Malli Nindu Jabili Episode 475: అత్త నేను ఉన్నంతవరకు మా అత్తకి అలాంటి పరిస్థితి రానివ్వను తనకు ఎవరూ లేరని ఇలాంటి పని చేశావు కదా తన వెనక నేనున్నాను అని గౌతమ్ అంటాడు. నువ్వు నన్ను ఏం చేయలేవు మీ అత్తని వెళ్లగొట్టానని ఫీల్ అవుతున్నావా అని వసుంధర అంటుంది. ఈరోజు నిన్ను ఏమీ చేయలేకపోవచ్చు కానీ ఏదో ఒక రోజు కచ్చితంగా చేస్తాను నీ సంగతి చూస్తాను అని గౌతమ్ అంటాడు. అయినా మా విషయంలో జోక్యం చేసుకోవడానికి నువ్వు ఎవరు ఇకనుంచి వెళ్ళిపో అని వసుంధర అంటుంది.

అమ్మగారు మా అమ్మ చేసిన తప్పేంటి మా అమ్మ చేసిన త్యాగని మరిచిపోయి ఇంత దారుణంగా వెళ్ళగొడతారా మీకు ఇది న్యాయమేనా అని మల్లి అంటుంది. ఇక ఆపుతారా మీ ఉపన్యాసాలు అని వసుంధర అంటుంది. ఇంట్లో నీకెంత హక్కు ఉందో మా అమ్మకు అంతే హక్కు ఉంది నువ్వు ఎవరు తనని వెళ్లగొట్టడానికి అని మల్లి ప్రశ్నిస్తుంది. అడ్డమైన వాళ్లకు సమాధానం చెప్పాల్సిన పని నాకు లేదు మీరందరూ కలిసి ఏట్లోనైనా దూకి చావండి ఐ డోంట్ కేర్ అని వసుంధర అంటుంది.

అయినా మా అత్త ఒకతే ఎందుకు బయటికి వెళుతుంది నిను అనాలి మామయ్య గారు నీ దగ్గర ఉంది అంతా తనని వెళ్లగొట్టినప్పుడు నువ్వు మాత్రం ఇక్కడే ఎందుకు ఉండాలి తను చేసిన త్యాగాన్ని మరిచిపోయి మీరు తనని వెళ్లగొట్టిన ఇక్కడే ఉంటారా చేసిన మేలును ఎలా మరిచిపోతారండి మీ ప్రాణాలను కాపాడింది మా అత్త కొంచెమైనా కృతజ్ఞత ఉండాలి కదా నిజంగా మీకు మనసు అనేది ఉంటే మీరు కూడా ఇంట్లో నుంచి వెళ్లిపోండి లేదంటే మీకు మనసే లేదని ఇక్కడే ఉండిపోండి అది మీ ఇష్టం అని గౌతమ్ శరత్ కు రేషమ్ వచ్చేలా Lateమాట్లాడుతాడు. అవును నువ్వు చెప్పింది కూడా కరెక్టే గౌతమ్ నేను ఇక్కడ ఒక క్షణం కూడా ఉండను నేను కూడా మీరాతో పాటే వెళ్ళిపోతాను అని శరత్ అంటాడు.డాడీ ఎవరికోసమో మీరెందుకు ఇంట్లో నుంచి వెళ్లిపోవడం అని మాలిని అంటుంది.

మామయ్య గారు ఆవేశపడకండి దేనికైనా కాలమే సమాధానం చెబుతుంది కానీ ఇలా చేయడం కరెక్ట్ కాదు అని అరవింద్ అంటాడు. ఇదే కరెక్ట్ అరవింద్ ఇన్ని రోజులు మీ అత్త మల్లి ని వాళ్ళ అమ్మని ఎన్నో కష్టాలు పెట్టి ఒక మూలన ఉంచింది ఇప్పుడు అలా జరగనివ్వను తన తరఫున నేను మాట్లాడుతాను అని గౌతమ్ అంటాడు. పోతే పోనీ ఎవడికంట దానికోసం నన్ను వదిలేసుకొని వెళ్ళిపోతాను అంటున్నాడు కదా మల్లి వెనుకకు తిరిగి వస్తాడు చూడు అని వసుంధర అంటుంది. మల్లి మీ నాన్నను కూడా తీసుకువచ్చేసాను అని గౌతమ్ అంటాడు. ఎందుకిలాంటి పని చేశారండీ నేను ఇన్నాళ్ల నుంచి పోరాడింది నాన్న అమ్మ కలిసి బయటికి వెళ్లిపోవాలని కాదు ఆ ఇంట్లో అమ్మకి కూడా స్థానం ఉందని చెప్పడానికి పోరాడాను అని మల్లి అంటుంది. మల్లి ఏం చేసినా నేను ఆలోచించి కరెక్ట్ గానే చేస్తాను నన్ను నమ్ము మల్లి మీ అమ్మకు న్యాయం జరిగేలా చేస్తాను అని గౌతమ్ అంటాడు.

తనకి కూడా నాన్న వెళ్ళిపోవాలనే ఉందండి తను అనుకున్నదే మీరు చేశారని వసుంధర గారు సంతోషపడుతుంది అని మల్లి అంటుంది. మీరేమీ కంగారు పడకు అత్తయ్య నేను చూసుకుంటాను అని గౌతమ్ అంటాడు.అమ్మ ఎవరి కోసం డాడీని నువ్వు ఎందుకు వదిలేసుకోవడం తండ్రి లేకుండా పెరగడం ఎంత కష్టమో నీకు తెలుసా మల్లి పడ్డ కష్టాలు ఇప్పుడు మనకు వస్తాయి. నాన్న లేనందువల్ల అని మాలిని అంటుంది. నువ్వేం కంగారు పడకు మాలిని మీ నాన్నని వెనకకు తీసుకు వస్తాను కదా ఆ మల్లి కి గౌతమ్ కి బాగా బుద్ధి చెప్పి ఇంకెప్పుడూ జన్మలో కోలుకోలేని దెబ్బ కొడతాను చూస్తూ ఉండు ఇక నన్ను విసిగించకు మాలిని కోపంలో నిన్ను ఏమైనా అంటాను నువ్వు లోపలికి వెళ్ళమ్మా అని వసుంధర అంటుంది. కట్ చేస్తేగౌతమ్ శరత్ ని మీరా గారిని తీసుకొని ఇంటికి వస్తాడు.

అంకుల్ మీరు ఇక్కడే ఉండండి ఇప్పుడే వస్తాను అని వాళ్ళని గుమ్మం బయట ఉంచి లోపలికి వెళ్లి వాళ్ళ అమ్మకు జరిగిన విషయం అంత చెప్పి వాళ్ళ అమ్మని తీసుకొని వస్తాడు గౌతమ్. అన్నయ్యగారు మీరేమీ జరిగిన దాని గురించి బాధపడకండి గౌతమ్ నాకు అంతా చెప్పాడు అంతా మనమంచికే మీరేమీ తిండికి గతిలేక మా ఇంటికి రాలేదు మీరు ఎక్కడ ఉన్న దర్జాగా ఉండొచ్చు మీ తెలివితేటలకి ఏమైనా చేసె అంత సత్తా ఉంది కానీ కొన్నాళ్లపాటు మా ఇంట్లో ఉండి విశ్రాంతి తీసుకోండి అన్నయ్యగారు అని కౌసల్య హారతి ఇచ్చి వాళ్ళని లోపలికి ఆహ్వానిస్తుంది.. దీనితో ఈరోజు ఎపిసోడ్ ముగుస్తుంది