NewsOrbit
Entertainment News Telugu TV Serials

Krishna Mukunda Murari: కృష్ణ మురారిని చూసేసిందా.? ముకుందా ప్లాన్ ఏంటి.!?

Krishna Mukunda Murari 24 October 2023 today 295 episode highlights

Krishna Mukunda Murari: పరిమళ దగ్గరుండి ముకుంద వాళ్ళ అన్నయ్య చేత కావాల్సిన డాక్యుమెంట్స్ అన్నిటి పైన సంతకం చేయించుకుంటుంది. ఆ తరువాత మురారిని పరిమళ ఐ సి యు కి షిఫ్ట్ చేస్తుంది. కాసేపటి ముకుందా వాళ్ళ అన్నయ్య ముకుందా కి ఫోన్ చేసి పని అయిపోయింది. అంతా తెలిసి మొదటికి మోసం జరుగుతుంది అని అంటుంది. చూడుముకుందా అలాంటి మాటలు మాట్లాడొద్దు అని వాళ్ళ అన్నయ్య అంటాడు. చూడు ముకుందా ఈ సీక్రెట్ ఈ ప్రపంచానికి నీకు నాకు తప్ప ఇంకెవరికి తెలీదు అని చెబుతాడు.

Krishna Mukunda Murari 24 October 2023 today 295 episode highlights
Krishna Mukunda Murari 24 October 2023 today 295 episode highlights

కాసేపటి తరువాత అదే హాస్పిటల్ కి పోలీసులు ముకుందా వాళ్ళ అన్నయ్యను అరెస్టు చేయడానికి వస్తారు నువ్వే మురారిని చంపావు అని అనగానే సాక్ష్యం ఎక్కడా అని అడగగానే వెంటనే వాళ్ళ నాన్న శ్రీనివాస్ నేనే సాక్ష్యం అని అంటాడు ఇప్పుడు చంపలేదు అంటే మురారిని లోపల ఐసీయూలో ఉన్నాడని చూపించాలి అదే కనుక చేస్తే ముకుందా సంతోషానికి ఇబ్బంది కలుగుతుంది అని ముకుంద వాళ్ళ అన్నయ్య నేనే చేసుకోను అని ఒప్పుకోక తప్పని పరిస్థితి వచ్చింది అని అనుకుంటాడు. శ్రీనివాస్ నేను బయటకు వచ్చాక మొట్టమొదటి చంపేది నిన్నే గుర్తుంచుకో అని వార్నింగ్ ఇస్తాడు. భవత్ సింగ్ సాబ్ ఉన్నారా.. నాకు ఆయనతో పని ఉంది. అయినా నాకు జర్జీ గారు అండగా ఉన్నాడు అని సంతోషంగా ముకుంద వాళ్ళ వెళతాడు. వెళ్తూ వెళ్తూ నేను బయటకు వచ్చాక నిన్నే చంపెది అని అంటాడు.

Krishna Mukunda Murari serial Krishna shakuntala
Krishna Mukunda Murari serial Krishna shakuntala

చిన్నమ్మ ఏసిపి సార్ కనిపించరా.. లేదమ్మా నీకు .. లేదమ్మా అని అంటుంది. చిన్నమ్మ నేనేమైనా మిమ్మల్ని ఇబ్బంది పెడుతున్నానా అని కృష్ణ అడుగుతుంది. బిడ్డ ఇబ్బందుల్లో ఉంటే కష్టమేంటి కిట్టమ్మ అయినా అంత మాట ఏంటి అని శకుంతల అడుగుతుంది. చిన్నాన్న ఎక్కడ చిన్నమ్మ ఏసీపీ సార్ ని వెతకడానికి వెళ్లారా అని కృష్ణ అడుగుతుంది. అవును అని శకుంతల చెబుతుంది. నేను కూడా మా అత్తవారింటికి వెళ్లి వస్తాను నాకు ఏసీబీ సార్ ఆచూకీ తెలుస్తుంది అని కృష్ణ అంటుంది . ఇప్పుడు వద్దు కిట్టమ్మా మీ చిన్నన్న వచ్చాక చెప్పెదుగానీ అని శకుంతల అంటుంది. ఎందుకు చిన్నమ్మ అంత కంగారు పడుతున్నావు నేను వెళ్తాను అంటుంటే.. మా అత్తయ్య వాళ్ళ ఇంటికి మా పెద్ద అత్తయ్య కాస్త కఠినంగా ఉంటుందేమో.. కానీ మా అత్తయ్య మాత్రం నాతో ప్రేమగా మాట్లాడుతుంది. చిన్నాన్న వచ్చాక నువ్వు చెప్పు అని కృష్ణ వాళ్ళ అత్త వాళ్ళ ఇంటికి బయలుదేరుతుంది.

