NewsOrbit
Entertainment News Telugu TV Serials

Krishna Mukunda Murari january 27 2024 Episode 378: భవాని అనుమానం.. అందరి ముందు అబద్ధం చెప్పిన ముకుంద ఆదర్శ్.. మధు ప్లాన్..?

Krishna Mukunda Murari Today Episode january 27 2024 Episode 378 Highlights

Krishna Mukunda Murari january 27 2024 Episode 378: కృష్ణా మురారి ఇద్దరూ మెట్లు దిగి కిందకి వస్తూ ఉంటారు నందు వాళ్ళిద్దరిని చూసి నవ్వుతూ ఉంటుంది కృష్ణ ఎందుకు నవ్వుతున్నారు అని అడుగుతుంది. నిన్ను చూస్తేనే నవ్వొస్తుంది కృష్ణ అని అంటుంది నందు అందుకు కృష్ణకి కోపం వస్తుంది నేను ఎప్పుడు అలానే ఉంటానా ఏంటి అని అంటుంది. నువ్వు తింగరి దానివే కదా అని అంటుంది రేవతి అత్తయ్య మీరు కూడా అలానే అంటారు ఏంటి అని అంటుంది కృష్ణ. ఇక అందరూ కలిసి కృష్ణుని ఆట పట్టిస్తూ ఉంటే కృష్ణ నేను కూడా పెద్ద తైలా సీరియస్ గా ఉంటాను అని అంటుంది. అయితే నువ్వు ఒక్కరోజు పెద్ద అత్త ఇలా ఉండు అని మురారి అంటాడు. దానికి కృష్ణ సరే ఉంటాను అయితే అని అంటుంది. అప్పుడే అక్కడికి రేవతి వస్తుంది సోఫాలో కూర్చుంటుంది కృష్ణ కూడా రేవతి లానే సోఫాలో కూర్చుంటుంది సీరియస్గా ఫేస్ పెట్టి ఉంటుంది ఏమైంది కృష్ణ అంత సీరియస్ గా ఉన్నావ్ అని రేవతి అడిగితే ఏమీ మాట్లాడకుండా సైలెంట్ గా ఉంటుంది.

Krishna Mukunda Murari Today Episode january 27 2024 Episode 378 Highlights
Krishna Mukunda Murari Today Episode january 27 2024 Episode 378 Highlights

ఇక రేవతి ఏమైంది కృష్ణకి ఎలా ఉంది అని అడుగుతుంది వెంటనే అక్కడే ఉన్న రేవతి మీలాగా ఉండడానికి తను ఒకరోజు మీలాగా ఉంటానని ఒప్పందం చేసుకుంది అని అంటుంది నాలాగా నువ్వు ఉంటావా ఏంటి కృష్ణ అసలు అయ్యే పనేనా అని అంటుంది రేవతి ఎవరు ఇంకొకలా మారాలని అనుకోకూడదు ఎవరు ఎవరి లాగా ఉంటేనే బాగుంటుంది నువ్వు నీలా ఉంటే బాగుంటుంది నేను నాలా ఉంటే బాగుంటుంది అని అంటుంది. ఆ మాటలకి అవును కదా అని అంటుంది కృష్ణ అందుకే తింగరి పిల్ల వెళ్లి కాఫీ తీసుకురా అని అంటుంది అత్తయ్య మీరు కూడా నాని అంటే నువ్వు వెళ్లి కాఫీ తీసుకురా అని రేవతి అంటుంది ఇక కాఫీ తీసుకురావడానికి వెళ్తుంది కృష్ణ అప్పుడే అక్కడికి పంతులుగారు వస్తారు. పంతులు గారిని చూసి ముకుంద కంగారు పడుతూ ఉంటుంది. ఈ పంతులు ఇప్పుడు శోభనం ముహూర్తం పెట్టడానికి వచ్చాడా అని టెన్షన్ గా ఉంటుంది. కృష్ణ కాఫీ తీసుకొని వస్తుంది పంతులుగారికి కూడా కాఫీ ఇవ్వు అని రేవతి అనడంతో మళ్లీ తీసుకొస్తాను అని అంటుంది అక్కర్లేదు తీసుకొచ్చిన కాఫీ ముందు అందరికీ ఇచ్చి నువ్వు కూడా ఇక్కడే ఉండు అని రేవతి అంటుంది కృష్ణ అలానే అని చెప్పింది చేస్తుంది. ఇక కృష్ణా మురారి పక్కకు వెళ్లి నిలబడుతుంది మురారి కృష్ణతో పంతులుగారు ఎందుకు వచ్చారు అర్థమైంది కదా ఇవాళ రేపు మన శోభనానికి ముహూర్తం పెడతారు. ఇక ఆగేదేం లేదు అని అంటాడు దానికి కృష్ణ చూద్దాం అని అంటుంది. చూడడం కాదు నువ్వే విను అని అంటాడు. ఇక ఆదర్శ్ కూడా ముకుంద వైపు ప్రేమగా చూస్తాడు తను మాత్రం చాలా ఇబ్బందిగా ఫీల్ అవుతుంది.

