Trinayani November 20 2023 Episode 1089: నేను అన్న దాంట్లో తప్పేమైనా ఉంటే మన్నించాలి కానీ పిల్లల కోసం అయినా అమ్మవారు రావాలి కదా అని తిలోత్తమ అంటుంది. చేసిన పరిహాసం చాలు తిలోత్తమ ఇక నువ్వు ఊరుకుంటే మంచిది అని స్వామీజీ అంటాడు.నైని మనం పిల్లల్ని తీసుకొని హాస్పిటల్ కి వెళ్దాం పదండి అని విశాల్ అంటాడు. ఏంటి అమ్మవారు వచ్చి పిల్లల్ని కాపాడదేమో అని భయపడుతున్నారా అని సుమన అంటుంది. ముందు నీ సోది ఆపు నీ మొహం చూడలేక చస్తున్నామా అని విక్రాంత్ అంటాడు. నన్ను తిట్టడం ఆపేసి పిల్లల్ని హాస్పిటల్ తీసుకెళ్దాం పదండి అని సుమన అంటుంది. కంగారు పడకు విశాల్ అమ్మ దూతని పంపిస్తుంది అని స్వామీజీ అంటారు.

ఎద్దులయ్య వాళ్ళు మాట్లాడుకుంటూ ఉండగా బయటికి వెళ్లి, జగన్మాత ఆ పిండిని నేను గ్రహించేలా అనుగ్రహించు అని ఎద్దులయ్య నందీశ్వరునిగా మారిపోతాడు.అలా నందీశ్వరునిగా మారిపోయిన ఎద్దులయ్య వాళ్ళ దగ్గరికి వచ్చి నిలబడతాడు. అల్లుడు ఎద్దు వచ్చింది కొట్టండి పిల్లల్ని ఏమన్నా చేస్తుంది అని పావన మూర్తి అంటాడు. భయపడకండి అమ్మవారు పంపించిన దూత పిల్లల పిండి గ్రహించడానికి వచ్చింది నైని పిల్లల్ని కింద పడుకోబెట్టండి అని స్వామీజీ అంటాడు. ఎందుకు ఆ ఎద్దు నా బిడ్డను తొక్కేస్తుంది నేను పడుకోబెట్టను అని సుమన అంటుంది. చెప్తే వినపడట్లేదా పాపని కింద పడుకోబెట్టు అని విక్రాంత్ కోపంగా అంటాడు. సుమన నైని పిల్లలి ఇద్దరినీ కింద పడుకోబెడతారు. నందీశ్వరుడు అందరూ చూస్తూ ఉండగానే పిల్లల నోట్లో ఉన్న పిండిని గ్రహించేస్తాడు.

నందీశ్వర నువ్వు ఆ విశాలాక్షమ్మ పంపిస్తే వచ్చావు కదూ పిల్లల నోట్లో ఉన్న పిండిని గ్రహించినట్టేనా అయితే ఇక నువ్వు వెళ్లి మళ్లీ రా అని స్వామీజీ అంటాడు. స్వామీజీ మా అత్తయ్య ఇంకా తేలుకోలేక పోతుంది అని హాసిని అంటుంది. ప్రస్తుతానికి గండమైతే తప్పింది కానీ విశాల్ అందరి పాపాలను లెక్కేసి ఆ చిత్రగుప్తిని పూజ చేద్దాము మీ అమ్మ గండం తప్పిపోతుంది అని స్వామీజీ అంటాడు. విక్రాంత్ చిత్రగుప్తుడి ఫోటో ను ప్రింట్ తీయి అని హాసిని అంటుంది. అలాగే వదిన అని విక్రాంత్ చిత్రగుప్తుని ఫోటో ప్రింట్ తీసి ఇస్తాడు. ఎక్కడో ఉన్న గాయత్రి అత్తయ్యకు గండం తప్పించడానికి నా భర్తను పనివాడిగా వాడుకుంటారు మీ సంగతి చెప్తాను అని సుమన మజ్జిగ తెచ్చి చిత్రగుప్తుడి ఫోటో మీద పోస్తుంది. చెల్లి ఏంటి అలా పోసేసావు అని హాసిని అంటుంది. చూసుకోలేదు అక్క చేయి జారింది అని సుమన అంటుంది. నీ తొందరపాటు వల్ల అన్ని చేజార్చుకుంటున్నావు సుమన జాగ్రత్తగా ఉండు అని స్వామీజీ అంటాడు.

