NewsOrbit
Entertainment News Telugu TV Serials

Mamagaru November 08 2023 episode 51: దేవమ్మ గంగకు పులక్షరూపాయలు ఇచ్చినందు గొడవ చేస్తున్న వసంత..

Mamagaru today episode november 08 2023 episode 51 highlights

Mamagaru November 08 2023 episode 51:  పిల్లి మొహం వేసుకొని ఎలా విన్నావో ఏమో అని వాళ్ళ ఆయన అంటాడు.ఏంటి నేను తిండిపోతున్న  పిల్లి మొహం వేసుకొని ఉన్నానా నీదే చెత్త మొహం గుమ్మడికాయ మొహం అంటూ శ్రీలక్ష్మి వాళ్ళ ఆయనను తిట్టడం మొదలు పెడుతుంది.శ్రీ లక్ష్మీ నువ్వు తిట్టడం ఆపేయి ని మాట ఎప్పుడైనా నేను కాదన్నా చెప్పు అలాగే తీసుకో అని వాళ్ళ ఆయన అంటాడు. కానీ తీసుకున్న వాళ్లే కట్టాలని మామయ్య శరత్ పెట్టాడండి అని శ్రీలక్ష్మి అంటుంది. అలాగే శ్రీలక్ష్మి నువ్వు చెప్పాక నేను కాదంటానా కానీ అందులో నుంచి 5000 తీసి పక్కన పెట్టు నేను వచ్చాక చెప్తాను అని వాళ్ళ ఆయన అంటాడు. సరేనండి అనే శ్రీలక్ష్మి అంటుంది. గంగ వాడుకున్న వాళ్ళే ఈ డబ్బులు కట్టాలని మీ మామయ్య గారు అన్నారు ఇప్పుడు ఆలోచించకుండా వెళ్లి మీ నాన్నగారిని హాస్పటల్లో జాయిన్ చేయి ఆ తర్వాత ఏం చేయాలో ఆలోచిద్దాం అని దేవమ్మ అంటుంది. చాలా థాంక్స్ అత్తయ్య మీరు సమయానికి ఆదుకున్నారు అని గంగా అంటుంది. అవునమ్మా నువ్వు గంగకు అనుకున్న సమయానికి డబ్బు ఇచ్చి మంచి పని చేశావు అని గంగాధర్ అంటాడు.

Mamagaru today episode november 08 2023 episode 51 highlights
Mamagaru today episode november 08 2023 episode 51 highlights

ఈ డబ్బు ఎలాగో అలా నెలకు కొన్ని నేనే కడతాను అత్తయ్య అని గంగా అంటుంది. గంగాధర్ గంగని హాస్పిటల్ తీసుకువెళ్ళు అని దేవమ్మ అంటుంది.కట్ చేస్తే అత్తయ్యమీ అబ్బాయిని అడిగాను డబ్బులు సగం ఇవ్వండి అని శ్రీలక్ష్మి అంటుంది. అంటే అంత డబ్బు లేదమ్మా గంగ వాళ్ళ నాన్నకు ఆరోగ్యం బాగోలేదని లక్ష రూపాయలు ఇచ్చాను అని దేవమ్మ అంటుంది. అలా ఎలా ఇస్తారు అత్తయ్య మాకు కొన్ని ఖర్చులు ఉంటాయి కదా సరే ఇంకేం చేస్తాం ఆ 50,000 ఇవ్వండి అని శ్రీలక్ష్మి అంటుంది. అంటే వసంత కూడా అడిగింది కదా అమ్మ అని దేవమ్మ అంటుంది. గంగకి ఇచ్చేటప్పుడు మాత్రం గుర్తుకు రాలేదు  నేను అడిగితే మాత్రం వసంత గుర్తుకు వచ్చిందా అత్తయ్య సరే వసంత అక్క అడిగితే పాతిక వేలు ఇస్తాను తెచ్చివ్వండి అని శ్రీలక్ష్మి అంటుంది. అలాగే అని దేవమ్మ డబ్బులు తెస్తూ ఉండగా, దేవమ్మ ఏంటి చాలా బిజీగా ఉన్నట్టున్నావు అని చoగయ్య అంటాడు. అంటే కోడళ్ళు డబ్బులు అడిగారు ఇస్తున్నానండి అని దేవమ్మ అంటుంది. మీ డబ్బులు మీ ఇష్టం కానివ్వండి అంటూ నవ్వుతాడు చoగయ్య. దేవమ్మ డబ్బులు తీసుకువెళ్లి శ్రీలక్ష్మికి ఇస్తుంది.

