Nindu Noorella Saavasam November 20 2023 Episode 85: నేను బాగా చదివి ఎగ్జామ్ లో పాస్ అయి అడ్మిషన్ సంపాదిస్తే అమ్మ ఎంత బాగా సంతోషిస్తుంది అమ్మ బర్త్డే రోజు అమ్మకు ఇవ్వగలిగిన గిఫ్ట్ ఇదొక్కటే రాథోడ్ అని అంజు అంటుంది. ఈ మాట మేడం గారు వింటే ఎంత ఆనందించేవారు ఏ లోకంలో ఉందో ఆ మహాతల్లి అని రాథోడ్ బాధపడతాడు. అంజు రాథోడ్ మాట్లాడుకుంటుంటే విని అరుంధతి సంతోష పడిపోతుంది. పొద్దు పొద్దున్నే సార్ భయపెట్టారు నువ్వేమో ఏడిపిస్తున్నావు బాగా చదువుకో తల్లి అని రాథోడ్ వెళ్లిపోతాడు. ఇదే నేను మీకు ఇచ్చే లాస్ట్ వార్నింగ్ ఇదే రిపీట్ అయితే పనిష్మెంట్లు పెరుగుతాయి అని అమరేంద్ర అంటాడు. అలాగే డాడీ అని పిల్లలు అంటారు. ఈరోజు నుంచి అన్నీ నేనే దగ్గర ఉండి చూసుకుంటాను అని అమరేంద్ర అంటాడు. అక్క అన్ని డాడీ చూసుకుంటే మన పని అయిపోయినట్టే అక్క ఇంతకుముందు అమ్మ ఉండేది కానీ ఇప్పుడు అమ్మ లేదు కదా అని ఆకాష్ అంటాడు.

అమ్మ లేకపోతే ఏంటి తమ్ముడు నేను ఉన్నాను కదరా అయినా మనం తప్పు చేయకుంటే నాన్న పనిష్మెంట్ ఎందుకు ఇస్తాడు చెప్పు బాధపడకండి నేనున్నానుగా నేను చూసుకుంటాను అని అమృత అంటుంది. రాథోడ్ నువ్వు ఇంట్లోనే ఉండు మిస్సమ్మకి కళ్ళు మంట తగ్గకపోతే హాస్పిటల్ కి తీసుకెళ్ళు అంజలి జాగ్రత్త అని పిల్లల్ని తీసుకొని వెళ్ళిపోతాడు అమరేంద్ర. నేను కూడా పిల్లలతో స్కూల్ కి వెళ్లి స్కూల్ ఎలా ఉందో చూస్తాను అని అరుంధతి వెళుతుంది. ఎప్పటిలాగే కారెక్కిన అమరేంద్ర మర్చిపోయి ఆరు సీట్ బెల్ట్ పెట్టుకో అని అంటాడు. పిల్లలు ఆ మాట వినగానే అమ్మని డాడీ ఇంకా మర్చిపోలేదు అని బాధపడతారు. గేటు బయట కూర్చున్న మాంత్రికుడికి అరుంధతి కారులో కనిపిస్తుంది. అది చూసిన మాంత్రికుడు ఆ కారు వెనకాల పరిగెత్తుతూ ఉంటాడు. కట్ చేస్తే,రామ్మూర్తి పిల్లల కోసం చాక్లెట్లు తీసుకోవడానికి షాపుకు వెళ్లి చాక్లెట్ ఇవ్వండి అని అంటాడు. ఎవరికండి మీ మనవడు మనవరాలికా అని ఆవిడ అంటుంది.

నా కూతురు బ్రతికి ఉంటే ఈపాటికి అంతటి మనవుడు మనవరాలు ఉండేవారు కానీ మనవరాళ్ళు లాంటి వాళ్లే ఇవ్వండి అని రామ్మూర్తి చాక్లెట్ తీసుకునివెళ్తూ ఉండగా వాళ్ళ భార్య బామ్మర్ది బండి మీద వెళుతుంటే చూసి ఇంత హడావుడిగా ఎక్కడికి వెళ్తున్నారు వీళ్ళు అని అనుకుంటాడు. తమ్ముడు నా భర్త మొదటి కూతురు ఎంత ఐశ్వర్యవంతురాలో తెలుసుకుందాం బండి త్వరగా తోలు రా అని వాళ్ళ అక్క అంటుంది. అయ్యో మిస్సమ్మ సార్ కోపం గురించి నీకు తెలుసు కదా ఎందుకు అలా చేసావు అని రాథోడ్ అంటాడు. నాకు తెలుసు రాథోడ్ గారు కానీ పిల్లల్ని కోప్పడుతున్నాడని వచ్చాను అని భాగమతి అంటుంది. మీకు డిసిప్లైన్ లేకపోవడం వల్ల ఆ మిస్సమ్మని కోప్పడ్డాను అనుకొని అమరేంద్ర మిస్సమ్మకి ఫోన్ చేద్దాం అనుకుంటాడు కానీ నెంబర్ లేకపోవడంతో రాథోడ్ కి ఫోన్ చేస్తాడు అమరేంద్ర.

రాథోడ్ ఫోన్ ఊరికే మోగుతుంది అని భాగమతి ఎత్తి హలో ఎవరు మాట్లాడితే మాట్లాడు లేకుంటే ఫోన్ పెట్టేసేయ్ పొద్దు పొద్దున్నే ఏంటయ్యా నాకీ నసా అసలే సార్ తిట్టాడన్న కోపంలో ఉన్నాను వినపడుతుందా లేదా అని భాగమతి అంటుంది. హలో నేను అని అమరేంద్ర అంటాడు. నేనే అంటే మీ గొంతు గుర్తుపట్టడానికి మీరేమన్న మినిస్టరా మీ పేరు చెప్పండి అని భాగమతి అంటుంది. నేనే అమరేంద్ర సరిపోతుందా ఇంకా గుర్తు చేయాలా అని అమరేంద్ర అంటాడు. సార్ మీరా నెంబర్ చూసుకోలేదండి కళ్ళు మూసుకొని ఉన్నాను కదా చెప్పండి అని భాగమతి అంటుంది.

పొద్దున బయటికి వచ్చినందుకు అరిచాను కదా అందుకే ఫోన్ చేశాను అని అమరేంద్ర అంటాడు. ఏంటి కోప్పడందుకు సారీ చెప్పడానికి ఫోన్ చేశారా చెప్పండి అని భాగమతి అంటుంది. హలో నేను సారీ చెప్పడానికి చేశాను అని నువ్వెందుకు అనుకుంటావ్ పొద్దున నువ్వు అలా బయటికి రావడం వల్ల అరిచానని చెప్పడానికి ఫోన్ చేశాను దానికి ఎందుకు అంతలా ఫీల్ అయిపోతావ్ నేను కోప్పడం కరెక్టే అన్నమాట అని అమరేంద్ర అంటాడు.ఈయన మళ్లీ రివర్స్ లో మాట్లాడుతున్నాడు ఈయనతో ఎలా మాట్లాడినా తప్పే రా బాబు అని భాగమతి అనుకుంటుంది.. దీనితో ఈరోజు ఎపిసోడ్ ముగుస్తుంది.