Nuvvu Nenu Prema: నిన్నటి ఎపిసోడ్ లో విక్కీకి అనుకోని పరిస్థితుల్లో గొంతు మూగబోతుంది. విక్కీ పద్మావతి వల్లే తనకి ఇలా జరిగిందని చాలా కోపంగా ఉంటాడు. ఇక పద్మావతి తెలియక చేసిన తప్పుకి చాలా బాధపడుతూ ఉంటుంది. నేను దగ్గర ఇవ్వడానికి ప్రయత్నిస్తుంటే ఇంకా దూరం అవుతున్నాను అని బాధపడుతుంది. ఇక అరుందా పద్మావతి విక్కీ మీద చూపిస్తున్న కేరింగ్ కి, సంతోషిస్తుంది.

ఈరోజు ఎపిసోడ్ లో,డైనింగ్ టేబుల్ దగ్గర అందరూ కూర్చొని ఉంటారు పద్మావతి విక్కీ కోసం స్పెషల్ గా టిఫిన్ చేసి తన గొంతు బాగాలేనందుకు వేడిగా నీళ్లు ఇస్తూ ఉంటుంది. ఇక ఎవరు ఏమి అడిగినా పద్మావతి విక్కీ లాగా ఆన్సర్ చేస్తూ ఉంటుంది విక్కీ మాట్లాడుతుంటే సౌండ్ బయటికి రాదు కాబట్టి పద్మావతి వికీ మాట్లాడిన మాటలను యాస్ ఇట్ ఇస్ గా ఏమనుకున్నాడో ఏం మాట్లాడుతున్నాడో అదే అందరితో చెబుతూ ఉంటుంది ఇక అందరూ ఆశ్చర్యపోతూ ఉంటారు. పద్మావతి చాలా బాగా చూసుకుంటుంది నేను నిన్ను ఎలా చూసుకుంటానో అలానే చూసుకుంటుంది అని అరవింద విక్కీ తో అంటుంది.

ఆఫీస్ కి పద్మావతి..
ఇక ఇంట్లో అందరూ టిఫిన్ చేస్తూ ఉంటే ఆర్య ఈరోజు మన కంపెనీకి ఒక డీల్ గురించి మాట్లాడ్డానికి వస్తున్నారు. ఇప్పుడేం చేద్దాం రా అని అంటాడు విక్కీదో విక్కీ ఏం పర్లేదు రమ్మను అని అంటాడు అది పద్మావతి చెప్తుంది. అదేంట్రా నువ్వు మాట్లాడలేవు కదా అని అంటాడు పర్వాలేదు అని అంటాడు విక్కీ. శాంతాదేవి ఇప్పుడు ఆ డీల్ గురించి ఎందుకు వదిలేసేయండి అని అంటుంది విక్కీ లేదు నానమ్మ అది చాలా ఇంపార్టెంట్ మన కంపెనీకి మంచి లాభం తీసుకొచ్చే డీల్ కచ్చితంగా వెళ్లాల్సిందే అ అని అంటాడు విక్కీ. అయితే ఆర్య నువ్వు వెళ్లి డీల్ చెయ్యి విక్కీకి హెల్ప్ చెయ్యి అని అంటే ఆర్య వామ్మో విక్కి పైన ఉన్నాడు కాబట్టి నేను మ్యారేజ్ చేసుకుంటూ వస్తున్నాను కానీ నా చదువుకి నాకంత స్థాయి లేదు అని అంటాడు. మరి ఎలాగోలాగా మీ డీల్ అయితే కుదరాలి కదా అని అంటుంది శాంతాదేవి. వెంటనే అరవిందా నా దగ్గర ఒక ఐడియా ఉంది పద్మావతి నేను ఆఫీసుకు తీసుకువెళ్ళు ఇప్పుడు దాకా నువ్వు చెప్పిన మాటలు నీతోనే మాకు ట్రాన్స్లేట్ చేస్తుంది కాబట్టి అక్కడ కూడా నీ మాటలన్నీ తనే ట్రాన్స్లేట్ చేసి చెప్తుంది అని అంటుంది. కానీ విక్కీ అందుకు ఒప్పుకోడు అక్కడే ఉన్న కృష్ణ నాకు తెలుసు విక్కీ నువ్వు ఒప్పుకోవని అని అనుకుంటాడు మనసులో, ఇక పద్మావతిని తీసుకు వెళ్ళమని ఇంట్లో అందరూ విక్కీకి ఫోర్స్ చేస్తూ ఉంటారు. నారాయణ మనకి ప్రతిసారి కష్టం వచ్చినప్పుడు పద్మావతి ఆదుకుంటుంది ఇప్పుడు ఈ కష్టం నుంచి కూడా పద్మావతి బయట పడేయాలి అని అంటాడు. ఇక పద్మావతి కూడా మనసులో నా వల్ల గొంతు పోయింది నావల్ల ఇలా అయింది కాబట్టి నేనే విక్కీకి హెల్ప్ చేయాలి అని అనుకుంటూ ఉంటుంది.
Krishna Mukunda Murari: కృష్ణే తప్పు చేసిందనీ అనుకుంటున్న భవాని.. మురారి కృష్ణ కి దూరం అవుతాడా.?

