NewsOrbit
ట్రెండింగ్ తెలంగాణ‌ న్యూస్

Teenmaar Mallanna: అనూహ్యంగా కాంగ్రెస్ పార్టీలో చేరిన తీన్నార్ మల్లన్న

Share

Teenmaar Mallanna: తెలంగాణలో ఎన్నికల సందడి కొనసాగుతోంది. ఎన్నికల పోలింగ్ కు మూడు మూడు వారాలు మాత్రమే గడువు ఉంది. ప్రధాన రాజకీయ పక్షాలైన బీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీ అధికారం తమదే ఉంటూ విస్తృతంగా ప్రచారాన్ని నిర్వహిస్తొంది. ప్రత్యర్ధి పార్టీలోని అసంతృప్తులను ఆకర్షిస్తూ వారిని పార్టీలో చేర్చుకుని కండువాలు కప్పేస్తున్నారు. ఈ క్రమంలో తీన్మార్ మల్లన్న (చింతపండు నవీన్) అనూహ్యంగా కాంగ్రెస్ పార్టీలో చేరారు. టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి నేతృత్వంలోని కాంగ్రెస్ పార్టీలో బీసీలకు అన్యాయం చేస్తున్నారంటూ ఇటీవల తీవ్ర స్థాయిలో విమర్శలు చేసిన తీన్మార్ మల్లన్న ఇవేళ అనూహ్యంగా కాంగ్రెస్ పార్టీ కండువా కప్పుకోవడం హాట్ టాపిక్ అయ్యింది.

జర్నలిస్ట్ గా తన ప్రస్థానాన్ని కొనసాగిస్తూనే రాజకీయాల్లో రాణించేందుకు తొలుత కాంగ్రెస్, ఆ తర్వాత బీజేపీలో చేరినా తీన్మార్ మల్లన్న ఆ పార్టీల్లో ఇమడలేకపోయారు. మళ్లీ ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో చేరారు. తెలంగాణ కాంగ్రెస్ పార్టీ ఇన్ చార్జి మాణిక్యరావ్ ఠాక్రే, టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ మహేశ్ కుమార్ గౌడ్, ఏఐసీసీ పరిశీలకుడు బోస్ రాజు, సీడబ్ల్యుసీ సభ్యుడు గురుదీప్ సిప్పల్ సమక్షంలో ఆయన కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు. తెలంగాణ రాష్ట్ర విభజన తర్వాత తీన్మార్ మల్లన్న వీ 6 న్యూస్ ఛానల్ లో తన ఉద్యోగానికి రాజీనామా చేసి కాంగ్రెస్ పార్టీలో చేరారు. 2015  లో తెలంగాణ శాసన మండలికి జరిగిన ఎన్నికల్లో నల్లగొండ – ఖమ్మం – వరంగల్ పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానం నుండి కాంగ్రెస్ అభ్యర్ధిగా పోటీ చేసి పరాజయం పాలైయ్యారు. తర్వాత 2019లో జరిగిన హుజూర్ నగర్ అసెంబ్లీ నియోజకవర్గ ఉప ఎన్నికల్లో స్వతంత్ర అభ్యర్ధిగా పోటీ చేసి ఓటమి పాలైయ్యారు.

ఆ తర్వాత 2021 మార్చిలో జరిగిన శాసనమండలి ఎన్నికల్లో నల్లగొండ – ఖమ్మం – వరంగల్లు పట్టభధ్రుల ఎమ్మెల్సీ స్థానం నుండి స్వతంత్ర అభ్యర్ధిగా పోటీ చేసి రెండవ సారీ ఓటమి పాలైయ్యారు. అయితే ప్రధాన రాజకీయ పార్టీల అభ్యర్ధులకు గట్టి పోటీ ఇచ్చి చెమటలు పట్టించి రెండో స్థానంలో నిలిచారు. టీజేఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు కోదండరామ్, బీజేపీ, కాంగ్రెస్ అభ్యర్ధులను వరుసగా, మూడు, నాలుగు, అయిదు స్థానాల్లో నిలబెట్టారు తీన్మార్ మల్లన్న. 2021 డిసెంబర్ నెలలో ఢిల్లీలో తెలంగాణ వ్యవహారాల ఇన్ చార్జి తరుణ్ చుగ్ ఆధ్వర్యంలో బీజేపీ లో చేరారు తీన్మార్ మల్లన్న. ఆ తర్వాత అయిదు నెలలకే ఆ పార్టీ నుండి బయటకు వచ్చేశారు. తదుపరి కాంగ్రెస్ పార్టీలోకి వెళ్లారని పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది.

