NewsOrbit
Entertainment News Telugu TV Serials

Krishnamma Kalipindi Iddarini Today: ఆదిత్య చేసిన త్యాగం గురించి తెలిసి బాధపడిన ఈశ్వర్…ఆదిత్య ప్రవర్తన గురించి అఖిలకు సలహా ఇచ్చిన భవాని!

Krishnamma Kalipindi Iddarini August1 17 2023 Episode 87 highlights

Krishnamma Kalipindi Iddarini ఆగస్టు 17 ఎపిసోడ్ 87: నువ్వు ఎంత బాధ పడుతున్నావో ఎంత మానసిక క్షోభ అనుభవిస్తున్నావో అర్థం చేసుకోగలను రా, భవిష్యత్తు గురించి భయమేస్తుంది అని పెద్ద మాటలు మాట్లాడుతున్నావు ఏమైందిరా, అఖిలతో పెళ్లి నీకు ఇష్టం లేదా, మనసు చంపుకొని పెళ్లి కి ఒప్పుకున్నావా, అఖిలతో సంతోషంగా లేవా, నాతో చెప్పుకోలేనివి ఏమైనా కష్టాలు ఉన్నాయా నీ ఈశ్వర్ అడుగుతాడు. అలాంటిదేమీ లేదు అన్నయ్య అప్పుడే చెప్పాను కదా అఖిలతో ఇష్టపడే పెళ్లి చేసుకున్నానని అని అంటాడు ఆదిత్య. ఇష్టపడి పెళ్లి చేసుకున్నప్పుడు భవిష్యత్తు గురించి ఎందుకు అన్నావు రా అని ఈశ్వర్ అడుగుతాడు.

Krishnamma Kalipindi Iddarini August1 17 2023 Episode 87 highlights
Krishnamma Kalipindi Iddarini August1 17 2023 Episode 87 highlights

భవిష్యత్తు కాదు అన్నయ్య బిజినెస్, బిజినెస్ గురించి అన్నాను అని ఆదిత్య అంటాడు.నేను సంతోషంగా ఉండాలని నువ్వు కన్నీరు దిగమింగుకుంటున్నావు కదరా ఈ అన్నయ్య మీద ఉన్న ప్రేమకి నాకోసం నువ్వు చేసిన త్యాగానికి నీకు రెండు చేతులెత్తి దండం పెట్టాలని ఉంది రా అని ఈశ్వర్ తన మనసులో అనుకుంటాడు. దీనికి ఏంటన్నయ్య దేని గురించి ఆలోచిస్తున్నావ్ అని ఆదిత్య అడుగుతాడు. నువ్వు ఇలా బాధపడుతుంటే నాకు చాలా బాధగా ఉంది రా అని ఆదిత్యతో అంటాడు.

Krishnamma Kalipindi Iddarini August1 17 2023 Episode 87 highlights
Krishnamma Kalipindi Iddarini August1 17 2023 Episode 87 highlights

నీ ప్రాబ్లం నీ సాల్వ్ చేయడానికి నేను ఏమైనా చేయగలనా అని అడుగుతాడు ఈశ్వర్. నువ్వు ఎప్పుడు హ్యాపీగా ఉండాలి రా ప్రశాంతంగా ఉండాలి నీ నోటి నుంచి ఇలా భయం అనే మాట రాకూడదు అందుకే అన్నయ్యను ఏం చేయమంటావు చెప్పురా నువ్వు సంతోషంగా ఉండడం కోసం నేను ఏమైనా చేస్తాను అంతే తప్ప నీలో ఏదైనా కష్టం దాచుకొని నీలో నువ్వు బాధపడొద్దు చెప్పురా నీ మనసులో ఏదైనా బాధ ఉంటే ఈ అన్నయ్యతో చెప్పురా నేను చూసుకుంటాను అని ఈశ్వర్ అడుగుతాడు. అన్నయ్య నాకు ఏదైనా కష్టం వస్తే నీకు కాకపోతే ఇంకెవరితో చెప్పుకుంటాను నేను చాలా హాయిగా ఉన్నాను నా గురించి నువ్వు టెన్షన్ పడకు అన్నయ్య అని ఆదిత్య అంటాడు.

Krishnamma Kalipindi Iddarini August1 17 2023 Episode 87 highlights
Krishnamma Kalipindi Iddarini August1 17 2023 Episode 87 highlights