కృష్ణ మరో ప్లాన్..
ఇక ఎలాగైనా వీళ్ళందరూ కలిసి ఒప్పించేలా ఉన్నారు అని కృష్ణకి అర్థం ఎందుకు పద్మావతి ఆఫీస్ కి వెళ్లడం ఆర్యవల్లే కావట్లేదు అని అంటున్నాడు ఇక ఏమిరా అని పద్మావతి వల్ల ఏమవుతుంది అని అంటాడు కృష్ణ.వెంటనే పద్మావతి అన్నయ్య మీరు నా గురించి ఎక్కువగా ఆలోచిస్తున్నారు అనుకుంటే కచ్చితంగా చేసి తీరుతుంది ఆ డీల్ ఎలాగైనా నేను కుదురుస్తాను అని అంటుంది. నీవల్ల ఎలా అవుతుంది పద్మావతి అని అంటాడు వెళ్తేనే కదా నా వల్ల అయ్యేది లేనిది తెలిసేది అన్నయ్య అని అంటుంది ఇక ఇంట్లో అందరూ చెప్తుంటే విక్కీ ఆలోచనలో పడతాడు ఇంతలో అరవింద నాకోసం ఒప్పుకో అని అంటుంది ఇక అక్క కోసం ఏదైనా చేసేటప్పుడు సరే అంటాడు. పద్మావతి చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది కానీ కృష్ణ మాత్రం మనసులో ఇప్పుడు మీ అందరికీ ఒక బ్లాంబు బ్లాస్ట్ అయ్యే విషయం తెలీదు, విక్కీ ఆఫీస్ లో ఇప్పుడు డీల్ మాట్లాడుకోవడానికి వస్తున్నది నా మనుషులు వాళ్లు అక్కడికి వచ్చి ఆ డీల్ కుదిరించుకొని విక్కీ ఆఫీస్ లో చొరబడి విక్కీని ఆర్థికంగా దెబ్బతీయడానికి వస్తున్నారు ఎలా తప్పించుకుంటారో నేను వేసే ఈ ఉచ్చులో నుంచి అది చూస్తాను అని మనసులో అనుకుంటాడు. ఇక పద్మావతి వికీ ఆఫీస్ కి వెళ్ళాలి అని అనుకుంటారు ఇక పద్మావతి విక్కీ కోసం వేడి నీళ్లు అలాగే టీ పెట్టుకుని తీసుకువస్తుంది. ఏంటమ్మా రెండు గాస్కులు అని అడుగుతుంది శాంతాదేవి విక్కీ సార్ కి గొంతు బాలేదు కదా అందుకని ఆయన కోసమే ఇవి రెండూ అని ఉంటుంది పద్మావతి ఎంత ప్రేమ చూపిస్తుందో విక్కీ మీద అని అందరూ అనుకుంటారు. అప్పుడే అక్కడికి లాయర్ కి సంబంధించిన వాళ్ళు వస్తారు ఆర్య ఎందుకు వీళ్లు అని అంటాడు ఒక ఇంపార్టెంట్ ఫైలు ఇవ్వడానికి వచ్చారు అంటాడు విక్కి ఇక ఇంపార్టెంట్ ఫైల్ ఇచ్చి వాళ్ళు వెళ్ళిపోతారు. ఆ ఫైల్ ఏంటి అని ఆర్య అడిగితే విక్కీ చెప్పడు ఇది చాలా కాన్ఫిడెన్షియల్ ఎవరికీ తెలియకూడదు అని అంటారు. అసలు అందులో ఏముందో చూడాలి అని కృష్ణ అనుకుంటాడు. ఇద్దరూ బయటికి వచ్చిన తర్వాత పద్మావతి వికీ పిలవకపోయినా పిలిచారా సారు అని వెనక్కి తిరుగుతుంది వెంటనే విక్కీ కళ్ళ లోకి కళ్ళు పెట్టి చూస్తూ అలానే చాలా సేపు చూసుకుంటారు. చూశారా సారు మీరు చెప్పకపోయినా మీ మనసు నాకు తెలుస్తుంది ఇప్పటికైనా మీ మనసులో నేనున్నానని ఒప్పుకోండి సార్ అని అంటుంది పద్మావతి. అలాంటిదేమీ లేదు నోరు మూసుకొని పదా అంటాడు విక్కీ. ఇద్దరు కలిసి ఆఫీసుకి బయలుదేరుతారు.