విక్రాంత్ ఇంకొక ప్రింట్ తీ అని హాసిని అంటుంది.అందరి చిట్టాలను లెక్క చూసే ఆయన చిత్రపటం అక్కరలేదని భగవంతుడు ఇలా చేశాడు విక్రాంత్ ఇంకా ఫోటో అక్కర్లేదు రండి నేను చెప్తాను అని స్వామీజీ అంటాడు. కట్ చేస్తే, చిత్రగుప్తుడు పూజ చేసి మీరు స్వామీజీకి దానంగా ఈ వస్తువులన్నీ ఇస్తారా అలా నేనెందుకు జరగనిస్తాను ఇంకొకసారి జన్మ ఎత్తి నన్ను చంపాలి అనుకున్నా నా శత్రువైన ఆ గాయత్రి అక్క మళ్ళీ చావాలి, ఈ పూజ ఫలించకూడదు అనుకుంటూ గుమ్మడికాయ కోసి దాంట్లో ఏవో పోసి మళ్ళీ దాన్ని అతక పెడుతుంది తిలోత్తమ. నైని హాసిని అని పూజకు సిద్ధం చేసి ఎద్దులయ్య స్వయం పాకానికి అన్ని అక్కడ పెట్టాను తీసుకురండి అని అంటుంది. అలాగే అని ఎద్దులయ్య పావన మూర్తి వెళ్లి ఆ స్వయం పాక వస్తువులన్నీ తెస్తారు. ఏమిటి చిత్రగుప్తుడి పూజ విచిత్రంగా ఉంది ఫోటో కూడా లేదు అని తిలోత్తమ అంటుంది. ఫోటో ఎందుకు అమ్మ కలశం పెట్టి దాంట్లో చిత్రగుప్తుని ఆవాహన చేస్తారు అని విశాల్ అంటాడు. అలా చేస్తే గండాలు తొలగిపోతాయా బావగారు ఆయన చిత్రపటం లేకపోతే ఎలా పూజ సంపూర్ణమవుతుంది అని సుమన అంటుంది.

విదేశాలలో చదువుకొని వచ్చినా విశాల్ కి తెలిసిన విషయం, శాస్త్రి గారి మనవరాలివైన నీకు తెలియకపోవడమే ఏంటమ్మా అని స్వామీజీ అంటాడు. తెలుసుకొని ఉపయోగమేముందని తెలుసుకోలేదు అని సుమన అంటుంది. అమరావతిలో ఐరావతం అంత ఉన్న మా అత్తయ్యకే తెలియదు ఇక సుమనకేం తెలుస్తుంది అని హాసిని అంటుంది. ఏయ్ మొద్దు నన్ను ఎద్దు అంటావేంటి అని తిలోత్తమ అంటుంది. అమ్మ వదిన నిన్ను తిట్టడం లేదు ఐరావతంతో పూలుస్తుంది అని విశాల్ అంటాడు.నైని ముందు గణపతికి హారతి ఇచ్చి ఆ తరువాత చిత్రగుప్తుడికి పూజ చెయ్యి అని స్వామీజీ అంటాడు. అలాగే స్వామీజీ అని నైని గణపతికి హారతి ఇచ్చి చిత్రగుప్తుకి పూజ చేస్తుంది. స్వామీజీ ఈ పూజ పూర్తయింది అమ్మకి గండం తప్పుతుందంటారా అని విశాల్ అడుగుతాడు. బావగారు పూజ అయిపోయింది మీరు ఆ చిత్రగుప్తుడికి గండం తప్పిపో వాళ్లని మొక్కుకోండి లేదంటే నీ కూతురుతో పాటు నా బిడ్డ కూడా గండం వస్తుంది అని సుమన అంటుంది.

పూజ అయితే సంపూర్ణమైంది నైని ఇక స్వయంపాక ని దానం చెయ్యి అని స్వామీజీ అంటాడు.అవును స్వామీజీకి దానం చేయి నైని అని తిలోత్తమ అంటుంది. దానం చేసేది నేను కాదు అత్తయ్య మీరే అని నైని అంటుంది. గండం నీ కూతురికి అయితే నేను దానం చేస్తే గండం ఎలా తప్పుతుంది అని తిలోత్తమ అంటుంది. అత్తయ్య అన్నయ్యకొ మేనమామకొ దానం ఇవ్వాలంట అందుకే నిన్ను ఇవ్వమంటున్నాను అని నైని అంటుంది. మామయ్య అంటే ఎవరున్నారు ఇంకా పావని మూర్తి తప్ప అని తిలోత్తమా అంటుంది. అమ్మో ఆ పాపాల బుట్టని నేను అందుకోను నాకేమన్నా అయితే మధుర్ ఊరుకోదు అని పావన్ మూర్తి అంటాడు.. దీనితో ఈరోజు ఎపిసోడ్ ముగుస్తుంది