నేను ఎంత అడిగినా నేను బాధపడతానని చెప్పడం లేదు చాలా బాధగా ఉంది రా అని ఈశ్వర్ తన మనసులో అనుకుంటాడు. నీకు ఏ బాధ వచ్చినా నాకు చెప్పురా అని అక్కడి నుండి వెళ్ళిపోతాడు ఈశ్వర్. ఈ తమ్ముడు అంటే నీకు ఎంత ప్రేమ నాకు తెలుసు అన్నయ్య అమృతను దూరం చేసుకుని నేను బాధపడుతున్నాను అని నీకు తెలిస్తే నువ్వు తట్టుకోలేవు నువ్వు వదినతో జీవితాంతం హ్యాపీగా ఉండాలి అన్నయ్య అందుకోసం నేను ఎంత పెద్ద బాధనైనా అనుభవిస్తాను అని ఆదిత్య అనుకుంటాడు. కట్ చేస్తే, నీ మీద నాకు చాలా నమ్మకం ఉంది గౌరీ ఆ నమ్మకాన్ని నువ్వు ఆకాశమంత చేసావ్, అవును మీ పెళ్లిల్ల విషయంలో మీ అమ్మ పెట్టిన కండిషన్ గురించి నువ్వు ఎక్కడ ఈశ్వర్ తో చెప్తావేమో అని చాలా భయపడిపోయాను కానీ నువ్వు నా మాట గౌరవించి నా మీద గౌరవంతో ఈశ్వర్ కి చెప్పలేదు, ఆ నిజం నీ శోభనానికి ఆటంకం కాకుండా మీరు సంతోషంగా కొత్త జీవితం ప్రారంభించినందుకు నేను పడిన కష్టమంతా పోయి ఈరోజు మీ ఇద్దరి అన్యోన్యత చూసి నేను చాలా ప్రశాంతంగా ఉన్నాను అని సునందా అంటుంది.

Krishnamma Kalipindi Iddarini August1 17 2023 Episode 87 highlights
Krishnamma Kalipindi Iddarini August1 17 2023 Episode 87 highlights

నేను ఆయనకి చెప్పకుండా దాచిన నిజాలు, నా జీవితానికి శాపంగా మారాయి అత్తయ్య అని గౌరీ తన మనసులో అనుకుంటుంది. ఏంటమ్మా అలా ఉన్నావ్ ఏం ఆలోచిస్తున్నావ్ అని సునంద అడుగుతుంది. ఏం లేదు అత్తయ్య ఏమీ లేదు అని గౌరీ చెప్తుంది. మీరు ఆరాటపడుతున్నట్టుగా మా మధ్య ఇలాంటి బంధం బలపడదు అత్తయ్య ఆయన మనసులో నాకు భార్య స్థానం లేదని చెప్పారు ఈ విషయం మీకు చెప్పాలని ఉంది కానీ మీరు బాధపడతారని గుండెల్లో మోస్తున్నాను అని గౌరీ తన మనసులో బాధపడుతుంది.

Krishnamma Kalipindi Iddarini August1 17 2023 Episode 87 highlights
Krishnamma Kalipindi Iddarini August1 17 2023 Episode 87 highlights

గౌరీ ఒక మంచి కోసం చిన్న చిన్న నిజాలు దాచిపెట్టడంలో తప్పులేదు అని సునంద అంటుంది. ఇంతలో భవాని అక్కడికి వస్తుంది వాళ్ళిద్దరూ మాట్లాడుకునేది చూస్తుంది. వీళ్ళిద్దరే ప్రేమగా మాట్లాడుకుంటున్నారు నా కూతురు లేదేంటి కొంపతీసి వీళ్లిద్దరూ ఒక పార్టీ అయ్యి నా కూతుర్ని పక్కకి తోసేసారా ఏంటి అని లోపలికి వస్తుంది భవాని. అఖిల ఎక్కడమ్మా అని భవాని అడుగుతుంది. నాన్న రాలేదా అమ్మ అని గౌరీ అడుగుతుంది. గౌరీని పట్టించుకోకుండా భవాని మళ్లీ మళ్లీ అఖిల గురించి అడుగుతుంది. ఏవండీ మీ పద్ధతి నాకేం నచ్చలేదు, మీరు గౌరీని పట్టించుకోవడం లేదు అంటుంది సునంద. నా ఇద్దరు కూతుర్లు నాకు రెండు కళ్ళు, అందుకే పిల్లల కాపురాలు చల్లగా ఉండాలి వాళ్లు బాగుండాలి అని ఆచారం ప్రకారం చలివిడి చేసి తీసుకొచ్చాను అని భవాని అంటుంది. గౌరిని పట్టించుకోలేదన్న కోపంలో అన్నాను మీరు ఏమనుకోకండి అని సునంద అంటుంది. గౌరీ భవానిని అఖిల దగ్గరికి తీసుకెళ్తుంది.

Krishnamma Kalipindi Iddarini August1 17 2023 Episode 87 highlights
Krishnamma Kalipindi Iddarini August1 17 2023 Episode 87 highlights

