NewsOrbit
Entertainment News Telugu TV Serials

Nuvvu Nenu Prema: పద్మావతిని తీసుకువచ్చిన విక్కీ.. శాంతాదేవి అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పలేక పోయిన విక్కి,పద్మావతి..

Nuvvu Nenu Prema 4 aug 2023 today 380 episode highlights

Nuvvu Nenu Prema: నిన్నటి ఎపిసోడ్ లో,పద్మావతి ఎవరికీ కనిపించకుండా గుడిలో ఉంటుంది. ఇంట్లో అందరూ టెన్షన్ పడుతూ ఉంటారు. విక్కీ పద్మావతి ఎక్కడుందో కనిపెట్టి,పద్మావతి దగ్గరికి వెళ్తాడు. ఈరోజు 380 వ ఎపిసోడ్ లో, పద్మావతి గుడిలో ప్రసాదం తింటూ ఉండగా, విక్కీ వచ్చి ప్రసాదం తింటూ ఉన్నప్పుడు తీసుకెళ్లాలని చూస్తాడు. నీకు ప్రసాదం కావాలంటే అక్కడ పెడతారు బిల్లు అని అంటుంది పద్మావతి. నువ్వు ముందు నాతోపాటు రా అని అంటాడు. తింటున్న ప్రసాదాన్నైనా తిని నువ్వు తినేసి వస్తాను అని అంటుంది పద్మావతి.

Nuvvu Nenu Prema 4 aug 2023 today 380 episode highlights
Nuvvu Nenu Prema 4 aug 2023 today 380 episode highlights

 

Nuvvu Nenu Prema : పద్మావతి తన కూతురు కాదని, తేల్చి చెప్పిన భక్త.. తండ్రి కోసం తపించిన పద్మావతి…

విక్కీ నుండి తప్పించుకోవాలనుకున్న పద్మావతి..

విక్కీ, ఫోన్ చూసుకుంటూ ఉండగా పద్మావతి వికీ తెలియకుండా వెనకనుంచి గుడి వెనక్కి వెళ్తుంది.ఎలాగైనా విక్కి నుండి తప్పించుకోవాలనుకుంటుంది.ఇక్కడ కూర్చుని తింటే ఇప్పుడు విక్కీ వెళ్ళిపోతాడు, అని అనుకొని అక్కడ ప్రసాదం తీసుకొని తింటూ ఉంటుంది. విక్కీ పద్మావతి ఎక్కడ అని వెతుకుని పద్మావతి ఉన్న ప్లేస్ కి వెళ్లి నిలబడతాడు. విక్కిని చూసి పద్మావతి నేను రానని చెప్పినా నా వెంటే పెడతారు ఏంటి అని అంటుంది. నువ్వు రావాల్సిందే అని కోపంగా అంటాడు. నాకు ఆ ఇల్లు జైలు లాగా ఉంటుంది నేను రాను అని అంటుంది. నువ్వు అసలు ఏం పని చేశావు నీకు అర్థం అవుతుందా నేను ఉంటాడు. మీ ఇంట్లో కూడా మీ అమ్మానాన్న నేను ఇంట్లో నుంచి వెళ్ళిపోమంటే నేను పడుతున్న బాధ ఏంటో నీకు అర్థం అవుతుంది.ఇప్పుడు ఎక్కడికి వెళ్తావు అని అంటాడు విక్కీ. వెళ్తాను వేరే ఊరికో ఏట్లోకో ఎక్కడికి వెళ్తాను అని అంటుంది. ఇంకొకసారి ఇప్పుడు ఇలాంటి పిచ్చి సమాధానం చెప్పకు అని అంటాడు.అయినా బాధ మీది కాదు కదా మీకు ఎలా తెలుస్తుంది అని అంటుంది పద్మావతి.నోరు మూసుకొని వచ్చి కారుకు అని అంటాడు విక్కి.

 

Nuvvu Nenu Prema 4 aug 2023 today 380 episode highlights
Nuvvu Nenu Prema 4 aug 2023 today 380 episode highlights

Nuvvu Nenu Prema: పద్మావతి కోసం విక్కీ వెతుకులాట.. పద్మావతి దొరికిందా..? దూరమైందా..?

విక్కీ నీ కిడ్నాపర్ని చేసిన పద్మావతి..