మరో వైపు సొంత పార్టీని స్థాపించి సొంత ఎజెండాతో స్వతంత్రంగా ప్రజల్లోకి వెళ్లాలని, తన టీమ్ సభ్యులను కూడా ఎన్నికల బరిలోకి దింపాలని నిర్ణయించుకున్నారు. ఆ క్రమంలోనే కొత్త పార్టీ పెట్టేందుకు ప్రయత్నాలు చేశారు. తెలంగాణ నిర్మాణ పార్టీ అనే పేరుతో పార్టీ పెడుతున్నట్లుగా మల్లన్న గతంలో ప్రకటించారు. ఆ మేరకు పార్టీ పేరును రిజిస్టర్ కూడా చేయించారు. అయితే సాంకేతిక కారణాల వల్ల అది ఆలస్యం కావడంతో ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ పార్టీ తరపున ఆయన పోటీ చేస్తారని వార్తలు వచ్చాయి. ఈ పార్టీ రాష్ట్ర బాధ్యతలు అప్పగించడంతో పాటు రాష్ట్ర వ్యాప్తంగా అభ్యర్ధుల ఎంపిక బాధ్యతను కూడా తీన్మార్ మల్లన్నకే అప్పగించిందనీ, ఆ పార్టీ తరపున ఆయనే సీఎం అభ్యర్ధి అని కూడా చెపుతున్నారు.

మెడ్చల్ నియోజకవర్గం నుండి మంత్రి మల్లారెడ్డి పై తాను పోటీ చేస్తానని కూడా గతంలో తీన్మార్ మల్లన్న ప్రకటించారు. దీనిపై మల్లారెడ్డి కూడా స్పందిస్తూ తనపై పోటీ చేస్తే డిపాజిట్ లు కూడా రావని అన్నారు. మరో పక్క కొడంగల్ నుండి తీన్మార్ మల్లన్న పోటీ చేస్తారంటూ రీసెంట్ గా మల్లన్న టీమ్ నేత ఘనపురం శ్రీనివాస్ మీడియా సమావేశంలో ప్రకటించారు. తన న్యూస్ ఛానల్ ద్వారా అధికార బీఆర్ఎస్, సీఎం కేసిఆర్ కుటుంబం పై తీవ్ర స్థాయిలో విమర్శలు, ఆరోపణలు చేస్తూ వస్తున్న తీన్మార్ మల్లన్న ఇవేళ అనూహ్యంగా కాంగ్రెస్ పార్టీలో చేరడంతో హాట్ టాపిక్ అయ్యింది. కాంగ్రెస్ పార్టీ నుండి ఏదైనా నియోజకవర్గం నుండి పోటీ చేస్తారా లేక కాంగ్రెస్ పార్టీ ప్రచారానికి ఉపయోగించుకుంటుందా అనేది తేలాల్సి ఉంది.

YS Sharmila: వైఎస్ షర్మిలకు బిగ్ ఝలక్ .. వైఎస్ఆర్ టీపీకి మూకుమ్మడి రాజీనామాలు..


Share

Related posts

Prabhas: రాధే శ్యామ్, సలార్ రీ షూట్..కంగారు పడుతున్న ప్రభాస్ ఫ్యాన్స్..

GRK

 Exercising: వ్యాయామం  చేయడం  సడన్గా మానేస్తే జరిగేది ఇదే !!

siddhu

GOA Elections: ప్రధాన రాజకీయ పార్టీల చూపు ఆ రాష్ట్ర ఎన్నికలపైనే…! ఎందుకంటే..?

somaraju sharma