Krishna Mukunda Murari Today Episode january 27 2024 Episode 378 Highlights
Krishna Mukunda Murari Today Episode january 27 2024 Episode 378 Highlights

ఇక పంతులుగారు పేపర్లన్నీ తిరగేసి పుస్తకాలన్నీ తిరగేసి అమ్మ ఇంకొక పది రోజులు దాకా ముహూర్తాలు లేవు అని అంటాడు. ఆ మాటకు ముకుంద సంతోషపడుతుంది హమ్మయ్య ఈ పంతులు మంచి మాట చెప్పాడు అని అనుకుంటుంది. మురారి మాత్రం చాలా కోపంగా పేస్ పెట్టి కృష్ణ వైపు చూస్తాడు. కృష్ణ నవ్వుతుంది నీకు నవ్వు వస్తుందా కృష్ణ అని అంటాడు. ఇక పంతులుగారు అమ్మ మీరు ముహూర్తం మంచిది పెట్టమన్నారు మరి మీరు పెట్టమంటే ముహూర్తం మంచిదైతే లేదు కానీ మీరు చెప్పారని పెట్టమంటే పెడతాను అని అంటే భవానీ దేవి ఏమీ అవసరం లేదు మీరు మంచి రోజు చూసే పెట్టండి పది రోజులైనా పర్లేదు అని అంటుంది ఆ మాటలకు ఇంట్లో వాళ్ళందరూ కూడా సరే అంటారు ఇక మురారి మాత్రం కృష్ణతో, కోపంగా ఆదర్శ్ తిరిగివస్తే అన్ని అన్నావు ఇప్పుడేమో ఇలా జరుగుతుంది అని అంటాడు. ఆ మాటలకు కృష్ణ నవ్వుతుంది. ఇంకో పది రోజులు ఆగాలి ఏసీబీ సార్ అని అంటుంది. ఇక పంతులు గారిని పంపించండి అని అంటుంది భవానీ దేవి, సరే అని మధు పంతులు గారిని తీసుకొని బయటికి వెళ్తాడు. పంతులు గారిని డబ్బులు ఇచ్చి పంపిస్తుంటే పంతులుగారు మనసులో భవానీ దేవి గారు ఎందుకు నాతో పది రోజులు వాడికి ముహూర్తం లేవని చెప్పించారు మంచి ముహూర్తాలు ఉన్నాయి కదా ఎందుకు ఆవిడ అబద్ధం చెప్పమన్నది అని అనుకుంటాడు. దీన్ని బట్టి చూస్తే భవానీ దేవి ఏదో ప్లాన్లో ఉందని అర్థం అవుతుంది.

