NewsOrbit
Entertainment News Telugu TV Serials

Brahmamudi అక్టోబర్ 27 ఎపిసోడ్ 238: స్వప్న ప్రెగ్నెన్సీ పోవడానికిరాహుల్ తో కలిసి రుద్రాణి స్కెచ్.. కావ్యకు దగ్గరైన రాజ్..

Brahmamudi Serial 27 october 2023 episode 238 highlights

Brahmamudi అక్టోబర్ 27 ఎపిసోడ్ 238:  నిన్నటి ఎపిసోడ్ లో స్వప్నకు శ్రీమంతం జరపాలి అని ఇందిరా దేవి అనుకుంటుంది. ఇక కావ్య ఇంట్లో వాళ్ళ హడావిడి చూసి నిజం చెప్పేస్తే మంచిది అని అనుకుంటుంది. ఇంతలో స్వప్న కావ్యం పక్కకు తీసుకువెళ్లి నువ్వు ఎప్పటికీ నిజం చెప్పడానికి వీల్లేదు నా దగ్గర నా ప్లాన్లు ఉన్నాయి దాని ప్రకారం నేను ఇంట్లో ఎవరికీ అనుమానం రాకుండా ఈ ప్రెగ్నెన్సీ నాటకానికి ముగిస్తాను అని చెప్తుంది. స్వప్న ఇంట్లో అందరినీ మోసం చేయడంతో పాటు నన్ను కూడా నీ మోసం లో భాగం కమ్మంటావా అని అంటుంది కావ్య. లేదంటే నాకు చావే గతి అని స్వప్న బెదిరిస్తుంది దాంతో చేసేదేం లేక కావ్య సైలెంట్ అవుతుంది.

Brahmamudi Serial 27 october 2023 episode 238 highlights
Brahmamudi Serial 27 october 2023 episode 238 highlights

ఈరోజు238 వ ఎపిసోడ్ లో కావ్య స్వప్న తో మాట్లాడి స్వప్న అన్న మాటలు గురించి ఆలోచిస్తూ కిందకి దిగి వస్తూ ఉంటుంది అప్పుడే హాల్లో ఇందిరా దేవి అపర్ణ కనకంతో మాట్లాడుతూ ఉంటారు. నేను మా ఇంటి నుంచి తీసుకురావాల్సినవి ఏమైనా ఉంటే చెప్పండి తీసుకు వస్తాను అని అంటుంది కనుకమ్. చూడు కనకం ఇది మా ఇంట్లో జరిగే శ్రీమంతం నువ్వు తీసుకురావాల్సిన పనేమీ లేదు మేము స్వప్నకు ఇక్కడే గ్రాండ్గా శ్రీమంతం చేస్తాము. ఎటువంటి ఆటంకాలు లేకుండా ఘనంగా జరిగితే మాకంతే చాలు అని అంటుంది ఇందిరాదేవి. ఇక ధాన్యలక్ష్మి వీలైతే ఐదు వెండి అరిసెలు ఐదు బంగార పరిసలు తీసుకురండి అని అంటుంది కనకం షాక్ అవుతుంది వెంటనే అపర్ణ అవన్నీ రుద్రాణి కోసం మా కోసం కాదు అని నవ్వుతుంది. వాళ్ళలా నవ్వుతూ ఉండడం దూరం నుంచి కావ్య చూసి ఇంత సంతోషంగా ఉన్న వాళ్లకి నేను వెళ్లి ఇప్పుడు నిజం చెప్పి బాధ పెట్టలేను అని అనుకుంటుంది. పుట్టబోయే బిడ్డ మీద అమ్మమ్మ గారు చాలా ఆశలు పెట్టుకున్నారు ఇలాంటి సమయంలో నేను వెళ్లి వాళ్ళ ఆనందం పాడు చేయడం కరెక్ట్ కాదు అని అక్కడి నుండి వెళ్ళిపోతుంది కావ్య.

Brahmamudi అక్టోబర్ 25 ఎపిసోడ్ 236: కావ్యతో రాజ్ తిప్పలు.. చివరికి ఒకే మంచం మీద కావ్య రాజ్.. రేపటికి సూపర్ ట్విస్ట్

Brahmamudi Serial 27 october 2023 episode 238 highlights

    Brahmamudi Serial 27 october 2023 episode 238 highlights

రాహుల్ తో కలిసి రుద్రాణి స్కెచ్..

