Nindu Noorella Savasam november 08 2023 episode 75: భాగమతి మొహం మీద పడ్డ డ్రాయింగ్ పేపర్ ని అంజు లాక్కొని ఇది నేను వేసిన డ్రాయింగ్ నువ్వు చూస్తే ఇలా వేసావు అలా వేసావు అంటావు అందుకే నీకు చూపించను అని అంజు అంటుంది. సరే నీ ఇష్టం నీకు చూపించాలి అనిపించినప్పుడే చూపించు. పిల్లలు రేపు మొదటి రోజు స్కూలుకు వెళ్తున్నారు కదా మనం తొందరగా వెళ్ళాలి వెళ్లి పడుకోండి అని భాగమతి అంటుంది. కట్ చేస్తే, ఏమే టిఫిన్ పెట్టేది ఏమైనా ఉందా నన్ను ఇంట్లోనే ఉంచుతావా అని భాగమతి వాళ్ళ నాన్న అంటాడు. చూడండి మీరు ఎక్కడికి వెళ్తున్నారో ఏ జాబ్ చేస్తున్నారో చెప్పట్లేదు రేపు పొద్దున్న మీకేమన్నా అయితే నేను భాగమతికి ఏమని సమాధానం చెప్పను.

లేని ప్రేమా ఎందుకు నటిస్తావే నేను త్వరగా వెళ్ళాలి అని వాళ్ళ ఆయన అంటాడు. అక్క బావ ఇంత తొందరగా వెళ్తున్నాడు ఎక్కడికి వెళ్తున్నాడు అని వాళ్ళ తమ్ముడు అంటాడు. ఈరోజు 27వ తారీకు కదరా ప్రతి సంవత్సరం ఈరోజు ఎక్కడికో వెళ్తాడు కానీ నాకు మాత్రం చెప్పడు ఎన్నిసార్లు తెలుసుకోవాలని ప్రయత్నించినా తెలుసుకోలేక పోయాను కానీ ఈరోజు కచ్చితంగా తెలుసుకోవాలి అని ఆవిడ వాళ్ళ ఆయన వెనకాల వెళుతుంది.

భాగమతి హడావుడిగా వెళుతున్నది చూసిన రాథోడ్ ఎక్కడికి వెళ్తున్నావమ్మా అని అంటాడు.కొంచెం పని ఉంది బయటికి వెళ్లి వస్తాను. ఈరోజు పిల్లలు మొదటి రోజు స్కూల్ కి వెళ్తున్నారు కదా, నువ్వు లేకపోతే ఎలా.ఇంకా టైం ఉంది కదా రాథోడ్ త్వరగానే వచ్చేస్తాను అని భాగమతి వెళ్ళిపోతుంది. ఏంటి చెల్లి ఈ రోజు హడావుడిగా వెళుతుంది తను రాకముందే మా ఇంట్లో వాళ్ళను ఒకసారి చూసుకుంటాను. అని అరుంధతి లోపలికి వెళ్లి వాళ్ళ అత్తయ్యను చూసి ఏంటి అత్తయ్య ఈరోజు పూజా మందిరంలో కూర్చొని బాధపడుతుంది, ఆయన చూస్తే అలా ఉన్నాడు ఏం జరుగుతుంది ఇక్కడ అని అరుంధతి బయట కిటికీ దగ్గర నిలబడి చూస్తుంది. ఇంతలో నీలా వచ్చి ఏంటి అమ్మ గారు పొద్దుటి నుంచి ఇక్కడే కూర్చున్నారు,తర్వాత చెప్తాను కానీ ప్రసాదం చేసి పట్టుకురా అని నిర్మల అంటుంది.అమ్మగారు ఈరోజు స్పెషల్ ఏంటి అందరూ అలా ఉన్నారు అని నీలా మనోహరితో అంటుంది.

