Rain Alert: బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తనం శుక్రవారం అల్పపీడనంగా మారనుందని వాతావరణ శాఖ తెలిపింది. అల్పపీడన ప్రభావంతో రాబోయే మూడు రోజుల్లో తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉందని చెప్పింది. ఇప్పటికే తెలుగు రాష్ట్రాల్లో కొన్ని చోట్ల వర్షాలు కురుస్తున్నాయి. తెలంగాణలో భారీ వర్షాలు..ఏపీలో తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు కురువనున్నాయని తెలిపింది. ఆవర్తన ప్రభావంతో మూడు రోజుల పాటు వర్షాలు పడతాయని హైదరాబాద్ వాతావరణ శాఖ అంచనా వేసింది.

తెలంగాణలోని పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు తెలిపింది. పలు ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురుస్తాయని వెల్లడించింది. ఇక..భారీ వర్షాల నేపథ్యంలో తెలంగాణలోని 16 జిల్లలకు రెండు రోజులపాటు ఎల్లో అలెర్ట్ జారీ చేసింది. నేడు హైదరాబాద్ లో మోస్తరు నుండి బారీ వర్షం కురిసే అవకాశం ఉంది. దాంతో జీహెచ్ఎంసీ అధికారులు, సిబ్బంది అలర్ట్ అయ్యారు. మరో వైపు నిర్మల్, వరంగల్, హన్మకొండ, కరీంనగర్, ములుగు, సిరిసిల్ల, మహబూబాబాద్, పెద్దపల్లి, అసిఫాబాద్, జయంశంకర్ భూపాల్ పల్లి, నిజామాబాద్ జిల్లాల్లో అక్కడక్కడా మోస్తరు నుండి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ అధికారులు తెలిపారు.
ఏపిలోనూ రెండు రోజుల పాటు వర్షాలు పడే అవకాశం ఉందని తుఫాను హెచ్చరికల కేంద్రం వెల్లడించింది. కొస్తాంధ్ర లో చాలా చోట్ల మోస్తరు వర్షాలు కురుస్తాయని తెలిపింది. రెండు జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్, 20 జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేశారు. కోస్తా తీరం వెంబడి గంటకు 40 – 50 కిలో మీటర్ల వేగంతో గాలులు వీస్తాయనీ.. మత్స్య కారులు వేటకు వెళ్లొద్దని వాతావరణ శాఖ హెచ్చరించింది.
శుక్రవారం తుర్పు గోదావరి జిల్లా, కాకినాడ, పార్వతీపురం మన్యం, శ్రీకాకుళం, విశాఖపట్నం, విజయనగరం జిల్లాల్లో మోస్తరు వర్షాలు పడతాయని అధికారులు అంచనా వేశారు. మిగితా జిల్లాలోనూ తేలికపాటి జల్లులు కురుస్తాయని అంటున్నారు. అక్కడక్కడా ఉరుములు మెరుపులతో కూడిన వర్షాలు కురుస్తాయని ప్రకటించారు. రాయలసీమలోని కొన్ని ప్రాంతాలపై అల్పపీడన ప్రభావం కొనసాగుతోందని తుఫాను హెచ్చరికల కేంద్రం తెలిపింది.
వైసీపీకి రాబోయే ఎన్నికల్లో 151కి ఒక్క సీటు కూడా తగ్గదన్న విజయసాయి రెడ్డి