Mamagaru today episode november 08 2023 episode 51 highlights
Mamagaru today episode november 08 2023 episode 51 highlights

కట్ చేస్తే, గంగను తీసుకొని గంగాధర్ హాస్పిటల్ కి వెళ్లి వాళ్ళ మామయ్య కి ట్రీట్మెంట్ చేయిస్తాడు. అమ్మ నాన్నకి ఏం కాదమ్మా నువ్వు ఏడుస్తుంటే నాకు ఏడుపొస్తుంది అమ్మ అక్క బావ ఉన్నారు కదా నువ్వు ఏడవకు అమ్మ అని వాళ్ళ చిన్న కూతురు అంటుంది. ఏంటి అత్తయ్య ఎందుకు ఏడుస్తున్నారు మావయ్యకి ఏం కాదు నేను డాక్టర్ గారితో మాట్లాడాను అని గంగాధర్ అంటాడు. సమయానికి మీరు డబ్బులు తెచ్చారు కాబట్టి సరిపోయింది లేకపోతే మా పరిస్థితి ఏమై ఉండేది అల్లుడుగారు అని వాళ్ళ అత్తయ్య ఏడుస్తుంది. డబ్బులకు భయపడకుండా అన్ని టెస్టులు చేపిద్దాం అత్తయ్య గారు అని గంగాధర్ అంటాడు. ఆడపిల్ల అత్తింటి నుంచి డబ్బులు తెచ్చి వాళ్ళ నాన్నకి ట్రీట్మెంట్ చేస్తుంది ఇది కరెక్ట్ కాదు అల్లుడుగారు అని వాళ్ల అత్తయ్య అంటుంది. అత్తయ్య ఇప్పుడు ఇవన్నీ మీరు ఆలోచించకండి అని గంగాధర్ అంటాడు. ఆలోచించకుండా ఎలా ఉంటాను బాబు అసలే ఇలాంటివి మీ నాన్నగారికి నచ్చవు అని వాళ్ళ అత్తయ్య అంటుంది.

Mamagaru today episode november 08 2023 episode 51 highlights
Mamagaru today episode november 08 2023 episode 51 highlights

అవన్నీ మనం కట్టేద్దాం డబ్బుల గురించి అస్సలు ఆలోచించకండి గంగ పెళ్లయిన తర్వాత జాబ్ చేయొచ్చని నాన్న చెప్పారు, కానీ తరువాత వద్దని చెప్తున్నారు ఈ పరిస్థితి రావడానికి కారణం మా నాన్నే కదా అత్తయ్య గారు అని గంగాధర్ వెళ్ళిపోతారు. డాక్టర్ గారు మా మామయ్య గారికి ఎలా ఉంది డాక్టర్ అని గంగాధర్ అడుగుతాడు. టెస్టులన్నీ పరిశీలన చేసిన తర్వాత కానీ ఏమీ చెప్పలేము అతను రెండు రోజులైనా హాస్పిటల్లో ఉండాలి అని డాక్టర్ అంటాడు. థాంక్యూ డాక్టర్ అని గంగాధర్ అంటాడు. కట్ చేస్తే, వసంత వచ్చి అత్తయ్య మీ అబ్బాయి ని అడిగాను 75000 ఇవ్వండి అని అంటుంది. అదేంటమ్మా నీకు శ్రీలక్ష్మి ఏమి చెప్పలేదా అని దేవమ్మ అంటుంది. నాకేమీ చెప్పలేదు అత్తయ్య అని వసంత అంటుంది.

