Malli Nindu Jabili October 22 Episode 474: ఇల్లంతా వెతికిన అమ్మ ఎక్కడ కనిపించట్లేదండి అని మల్లి అంటుంది. ఏమై ఉంటుంది అత్త ఎక్కడికి వెళ్ళింది మీరా గారు అని గౌతమ్ అంటాడు. ఏమో నాకేం తెలుసు అని వసుంధర అంటుంది. సీసీటీవి చూస్తే తెలుస్తుంది కదా మల్లి అతను ఎందుకు అడగడం అని గౌతమ్ అంటాడు. చూసుకోండి నాకేంటి భయం అని వసుంధర అంటుంది. వాళ్లు వెళ్లి సీసీటీవీ చూస్తే అందులో వసుంధర గారు మీరా అని వెళ్ళగొట్టినట్టు కనిపిస్తుంది. ఎందుకు మా అమ్మని వెళ్లగొట్టారు వసుంధర గారు అని మల్లి అడుగుతుంది. నేనెందుకు మీ అమ్మని వెళ్లగొట్టాను ఏం మాట్లాడుతున్నావ్ అని వసుంధర అంటుంది.నువ్వు గట్టిగా అనంత మాత్రాన నిజమైపోద్దత్తా అనే గౌతమ్ అంటాడు.

మీ అమ్మ నేలకొండపల్లి వెళ్ళుంటుంది నా ఇంట్లో ఎందుకు ఇంకా ఉంటుంది అని వసుంధర అంటుంది.మా అమ్మ అంటే నీకెందుకు అంత కాక్ష ఏం చేసిందని మా అమ్మ కాళ్ళు కడిగి నెత్తిన చల్లుకున్న సరిపోదు తను చేసిన త్యాగానికి మీరు మా అమ్మ రుణం తీర్చుకోలేరు ఇలాంటి పని చేసి ఉండాల్సింది కాదు అని మల్లి అంటుంది. ఆ గంగా జలమేదో నీ నెత్తి మీద చల్లుకోమా మాకేం అక్కర్లేదు అని వసుంధర అంటుంది. ఇంకా నా సంగతి నీకు తెలియదు తనకి ఎవరూ లేరు అనుకుంటున్నారా నేనున్నాను నేను రంగాలో దిగితే బాగోదు అని గౌతమ్ అంటాడు.నీకు చేతనైంది చేసుకోండి వెళ్ళండి అని వసుంధర అంటుంది. పద మల్లి ఈవిడతో మాట్లాడుతుంటే టైం వేస్ట్ అతని వేత కలి అని వెళ్లి మీరా కోసం ఎక్కడెక్కడో తిరిగి వెతుకుతారు కానీ మీరా గారు ఎక్కడ కనిపించకపోయేసరికి గౌతమ్ శరత్ కు ఫోన్ చేస్తాడు శరత్ మాత్రం ఫోను ఎత్తడు.గౌతమ్ మళ్లీ మళ్లీ ట్రై చేస్తాడు ఈన్నిసార్లు చేస్తున్నాడు ఏంటి అనే శరత్ ఫోన్ ఎత్తుతాడు. ఏంటి గౌతమ్ ఈన్నిసార్లు ఫోన్ చేస్తున్నవ్ ఏంటి అని శరత్ అంటాడు. నీ మొదటి భార్య వసుంధర గారు మీ రెండో భార్య అయినా మీరా ని ఇంట్లో నుంచి బయటికి వెళ్ళగొట్టింది అని గౌతమ్ అంటాడు.

ఏంటి డాడీ అతను ఎందుకు ఫోన్ చేశాడు అని మాలిని అంటుంది. మీ అమ్మ మీరా గారిని బయటికి వెళ్లగొట్టిందంట ఫోన్ చేసి చెప్పాడు. మీ అమ్మ ఇలాంటి పని ఎందుకు చేసిదొ నాకు అర్థం కావట్లేదు అనే శరత్ అంటాడు.డాడీ మీరు వెళ్ళండి మేము ఫ్లైట్ ఎక్కి హనీమూన్ కి వెళ్తాము అనే మాలిని అంటుంది.మాలిని ప్లీజ్ ఇలాంటి టైం లో కూడా మనం వదిలేసి వెళ్ళిపోతే బాగోదు ఇంటికి వెళ్ళిపోదాం అని అరవింద్ అంటాడు.ఏంటి నా హనీమూన్ ట్రిప్పు ఇంత బాగా జరిగిపోతుంది అనుకున్నాను కానీ మధ్యలోనే ఆగిపోయింది నా కర్మ ఇలా ఉంటే ఏం చేస్తాం అని మాలిని అంటుంది.ఏంటి ఎంతలా వెతికినా అమ్మ కనిపించట్లేదు అని మల్లి కంగారు పడుతుంది.

