Mamagaru November 20 2023 Episode 61: ఇదిగో 50000 అని గంగాధరం వాళ్ళ నాన్నకి ఇస్తాడు. 50 వేలకు సరుకును తెచ్చి 50 వేలకి అమ్మితే ఏమని చెప్పాలి రా అని చంగయ్య అంటాడు. అంటే 50,000 సరుకైతే అమ్మేశాను కదా నాన్నగారు అని గంగాధర్ అంటాడు. అయితే ఉండండి ఇప్పుడే గోవర్ధన్ కి ఫోన్ చేసి మాట్లాడుతాను మీరే వినండి అని చoగయ్య గోవర్ధన్ కి ఫోన్ చేస్తాడు. గోవర్ధన్ ఫోన్ ఎత్తి చెప్పండి చoగయ్య గారు అంటాడు.ఏమిటండీ సరుకుల్లో రేట్ ఎక్కువ వేశారు అని చంగయ్య అంటాడు. అంటే మీకు తెలిసిందే కదా అండి మీ వాడు బేరం అడగలేదు నేను చెప్పలేదు మీరు అడుగుతున్నారు కాబట్టి 7000 తక్కువ చేస్తాను అని గోవర్ధన్ అంటాడు.

చూసావా రా పుత్ర ఒక్క ఫోన్ కాల్ తో 7000 సంపాదించాను నువ్వు తెచ్చిన 50 వేలకే సరుకు అమ్మేశావు నిన్ను నమ్మి షాపు కిరాయికి తీసుకుంటే కిరా ఏమి కట్టాలి నీ కింద ఉండే పనోడికేమిస్తావు ఆటో కిరాయికి ఏం కడతావురా ఇంత తెలివి తక్కువ వ్యాపారం ఎవడైనా చేస్తాడా తెచ్చిన రేటికే ఎవడైనా సరుకును అమ్మేస్తాడా అందులో లాభం చూసుకొని అమ్మడా అందుకే నీకు ఇన్ని రోజులు దాకా వ్యాపారం పెట్టించలేదు కానీ అందరూ ఒక అవకాశం ఇవ్వమని అంటే సరే నన్ను నిందిస్తారు అని ఒక అవకాశం నీకు ఇస్తే నువ్వేం చేసావో చూసావుగా అందుకే నువ్వు వ్యాపారానికి పనికిరావు ఏమమ్మా గంగ ఇప్పుడేమంటావు అని అని చoగయ్య అంటాడు. గంగ బాధతో ఇంట్లోకి వెళ్ళిపోతుంది. పాండురంగడు శ్రీ లక్ష్మీ వెళ్ళిపోతుండగా, ఆగండి ఎక్కడికి వెళ్తున్నారు పుత్రులు కోడళ్ళు అని చoగయ్య అంటాడు. వాళ్లు నలుగురు అలా నిలబడతారు.

ఏంటి మీరు ఇంట్లో నుంచి వెళ్ళిపోతాను అంటున్నారు అంట ఎందుకు అని చoగయ్య అడుగుతాడు. ఇక్కడ ఉండి చేసేది మాత్రం ఏముంది మామయ్య గారు మనుషులం అర మీటర్ దూరంలో ఉన్న మనుషులు మాత్రం కిలోమీటర్ దూరంలో ఉన్నాయి ఉద్యోగాలు చేయమని మీరు అవకాశం ఇచ్చిన వసంత అక్క బావగారు సంతకం పెట్టకపోవడంతో మేము ఉద్యోగాలకు వెళ్లలేకపోయాము అలాంటప్పుడు ఎక్కడ ఉంటే ఏముందండి మా బ్రతుకు ఏదో మేము బతుకుతాము అని శ్రీలక్ష్మి అంటుంది. శ్రీలక్ష్మి కి గవర్నమెంట్ ఉద్యోగం వచ్చిన అన్నయ్య వదిన సంతకం పెట్టకపోవడంతో ఇప్పుడు అవకాశం లేకుండా పోయింది ఇప్పుడు ఎక్కడ ఉంటే ఏముంది అని పాండురంగడు అంటాడు. చూడమ్మా వసంత శ్రీ లక్ష్మీ పాండురంగడు చెప్పాడు మరి నీ ఉద్దేశం ఏంటి అని చoగయ్య అడుగుతాడు. ఏముంది మామయ్య గారు పొదుపు సంఘం డబ్బులు మిమ్మల్ని అడగకుండానే మీరు మాకు తీసుకోమని చెప్పారు కానీ స్వార్థం వాళ్లే డబ్బులు తీసుకున్నారు మరి నాకు అన్యాయం జరగలేదా మామయ్య గారు అని వసంత అంటుంది.