Krishna Mukunda Murari Today Episode january 27 2024 Episode 378 Highlights
Krishna Mukunda Murari Today Episode january 27 2024 Episode 378 Highlights

ఇక ముకుందా చాలా టెన్షన్ గా బయటికి వచ్చి నుంచొని ఆలోచిస్తూ ఉంటుంది. ఎక్కడ ముహూర్తం పెట్టేస్తారు అని భయపడ్డాను 10 రోజుల వరకు ముహూర్తాలు లేవనేసరికి ప్రాణం లేచి వచ్చినట్టుంది పాపం ఆదర్శ్ మాత్రం నా మీద ఎన్నో ఆశలు పెట్టుకున్నాడు తన ఆశలన్నీ నిరాశ అయిపోతాయేమో అని అనిపిస్తుంది నా వల్ల నిన్నటి వరకు కృష్ణ మురారి బాధపడ్డారు ఇప్పుడు ఆదర్శ్ బాధపడుతున్నారు నేను ఎవరిని సంతోష పెట్టట్లేదు కానీ ఆదర్శకి ఏమనుకుంటాడో ఏమో అని భయంగా ఉంది నేను ఏదీ కావాలని చేయట్లేదు కదా నా ఇష్టం ఇంకొకరి మీకు కష్టంగా మారుతుంటే నేనేం చేయాలి అని ఆలోచిస్తూ ఉంటుంది మురారి అసలు నేను నిన్ను మర్చిపోలేక పోతున్నాను నావల్ల కావట్లేదు అత్తయ్య నన్ను ఇంకా అనుమానంగా చూస్తోంది ఆవిడ ముందు బయటపడలేను అలాగని నటించలేను ఇప్పుడు ఆదర్శం ఇంటికి వచ్చేసాడు ఇప్పుడు మురారిని మనసులో పెట్టుకొని ఆదర్శంగా నేను ఎలా ఉండాలి. అని అన్ని ఆలోచిస్తూ ఉంటే వెనుక నుంచి ఆదర్శ ముకుందని చూసి ఏంటి ఇక్కడ ఒక్కతే నించొని ఆలోచిస్తుంది ఏమైయుంటుందా అని దగ్గరికి వచ్చి భుజం మీద చేయి వేస్తాడు. ఒకసారిగా ముకుంద పెద్దగా అరుస్తుంది.

Krishna Mukunda Murari Today Episode january 27 2024 Episode 378 Highlights
Krishna Mukunda Murari Today Episode january 27 2024 Episode 378 Highlights

ఇక ముకుంద అర్చిన అరుపులకి ఇంట్లో వాళ్ళందరూ అక్కడికి వచ్చేస్తారు. ఏమైంది అని మధు అంటాడు ముకుంద ఏం చెప్పాలో తెలియక ఉంటుంది కృష్ణ కూడా ఏమైందో చెప్పు అని అంటే ముకుంద ఏమీ చెప్పదు ఇక అందరూ ఆదర్శం అడుగుతారు ఏమైంది అని ఆదర్శ, నిజం చెప్పబోతుంటే ముకుందా అడ్డుపడి ఏమీ లేదు మేమిద్దరం మాట్లాడుకుంటూ ఉంటే పైనుంచి తొండపడింది. దానికి నాకు భయం వేసి పెద్దగా అరిచాను అని అంటుంది. కృష్ణ మురారి వైపు చూసి నవ్వుతుంది. మురారి నీలాగే నువ్వు బళ్ళంటే భయపడతావు తన తొండ అంటే భయపడింది అని అంటాడు. మధు మాత్రం అనుమానంగా ఇక్కడ తొండలే లేవు కదా అని అంటాడు. ఆ మాటలకు ఆదర్శ షాక్ అవుతాడు ఏం చెప్పాలా ఇప్పుడు మధుకి అని ఆలోచిస్తూ ఉంటాడు ఇంట్లో వాళ్ళందరూ కూడా ఆలోచిస్తూ ఉంటే లేదు తొండే పడింది, అని ముకుంద గట్టిగా చెప్తుంది దాంతో భవానీ దేవి ఎవరికి ఏమి జరగలేదు కదా ఇక ఈ డిస్కర్షన్ ఎందుకు పదండి వెళ్దాం అని అంటుంది. అందరూ వెళ్లిపోయిన తర్వాత ఆదర్శ్ తో ముకుందా మీరు నాకు చాలా హెల్ప్ చేశారు ఎక్కడ మీరు నిజం చెప్తారు అని భయపడ్డాను అని అంటుంది. అందరూ నేను చేయి వేస్తే నేను వరి చావని తెలిస్తే ఇంకా బాధపడేవాళ్లు నువ్వు ఇంకా నన్ను ఇష్టపడట్లేదు అని అనుకునే వాళ్ళు కానీ నువ్వు అలా చెప్పకుండా బాగా తెలివిగా సమాధానం చెప్పావు ముకుందా అని అంటాడు ఆదర్శ. ముకుంద మాత్రం మనసులో నేను మిమ్మల్ని మోసం చేస్తున్నాను అని అనుకుంటుంది. ఇక అక్కడి నుంచి ఆదర్శ్ కూడా వెళ్లిపోతాడు నువ్వేదో డీప్ గా ఆలోచిస్తున్నట్లు ఉన్నావు నేను డిస్టర్బ్ చేశాను సారీ అని చెప్పి వెళ్ళిపోతాడు. ముకుంద మాత్రం అక్కడే నిలబడి ఆలోచిస్తూ ఉంటుంది.

