Nuvvu Nenu Prema:నిన్నటి ఎపిసోడ్ లో శాంతాదేవి విక్కీ పద్మావతి ఇద్దరినీ ఊటీ పంపించాలి అనుకుంటుంది. అందుకు పద్మావతి చాలా సంతోషిస్తుంది కానీ విక్కీ మాత్రం దానికి ఒప్పుకోడు. ఇంట్లో అందరికీ నచ్చచెప్పి ఆఫీస్ కి వెళ్తాడు. కృష్ణ ఇచ్చిన ఐడియా తో శాంతాదేవికి విక్కీ పద్మావతి ని కలపడానికి మరొక ఐడియా వస్తుంది. ఎలాగైనా విక్కీ పద్మావతిని విడగొట్టాలని కృష్ణ చూస్తుంటే ఇంట్లో వాళ్ళు కలపాలని చూస్తూ ఉంటారు.

ఈరోజు 449 వ ఎపిసోడ్ లో శాంతాదేవికి వచ్చిన ఐడియా ప్రకారం, విక్కీ పద్మావతి ఇద్దరూ ఊటీ వెళ్లడానికి అన్ని ఏర్పాట్లు చేయాలి అని అంటుంది. వాళ్ళ ఊటీ కి వెళ్ళారని కృష్ణ చెప్పడంతో అయితే ఇక్కడే ఊటీని ఏర్పాటు చేద్దాం అని అంటుంది. అందుకు ఇంట్లో వాళ్ళందరూ సరే అనడంతో శాంతాదేవి ఇంటిని ఊటీగా మార్చేస్తుంది. విక్కీ ఆర్య ఇద్దరు ఆఫీస్ నుంచి ఇంటికి వస్తారు. ఇంటి బయట కార్ ఆపి అసలు ఇది మనీ లేనా వేరే అడ్రస్ కి వచ్చామా అని అనుకుంటారు. నాకు అదే అనుమానంగా ఉంది అని అంటాడు ఆర్య. వీలైతే మందే కానీ ఇలా మారిపోయింది ఏంట్రా అని అంటాడు విక్కీ. అప్పటికే శాంతి ఇల్లంతా ఊటీ వెకేషన్ లాగా మార్చేస్తుంది.
డ్రైవర్ గా నారాయణ,విక్కీ ఆర్య కన్ఫ్యూజన్..
అప్పుడే పద్మావతి అను ఇద్దరూ కళ్ళజోడు పెట్టుకొని బాగా రెడీ అయ్యి విక్కీ ఆర్య ల కారు దగ్గరికి వస్తారు. ఇల్లే కాదురా ఇంటితో పాటు వీళ్ళు కూడా మారిపోయారు అని అంటాడు విక్కీ. ఏ పద్మావతి ఏంటి ఇదంతా అని అంటాడు విక్కీ. చెప్తాను సారు అని వెళ్లి కారు వెనక సీట్లో అను పద్మావతి ఇద్దరు కూర్చుంటారు.అవును సారూ ఊటీ హోటల్ కి వచ్చినప్పుడు మీరు ఒక్కరే లోపలికి వెళ్తారా మాతో కలిసి వెళ్తారా అని అంటుంది. ఊటీ ఏంటి హోటల్ ఏంటి అని అంటాడు విక్కి, నాకు ఇరిటేషన్ తెప్పించమాకు అని కారు దిగి లోపలికి వెళ్ళబోతుంటే నారాయణ డ్రైవర్ గా ఎంట్రీ ఇస్తాడు. నందనవనం హోటల్ హెవెన్ ఆఫ్ ద హిల్ అంటూ నారాయణ మాట్లాడుతూ ఉంటాడు. బాబాయ్ ఏంటిది అని అంటాడు. మీరు మా నందనవనం హోటల్ చూశారంటే ఇంకా ఆశ్చర్యపోతారు నన్ను చూసి ఆశ్చర్యపోకండి సార్ అని అంటాడు.