ఈరోజు బాధతో వాళ్లకి సంతోషంతో నాకు ముగిసే రోజే అని మనోహరి కోపంగా కళ్ళు ఎర్రజేసి అంటుంది. అత్తయ్య నిజం చెప్పట్లేదు, ఈనేమో రూమ్ లో కూర్చొని ఇలా బాధపడుతున్నాడు అని అరుంధతి టెన్షన్ పడుతుంది. అరుంధతి ఫోటో తీసుకొని హ్యాపీ బర్త్డే ఆరు అని ఫోటోని చూస్తూ బాధపడతాడు. కిటికీలోనుంచి చూస్తున్న అరుంధతి ఈరోజు నా పుట్టినరోజు అని అనుకుంటుంది. కట్ చేస్తే,అరుంధతి వలన నాన్న గుడికి వస్తారు. అయ్యా పేరు చెప్పండి అని పంతులు అడుగుతాడు. పేరు తెలియదండి అని వాళ్ళ నాన్న అంటాడు. పేరు తెలియదు జన్మ నక్షత్రం చెప్తున్నారు ఇప్పుడు ఎలా అండి అర్చన చేసేది అని పంతులు అంటాడు. అమ్మ నేను ఆ ఒక్క రోజు ఆ తప్పు చేయకపోతే ఇలా బాధపడి ఉండేవాడిని కాదు నేను చనిపోయే దాకా ఈ కర్మ నన్ను వదలదు అని వాళ్ళ నాన్న అంటున్నాడు. నాన్న అక్క ఎక్కడ ఉందో తెలియకపోయినా అక్క క్షేమంగా ఉండాలని ప్రతి సంవత్సరం గుడికి వచ్చి పూజ జరిపిస్తున్నారు,మీరు కావాలని ఏదీ చేయలేదు కదా నాన్న ఎందుకు బాధపడతారు ఊరుకోండి,అసలు అక్క ఎందుకు మీ నుండి దూరమైంది నాన్న ఆరోజు ఏం జరిగింది అని భాగమతి అడుగుతుంది.

వాళ్ల వెనకాలే వచ్చినా వాళ్ల పిన్ని గుడికి వచ్చి తొంగి చూస్తుంది. ఆరోజు మీ అమ్మ కన్నాక మీ నాయనమ్మ మీ అక్కని తీసుకువచ్చి మీ అక్క చనిపోయిందని నాకు చెప్పి ఎక్కడో హాస్టల్ ముందు వదిలేసి వచ్చిందంట నేను నిజంగానే చనిపోయిందేమో అని బ్రమ పడ్డాను కానీ మా అమ్మ చేతిలో ఉన్న నా కూతురు బ్రతికే ఉందని గమనించలేకపోయాను నేను చేసిన తప్పు అదేనమ్మ అని వాళ్ళ నాన్న అంటాడు. మరి ఆ తరువాత అక్క బ్రతికి ఉన్నదని నీకు ఎలా తెలిసింది నాన్న అని భాగమతి అంటుంది.

మా అమ్మ చనిపోయేముందు నన్ను పిలిచి నేను చాలా పెద్ద తప్పు చేశాను రా నీ కూతురు చనిపోయిందని అబద్ధం చెప్పి ఆడపిల్ల ఉసురు పోసుకున్నాను అందుకే నాకు దేవుడు ఈ శిక్ష వేశాడు అని చెప్పింది,వెంటనే నేను హాస్టల్ కి వెళ్లి అడిగాను, వాళ్లు మీ అమ్మాయి పేరేంటి ఆడపిల్ల అని తెలియగానే ఎందుకు సార్ ప్రేమ చచ్చిపోతుందా ఎందుకు అలా వదిలేసారు అని హాస్టల్ వార్డెన్ అంటుంది. నాకు నిజంగా మా అమ్మాయి బ్రతికి ఉన్నదని నాకు తెలియదమ్మా అని నేను అన్నాను. అప్పుడు ఆరు నెలలకు ఒకసారి వదిలేసేవారు సార్ కానీ ఇప్పుడు వారానికి ఒకసారి అమ్మాయి హాస్టల్ ముందు ఉంటుంది,అందులో మీ అమ్మాయి ఎవరో ఎలా తెలుస్తుంది ఏమైనా గుర్తులు పుట్టుమచ్చ లాంటివి నీకు తెలుసా అని ఆవిడ నన్ను అడిగింది.. దీనితో ఈరోజు ఎపిసోడ్ ముగుస్తుంది