కృష్ణ మీద అరవింద అనుమానం..
ఇక కృష్ణ విక్కీ ఏదో ఫైల్ తెప్పించాడు కదా ఇందాక అదేంటో చూడాలి అని అనుకుంటాడు మనసులో, ఇక అందరూ వెళ్లిపోయిన తర్వాత విక్కీ రూమ్ కి వెళ్లి ఆ ఫైల్ ఎక్కడ పెట్టాడు వెతకాలి అని వెళ్తాడు అదే టైంకి అరవింద్ కూడా పనిమనిషిని తీసుకుని విక్కీ బెడ్ షీట్ మార్చడానికి అక్కడికి వెళుతుంది ఇక అక్కడే ఉన్న కృష్ణను చూసి ఏంటండీ మీరు ఎక్కడున్నారు అని అంటుంది విక్కీ, రూమ్ లో మీరేం చేస్తున్నారు అని అంటుంది ఇప్పుడు ఎలా తప్పించుకోవాలి అరవింద్ కి అనుమానం రాకుండా అని కృష్ణ ఏదో ఒకటి చెప్పాలి అని డిసైడ్ అవుతాడు. ఏం లేదురానమ్మ నాది ఒక పేపర్స్ కనిపించట్లేదు వెతుకుతున్నాను అంటాడు మీ పేపర్స్ కనిపించకపోతే మీ రూమ్ లో వెతకాలి గాని ఇక్కడ ఏంటి అని అంటుంది అరవింద. ఇక ముసుగులో బుద్ధులాట ఎందుకు నిజం చెప్పేద్దాం అని అనుకొని ఆస్తి పత్రాల కోసం వెతుకుతున్నాను రానమ్మ అని అంటాడు. ఆస్తి పత్రాల కోసం వెతకడం ఏంటండీ అని అంటుంది. జోక్ చేశాను రానమ్మ నువ్వేమంటావా అని అంటాడు ఇలాంటి జోకులు ఎప్పుడు వేయమాకండి అసలు ఎందుకు వచ్చారు మీరు రూమ్ లోకి ఇప్పటికీ చెప్పలేదు అని అంటుంది. నా షర్టు ఒకటి మిస్ అయింది రానమ్మ ఈ రాము ఎప్పుడూ నా షట్ ని విక్కీ సెల్ఫ్ లో విక్కీ షట్ నేను ఆ సెల్ఫ్ లో పెడుతూ ఉంటాడు. అందుకనే ఆ షర్ట్ వెతకడం కోసం వచ్చాను అని అంటాడు. షర్ట్ కోసం వచ్చారా అని అంటుంది అరవింద అమ్మయ్య ఎలా నమ్మించాను అని అనుకుంటాడు. అరవింద ఇంకొకసారి ఎవరూ లేకుండా విక్కీ గదిలోకి రాకండి ఎందుకంటే చూసే వాళ్ళకి బాగోదు అని అంటుంది సరే రానమ్మ అంటాడు కృష్ణ.

ఆఫీస్ లో అల్లాడించిన పద్మావతి..
ఇక పద్మావతి ఆఫీస్ లోకి అడుగుపెట్టగానే అందరూ గుడ్ మార్నింగ్ చెప్తారు.అక్కడ పని చేసే స్టాప్ మీరు ఎలా ఉన్నారు మేడం అంటే నేను బానే ఉన్నాను అంటుంది పద్మావతి. మీరు ఎలా ఉన్నారు అని అంటుంది పద్మావతి అక్కడ స్టాప్ మీరు పెట్టే భోజనం తిని మేము చాలా బాగున్నాము. ఆ భోజనం తినే మేము చక్కగా పని చేయగలుగుతున్నాము అని అంటారు. ఇక ఆఫీస్ స్టాఫ్ అంతా పద్మావతిని పొగడ్డం మొదలుపెడతారు. పద్మావతి ఆఫీస్ స్టాఫ్ పొగుడుతుంటే అక్కడే ఉన్న ఆర్య కూడా పద్మావతిని పొగడం మొదలుపెడతాడు ఇక విక్కీ కోపంగా అందరి వైపు చూస్తూ ఉంటాడు.