కోపంగా విక్కీ చేయి పట్టుకొని పద్మావతిని గుడి బయటకు తీసుకొస్తూ ఉంటాడు. వెంటనే పద్మావతి పెద్దగా వచ్చి నలుగురిని పోగు చేస్తుంది. ఈయన ఎవరో నాకు తెలియదండి నన్ను కిడ్నాప్ చేస్తున్నాడు అని అందరితో చెప్తుంది. ఇంకా చూస్తారు ఏంటి పట్టుకొని నాలుగు తగిలించండి అని,అంటారు. నేను కిడ్నాపర్ని కాదు తన భర్తని అని అంటాడు విక్కీ.అందులో ఒక ఆవిడ ఏం మా నీ భర్త అయితే అబద్ధం చెప్తున్నావా అని అంటుంది. లేదండి ఎవరు నాకు తెలియదు అని ఫేస్ చూస్తే నా భర్తలా ఉన్నాడా చూడండి కిడ్నాపర్ లోనే ఉన్నాడు నన్ను కాపాడండి ఎన్ని సినిమాలు ఇలా చెప్పి తీసుకెళ్లలేదు చూశారు కదా మీరు కూడా,నేను కాపాడండి ఆయన అలానే అంటారు అని అంటుంది.స్టాప్ ఇట్ అని అరుస్తాడు విక్కీ. చూశారుగా ఎంతమంది ముందే నన్ను అలా అరుస్తున్నాడు నా భర్త అయితే అలా అరుస్తాడా అని అంటుంది పద్మావతి.ఇంకెందుకు అయితే నలుగురం కలిసి నలుగు తగిలిస్తే బుద్ధి వస్తుంది అని అంటారు అక్కడివాళ్ళు.వద్దొద్దు మంచి కిడ్నాపర్లానే ఉన్నాడు కొట్టకండి అని అంటుంది పద్మావతి. ఇప్పటికి వార్నింగ్ ఇచ్చి పంపించేసెయ్యండి కొట్టకుండా అని అంటుంది. సరే నీ పిక్ కి వార్నింగ్ ఇచ్చి వాళ్ళందరూ అక్కడ నుంచి వెళ్లిపోతారు. నన్ను కిడ్నాపర్ అంటావా రా చెప్తా నీ పని అని చేయి పట్టుకుంటాడు. మళ్లీ పద్మావతి కాపాడండి కాపాడండి అని అరుస్తుంది మళ్ళీ అందరూ వచ్చేస్తారు. నేను మంచి కిడ్నాప్ అనుకున్నాను ఈయన మళ్ళీ నన్ను కిడ్నాప్ చేయాలని చూస్తున్నాడు నన్ను కాపాడండి పద్మావతి. చూస్తారే నాలుగు తగిలించండి అని అంటారు అక్కడివాళ్ళు, మీరు తను చెప్పేది నమ్ముతారా నేను చెప్పేది నమ్మరా నేను నిజంగా తన భర్తని అని పెళ్లి ఫోటో చూపిస్తాడు. అది చూసి ఏమ్మా నేను నీ భర్త ఎందుకు అబద్ధం చెప్పావు. తన భార్య అంటే మీరు ఎవరు నమ్మరు చెప్పకుండా ఇంట్లో నుంచి వచ్చేసింది తీసుకెళ్దాం అంటే, తన ఇంటికి రానంటుంది. మీ ఇద్దరి మొగుడు పెళ్ళాలు, మీ జంట చాలా బాగుంది పెళ్లి కొత్తగా అయినట్టుంది కదా ఇవన్నీ సరదాలు, ఏమ్మా నీ భర్త నేను ఇంటికి తీసుకెళ్దామంటే ఎందుకు వెళ్లట్లేదు అని అడుగుతారు. నీ మీద ఎంత ప్రేమ ఉంటే నిన్ను వెతుక్కుంటూ ఇక్కడిదాకా వస్తాడు. అబ్బాయి ఎక్కువ ఇబ్బంది పెట్టకుండా ఇంటికి వెళ్ళు అని అంటారు అక్కడివాళ్ళు. రా అని చెప్పి విక్కీ చేయి పట్టుకోగా ఎత్తుకొని తీసుకెళ్లి బాబు నీ మీద ఉన్న కోపం పోతుంది అని అంటారు. సరే నీ విక్కీ ఎత్తుకొని కార్ దగ్గరికి తీసుకొని వెళ్తాడు. కార్ దగ్గర దింపి పద్మావతిని ఇంకా పదా అని అంటాడు.నేను రానని చెప్తున్నా బలవంతంగా కారులో కూర్చో పెడతారా ఏంటి అని అంటుంది పద్మావతి. మళ్లీ వాళ్ళందరినీ పిలిపిస్తాను అప్పుడు వాళ్లే కార్యక్రమం ఇస్తారు అని అంటాడు విక్కి.వద్దులే కార్యకర్తను అని కార్ ఎక్కుతుంది పద్మావతి. సీట్ బెల్ట్ పెట్టుకోని అంటాడు అంతే కోపంగా ఉంటుంది విక్కీని సీట్ బెల్ట్ పెట్టి కారు ముందుకు పోనిస్తాడు.