Krishna Mukunda Murari Today Episode january 27 2024 Episode 378 Highlights
Krishna Mukunda Murari Today Episode january 27 2024 Episode 378 Highlights

ఇక కృష్ణా, మురారి ఇద్దరు గదిలోకి వస్తారు ముహూర్తం లేదనేసరికి చాలా ఫీల్ అవుతూ ఉంటాడు మురారి కృష్ణ కావాలని ఆటపట్టిస్తూ ఉంటుంది ఆదర్శ తెలుగు వచ్చాక అన్ని అన్నావు ఇప్పుడేమో మాట మారుస్తున్నావు అని అంటాడు మురారి ఆదర్శ్ రావడమే కాదు ముకుందతో సంతోషంగా ఉండాలి కదా అని అంటే, అంటే వాళ్ళిద్దరూ కలిసి ఉండకపోతే అని అంటాడు మురారి అవునే సిటీ సార్ మీరు అనుకున్నదే వాళ్ళిద్దరూ కలిసి ఉండకపోతే మనం కూడా కలము అని చెప్తుంది దానికి మురారి చాలా కోపం వస్తుంది అదేంటి అలా అంటావు అని అంటాడు అనడం ఏంటి సార్ మీకు కూడా అలానే అనిపిస్తుంది కదా అని అంటుంది. వాళ్ళిద్దరూ కచ్చితంగా కలుస్తారు అని అంటాడు మురారి. ముకుంద ఒకప్పుడు ఎలా ఉందో కానీ ఇప్పుడు మాత్రం ఆదర్శ వచ్చిన తర్వాత చాలా బాగుంది అని అంటుంది కృష్ణ. ఆదర్శవచాక ముకుంద ఎలా రిసీవ్ చేసుకుంటుందో అనుకున్నాను కానీ ఇప్పుడు నా అనుమానాలు అన్నీ పోయాయి అని అంటాడు. వాళ్ళిద్దరిని చూస్తుంటే చాలా ముచ్చటగా ఉంది అని అంటాడు మురారి.

రేపటి ఎపిసోడ్లో మధు అందరితో కలిసి మందు కొడుతూ ఉంటాడు. మధు ప్లాన్ ప్రకారం,నిజంగానే ముకుంద, ఉదయం తొండపడిందని అరిచిందా అని అంటాడు. ఏదో జరిగినట్టు నాకనిపిస్తుంది అదేంటి అని అడుగుతాడు వెంటనే అక్కడికి వచ్చిన ముకుందా వీళ్ళు కచ్చితంగా నిజం రాబట్టాలని చూస్తున్నారు ఇప్పుడు ఎక్కడ ఆదర్శ అందరికీ నిజం చెప్తాడు అని భయపడుతుంది.

