Krishna Mukunda Murari: కృష్ణ ఇంట్లో ఒక్కొక్కరిని తలుచుకుని మనసులో బాధపడుతూ ఉంటుంది. తనని ఇంట్లో వాళ్ళందరూ ఎలా ఆక్కున చేర్చుకున్నారో, వాళ్ళందరూ తన మనసుకి ఏ విధంగా కనెక్ట్ అయ్యారో ఆ సన్నివేశాలు అన్నింటిని గుర్తు చేసుకుని కృష్ణపడుతూ ఉంటుంది.. ఏసీపీ సార్ మీరు కూడా నన్ను వదిలేసి వెళ్ళిపోతారా.. ఈ సమయంలో నేను బాధపడటం తప్ప నాకోసం మీరు రారా అని కృష్ణ మదన పడుతూ ఉంటుంది. అప్పుడే మురారి ఆగు, మురారి నువ్వు అక్కడికి వెళ్ళకూడదు అనే మాటలు వినిపిస్తాయి కృష్ణకి.. ఏసిపి సార్ నేను తలుచుకోగానే నాకోసం మీరు వచ్చారా అంటూ.. కృష్ణ పరుగు పరుగున బయటకు వస్తుంది. మురారి ఎక్కడ ఉన్నాడా అని ఆత్రంగా చుట్టు తిరుగుతూ తనకోసం వెతుకుతూ ఉంటుంది.

మురారి కారులో వెళ్తుండగా కృష్ణ చెప్పిన మాటలు గుర్తుకు వస్తాయి.. మనం చాలా తప్పు చేసాం , మనం మన అగ్రిమెంట్ మ్యారేజ్ గురించి అందరికీ చెప్పి ఉండాల్సింది ఏసిపి సార్. చాలా పెద్ద తప్పు చేశాం మనం. నాకు ఇలా వెళ్ళిపోతున్నందుకు చాలా గిల్టీగా ఉంది. మీకే మీరు మీ వాళ్ళతో ఎప్పుడూ కలిసి సంతోషంగా ఉంటారు. కానీ, నాకు అలా కాదు తర్వాత ఎప్పటికైనా మన అగ్రిమెంట్ మ్యారేజ్ గురించి వాళ్ళకి తెలుస్తుంది కదా.. అప్పుడు వాళ్ళు నన్ను తప్పుగా అనుకుంటారు కదా అని కృష్ణ బాధపడుతుంది. నా అవసరం కోసం నేను మిమ్మల్ని మీ కుటుంబ సభ్యుల్ని వాడుకున్నాను అని నా గురించి తప్పుగా అనుకుంటారు కదా ఏసీబీ సార్ ఇలా ఇప్పటివరకు వాళ్లతోనే మనం సంతోషంగా ఉండడం నిజంగా తప్పే కదా మనం మోసం చేస్తున్నాం అని కృష్ణ అన్న మాటలకు మురారి కారులో ఏడుస్తాడు.

మురారి కారులో కృష్ణ వెళ్తున్నట్టు కనిపించి కారులో నుంచి దిగి కృష్ణ కృష్ణ అంటూ తనకి ఎదురు వెళ్తూ ఉంటాడు కానీ ఎదురుగా ఉన్న వాళ్ళు మాత్రం కృష్ణ కాదు నిదానంగా విషయం తెలుసుకున్న మురారి కారు పక్కన కూర్చుని కృష్ణ కోసం బాధపడుతూ ఉంటాడు కృష్ణ నీ విషయంలో నువ్వు చాలా క్లారిటీగా ఉన్నావు కానీ నువ్వే నా ప్రపంచం కృష్ణ అంటూ మురారి రోడ్డు మీద కూర్చుని బాధపడుతూ ఉంటాడు మరో వైపు కృష్ణ మురారి ఎక్కడ అని వెతుకుతూ ఉండగా అంతలో వాళ్ళ అమ్మ మురారి ఆగు ఇలా గొడవ చేయకూడదు అని తనను పట్టుకొని ఆపుతుంది. కృష్ణ అప్పుడు అక్కడికి వెళ్లి ఆ బాబుని ఎత్తుకుంటుంది.

కృష్ణ ఇంట్లో అందరికీ తలా ఒక గిఫ్ట్ ఇస్తుంది. ఆ గిఫ్ట్ గురించి ఇంట్లో ప్రతి ఒక్కరూ మాట్లాడుకుంటూ ఉంటారు. మధుకి జాకీ ఇస్తుంది. భవాని మధు ని పిలిచి తనకి ఇచ్చిన జాకినీ టీవీకి కనెక్ట్ చేయమని చెప్తుంది. అందులో ఉన్న వీడియోని చూసి ప్రతి ఒక్కరు ఆశ్చర్యపోతారు. ఆ వీడియోలో కృష్ణ ప్రతి ఒక్కరు గురించి మంచిగా మాట్లాడుతూ వాళ్ళల్లో మార్చుకోవాల్సిన మార్పుల గురించి మాట్లాడుతూ ఉంటుంది. కృష్ణ మాటలు విన్న ప్రతి ఒక్కరు కూడా తనమీద గౌరవాన్ని రెట్టింపు చేశాయి. కానీ గౌతం నందిని మాత్రం కోపంగా ఉన్నారు. రేవతి కూడా ఇంత మంచి అమ్మాయిని క్యాంపు నుంచి దూరం కాకుండా మళ్ళీ ఇంటికి తెచ్చుకునే ప్రయత్నం చేయాలి అని అనుకుంటుంది. భవానీకి కూడా మనసులో ఏదో అనుమానం కలుగుతుంది.

రేపటి ఎపిసోడ్ లో భవాని ముకుందని పిలిచి నువ్వు పెళ్లికి ముందు ఎవరినైనా ప్రేమించావా అని అడుగుతుంది. అదేంటి అత్తయ్య అలా అడుగుతున్నారు అని ముకుందా అడుగుతుంది. ప్రశ్నకి ప్రశ్న జవాబు కాదు. జవాబు చెప్పు అని భవాని ముకుందని నిలదీస్తుంది. అవును అత్తయ్య ప్రేమిస్తున్నాను ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమిస్తున్నాను అని ముకుంద చెబుతుంది ఆ మాటకి భవాని షాక్ అవుతుంది. ఇక ఏం జరుగుతుందో తరువాయి భాగంలో చూద్దాం.