Brahmamudi 3 Aug165 ఎపిసోడ్: స్వప్న గర్భవతి కాదనే విషయాన్ని కావ్య ఇంట్లో అందరికీ చెప్పేసిందా..? ఏం జరిగిందంటే!

 

Nuvvu Nenu Prema 4 aug 2023 today 380 episode highlights
Nuvvu Nenu Prema 4 aug 2023 today 380 episode highlights

భక్త కి పద్మావతి గురించి ఆలోచించమని చెప్పిన ఆర్య..

విక్కీ ఫోన్ చేసి పద్మావతి దొరికిందని ఆర్య కి చెప్తాడు.ఆర్య చాలా సంతోషిస్తాడు.వెంటనే అనుకి లక్ష్మీకి చెప్తాడు. పద్మావతిని విక్కీ తీసుకొస్తున్నాడట అని అంటాడు. వెంటనే లక్ష్మి పోనీలే బాబు తను చెప్పకుండా పెళ్లి చేసుకున్న అతను అర్థం చేసుకునే భర్త దొరికాడు అంతకన్నా ఏం కావాలి అని అంటుంది. పద్మావతి చాలా అదృష్టవంతురాలు వ్యక్తిని భర్తగా పొందినందుకు అని అంటుంది లక్ష్మి.అప్పుడే అక్కడికి, ఆండాలు బత్తాయి ఇద్దరు వచ్చి అను ఇంటికి వెళుతుందని చీరలు అవి తీసుకొని వస్తారు.సరే మేము ఇంకా బయలుదేరుతాము అని అంటాడు ఆర్య. ఇంకొంచెం సేపు ఉండండి బాబు అని అంటాడు భక్త. లేదులెండి మేం బయలుదేరాలి అని అంటాడు ఆర్యా.మావయ్య మీరు ఒకసారి పద్మావతి గురించి ఆలోచించండి అని అంటాడు. ఇంకా ఏదో చెప్పబోతూ ఉండగా మనసుకైన గాయాన్ని ఎలా మాన్పించుకుంటామో నాకు తెలియదు బాబు. గాయం గాయం అయిపోతుంది నా మనసు మారదు అని అంటాడు భక్త. నాకు అను మాత్రమే కూతురు. మీరు ఎంత మాట్లాడినా నేను మారేది లేదు. అను జాగ్రత్తగా చూసుకో అని చెప్తాడు.అండల్ అను ఎప్పుడైనా మీ గుర్తొస్తే మళ్ళీ రా అని అంటుంది. ఇక అందరికీ సెలవు చెప్పి వాళ్ళిద్దరూ అక్కడ నుంచి వెళ్తారు.

Krishna Mukunda Murari: మురారి, కృష్ణ మాటలకు ఖంగుతిన్న రేవతి.. ముకుంద మాస్టర్ ప్లాన్

 

Nuvvu Nenu Prema 4 aug 2023 today 380 episode highlights
Nuvvu Nenu Prema 4 aug 2023 today 380 episode highlights

శాంతాదేవి విక్కి పద్మావతిని ప్రశ్నించడం..

పద్మావతి ఇంటికి తీసుకొని వస్తాడు విక్కి. కారు దిగి లోపలికి వచ్చేటప్పుడు,ఇక్కడ జరిగినవి ఏవి మా అక్క దగ్గర చెప్పమాకు అని అంటాడు. అక్కని ఇంత బాగా చూసుకుని నువ్వు నన్ను ఎందుకు ఇలా ఇబ్బంది పెడుతున్నావు అని అనుకుంటుంది మనసులో, మా అక్క సంతోషమే నాకు ముఖ్యం,నువ్వు కాస్త లోపలికి రా అని అంటాడు.పద్మావతి వస్తాను రాకపోతే ఎత్తుకొని తీసుకెళ్తారా ఏంటి అని అంటుంది.కారు దిగి లోపలికి రాగానే శాంతాదేవి, విక్కీ పద్మావతి ఇద్దరినీ ఆగమంటుంది.ఏంటి పద్మావతి నువ్వు చేసిన పని,పెళ్లి చేసుకుని వచ్చి ఒక తప్పు చేశారు. ఇంతమంది పెద్దవాళ్ళం కలిసి,పరిష్కారం వెతుకుదాం అనుకుంటే, ఇలా చేయడం ఏమన్నా బాగుందా,నువ్వు చెప్పకుండా ఎక్కడికి వెళ్ళిపోయావు, ఎంత కంగారు పడ్డాను అని అంటుంది అరవింద. ఇంట్లో వాళ్ళు ఏదైనా అంటే వెళ్ళిపోతావా మనవాళ్లే కదా అన్నది ఇవాళ కాకపోతే రేపైనా మారతారు కదా, ఇలాంటి పనులు ఇంకెప్పుడూ చేయకు అని అంటుంది అరవింద. అసలు నువ్వు ఎక్కడికి వెళ్లావు అసలు ఏమైంది అని అడుగుతుంది శాంతదేవి.వెంటనే వికీ పద్మావతి ఎప్పుడు నిజం చెప్పేస్తుందో మొత్తం అని, పద్మావతి నువ్వు రెస్ట్ తీసుకోవాల్సి పోయావు కదా అని అంటాడు.

