Krishna Mukunda Murari: కృష్ణ హాస్పిటల్ కి వెళ్తుంది. హాస్పటల్లో ఒంటరిగా కూర్చుని గతంలో ముకుందతో తనకి జరిగిన సంభాషణల గురించి ఆలోచిస్తూ ఉంటుంది. ఆ ఇంట్లో ఎవరు ఎవరిని మోసం చేస్తున్నారు. అయినా నేను ఆ ఇంట్లో ఎందుకు ఉంటున్నానో నాకే అర్థం కావడం లేదు. ఎందుకు నా జీవితం ప్రశ్నార్ధకంగా మారింది అని అనుకుంటూ ఉంటుంది. సరిగ్గా అదే సమయానికి వాళ్ల మేడం పరిమళ అక్కడికి వస్తుంది. కృష్ణ గబగబా లేచి మాట్లాడబోతుండగా.. ఇంట్లో ఏమైనా సమస్యనా అని అడుగుతుంది. గొడవేమైనా జరిగిందా అని ప్రశ్నిస్తుంది. నా బాధ పైకి చెప్పుకునే అంత పెద్దది కాదు లోలోపల దాచుకుని బాధపడే అంత చిన్నది కాదు అని కృష్ణ మనసులో అనుకుంటుంది.

కృష్ణ పరిమళతో మాట్లాడుతూ ఉండగా సరిగ్గా అదే సమయానికి మురారి అక్కడికి వస్తాడు నీ మనసులో ఉన్న ప్రశ్నలన్నింటికీ క్లారిఫికేషన్ మురారి ఇస్తాడు అని చెబుతుంది. రేయ్ నీ వైఫ్ కి ఏదో క్లారిఫికేషన్ కావాలంట ఇవ్వు అని పరిమళ అంటుంది. అంతలో తనకి సర్జరీ ఉండడంతో గబగబా అక్కడ నుంచి వెళ్ళిపోతుంది. ఏమైంది కృష్ణ ఏంటి చెప్పు అని మురారి అడుగుతాడు ఏం లేదు ఏసీబీ సార్ అని కృష్ణ అంటుంది. అయినా నువ్వేంటి చెప్పకుండా వచ్చేసావు అని మురారి కృష్ణ ని అడుగుతాడు. కనీసం ఒక మెసేజ్ కూడా చేయలేదు అని అంటాడు.

కృష్ణ ఈమధ్య నువ్వు ఏదోలా ఉంటున్నావు నా మీద నీకు ఏమైనా కోపమా అని మురారి అడుగుతాడు. నా చేతే నిజం చెప్పించి కాంప్రమైజ్ చేయాలని అనుకుంటున్నారా.. నేను మీకు అవకాశం ఇస్తున్నాను ఏసీబీ సార్. మీ అంతట మీరే పెద్దత్తయ్యకు నిజం చెప్పి ఆ విషయాన్ని క్లారిఫై చేయాలి. అప్పటివరకు నేను మీతో ఇదివరకే లాగా ఉండలేను అని కృష్ణ మనసులో అనుకుంటుంది. కృష్ణ నువ్వు నిజంగా నిజమే చెబుతున్నావా అని మురారి అడుగుతాడు. కృష్ణ ఆకలిగా ఉంది బయటకు వస్తావా ఏదైనా తినేసి వద్దామని మురారి అడుగుతాడు. లేదు నాకు ఆపరేషన్ ఉంది క్షమించండి అని కృష్ణ అంటుంది.

మురారి వెళ్ళిపోతుండగా ఏసీబీ సార్ త్రీ డేస్ బ్యాక్ ఒక ఆర్మీ ఆఫీసర్ ఇక్కడికి వచ్చారు. ఆయన కూడా మొన్న యుద్ధంలో పాల్గొన్నారు. యుద్ధం అయిపోగానే చాలామంది లీవ్స్ మీద ఇంటికి వచ్చారట. మరి ఆదర్శ్ ఎందుకు రావడం లేదు ఏసిపి సార్ అని కృష్ణ అడుగుతుంది. ముకుంద విషయం కృష్ణకు తెలిసిపోయిందా.. ఎందుకు కృష్ణ ఆదర్శ్ గురించి అడుగుతుంది అని మురారి మనసులో ఆలోచిస్తూ ఉంటాడు. కృష్ణ అక్కడి నుంచి వెళ్ళిపోతూ మీ మనసులో ముకుంద స్థానం ఏంటి.. నా స్థానం ఏంటో తెలిసే వరకు.. నేను మీ మీద ఎంత ప్రేమ ఉన్నా కూడా చూపించను అని కృష్ణ మనసులో అనుకుంటుంది.

ముకుంద ఇంట్లో మురారి కోసం వంట చేసే అవకాశం దొరికింది కదా అని అవకాశం తో మురారి మీద ప్రేమ చూపించాలని ఆలోచిస్తూ ఉంటుంది. అప్పుడే రేవతి అక్కడికి వచ్చి ఆదర్శ్ పేరు చెప్పి మురారి మీద ప్రేమ చూపించాలి అని అనుకుంటున్నావా అని ప్రశ్నిస్తుంది. కానీ ఆయన అంటే నా దృష్టిలో మురారినే అని ముకుందా అనగానే.. ఇలా మాట్లాడటానికి నీకు సిగ్గు లేదా అని రేవతి అంటుంది. కృష్ణని మోసం చేస్తున్నానని అనిపించడం లేదా అని రేవతి అడగగానే లేదు అని ముకుందా అంటుంది. నేను మిమ్మల్ని ఒక ప్రశ్న అడగాలి ఇన్నాళ్లు కృష్ణ మురారిలు ఇద్దరు వాళ్లది అగ్రిమెంట్ మ్యారేజ్ అని చెప్పకుండా మనల్ని మోసం చేశారు కదా అని ముకుందా అడుగుతుంది.

ఇంకా రేపటి ఎపిసోడ్ లో ముకుందా మురారి ఇద్దరూ మాట్లాడుకుంటూ ఉండగా కృష్ణ చాటు నుంచి చూస్తుంది నువ్వు ఏమన్నా మురారి నీ జీవితంలో నాకు తప్ప ఇంకెవరికీ స్థానం ఉండదు అని అన్నావు. నువ్వు ఈ జన్మలో మారవు. నిన్ను మార్చాలి అనుకోవడం కన్నా బుద్ధి తక్కువ పని ఇంకొకటి ఉండదు అని మురారి అంటాడు. ప్లీజ్ ముకుంద నేను నిన్ను ఒకప్పుడు ప్రేమించిన మాట వాస్తవమే. కానీ నా ప్రాణ స్నేహితుడి భార్యను నేను ఎప్పటికీ అలా చూడలేను. నీకు రెండు చేతులు జోడించి దండం పెడుతున్నాను. చావనైనా చేస్తాను కానీ నేను నిన్ను ప్రేమించను. కృష్ణ ఎప్పటికీ నా మనసులో ఉంటుంది అని మురారి చెబుతాడు. ఆ మాటలు విన్న కృష్ణ సంతోషిస్తుంది.