నందనవనం ఇట్ ఇస్ నాట్ ఏ హోటల్ హెవెన్ ఆఫ్ ద హిల్ అని అంటాడు. నాన్న ఏంటి ఇదంతా అంటాడు ఆర్యా. ఎవరు నాన్న ఎవరికి నాన్న అని అంటాడు నారాయణ నా పేరు యష్, నన్నలానే పిలవండి నేను ఇక్కడ రూమ్ బాయ్ ని డ్రైవర్ ని అన్ని నేనే ఇటువంటి లోపలికి రండి అని సామాను చేతిలో ఉన్నవి తీసుకుంటాడు. నాకు ముందు కార్ కీస్ ఇవ్వండి సార్ నేను మీ డ్రైవర్ ని కారు పక్కకి పార్కు చేస్తాను ఇది నందనవనం హోటల్ హెవెన్ ఆఫ్ ద హిల్ ఇట్స్ నాట్ ఎ హోటల్ అని అంటూ ఉంటాడు. పద్మావతి పోటీలో బాగా చలిగా ఉందండి లోపలికి వెళ్దాం పదండి హోటల్ దాకా వచ్చి లోపలికి వెళ్లకపోతే బాగోదండి అని అంటుంది. విక్కీ నాకైతే ఏమీ అర్థం కావట్లేదు రా ముందు లోపలికి వెళ్దాం పద అని అంటాడు. వెల్కమ్ టు వెల్కమ్ టు నందనవనం హోటల్ ఇట్ ఇస్ నాట్ ఏ హోటల్ అని కార్ కీస్ తీసుకుంటాడు నారాయణ. అక్కడ కట్టిన సీనరీస్ అన్నీ చూస్తూ విక్కి ఆశ్చర్యపోతూ ఉంటాడు.వెంటనే పద్మావతి లోపలికి వెళ్దాం పదండి అని చెయ్యి పట్టుకుంటుంది పద్మావతి ఏంటి ఇదంతా అని అంటాడు విక్కీ. నా చెయ్యి పట్టుకుని మీరు ఏడడుగులు నడిపించారు కదా ఇప్పుడు పట్టుకుంటే ఎందుకు అంత ఆశ్చర్యపోతున్నారు భార్యాభర్తల అయిన తర్వాత ఒకరు చేయి ఒకరు పట్టుకొని ఉంటేనే వాళ్ళ బంధం బలంగా ఉంటుంది అని అనగానే నారాయణ సూపర్ గా చెప్పారు మేడం మీ ఇద్దరు జెంటిల్ చూస్తుంటే కన్నుల పండుగ ఉంది అని అంటాడు ముందు లోపలికి పదండి సార్ అని అంటాడు నారాయణ.బాబాయ్ ఇప్పటికైనా విషయం ఏంటో చెప్పు బాబాయ్ అని అంటాడు సార్ నేను డ్రైవర్ని సార్ మీ బావ ఏం కాదు సార్ లోపలికి రండి సార్ అని అంటాడు నారాయణ. లోపలికి వెళ్తే స్వర్గంలో ఉంటుందేమో అని అంటుంది పద్మావతి.
హోటల్ నందనవనం..