ఇక శకుంతల కంగారుపడుతూ వెంటనే ప్రభాకర్ కి ఫోన్ చేస్తుంది. ఇక హాస్పిటల్ కి రాగానే కృష్ణ ఎక్కడా అని అడగగా కిట్టమ్మా ఇప్పుడే వాళ్ళ అత్తారింటికి వెళ్ళింది. తన పెనిమిటి ఆచూకీ తెలుసుకోవడానికి నిన్ను తిట్టమని ఎక్కడికి వెళ్ళకుండా చూసుకోమని చెప్పాను కదా అని ప్రభాకర్ తిడుతాడు. ముందు అర్జెంటుగా కిట్టమ్మ ఆపు పెనిమిటి ఆ తర్వాత నన్ను కొట్టు తిట్టు ఏమైనా చేసుకో అని అంటుంది. ఇక ప్రభాకర్ బైక్ మీద బయలుదేరి దేవుడా మాకిట్టమ్మ ఇంట్లోకి వెళ్ళకుండా చూడు.. తనకి ఈ నిజం తెలిస్తే తట్టుకోలేదు. నేనే మంచి సమయం చూసుకొని చెప్తాను అని మనసులో అనుకుంటూ స్పీడ్ గా బైక్ డ్రైవ్ చేసుకుంటూ వెళ్తాడు. ఇక కృష్ణ ఆటోలో బయలుదేరి మురారి వాళ్ళ ఇంటి ఎదురు ఆగుతుంది మురారి వాళ్ళింట్లో మురారి కి మూడవరోజు కర్మకాండ జరిపించడానికి పంతులుగారు వస్తారు. ఇక అప్పుడే ముకుందా బయటకు వస్తుంది కృష్ణ ఇంట్లోకి నడిచి వస్తూ ఉండగా ప్రభాకర్ కృష్ణని తన బండి ఎక్కించుకొని తీసుకువెళ్లడం చూస్తుంది.

Krishna Mukunda Murari serial Krishna prabhakar
Krishna Mukunda Murari serial Krishna prabhakar

కృష్ణ ప్రభాకర్ ఇద్దరు కలిసి మురారి ఏ హాస్పిటల్లో అడ్మిట్ అయ్యారని తెలుసుకుంటూ ఉంటారు. కృష్ణ మురారి గురించి వెతుకుతూ తను ముందుగా అడ్మిట్ అయినా హాస్పిటల్ కి వెళుతుంది. రెండు రోజుల క్రితం మధ్యాహ్నం రెండు గంటలకి శంషాబాద్ రోడ్ లో యాక్సిడెంట్ జరిగింది. ఎవరో ఒక అతను వచ్చి ఎంత డబ్బైనా పర్వాలేదు ట్రీట్మెంట్ చేయమని చెప్పాడు. ఆయన్ని చూడొచ్చా డాక్టర్ అని అడగగా బెటర్ ట్రీట్మెంట్ కోసం వేరే హాస్పిటల్ కి తీసుకువెళ్లారు అని చెబుతారు. డాక్టర్ నేను కూడా డాక్టర్ని ఆ పేషెంట్ గురించి మీ బుక్ లో రికార్డ్స్ రాసుకుంటారు కదా ఆ డీటెయిల్స్ అయినా చెప్పమని అడగగా తనని అడ్మిట్ చేసిన అతను అతని గురించి ఎలాంటి డీటెయిల్స్ రికార్డులో నోట్ చేసుకోవద్దని స్పెషల్గా రిక్వెస్ట్ చేశారు స్పెషల్ ట్రీట్మెంట్ మాత్రమే ఇవ్వమని చెప్పారు తను ఎందుకు సీక్రెట్ గా ఉంచడానికి ప్రయత్నించారు అని చెప్పగానే కృష్ణ ఖచ్చితంగా పోలీసు వాళ్లలో ఎవరో అయ్యుంటారు చిన్నాన్న అయినా ఏసీబీ సార్ కదా అందుకే ఇలా సీక్రెట్ గా ఉంచి ఉంటారు అని కృష్ణ ప్రభాకర్ తో అంటుంది.

