Krishna Mukunda Murari: ముకుందా నువ్వు చాలా మంచి దానివి. కొంతమంది ఇలాంటి సందర్భాలలో చాలా సెల్ఫిష్ గా ఆలోచిస్తారు కానీ, నువ్వు అలా ఆలోచించలేదు. నువ్వు భార్యగా దొరకడం నిజంగా నా అదృష్టం. కానీ నేనే నీ విషయంలో తప్పు చేశాను. నేను నిన్ను అర్థం చేసుకోకుండా ఇక్కడ నుంచి వెళ్ళిపోయాను. అదే ఇక్కడే ఉండి ఉంటే నీ మనసు మారిపోయిన వెంటనే నీతోనే కలిసి ఉండేవాడిని అని ఆదర్శ్ అంటాడు. ఎనీవే నీ లైఫ్ లోకి నన్ను రాణించావు అది చాలు నాకు చాలా సంతోషంగా ఉంది ముకుందా అని ఆదర్శ్ చెప్పి అక్కడ నుంచి వెళ్ళిపోతాడు. అప్పుడు ముకుందా మనసులో ఇంట్లో వాళ్ళని నమ్మించడం కోసం మిమ్మల్ని రప్పించాను కానీ, ఎక్కువ కాలం మీతో ప్రేమగా ఉన్నట్టు నటించలేను. ఎందుకంటే మీరు నేను ఊహించిన దాని కంటే ఎక్కువగా ఆశలు పెంచుకుంటున్నారు. భగవంతుడా ఈ సమస్య నుంచి నేను ఎలా బయటపడాలా అని ముకుందా మనసులో అనుకుంటుంది.
ఏంటి మేడం చూస్తూ ఉండిపోయారు అని మురారి కృష్ణని అడుగుతాడు నాకు ఎంత ఆనందంగా ఉందో మాటల్లో చెప్పలేను అసలు ముకుందా చేత నాకు ఉంగరం తొలగించింది చూడండి అది ఇంకా నమ్మలేకపోతున్నాను తను మారిపోయింది అని అనడానికి ఇంతకంటే క్లియర్ ఎగ్జాంపుల్ మరి ఇంకొకటి ఏముంటుంది అని కృష్ణ మురారితో అంటుంది ముకుందా మారిపోయింది అని మురారి అంటాడు అయితే ఇక నెక్స్ట్ ఏంటి అని కృష్ణుని అడగగా ఏముంది ఏం లేదు అని కృష్ణ అంటుంది ఇప్పుడు ఇంట్లో హార్ట్ టాపిక్ ఏం నడుస్తుందో నీకు తెలుసా మన శోభన ముహూర్తం గురించి అని చెప్పడంతో మీరు ఎక్కడికి వెళ్ళినా ఆ టాపిక్ దగ్గరికి వచ్చి ఆగాల్సిందే కదా అని కృష్ణ అంటుంది.
భవాని ఒంటరిగా నిలబడి ముకుంద గురించి ఆలోచిస్తూ ఉంటుంది ముకుందా కావాలనే
ఆదర్శ్ ను అవాయిడ్ చేస్తుందా.. సరిగ్గా ఆదర్శ్ రింగును ఓపెన్ చేసి ముకుంద చేతికి తొడగబోతాడు. అప్పుడు ముకుందా కావాలని తన చేతిని వెనక్కి లాక్కుంటుంది. అందరూ ఒక్కసారిగా షాక్ అవుతారు. అప్పుడు మా మీద తను చూపించిన ప్రేమ మేము కూడా కృష్ణ మురారి ల మీద చూపించాలి కదా.. ఇప్పుడు ఈ ఉంగరాలని మేము మార్చుకోవటం కన్నా వాళ్ళిద్దరూ మార్చుకోవడమే చాలా మంచిది. వాళ్ళు మా మీద చూపించే ప్రేమని ఈ విధంగా మేము కూడా వాళ్ళ మీద ప్రేమను చూపించాలి కదా అని ఆ ఉంగరాలను క్రిష్ణ మురారి లు మార్చుకుంటేనే నాకు సంతోషం అని వాళ్ళు ఉంగరాలు మార్చుకునేలా చేస్తుంది. నిజంగా ముకుంద లో మార్పు వచ్చిందా, లేదంటే అందరినీ ఏమరుస్తుందా అని ఆలోచిస్తూ ఉంటుంది. ఇందులో మార్పు వచ్చే వరకు తనని ఓ కంట కనబడుతూనే ఉండాలి. ఈసారి ముకుందా మారలేదని తెలిస్తే ఆదర్శ్ ఏమైపోతాడో కూడా తెలీదు అని భవాని మనసులో అనుకుంటూ ఉంటుంది. సరిగ్గా అదే సమయానికి రేవతి అక్కడికి వస్తుంది. ఏం ఆలోచిస్తున్నారు అక్క అని అడుగుతుంది. అప్పుడు రేవతి తో భవాని ఏం లేదు నువ్వు ఏదో చెప్పాలనుకుంటున్నావు కదా అదేంటో చెప్పు అని రేవతి అని అడుగుతుంది భవాని. కృష్ణ మురారిలతో పాటు ఆదర్శ్ ముకుందలకు కూడా శోభనం ముహూర్తం పెట్టించాలి కదా.. కానీ పది రోజుల వరకు ముహూర్తాలు లేవని పంతులుగారు చెప్పారు అందుకే పెట్టుడు ముహూర్తాలు పెట్టించాలని అనుకుంటున్నాను.