Mamagaru today episode november 08 2023 episode 51 highlights
Mamagaru today episode november 08 2023 episode 51 highlights

అంటే  వసంత గంగ వాళ్ళ నాన్నకి ఒంట్లో బాలేదు అంటే లక్ష రూపాయలు ఇచ్చాను అని దేవమ్మ అంటుంది.  ఎలా ఇస్తారు అత్తయ్య అది మన ముగ్గురు డబ్బు అని వసంత అంటుంది. అదేంటమ్మా తను వేరు మనం వేరన్నట్టుగా మాట్లాడుతున్నావు అని దేవమ్మ అంటుంది. డబ్బులు తీసుకున్న సంగతి నాకు గంగ చెప్పిందా పోనీ మీరైనా చెప్పారా నాకు డబ్బు అవసరం ఉందనే మీకు ముందే చెప్పాను కదా అత్తయ్య అని వసంత అంటుంది. అక్క 50,000 నా దగ్గర ఉన్నాయి నాకేమీ అవసరం లేదు అన్ని నువ్వే తీసుకో అని శ్రీలక్ష్మి అంటుంది. ఏంటి దానం ఇస్తున్నావా నాకేం అక్కర్లేదు నువ్వే ఉంచుకో అని వసంత అంటుంది.ఇంతలో వసంత వాళ్ళ ఆయన వచ్చి ఏంటి ఏం జరిగింది అని అంటాడు. ఏముందండి మా ముగ్గురికి వచ్చిన డబ్బుల్లో లక్ష రూపాయలు గంగకి ఇచ్చిందంట అని వసంత అంటుంది. అలా ఎలా ఇస్తావు అమ్మ మేం తీసుకుంటామని చెప్పాము కదా పెద్ద కోడలు పెద్ద కొడుకు అని ఇదేనా మీరు ఇచ్చే గౌరవము బాగా బుద్ధి చెప్పావమ్మా అని వాళ్ళ అబ్బాయి అంటాడు. మామయ్య గారేమో చీపురుతో పోల్చారు మీరు అది నిజం చేశారు అత్తయ్య గారు.

Mamagaru today episode november 08 2023 episode 51 highlights
Mamagaru today episode november 08 2023 episode 51 highlights

రేపటి నుంచి నా పని నేను చేసుకుని ఒక మూలన పడుంటాను అంటూ వాళ్ళ ఆయనను తీసుకొని వెళ్ళిపోతుంది వసంత. కట్ చేస్తే మహేష్ జాతకం చూపించుకుంటాడు. నా జీవితంలో నీలాంటి దరిద్రమైన జాతకం నేనెప్పుడూ చూడలేదు ఇంత చండాలంగా ఉంది ఏంటి బ్రో అని జాతకం చెప్పే అతను అంటాడు. అంత దరిద్రంగా ఉందన్న జాతకం అయితే నాకు పెళ్లెప్పుడు అవుతుందో చెప్పు అని మహేష్ అంటాడు.ఆడని సినిమాకు నలుగురు హీరోలు అన్నట్టు ఇంకా పెళ్లేంటి బ్రో అని ఆ వ్యక్తి అంటాడు. అంతా నా ఫ్రెండ్ వల్లే అని మహేష్ అంటాడు. అందుకే ఎవడి సినిమాలో వాడే వేలు పెట్టాలి పక్క వాడి సినిమాలో వేలు పెడితే కాలుతుంది బ్రో అని అతను అంటాడు.ఇంతలో గంగాధర్ గంగని తీసుకొని వెళ్ళిపోతూ ఉంటే బజారులో మహేష్ ను చూసి ఏంటి రా నా దగ్గర అసిస్టెంట్ గా మానేసి అతని దగ్గర చేరావా ఏంటి అని అంటాడు. అతను ఎవరు అని ఆ వ్యక్తి అంటాడు. నా జాతకానికి యముడు ఆవిడకి మొగుడు నేను చెప్పానే మా ఫ్రెండ్ వాడేనండి వీడు అని మహేష్ అంటాడు..