ఇక రుద్రాణి రాహుల్ నిపిలిచి మాట్లాడుతూ ఉంటుంది.ఏంటి మమ్మీ ఇంపార్టెంట్ విషయం అని చెప్పావు కానీ ఆ టాబ్లెట్స్ ఏవో చేతిలో పట్టుకొని చూస్తూ ఉన్నావు ఇంతకీ విషయం ఏంటి అని అంటాడు. చూడు రాహుల్ ఒక్కోసారి మన ప్లాన్ సక్సెస్ అవుతుందని మనకి నమ్మకం ఉన్న కానీ ఎక్కడో ఏదో క్లూ వదిలేస్తామన్న భయంతో ఒకటికి నాలుగు సార్లు ఆలోచించాల్సి ఉంటుంది అని అంటుంది. నువ్వు ఏమంటున్నావో నాకు అర్థం కావట్లేదు అని అంటాడు రాహుల్. ఈ టాబ్లెట్స్ అబార్షన్ అవడం కోసం వాడే టాబ్లెట్స్ ఇవి మన డాక్టర్ అడిగి తీసుకువచ్చాను అని అంటుంది రుద్ర నువ్వు ఎందుకు మమ్మీ తీసుకొచ్చింది ఇప్పుడు అని అంటాడు రాహుల్. నీ భవిష్యత్తు కోసం అని అంటుంది రుద్రాణి. మమ్మీ నాకు అర్థం కావట్లేదు అంటాడు రాహుల్. ఈ టాబ్లెట్స్ స్వప్న కోసం తెప్పించాను ఇవి తనకిచ్చి అబార్షన్ అయ్యేలా చేయాలి అని అంటుంది. ఇప్పుడు దానికి శ్రీమంతం చేయాలనుకుంటున్నారు శ్రీమంతం వంగల్ని పుట్టింటికి వెళ్తుంది పండంటి బిడ్డని ఎత్తుకొని వస్తుంది. ఆ తర్వాత మనం చేసేది ఏమీ ఉండదు దానికి పుట్టిన పిల్లలకు ఆడించడం తప్ప, అదే మనం దానికి కడుపు పోగొట్టమంటే శ్రీమంతం ఆగిపోతుంది స్వప్న ఇక్కడే ఉంటుంది. ఆ తర్వాత మంచి టైం చూసి దాని ఇంట్లో నుంచి బయటికి పంపించొచ్చు, అమ్మ నువ్వు అనే మాటలు బాగానే ఉన్నాయి కానీ నీకు ఇక్కడ ఒక విషయం అర్థం కావట్లేదు స్వప్నకి ఏమైనా అయితే మొదట అనుమానం వచ్చేది నా మీదే, నీ మీద ఎలా అనుమానం వస్తుంది నువ్వేమన్న టాబ్లెట్ వేసుకోమనిస్తున్నావా అని అంటుంది. అదే ఫుడ్ పాయిజన్ అయిపోయి కడుపు పోయిందని నమ్మిస్తే, నమ్మిస్తే ఏమవుతుంది అమ్మ అంటాడు ఇప్పుడు ఇంట్లో వంట చేస్తుంది ఎవరు? కావ్య కదా ఫుడ్ పాయిజన్ అయితే అప్పుడు ఎవరి మీద అనుమానం వస్తుంది కావ్య మీదే కదా అందుకనే నేను చెప్పినట్టు ఈ టాబ్లెట్ని జ్యూస్ లో కలిపి స్వప్న చేత తాగించు ఆటోమేటిక్గా ఫుడ్ పాయిజన్ అయింది అని డాక్టర్ చెప్తాడు. దాంతో కావి మీద మనం ఈ నెపం నెట్టేసి దాన్ని ఇంట్లో నుంచి బయటికి పంపించవచ్చు దాంతోపాటు దాని అక్కని కూడా బయటికి వెళ్ళొచ్చు అని అంటుంది. ఇది తాగిన గంటకి అబార్షన్ అవుతుంది. మనం మన డాక్టర్ దగ్గరికి తీసుకెళ్తాము మనం చెప్పినట్టుగా డాక్టర్ గారు రిపోర్ట్ ఇస్తుంది కాబట్టి మనం అనుకున్నది అనుకున్నట్టు జరుగుతుంది. ఇప్పుడే నేను చెప్పింది చేయకు రాత్రికి భోజనం అయిన తర్వాత చేయి అప్పుడు మనం అనుకున్నది అనుకున్నట్టు జరుగుతుంది ఇంట్లో నాకు కావాల్సింది అదే మామ్ అని అంటాడు రాహుల్ ఇక ఇద్దరు నవ్వుకుంటారు.