అనాన్నా డబ్బులు వాళ్లే పంచుకొని నింద మాత్రం మా మీదే వేశారు వాళ్లనే ఉండమనండి మేమే వెళ్ళిపోతాము అని సుధాకర్ అంటాడు. ఇంతేనా ఇంకేమైనా ఉన్నాయా అని చoగయ్య అంటాడు. అవును మామయ్య నా మనసులో ఎలాంటి స్వార్థం లేకుండా చెప్పేశాను అని శ్రీలక్ష్మి అంటుంది. ఇంతకుముందు కలిసిమెలిసి బాగానే ఉన్నారు కదా ఇప్పుడు వచ్చిందెల్లా ఉద్యోగo దగ్గర ఉద్యోగాలు చేస్తే డబ్బులు వచ్చి మీరు ధనవంతులవుతారు కానీ ప్రేమలు ఆప్యాయతలు ఉండవు ఎవడికి కష్టమొస్తే వాడే చూసుకోవాలి, అదే పదిమంది ఉంటే పదిమంది చూసుకుంటారు పదిమంది బాధను పంచుకుంటారు డబ్బు మనుషుల మధ్యలో గోడని సృష్టిస్తుంది అంతకుమించి వచ్చేది ఏమీ లేదు ఈ గొడవ అంతా గంగ ఇంటికి రావడం తోటే స్టార్ట్ అయింది ఉద్యోగాలు చేయాలనే ఆశను చంపుకోండి అని చంగయ్య అంటాడు. కట్ చేస్తే, గంగ వాళ్ళ మామగారు అన్న మాటలు గుర్తుకు తెచ్చుకొని బాధపడుతూ ఉంటుంది.

గంగ వాళ్ళ అమ్మానాన్న గంగ ఎప్పుడు ఫోన్ చేస్తుందా అని ఎదురు చూస్తూ ఉంటారు. అమ్మ అక్క ఫోన్ చేస్తే నేనే ముందు మాట్లాడతాను అని వర్షా అంటుంది. పెద్దదాన్ని నేనే ముందు మాట్లాడతాను అని వాళ్ళ అమ్మ అంటుంది. అందరికంటే నా కూతురు భర్త బిజినెస్ చేస్తుంనడే వార్త నేను వినాలి అని వాళ్ళ నాన్న అంటాడు. బావ బిజినెస్ చేస్తున్నాడని అందరికంటే సంతోషించేది ముందు నేనే కాబట్టి నేనే వినాలి అని వర్షం అంటుంది. వర్ష అక్క ఫోన్ చేస్తే మన ముగ్గురం ఒకేసారి మాట్లాడదాం స్పీకర్ పెట్టు అని వాళ్ళ నాన్న అంటాడు. ఏంటండీ ఇంకా గంగ ఫోన్ చేసి శుభవార్త చెప్పట్లేదు అని వాళ్ళ భార్య అంటుంది. తను చేసిందాకా ఆగడం నావల్ల కావట్లేదు వర్షా నువ్వే అక్కకు ఫోన్ చెయ్ అని వాళ్ళ నాన్న అంటాడు. వర్షా గంగ కి ఫోన్ చేస్తుంది. బాధలో ఉన్న గంగ ఫోన్ కట్ చేస్తుంది. నాన్న అక్క ఫోను ఎత్తడం లేదు కట్ చేస్తుంది అని వర్షం అంటుంది. ఒక్కోసారి సిగ్నల్ లేక కట్ అవుతుంది లే అమ్మ అక్కే చూసుకుని చేస్తుంది అని వాళ్ళ నాన్న అంటాడు.