లోపలికి వెళ్ళగానే హోటల్ చాలా బాగుందండి అని పద్మావతి అంటూ ఉంటుంది ఇప్పుడేం చేశారు మేడం ముందు చూడండి అంటాడు నారాయణ. వెంటనే కుచల కుష్ అనే పేరుతో అక్కడికి ఎంట్రీ ఇస్తుంది. ఖుష్ ఏంటి అని అంటాడు విక్కీ. ఊటీలో పేర్లన్నీ అట్లానే ఉంటాయి అని అంటుంది పద్మావతి. వెల్కమ్ టు నందవరం హోటల్ నేను ఈ హోటల్ ఆర్గనైజర్ ని నా పేరుకుష్ క్యేయో అని అంటుంది కుచల. మీరు నాకు ఆర్డర్ వేయండి మొత్తం నేను పూసేసుకుంటాను అని అంటుంది అది పోసేసుకోవడం కాదు అని అంటాడు నారాయణ.వేషం మారిన భాష మారలేదుఅని కుశలని తిడతాడు మీరిద్దరిని చూస్తుంటే నాకు చాలా ఇరిటేషన్ గా ఉంది అసలు ఏంటి ఇదంతా అని అరుస్తాడు విక్కీ. నీకు ఇప్పుడు తలనొప్పిగా ఉందా వెయిట్ అని అంటుంది కుచల. బేరర్ వెల్కమ్ డ్రింక్ తీసుకొని రా అని అంటుంది బెర్రీ డ్రింక్ తీసుకొచ్చిన తర్వాత ఇది తీసుకోండి సార్ మీరు లోపలికి వెళ్లే ముందే రిఫ్రెష్ అవుతారు అని అంటుంది. వెంటనే పద్మావతి ఈ హోటల్ కి వచ్చి మనం మంచి పని చేసాం కదా, అచ్చం మన హోటల్ ఉన్న హోటల్ ఇల్లు లానే ఉందండి అని అంటుంది ఇల్లులా ఉండడమేంటి ఇది మన ఇల్లే కదా అంటాడు విక్కి. ఈ వేషంలో కూడా కుచల అను, పద్మావతి ఇద్దరినీ అవమానించాలని చూస్తుంది.

విక్కీ కోపం..
ఇక శాంతాదేవి అక్కడికి ఎంట్రీ ఇస్తుంది కుచల నీకెన్ని సార్లు చెప్పాను హోటల్కి వచ్చిన వాళ్ళతో ఎలా మాట్లాడాలి అని, ఆమె తరఫున నేను సారీ చెప్తున్నాను అని అంటుంది శాంతాదేవి. ఏంటి నానమ్మ నువ్వు కూడా వీలు లాగా మారిపోయావా అని అంటాడు విక్కీ.అయినా ఇంతకీ అక్క ఎక్కడ ఉంది అని అంటాడు అప్పుడే అక్కడికి అరవింద కృష్ణ ఇద్దరు వస్తారు.ఫ్లవర్ బొకేస్ పెట్టుకొని వెల్కమ్ టూ నందనవనం హోటల్ సార్ అని అంటారు. అరవింద ఆర్య దగ్గరికి వెళ్లి వెల్కమ్ టు నందనవనం హోటల్ అని ఫ్లవర్ బొకే ని ఇస్తుంది. కృష్ణ కావాలని పద్మావతి దగ్గరికి వెళ్లి మీకు గులాబీలు అంటే చాలా ఇష్టం కదా మేడం అందుకే మీకోసమే స్పెషల్ గా ఈ గులాబీ బోకే చేయించాము తీసుకోండి మేడం అని అంటాడు వెంటనే విక్కీకి కోపం వస్తుంది. గతంలో పద్మావతి గులాబీలు అంటే ఇష్టం అని చెప్పడం దానికి కృష్ణ గులాబీలు పార్సిల్ తెప్పించడం అదంతా గుర్తుచేసుకొని కోపంగా ఉంటాడు విక్కి. పద్మావతి కూడా అవి తీసుకోవడానికి ఒప్పుకోదు ఇంతలో అరవిందా తీసుకోండి మేడం మీ కోసమే అని అంటుంది. మీకే కాదు మేడం ఈ ఫ్లవర్స్ అంటే మా రాణమ్మ కూడా చాలా ఇష్టం మీరు మొహమాట పడకుండా ముందు ఒకే అందుకోండి అని అంటాడు కృష్ణ. సరే అని పద్మావతి తీసుకుంటుంది. ఇప్పటికైనా ఎందుకిలా చేస్తున్నారో చెప్పండి అక్క అని గట్టిగా అడుగుతాడు విక్కి.
నిజం చెప్పినా అరవింద..