Brahmamudi అక్టోబర్ 26 ఎపిసోడ్ 237: కావ్యకు దగ్గరవుతున్న రాజ్.. స్వప్న ప్రెగ్నెన్సీ నాటకాన్ని బయట పెట్టాలనుకున్న కావ్య.. కళ్యాణ్ ఫోన్ తో అప్పు బాధ..

Brahmamudi Serial 27 october 2023 episode 238 highlights
Brahmamudi Serial 27 october 2023 episode 238 highlights

కృష్ణుడితో తన బాధ చెప్పుకున్న కావ్య..

ఏంటి కృష్ణ చక్కగా నవ్వుతూ ఉన్నావు మా ఇంట్లో కూడా నీ లీలలు మొదలుపెట్టినట్టున్నావు. జగన్నాటక సూత్రధారివి కదా నీ లీలలు నాకెలా అర్థం అవుతాయి. నీకు మొత్తం అర్థమయ్యే ఉంటుంది చూడు కృష్ణ నేనేమీ కావాలని అబద్ధం చెప్పట్లేదు కాకపోతే నేను నిజం దాచి పెట్టాను అంతే,అందరిలో ఆనందం పోగొట్టడం ఎందుకు అని నిజం దాచి పెట్టాను కృష్ణ. ఈ సంఘర్షణ నుంచి ఎలా బయటపడాలో అర్థం కాక నా బుర్ర బద్దలై పోతుంది అని దేవుడితో మాట్లాడుతూ ఉంటుంది కావ్య. ఏది ఎలా జరగాలని రాసిపెట్టి ఉంటే అలా జరుగుతుంది నన్ను మాత్రం అపార్థం చేసుకోవద్దు కృష్ణ, ఇందులో నా తప్పు ఉందని నువ్వేలెత్తి చూపించొద్దు ఇదంతా నీవు నేర్పిన విద్య నీరజాక్ష అని దండం పెట్టుకుంటుంది కృష్ణుడికి.

Brahmamudi Serial 27 october 2023 episode 238 highlights
Brahmamudi Serial 27 october 2023 episode 238 highlights

కళ్యాణ్ వంట..

అనామికా ఇంటికి కళ్యాణ్, అప్పు ఇద్దరు వస్తారు అదేందిరా బై నువ్వంట చేస్తున్నావు అనామికా వాళ్ళ ఇంటికి వచ్చి అని అంటుంది అప్పు. తనకి వంట రాదు అందుకే నీ హెల్ప్ కోసం నిన్ను ఇక్కడికి పిలిచాను నువ్వు వచ్చేసరికి లేట్ అయింది అందుకే నేనే యూట్యూబ్లో చూసి వండుతున్నాను. అయినా నువ్వు వంట చేయడమేంటి తనకు రాదా అని అంటుంది అప్ప. అక్కడికి వచ్చినా అనామిక ఆవును నాకు రాదు అని అంటుంది మరి పెళ్లయిన తర్వాత ఏం చేస్తారు అని అంటుంది అప్పు అక్కడ వంట వాళ్ళు ఉంటారు కదా అంటుంది అనామిక. వంట వాళ్లని నమ్ముకుంటే ఇంక అంతే సంగతి అయినా పాపం వీడి పెళ్లి అయిన తర్వాత వీడి పరిస్థితి గురించి ఆలోచిస్తే పాపం అనిపిస్తుంది అనుకుంటుంది మనసులో, కళ్యాణ్ చేసిన వంట అనామికకు నచ్చదు వెంటనే అనామిక ఇలా చేస్తే ఇంకా తిన్నట్టే అని ఉంటుంది అలా డైరెక్ట్ గా మొహం మీద చెప్పకపోతే ఏమైంది అంటుంది అప్పు. చెప్తేనే కదా ఇంకొంచెం బెటర్ గా చేసేది అని అంటుంది. వడిని అ దేవుడే కాపాడాలి అని మనసులో అనుకుంటుంది అప్పు.

Nuvvu Nenu Prema: పద్మావతి చేసిన పనికి తిప్పలు పడ్డ విక్కి అనుకున్నది ఒక్కటి అయినది ఇంకొకటి..పాపం పద్మావతి..