మల్లి నువ్వు టెన్షన్ పడకు మీ అమ్మ దొరుకుతుంది లే ఇక్కడే ఎక్కడ ఉంటుంది అనే గౌతమ్ అంటాడు. అమ్మ చిన్నప్పటి నుంచి చాలా కష్టాలు పడింది సార్ అని మల్లి అంటుంది. బాధపడకు మళ్ళీ వెతికితే దొరుకుతుంది అని వెతుకుతూ ఉండగా ఒకచోట కనిపిస్తుంది మీరా అదిగోండి అక్కడ ఉంది అమ్మ కరాపండి అని మల్లి అంటుంది.ఏంటమ్మా ఇలా వచ్చేసావు బయటికి రా మా వెల్దామని మల్లి అంటుంది.నేను ఇక్కడ ఉండడం కరెక్ట్ కాదమ్మా వెళ్ళిపోతాను అని మీరా అంటుంది.

అత్తయ్య మీకోసం కాకపోయినా మల్లి కోసమేనా మీరు ఇక్కడే ఉండాలి అని గౌతమ్ అంటాడు. వద్దు బాబు నేను ఇక్కడ ఉంటే ఎవరికి మనశ్శాంతి ఉండదు నేను నేలకొండపల్లి వెళ్లిన ప్రశాంతంగా ఉంటాను అని మీరా అంటుంది. అత్తయ్య నా మాట మీద నమ్మకం ఉంచండి ఇన్నాళ్ళ నుంచి ఏం జరిగిందో ఏమో నాకు తెలియదు ఇక మీదట నేను రంగంలోకి దిగాను కదా నేను చూసుకుంటాను మీరు పదండి అత్తయ్య అనే గౌతమ్ మీరా ని తీసుకొని బయలుదేరుతాడు. కట్ చేస్తే ఏంటి మాలిని మీరు ఇంకా వెళ్లలేదా ఏంటి మళ్లీ వచ్చావు అని వసుంధర అంటుంది. ఏం చెప్పను మామ్ మీరా గారిని బయటకు వెళ్లగొట్టారు డాడీ ఏమో ఇక్కడికి తీసుకువచ్చేసాడు హనీమూన్ కి వెళ్తున్నాను అన్న ఆనందం కాసేపు కూడా నిలవలేదు అని మాలిని అంటుంది. అది కాదు అత్తయ్య మీరు ఎందుకు మీరా గారిని వెళ్లగొట్టారు అని అరవింద్ అంటాడు. అడుక్కుతినేది నా ఇంట్లో ఎన్నాళ్ళు ఉంటుంది అందుకే వెళ్ళగొట్టాను అనే వసుంధర అంటుంది.

ఇంట్లో నీకెంత హక్కు ఉందో మీరాకి కూడా అంతే హక్కు ఉంది తనని నువ్వు వెళ్ళగొట్టే హక్కు నీకు లేదు అనే శరత్ అంటాడు. నీ మొగుడు నా మొగుడు ఎప్పుడు మారుతారు ఇద్దరు ఒకటే కదా అని మాలిని అంటుంది. మా విషయంలో నువ్వు అనవసరంగా మాట్లాడొద్దు నువ్వు మాలిని ని మంచిగా చూసుకుంటే అంతే చాలు అరవింద్ అని వసుంధర అంటుంది. ఎందుకు మాట్లాడాడు మామ్ మల్లి వాళ్ళ అమ్మంటే తనకు కూడా ఇష్టమే కదా అనే మాలిని అంటుంది. ఎందుకు మాలిని అలా మాట్లాడుతావు తనే మన పరాయిదా మల్లి నీ కన్నా తల్లే కదా అని శరత్ అంటాడు. దాన్ని కనడమే దండగ అయినా అది ఏమైనా నాలాగా పెళ్లి చేసుకుని మాలిని నీ కన్నట్టు కన్నదా అక్రమ సంబంధం పెట్టుకొని నీతో కన్నది అని వసుంధర అంటుంది. వసుంధర అని శరత్ గట్టిగా మాట్లాడుతాడు.అప్పుడే అక్కడికి వచ్చిన గౌతమ్ కూడా అత్తయ్య ఏం మాట్లాడుతున్నావ్ అని కోపంగా అంటాడు.. దీనితో ఈరోజు ఎపిసోడ్ ముగుస్తుంది