Krishna Mukunda Murari:కృష్ణా ముకుందా మురారి సీరియల్ లో, కృష్ణ పాత్రలో నటిస్తుంది ప్రేరణ కుంభం. ఈమె హైదరాబాదులో పుట్టి బెంగళూరులో పెరిగింది మోడల్గా కెరియర్ మొదలుపెట్టి కన్నడ సినిమాల్లో నటిస్తూ కన్నడ సీరియల్స్ లో కూడా చేస్తూ, మంచి అవకాశాల్ని అందుకుందని చెప్పొచ్చు. కన్నడలో చేసిన సీరియల్స్ అన్ని సూపర్ హిట్గా నిలిచాయి. కృష్ణ ముకుందా మురారి సీరియల్ నటించడం ద్వారా మంచి తెలుగు ప్రేక్షకుడిని సంపాదించుకుంది ప్రేరణ. ఈమె కన్నడ స్టార్ అయినా కానీ తెలుగు మాత్రం చాలా చక్కగా మాట్లాడుతుంది. 2017లో ప్రేరణ కన్నడ సీరియల్ హర హర మహాదేవ తో ఎంట్రీ ఇచ్చింది. ఆ తర్వాత కనడంలో చాలా సీరియల్స్ నటించింది సినిమాల్లో కూడా కనడంలో చురీ కట్, ఆన, ఫిజికల్ టీచర్, ఈ సినిమాల్లో నటించింది. ఈమె కన్నడలో బిగ్ బాస్ లో కూడా 2021లో మినీ సీజన్లో కూడా పాల్గొంది.
ఇప్పుడు కృష్ణ ముకుందా మురారి సీరియల్ లో తింగరి పిల్ల నటిస్తూ, కొంచెం అమాయకత్వం, అంతే మొండితనంతో కూడుకున్న పాత్ర కృష్ణ ది. ప్రేరణ ఈ పాత్రకు తగ్గట్టుగా నటిస్తు, అందులో ఒదిగిపోయారని చెప్పొచ్చు. ఈ సీరియల్లో తండ్రి కోరిక మేరకు ఇష్టం లేకపోయినా ఏసీపి సార్ ని పెళ్లి చేసుకుని, తరువాత అతని మంచితనం తెలుసుకొని అతని భర్తగా పొందాలని ప్రేమ దక్కించుకోవాలని ఆరాటపడే పాత్ర కృష్ణ ది. మరి నిజ జీవితంలో కూడా ఈమె పెళ్లి గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం..

కృష్ణ త్వరలోనే పెళ్లి పీటలు ఎక్కబోతుంది.అవును నిజ జీవితంలో పెళ్లి చేసుకోబోతోంది. ఇప్పటికే తను నచ్చిన మెచ్చిన వాడితో ఎంగేజ్మెంట్ కూడా చేసుకుంది. ఈ విషయాన్ని తన సోషల్ మీడియా ఇంస్టాగ్రామ్ లో ప్రేక్షకులతో అభిమానులతో పంచుకుంది.ఇన్ని రోజులు చెప్పని సీక్రెట్ ని రివీల్ చేసేసింది ఇన్స్టాగ్రామ్ ద్వారా,ప్రేమించి పెళ్లి చేసుకోబోతున్నట్లు చెప్పిన ప్రేరణ. ఇక ఆ హీరో పేరు శ్రీపాద్. చూడ్డానికి చాలా అందంగా, అచ్చు మన తెలుగు హీరో లాగా ఉన్నాడు. ప్రేరణ శ్రీపాదల జంట మేడ్ ఫర్ ఈచ్ అదర్ లా ఉంది అంటూ సోషల్ మీడియాలో ఆమె అభిమానులు కామెంట్స్ రూపంలో తెలియజేస్తున్నారు. ఈమధ్య అందరి ముందు ప్రేరణ శ్రీపాద ఫోటోలను స్టార్ మా ద్వారా అందరికీ పరిచయం చేశారు. రీసెంట్ గా స్టార్ మా లో జరిగిన అవార్డు ఫంక్షన్ లో శ్రీముఖి అందరి ముందు ఆమె కాబోయే భర్త ఫొటోస్ ను చూపిస్తుంది. ఇక ఇంస్టాగ్రామ్ ఫాలో అవ్వని వాళ్లకు కూడా ఇప్పుడు మన కృష్ణ కాబోయే భర్త ఎవరో తెలిసిపోయింది సో శ్రీపాద ,ప్రేరణకు ఆల్ ది బెస్ట్ చెప్పేద్దాం..