Nuvvu Nenu Prema 4 aug 2023 today 380 episode highlights
Nuvvu Nenu Prema 4 aug 2023 today 380 episode highlights

రేపటి ఎపిసోడ్ లో,పద్మావతి తో విక్కీ కోపంగా నువ్వు బయట అందరికీ,సంతోషంగా కనిపించాలి. మన మధ్య భార్యాభర్తల సంబంధం లేదన్న విషయం బయట ఎవరికి తెలియడానికి వీల్లేదు ఈ ఆరు నెలలు నేను చెప్పినట్టు నువ్వు వినాలి. భారీగా అందరి ముందు నటించాలి అని అంటాడు.

Related posts

Tollywood Young Heroes: షాకిస్తున్న టాలీవుడ్ యంగ్ హీరోల రెమ్యున‌రేష‌న్‌.. ఒక్కొక్క‌రిది ఒక్కో రేటు!

kavya N

Harom Hara Release Date: కొత్త రిలీజ్ డేట్ ను అనౌన్స్ చేసిన హరోం హర మూవీ టీం.. పోటీ నుంచి తప్పుకున్న సుధీర్ బాబు..!

Saranya Koduri

Lavanya Tripathi: మెగా ఫ్యాన్స్ కి సూపర్ గుడ్ న్యూస్.. తల్లి కాబోతున్న లావణ్య..!

Saranya Koduri

Srimukhi: శ్రీముఖి మూవీ టైటిల్ ని దొబ్బేసిన అజిత్.. రిలీజ్ కి నోచుకోలేకపోయినా తెలుగు యాంకర్ మూవీ..!

Saranya Koduri

Prabhas Kalki OTT: రెండు ఓటీటీల్లో అడుగుపెట్టనున్న కల్కి.. తెలుగు స్ట్రీమింగ్ ప్లాట్ ఫామ్ డీటెయిల్స్ ఇవే..!

Saranya Koduri

Dhe Promo: ఢీ షో కి స్పెషల్ గెస్ట్ గా హాజరైన కాజల్.. గ్రాండ్ ఫినాలే కి చేరుకున్న ముగ్గురు కంటెస్టెంట్ల లిస్ట్ ఇదే..!

Saranya Koduri

South Actress: ఈ ఫోటోలో ఉన్న చిన్నారిని గుర్తుప‌ట్టారా.. సౌత్ ఇండ‌స్ట్రీలో స్టార్ హీరోయిన్ ఆమె..!!

kavya N

Karthika Deepam 2 May 21th 2024 Episode: తాళి తెంపబోయిన నరసింహ.. కాళికాదేవి రూపం ఎత్తిన దీప..!

Saranya Koduri

Kajal Aggarwal: అసిస్టెంట్ డైరెక్టర్ నుంచి కాజ‌ల్ కు చేదు అనుభ‌వం.. కారవాన్ లో ష‌ర్ట్ తీసేసి అంత ప‌ని చేశాడా..?

kavya N

Vijayashanti: మ‌రో కొత్త సినిమాకు సైన్ చేసిన విజ‌య‌శాంతి.. ఆ మెగా హీరోకి త‌ల్లిగా రాముల‌మ్మ‌!

kavya N

Brahmamudi May 21 Episode  415:అనామిక తో విడాకులు అన్న కళ్యాణ్.. మాయని దుగ్గిరాల ఇంటికి తెచ్చిన కావ్య.. ప్లేట్ తిప్పేసిన మాయ… ఫ్యుజులు ఎగిరే ట్విస్ట్ రేపటికి..

bharani jella

Nuvvu Nenu Prema May 21 Episode 629: తన భర్త గురించి నిజం తెలుసుకున్న అరవింద.. పద్మావతిని బెదిరించిన కృష్ణ..అరవింద ని కొట్టిన కృష్ణ ..

bharani jella

Krishna Mukunda Murari May 21 Episode 475: ముకుంద మీద కృష్ణ మురారిల అనుమానం.. కృష్ణ బిడ్డ సేఫ్..ముకుందని కొట్టిన కృష్ణ..

bharani jella

Trivikram Ram: హీరో రామ్ తో భారీ సినిమా ప్లాన్ చేస్తున్న డైరెక్టర్ త్రివిక్రమ్..?

sekhar

Junior NTR: హ్యాపీ బర్త్ డే తారక్ బావ.. అల్లు అర్జున్ స్పెషల్ ట్వీట్ వైరల్..!

Saranya Koduri