ఇంకోసారి మా అత్తయ్య గారి ముందట నన్ను నిర్లక్ష్యం చేసి మాట్లాడకు అని గౌరీ చెప్తుంది. దానివల్ల మన కుటుంబ పరువును మనమే బయటపెట్టిన వాళ్ళమవుతాము. ఇంకోసారి అలా చేయకు అమ్మ అని గౌరీ చెప్తుంది. సరే నేను అఖిల దగ్గరికి వెళ్తానని భవాని వెళుతుంది.నన్ను చూడగానే నీ మొహం చిచ్చుబుడ్డి లాగా వెలిగిపోతోంది అనుకున్నాను, ఏమైందమ్మాడు నువ్వు కలలు కన్నా ఇంటికి కోడలు పోయావు కానీ ఆ సంతోషం నీ మొహం లో ఆవగింజంతైన కనిపించడం లేదు ఏంటి, కంగారు నేను భరించలేకపోతున్నాను ఏమైందో చెప్పు అంటుంది భవాని.నేను ఇంటికి కోడలు మాత్రమే అయ్యాను కానీ నేను చెప్పినట్టు మాకు శోభనం జరగలేదమ్మా అని అఖిల ఏడుస్తూ చెప్తుంది.ఆయన నాతో ప్రేమగా ఉండడానికి కొంచెం టైం అడిగారమ్మా. ఇంత చిన్న విషయానికి ఎవరైనా ఏడుస్తారా ఇప్పుడు నువ్వు చేయాల్సింది మీ ఆయన్ని ఆకట్టుకునేలా నీ చూపులతో నీ మాటలతో మాయ చేయాలి నేను చెప్పినట్టు చెయ్ మీ ఆయన నీ వెనకాల కుక్కపిల్లలా తిరుగుతాడు అని భవాని అంటుంది

Related posts

Kalki 2898 AD: హాట్ టాపిక్ గా క‌ల్కి మూవీ ప్ర‌మోష‌న్స్ బ‌డ్జెట్‌.. మ‌రో రెండు సినిమాలు తీయొచ్చు!!

kavya N

Bengalore Rave Party: రేవ్ పార్టీ ఎంట్రీ ఫీజు అన్ని ల‌క్ష‌లా.. షాకింగ్ విష‌యాలు బ‌ట‌య‌పెట్టిన బెంగళూరు పోలీస్ కమిషనర్!

kavya N

Tollywood Young Heroes: షాకిస్తున్న టాలీవుడ్ యంగ్ హీరోల రెమ్యున‌రేష‌న్‌.. ఒక్కొక్క‌రిది ఒక్కో రేటు!

kavya N

Harom Hara Release Date: కొత్త రిలీజ్ డేట్ ను అనౌన్స్ చేసిన హరోం హర మూవీ టీం.. పోటీ నుంచి తప్పుకున్న సుధీర్ బాబు..!

Saranya Koduri

Lavanya Tripathi: మెగా ఫ్యాన్స్ కి సూపర్ గుడ్ న్యూస్.. తల్లి కాబోతున్న లావణ్య..!

Saranya Koduri

Srimukhi: శ్రీముఖి మూవీ టైటిల్ ని దొబ్బేసిన అజిత్.. రిలీజ్ కి నోచుకోలేకపోయినా తెలుగు యాంకర్ మూవీ..!

Saranya Koduri

Prabhas Kalki OTT: రెండు ఓటీటీల్లో అడుగుపెట్టనున్న కల్కి.. తెలుగు స్ట్రీమింగ్ ప్లాట్ ఫామ్ డీటెయిల్స్ ఇవే..!

Saranya Koduri

Dhe Promo: ఢీ షో కి స్పెషల్ గెస్ట్ గా హాజరైన కాజల్.. గ్రాండ్ ఫినాలే కి చేరుకున్న ముగ్గురు కంటెస్టెంట్ల లిస్ట్ ఇదే..!

Saranya Koduri

South Actress: ఈ ఫోటోలో ఉన్న చిన్నారిని గుర్తుప‌ట్టారా.. సౌత్ ఇండ‌స్ట్రీలో స్టార్ హీరోయిన్ ఆమె..!!

kavya N

Karthika Deepam 2 May 21th 2024 Episode: తాళి తెంపబోయిన నరసింహ.. కాళికాదేవి రూపం ఎత్తిన దీప..!

Saranya Koduri

Kajal Aggarwal: అసిస్టెంట్ డైరెక్టర్ నుంచి కాజ‌ల్ కు చేదు అనుభ‌వం.. కారవాన్ లో ష‌ర్ట్ తీసేసి అంత ప‌ని చేశాడా..?

kavya N

Vijayashanti: మ‌రో కొత్త సినిమాకు సైన్ చేసిన విజ‌య‌శాంతి.. ఆ మెగా హీరోకి త‌ల్లిగా రాముల‌మ్మ‌!

kavya N

Brahmamudi May 21 Episode  415:అనామిక తో విడాకులు అన్న కళ్యాణ్.. మాయని దుగ్గిరాల ఇంటికి తెచ్చిన కావ్య.. ప్లేట్ తిప్పేసిన మాయ… ఫ్యుజులు ఎగిరే ట్విస్ట్ రేపటికి..

bharani jella

Nuvvu Nenu Prema May 21 Episode 629: తన భర్త గురించి నిజం తెలుసుకున్న అరవింద.. పద్మావతిని బెదిరించిన కృష్ణ..అరవింద ని కొట్టిన కృష్ణ ..

bharani jella

Krishna Mukunda Murari May 21 Episode 475: ముకుంద మీద కృష్ణ మురారిల అనుమానం.. కృష్ణ బిడ్డ సేఫ్..ముకుందని కొట్టిన కృష్ణ..

bharani jella