ఇక విక్కి గట్టిగా అడిగేసరికి అరవింద ఓకే నిజం చెప్తాను. మీరుటి కోడి ఊటీ వెళ్లడానికి ఇష్టపడట్లేదు అదికాక నీకు కుదరట్లేదు అని చెప్పావు కదా అలాంటప్పుడు ఇంటిని ఊటీగా మార్చేద్దాము అని అనుకున్నాము. ఇలా కూడా చేయచ్చని మాకు ఇప్పుడే తెలిసింది రా అని అంటుంది అరవింద. ఏంటి అక్క ఇదంతా అని అంటాడు విక్కీ. నువ్వు ఇప్పుడేం మాట్లాడకూడదు ఇదంతా మా టైం నీ టైం కాదు నేను చెప్పినట్టు నువ్వు చేయాల్సిందే ఎందుకంటే నువ్వు ఇంటికి వెళ్లలేదు కదా ఎక్కడైనా నేను చెప్పినట్టు విను ఇక మీకు ఇక్కడే హనీమూన్ అని అంటుంది. అవును సార్ ఇక మీ కపుల్స్ కి ఇక్కడే హనీమూన్ అని ఇంట్లో అందరూ ఒకేసారి అంటారు. విక్కీ చాలా కోపంగా ఉంటాడు పద్మావతి మాత్రం చాలా సంతోషంగా ఉంటుంది. అరవింద శాంతాదేవి ఈ హోటల్ హెడ్ అని, తనేమో మేనేజ్ రన్నింగ్ కృష్ణ ఏమో అసిస్టెంట్ మేనేజ్డ్ అని అందరినీ పరిచయం చేస్తుంది. అదంతా చూసి విక్కీ అసలు ఏమీ నచ్చదు కానీ వాళ్ళ అక్క కోసం సైలెంట్ గా ఉంటాడు. శాంతాదేవి కొన్ని దండలు తీసుకొచ్చి విక్కీ పద్మావతి అను ఆర్యాల మెడలో వేస్తుంది. కుచల స్వీట్స్ తీసుకువచ్చి వాళ్ళకి పెడుతుంది. ఇక మీరు మా నందనవనం హోటల్ లో అడుగు పెట్టారు కదా ఇక అంత మీకు నచ్చినట్టుగానే ఉంటుంది.

ఫోటోషూట్ కి వెళ్దాం అన్నా అరవింద..
అరవింద సరే మా హోటల్ కి వచ్చిన కొత్త జంటలకి ఇక్కడే ఫోటోషూట్ కూడా ఉంటుంది. మీరు కూడా మా హోటల్ కి వచ్చారు కాబట్టి మీకు కూడా ఫోటో షూట్ ఉంది రండి సార్ అని అంటుంది. అరవింద్ కోసం మీకు ఏం మాట్లాడకుండా వెళ్తాడు. ఇది కృష్ణ మాత్రం మనసులో మీరిద్దరూ ఎలా హ్యాపీగా ఉంటారు నేను చూస్తాను కదా అని అనుకుంటాడు. ఇక అను ఆర్య ఇద్దరు ఫోటోషూట్ కి మంచి ఫోజులు ఇస్తూ ఉంటారు. వికీ మాత్రం సైలెంట్ గా ఉంటాడు కాస్త నవ్వండి సార్ ఇది నందనవనం హోటల్ మీ ఇల్లు కాదు, అని పద్మావతి అంటుంది. ఇక అరవింద కోసం విక్కీ నవ్వుతూ ఫొటోస్ కి ఫోజు ఇస్తాడు. ఇక ఫోటో సెక్షన్ అయిపోయింది అని అంటాడు నారాయణ. మీకోసం ఇంకో ప్రోగ్రాం ఉంది అని అరవిందా మంచి బట్టల్ని తీసుకొని వచ్చి వాళ్ళందరికీ ఇస్తుంది. నిరంత రెడీ అయ్యి కిందకి రండి అని అంటుంది అరవింద. అక్క నేను బాగా టైడ్ అయ్యాను నేను పడుకుంటాను అని అంటాడు .అదంతా ఏమీ కుదరదు మీరు బట్టలు మార్చుకొని కిందకి రావాల్సిందే అంటుంది అరవింద. ఇక ఇద్దరు పైకి వెళ్తారు బట్టలు చేంజ్ చేసుకొని రావడానికి, విక్కీ కోపంగా పైకి వెళ్తాడు.
పద్మావతిని బాధ పెట్టిన విక్కీ..