రేపు పెట్టుడు ముహూర్తం ఉందంట అక్క ఖాయం చేయనా అని రేవతి అడుగుతుంది. అయినా పది రోజులే కదా పది రోజుల్లో కూడా వెయిట్ చేయలేకపోతే ఎలా అదేమీ ఆరు నెలల్లో సంవత్సరము కాదు కదా తొందరపడడానికి మంచి ముహూర్తం చూసే పెట్టొచ్చులే నీకు అంత తొందరగా ఉంటే.. కృష్ణా మురారిలకు పెట్టించు ముకుంద ఆదర్శలకు మాత్రం వద్దు అని భవాని అంటుంది. అప్పుడు మనసులో భవాని ఒకసారి శోభనం ముహూర్తం అప్పుడే ముకుందా తనకు చేసిన గాయానికి ఆదర్శ్ ఇప్పటివరకు ఇంటికి రాలేదు ఇక ఇప్పుడు కూడా తన మనసులో తను లేడని తెలిస్తే ఇక ఆదర్శం ఏమైపోతాడో తెలీదు ముకుందా మనసులో ఆదర్శం ఉన్నాడు అని తెలిసిన తరువాతే శోభన ముహూర్తం పెట్టించాలని భవాని మనసులో బలంగా నిశ్చయించుకుంటుంది. రేవతి నువ్వు వెళ్లి కృష్ణ మురారి లేరా ఒప్పించు అని చెప్పి రేవతిని అక్కడి నుంచి పంపించేస్తుంది.
రేవతి కృష్ణ తో కార్యం కోసం ముహూర్తం ఇప్పుడప్పుడే లేదు. ఒక పది రోజులు ఆగమంటే పంతులు గారిని అడిగి పెట్టుడి ముహూర్తాలు పెట్టమని చెప్పాము. కానీ పెద్ద అత్తయ్య ఆదర్శ ముకుంద లకు పెట్టుడి ముహూర్తం మాత్రం వద్దని చెప్పింది. కావాలంటే నీకు మురారి కి పెట్టించమని చెప్పింది అక్క అని రేవతి అంటుంది. అప్పుడు పెద్దత్తయ్యతో ఒకసారి మాట్లాడండి అని కృష్ణ రేవతి తీసుకొని వెళుతుంది. కృష్ణ మీరు పెట్టుడు ముహూర్తం పెట్టుకోండి కానీ, ఆదర్శ ముకుందకి మాత్రం పెట్టుడు ముహూర్తం వద్దు. వాళ్ళు ఇంకొన్ని రోజులు వెయిట్ చేస్తారు పరవాలేదు అని కరాఖండిగా భవాని అంటుంది. ఇక అదే విషయాన్ని కృష్ణ మురారి కి చెబుతుంది.
రేపటి ఎపిసోడ్ లో ఇంట్లో వాళ్ళందరూ డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చొని భోజనం చేస్తూ ఉంటారు. అప్పుడు కృష్ణ ఏసిపి సార్ ఫ్రెండ్ వాళ్ళు బెస్ట్ కపుల్ కాంపిటీషన్ కండక్ట్ చేస్తున్నారు. అందులో ఆదర్శ్ ముకుంద పార్టిసిపేట్ చేసి బెస్ట్ కపూల్ అవార్డ్ తీసుకుంటున్నారు. దాంతో వాళ్ళ పైన ఉన్న అనుమానాల్ని క్లియర్ అవుతాయి అని కృష్ణ ముకుంద ని ఇరకాటంలో పడేసింది. ఇక ఆదర్శ్, ముకుంద ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో చూడాలి.