Brahmamudi సెప్టెంబర్ 16 ఎపిసోడ్ 203: కావ్య విషయం లో అందరూ తనని తప్పు పెట్టినందుకు గాను తనని తానూ ఇంట్లో నుండి వెలి వేసుకుంటుంది అపర్ణ. ఇక నుండి ఈ ఇంట్లో నేను ఒక జడపదార్థం లాగ పడి ఉంటానని, ఎవరి జోలికి వెళ్ళను, ఏ విషయం పట్టించుకోను, కానీ ఇంట్లోనే ఉంటాను అని అంటుంది. ఆమె నిర్ణయం కి అందరూ ఆశ్చర్యపోతారు.

దుగ్గిరాల కుటుంబం నుండి తనని తానూ వెలి వేసుకున్న అపర్ణ :
అప్పుడు రాజ్ అమ్మా అంటూ అపర్ణ వద్దకు వస్తే, ముఖ్యంగా నువ్వు నాతో మాట్లాడకు, ఈరోజు నీ భార్య ముందు నీ తల్లి దోషి అయిపోయింది కదా, నీ భార్యనే సింహాసనం మీద కూర్చోపెట్టుకో అని అనేసి కోపం గా తన గదిలోకి వెళ్ళిపోతుంది. మరోపక్క కనకం స్వప్న కనిపించకుండా ఎక్కడికి పోయింది అని కంగారు పడుతూ, స్వప్న ఫోన్ కి కాల్ చేస్తూ ఉంటుంది. కానీ స్వప్న ఫోన్ కలవదు, ఏంటో అంత కంగారు పడుతూ ఎవరికి కాల్ చేస్తున్నావ్ అని అన్నపూర్ణ అడగగా, ఉందిగా ఒక శునకం దానికే అని అంటుంది. అంటే స్వప్న కి ఫోన్ చేస్తున్నావా అని అంటుంది అన్నపూర్ణ. పర్లేదు శునకం అనగానే భలే కనిపెట్టేశావ్ అని అంటుంది.

అపర్ణ ని రెచ్చగొట్టిన రుద్రాణి:
అప్పుడు మూర్తి వాళ్ళు ఉన్న ప్లేస్ సిగ్నల్స్ లేవేమో కంగారు పడకు అని కనకం కి సర్ది చెప్తాడు. మరో పక్క రుద్రాణి అపర్ణ రూమ్ లో కూర్చొని బాధ పడడం ని చూసి, మరింత రెచ్చగొట్టడానికి వస్తుంది. ఏదైతే జరగకూడదు అనుకున్నానో, అదే జరిగింది. నేను మొదటి నుండి నీకు చెప్తూనే ఉన్నాను, కావ్య విషయం లో జాగ్రత్త అని, ఈరోజు చూడు ఏమి జరిగిందో. ఇప్పటికైనా అర్థం చేసుకో వదిన, నేను మాత్రమే ఈ ఇంట్లో నీ గురించి నిజాయితీగా ఆలోచించే మనిషిని అంటూ చెప్పుకొస్తుంది. అయినా రాజ్ ఏమిటి వదిన కావ్య కి అలా సపోర్ట్ చేస్తున్నాడు. రాజ్ రాగానే నీకు ఎదురు సమాధానం చెప్తున్నా కావ్య చెంప పగలగొట్టి, నీకు సపోర్ట్ గా నిలుస్తాడని అనుకున్నాను, కానీ కావ్య కి అలా సపోర్ట్ చేస్తాడని ఊహించలేదు. ఒక్క పని మనిషి విషయం లోనే నీ విలువ మొత్తం తీసేసి ఇలా నలుగురిలో నవ్వులపాలు చేసిందంటే, రాబొయ్యే రోజుల్లో ఇంకెన్ని చేస్తుందో అంటూ రెచ్చగొట్టి వెళ్తుంది రుద్రాణి.

రాజ్ తో మాట్లాడేందుకు ఇష్టపడని అపర్ణ :
ఇక ఆ తర్వాత రాజ్ అపర్ణ ని కలవడానికి వెళ్తాడు. అపర్ణ రాజ్ ని కలవడానికి ఏమాత్రం ఇష్టపడడు. జరిగింది చాలు,మాట్లాడింది చాలు, ఇక నేను ఏమి వినదలచుకోలేదు, వెళ్ళు ఇక్కడి నుండి అని అంటుంది అపర్ణ. అక్కడ సమయం వేరు, సందర్భం వేరు , నేను నిన్ను తప్పుపట్టకపోతే అందరూ నిన్నే అంటారు అమ్మా, అందుకే అలా మాట్లాడాను అంటాడు రాజ్. అప్పుడు అపర్ణ అందరితో కలిసి నువ్వు కూడా నా మీద నోరే ఏతావ్ కదా, నిన్న గాక మొన్న వచ్చిన నీ భార్య ఎక్కువ అయిపోయింది, నేను తక్కువ అయిపోయాను, నువ్వు నీ భార్య తో కలిసి చక్కగా కాపురం చేసుకుంటే అంతకు మించి సంతోషం ఏముందిరా, అలాగే చేసుకోపో అని అంటుంది.

అప్పుడు రాజ్ ఈ ప్రపంచం నాకు నీకంటే ఎవరు ఎక్కువ కాదమ్మా, మెల్లగా నేను ఎందుకు ఇలా చేస్తున్నానో నువ్వే అర్థం చేసుకుంటావ్ అని చెప్పి వెళ్తాడు. ఇక మరుసటి ఎపిసోడ్ ప్రోమో లో డిన్నర్ సమయం లో అపర్ణ ఇంట్లో వాళ్ళతో కాకుండా సెపెరేట్ గా కూర్చొని తింటుంది, అప్పుడు ఇందిరా దేవి ఇలా అందరిని వెలి వేసి నువ్వు మాత్రం ఎందుకు ఈ ఇంట్లో ఉండడం, ఆస్తి తీసుకొని వెళ్ళిపో ఇక్కడి నుండి అని అంటుంది, ఆ తర్వాత ఏమి జరిగిందో రేపటి ఎపిసోడ్ లో చూడాలి.