విక్కీ ఇదంతా నీ ప్లానే కదా అని అంటాడు. లేదు సార్ ఇది నా ప్లాన్ కాదు అమ్మమ్మ గారు అరవింద గారి ఇలా చేశారు అని అంటుంది పద్మావతి.మా వాళ్లకు ఇలాంటి ఐడియాలు రావు నువ్వే ఇచ్చుంటావు అయినా నేను నిన్ను ఎలా ప్రేమిస్తాను అని అనుకున్నావ్ పద్మావతి అని అంటాడు.నీలా మోసం చేసి ప్రాణాలు తీయాలని ఎవరు చూడరు నువ్వు కాబట్టే ఇలాంటివన్నీ చేస్తున్నావు అని అంటాడు. ఎందుకు సారు నా ప్రేమ గురించి మీకు అర్థం అయ్యేలా చెప్తున్నా మీరు మళ్ళీ మళ్ళీ నన్ను అపార్థం చేసుకుంటున్నారు ఎందుకు అని అంటుంది పద్మావతి. నా ప్రేమలో మోసం లేదు మీకోసం చచ్చేంత ప్రేమ నాలో ఉన్నది అని అంటుంది పద్మావతి. మీరు అడగలే కానీ ఇప్పుడే ఇక్కడే ఈ క్షణమే నా ప్రాణం ఇచ్చేస్తాను అని అంటుంది. అంతేగాని నా స్వార్థం కోసం కాదు సారు ఇదంతా నేను చేసేది, అని పద్మావతి అంటుంది విక్కీ అందుకు ఒప్పుకోడు, నువ్వు కావాలని నటిస్తున్నావు పద్మావతి నువ్వు చేసిన గాయం నేను ఎప్పటికీ మర్చిపోలేదు ఇంకా నా మనసులో అలానే ఉంది అలాంటిది నేను ఎలా క్షమిస్తాను అని అంటాడు. నువ్వు ఇలాంటి ఎన్ని ట్రిక్స్ ప్లే చేసిన నా దానివి కాలేదు మన మధ్య దూరం మాత్రం తగ్గదు అని అంటాడు. మనసుకి బాధ అయితే ఇష్టమైన వాళ్ళతో చెప్పుకుంటే ఆ బాధ తగ్గుతుంది అంటారు, కానీ మనసులో ఉండే వాళ్లే ఆ బాధ కారణమైతే ఆ కన్నీళ్ళకి ఇంకా అంతేది సారు అని ఏడుస్తుంది పద్మావతి. పైగా ఇది కూడా నటనే అని అంటున్నారు మీరు, కానీ నా ప్రేమను మీకు ఎలా చూపించాలి ఏం చెప్పి మిమ్మల్ని నమ్మించాలో నాకు అర్థం కావట్లేదు అని అంటుంది. కళ్ళతో నువ్వు చేసిన నయవంచను చూసిన తర్వాత నువ్వు ఎన్ని చేసినా నేను నిన్ను నమ్మను అని విక్కీ అంటే పద్మావతి బాధపడుతూ ఉంటుంది.
రేపటి ఎపిసోడ్ లో పద్మావతి విక్కీ రెడీ అయ్యి, కింద చూస్తూ ఉంటారు అప్పుడే అరవింద ఇంట్లో వాళ్ళందరూ ఏరి వీళ్ళు ఇంకా డ్రెస్ మార్చుకొని కిందకి రాలేదే అని అనుకుంటూ ఉంటారు. అప్పుడే విక్కీ ఒక్కడే ముందుకెందుకు దిగుతూ ఉంటాడు ఏది మీ లైఫ్ పార్టనర్ అని అడుగుతారు ఇంట్లో వాళ్ళు వెంటనే పద్మావతి మెట్లు దిగుతూ ఉంటుంది. పద్మావతిని ఆ చీరలో చూసి విక్కీ ఫ్లాట్ అవుతాడు. ఏంటి ఎప్పుడు చూడనట్టు అలా చూస్తున్నారు నన్ను అని అడుగుతుంది పద్మావతి. మీ అందానికి ఫిదా అయినట్టున్నాడు మేడం అని అంటుంది అరవింద.