Related posts

Chandu: అర్ధరాత్రి 12 గంటలకు చందు నుంచి నాకు మెసేజ్ వచ్చింది.. కరాటే కళ్యాణి షాకింగ్ కామెంట్స్..!

Saranya Koduri

Big Boss: బిగ్ బాస్ లవర్స్ కి సూపర్ గుడ్ న్యూస్.. సీజన్ 8 ప్రారంభం అప్పుడే..!

Saranya Koduri

Trinayani: పవిత్ర నా జీవితాన్ని బుగ్గు పాలు చేసింది.. చందు మరణం పై స్పందించిన భార్య..!

Saranya Koduri

Bigg Boss Ashwini: సోషల్ మీడియాలో బిగ్ బాస్ అశ్విని హంగామా.. తగ్గేదేలే అంటుంది గా..!

Saranya Koduri

Anchor Varshini: మానవ రూపం అసూయపడే అందం.. కానీ.. చేతిలో అవకాశాలు నిల్..!

Saranya Koduri

Tollywood: తెరపై సాఫ్ట్.. సోషల్ మీడియాలో మాత్రం బేవచ్చం.. ఏంటి గురు ఇది..!

Saranya Koduri

Manasu Mamatha: సీరియల్ యాక్టర్ శిరీష విడాకులు వెనక స్టార్ హీరో హస్తం..?

Saranya Koduri

Siddhu Jonnalagadda: టిల్లు స్క్వేర్ స‌క్సెస్ తో భారీగా పెరిగిన సిద్ధు జొన్న‌ల‌గ‌డ్డ రెమ్యున‌రేష‌న్‌.. ఇప్పుడెన్ని కోట్లంటే..?

kavya N

Karthika Deepam 2 May 18th 2024 Episode: సౌర్యని స్కూల్లో చేర్పిస్తూ ఫాదర్గా సంతకం పెట్టిన కార్తీక్.. పారుపై సీరియస్ అయినా దీప..!

Saranya Koduri

Serial Actor Chandrakanth: ప‌విత్ర‌తో ఐదేళ్లుగా స‌హ‌జీవ‌నం.. క‌ట్టుకున్న భార్య‌కు అన్యాయం.. చంద్రకాంత్ గురించి వెలుగులోకి వ‌చ్చిన సంచ‌ల‌న నిజాలు!

kavya N

Prasanna Vadanam: ఆహాలో అల‌రించ‌బోతున్న సుహాస్ స‌స్పెన్స్ థ్రిల్ల‌ర్ ప్ర‌స‌న్న‌వ‌ద‌నం.. స్ట్రీమింగ్ డేట్ ఇదే!

kavya N

Brahmamudi May 18 Episode  413: కిడ్నాపర్స్ చెర నుండి బయటపడ్డ కావ్య.. కిడ్నాపర్స్ ని పోలీసుకి పట్టించిన రాజ్.. కావ్య అనుమానం..

bharani jella

Nuvvu Nenu Prema May 18 Episode 627:క్యాబ్ డ్రైవర్ గా మారిన విక్కీ.. అరవింద కోసం విక్కీ బాధను పోగొట్టడానికి పద్మావతి ఏం చేయనుంది?

bharani jella

Krishna Mukunda Murari May 18 Episode 473:ముకుంద కోసం ఆదర్శ కంగారు.. ముకుంద కి ప్రెగ్నెన్సీ టెస్ట్ చేయడానికి ఒప్పుకున్న కృష్ణ.. రేపటి ట్వీస్ట్..

bharani jella

Manam Movie: రీరిలీజ్‌కు సిద్ధ‌మైన‌ మ‌నం.. ఈ సినిమాలో శ్రియా పాత్ర‌ను మిస్ చేసుకున్న అన్ ల‌క్కీ హీరోయిన్ ఎవ‌రో తెలుసా?

kavya N