Related posts

Kalki 2898 AD: హాట్ టాపిక్ గా క‌ల్కి మూవీ ప్ర‌మోష‌న్స్ బ‌డ్జెట్‌.. మ‌రో రెండు సినిమాలు తీయొచ్చు!!

kavya N

Bengalore Rave Party: రేవ్ పార్టీ ఎంట్రీ ఫీజు అన్ని ల‌క్ష‌లా.. షాకింగ్ విష‌యాలు బ‌ట‌య‌పెట్టిన బెంగళూరు పోలీస్ కమిషనర్!

kavya N

Tollywood Young Heroes: షాకిస్తున్న టాలీవుడ్ యంగ్ హీరోల రెమ్యున‌రేష‌న్‌.. ఒక్కొక్క‌రిది ఒక్కో రేటు!

kavya N

Harom Hara Release Date: కొత్త రిలీజ్ డేట్ ను అనౌన్స్ చేసిన హరోం హర మూవీ టీం.. పోటీ నుంచి తప్పుకున్న సుధీర్ బాబు..!

Saranya Koduri

Lavanya Tripathi: మెగా ఫ్యాన్స్ కి సూపర్ గుడ్ న్యూస్.. తల్లి కాబోతున్న లావణ్య..!

Saranya Koduri

Srimukhi: శ్రీముఖి మూవీ టైటిల్ ని దొబ్బేసిన అజిత్.. రిలీజ్ కి నోచుకోలేకపోయినా తెలుగు యాంకర్ మూవీ..!

Saranya Koduri

Prabhas Kalki OTT: రెండు ఓటీటీల్లో అడుగుపెట్టనున్న కల్కి.. తెలుగు స్ట్రీమింగ్ ప్లాట్ ఫామ్ డీటెయిల్స్ ఇవే..!

Saranya Koduri

Dhe Promo: ఢీ షో కి స్పెషల్ గెస్ట్ గా హాజరైన కాజల్.. గ్రాండ్ ఫినాలే కి చేరుకున్న ముగ్గురు కంటెస్టెంట్ల లిస్ట్ ఇదే..!

Saranya Koduri

South Actress: ఈ ఫోటోలో ఉన్న చిన్నారిని గుర్తుప‌ట్టారా.. సౌత్ ఇండ‌స్ట్రీలో స్టార్ హీరోయిన్ ఆమె..!!

kavya N

Karthika Deepam 2 May 21th 2024 Episode: తాళి తెంపబోయిన నరసింహ.. కాళికాదేవి రూపం ఎత్తిన దీప..!

Saranya Koduri

Kajal Aggarwal: అసిస్టెంట్ డైరెక్టర్ నుంచి కాజ‌ల్ కు చేదు అనుభ‌వం.. కారవాన్ లో ష‌ర్ట్ తీసేసి అంత ప‌ని చేశాడా..?

kavya N

Vijayashanti: మ‌రో కొత్త సినిమాకు సైన్ చేసిన విజ‌య‌శాంతి.. ఆ మెగా హీరోకి త‌ల్లిగా రాముల‌మ్మ‌!

kavya N

Brahmamudi May 21 Episode  415:అనామిక తో విడాకులు అన్న కళ్యాణ్.. మాయని దుగ్గిరాల ఇంటికి తెచ్చిన కావ్య.. ప్లేట్ తిప్పేసిన మాయ… ఫ్యుజులు ఎగిరే ట్విస్ట్ రేపటికి..

bharani jella

Nuvvu Nenu Prema May 21 Episode 629: తన భర్త గురించి నిజం తెలుసుకున్న అరవింద.. పద్మావతిని బెదిరించిన కృష్ణ..అరవింద ని కొట్టిన కృష్ణ ..

bharani jella

Krishna Mukunda Murari May 21 Episode 475: ముకుంద మీద కృష్ణ మురారిల అనుమానం.. కృష్ణ బిడ్డ సేఫ్..ముకుందని కొట్టిన కృష్ణ..

bharani jella