Krishna Mukunda Murari 24 October 2023 today 295 episode highlights
Krishna Mukunda Murari 24 October 2023 today 295 episode highlights

మరోవైపు ముకుందా మురారి కి యాక్సిడెంట్ జరగకుండా ముందు కృష్ణ మురారి కలిసిపోయారు కదా.. మురారి ఇప్పటికీ కృష్ణ గురించి ఆలోచిస్తూ ఉంటాడా.. అయినా పర్వాలేదు నా ప్రాణాలు పణంగా పెట్టైనా సరే మురారిని ఎలాగైనా మార్చుకునే బాధ్యత నాది అని ముకుందా అనుకుంటుంది. ఇక రేపటి ఎపిసోడ్ లో కృష్ణ హాస్పిటల్ లోనే ఉన్న మురారిని కట్లు విప్పుతుంటే చూస్తుంది.. తను మురారి నీ గుర్తిస్తుందా.. మురారి కృష్ణ కంట పడకుండా ఉండటానికి ముకుంద, వాళ్ళ అన్నయ్య ఎలాంటి జాగ్రత్తలు తీసుకున్నారో చూడాలి.

Related posts

Pranitha Subhash: సిగ్గు లేదా అంటూ ప్ర‌ణీతపై మండిప‌డుతున్న నెటిజ‌న్లు.. అంత పెద్ద త‌ప్పు ఏం చేసింది..?

kavya N

Gangs of Godavari: గ్యాంగ్స్ ఆఫ్ గోదావ‌రి ఫ‌స్ట్ డే క‌లెక్షన్స్‌.. విశ్వ‌క్ సేన్ కెరీర్ లోనే ఇది హైయ్యెస్ట్‌..!!

kavya N

Manamey Trailer: శర్వానంద్ `మ‌న‌మే` ట్రైల‌ర్ వ‌చ్చేసింది.. ఎలా ఉందంటే..?

kavya N

Brahmamudi June 01 Episode 425: రాజ్ గదిలో ఉండాలనుకున్న మాయ.. రెండు రోజుల్లో రాజ్, మాయ ల పెళ్లి.. కావ్య ప్లాన్ తెలుసుకున్న రుద్రాణి..

bharani jella

Krishna Mukunda Murari June 1st 2024 Episode 485: క్రిష్ణ, మురారీల తప్పులేదని భవానికి నిజం చెప్పిన మధు. ముకుంద కుట్ర బట్టబయలు. రేపటికి సూపర్ ట్విస్ట్

bharani jella

Nuvvu Nenu Prema June 01 Episode 639: విక్కీ ని ఇష్టపడుతున్న గాయత్రి.. పాప కుచల కి దగ్గర కానుందా? పద్దు విక్కీ ల మీద మూర్తి అనుమానం..

bharani jella

Devara: ఎన్టీఆర్ ‘దేవర’ మూవీ ఫియర్ సాంగ్ కూ 70M వ్యూస్..!!

sekhar

Superstar Krishna: సూప‌ర్ స్టార్ కృష్ణకు మాత్ర‌మే సొంత‌మైన ఈ రేర్ రికార్డుల గురించి మీకు తెలుసా..?

kavya N

Guppedantha Manasu: గుప్పెడంత మనసు ఫ్యాన్స్ కి సూపర్ గుడ్ న్యూస్.. రిషి రీ ఎంట్రీ కన్ఫామ్.. పక్కా క్లారిటీ ఇచ్చేసిన స్టార్ మా..!

Saranya Koduri

Krishna Mukunda Murari: బ్లాక్ కలర్ చీరలో కృష్ణ ముకుంద మురారి అత్త అందాలు.. 45 ఏళ్ల వయసులో కూడా ఇంత అందం ఎలా సాధ్యం..?

Saranya Koduri

Sivakarthikeyan: ముచ్చ‌ట‌గా మూడోసారి తండ్రి కాబోతున్న హీరో శివ కార్తికేయ‌న్‌.. వైర‌ల్‌గా మారిన వైఫ్ బేబీ బంప్ వీడియో!

kavya N

Balakrishna-Anjali: బాల‌య్య దురుసు ప్ర‌వ‌ర్త‌న‌పై అంజ‌లి షాకింగ్ రియాక్ష‌న్‌.. పెద్ద ట్విస్టే ఇచ్చిందిగా..!!

kavya N

Karthika Deepam 2 May 31th 2024: తన గానంతో ప్రతి ఒక్కరిని ఆకట్టుకున్న దీప.. భర్త అంటే మీలా ఉండాలి అని శ్రీధర్ ను మెచ్చుకున్న కార్తీక్..!

Saranya Koduri

Family Stars promo: సుధీర్ ని బావ అని పిలిచిన అషూ రెడ్డి.. అత్త కోడళ్ళ మధ్య కోల్డ్ వార్..!

Saranya Koduri

Telugu OTT: ఈవారం ఓటీటీ తెలుగు ఫ్యాన్స్ కి పండగ… ఈ థ్రిల్లర్ సినిమాలను డోంట్ మిస్..!

Saranya Koduri