Brahmamudi Serial 27 october 2023 episode 238 highlights
Brahmamudi Serial 27 october 2023 episode 238 highlights
రాహుల్ ప్లాన్..

ఇక రుద్రాణి చెప్పినట్టు రాహుల్ ఆ టాబ్లెట్ ని జ్యూస్ లో కలుపుతూ ఉంటాడు. అక్కడే ఉన్న రుద్రాణి చూడు రాహుల్ దేవుడికి దండం పెట్టుకో, మనం అనుకున్నది సక్సెస్ అవ్వాలని అని అంటుంది రుద్రాణి. చేసేదేమైనా మంచి పనా సక్సెస్ అవ్వడానికి దేవుడికి దండం పెట్టుకోవడం ఎందుకు అని అంటాడు. చెప్పింది చెయ్ ముందు తీసుకువెళ్లి జ్యూస్ దానికి ఇవ్వు అని అంటుంది.ఇక రాహుల్ జ్యూస్ తీసుకుని వెళ్లి స్వప్నకి ఇస్తాడు నీకోసమే కష్టపడి చూసి తీసుకు వచ్చాను అంటాడు కష్టపడే ముందు నాకో మాట చెప్పచ్చు కదా అని అంటుంది స్వప్న. ఇప్పుడేమైంది నీకోసమే కదా కష్టపడింది అంటాడు రాహుల్. నీకు ఫ్రెష్ ఫ్రూట్ జ్యూస్ తాగడం ఇష్టం కదా, అందుకే చేసి తీసుకు వచ్చాను అంటాడు ఇష్టమే కానీ మోసంబి జ్యూస్ తాగడం మాత్రం ఇష్టం ఉండదు అంటుంది స్వప్న. అక్కడే రుద్రాణి అదంతా గమనిస్తూ ఉంటుంది. ప్లాన్ ఏమన్నా పాడు అవుతుందా ఏంటి అని మనసులో అనుకుంటూ ఉంటుంది ఇక అప్పుడే అక్కడికి కనకం ఎంట్రీ ఇస్తుంది. ఎలాగైనా రాహుల్ స్వప్నతో ఆ జ్యూస్ తాగించడానికి ప్రయత్నిస్తూ ఉంటాడు. కనకం అంత బతిమిలాడిచ్చుకుంటావేంటి తాగు అని అంటుంది. అల్లుడుగారు ప్రేమతో చేసి తీసుకొస్తే తాగను అంటావేంటి, ఇది నీ కోసం కాదు నీ కడుపులో ఉన్న బిడ్డ కోసం, వెంటనే షాక్ అవుతాడు రాహుల్. ఆ విషయం మీకు ఎలా తెలుసు ఆంటీ అని అంటాడు అదేంటి బాబు నువ్వు నీ బిడ్డ ఆరోగ్యం కోసమే కదా తెచ్చింది. అని అంటుంది కనకం అయినా స్వప్న తాగను అంటుంది బలవంతంగా కావాలని కనకం స్వప్న చేత జ్యూస్ తాగిస్తుంది.సొంత తల్లి కూతురి కడుపు పోవడానికి చేస్తున్న చూస్తుంటే చాలా సంతోషంగా ఉంది అని రుద్రాన్ని దూరం నుంచి చూసి అనుకుంటుంది రాహుల్ థ్యాంక్స్ ఆంటీ అని అంటాడు పర్లేదు అని కనకం అక్కడి నుంచి వెళ్ళిపోతుంది ఇక అనుకున్నంత సక్సెస్ఫుల్గా జరిగింది ఇక తెల్లవారేసరికి ఇంట్లో జరిగే రచ్చ చూడాలి అని మనసులో అనుకుంటాడు.

Nuvvu Nenu Prema: పద్మావతి చేసిన పనికి తిప్పలు పడ్డ విక్కి అనుకున్నది ఒక్కటి అయినది ఇంకొకటి..పాపం పద్మావతి..

Brahmamudi Serial 27 october 2023 episode 238 highlights
Brahmamudi Serial 27 october 2023 episode 238 highlights
రాజ్ తో కావ్య సరదా..

జండుబాం తీసుకుంటూ ఉంటాడు ఏదో ఒకసారి నడుం మీద రాశారు కదా అని ప్రతిసారి ఇంకా అలానే రాయించుకుంటాను ఏంటి అంటుంది కావ్య.మీరు ప్రతిసారి నా నడుము టచ్ చేయాలని ఇలా చేస్తున్నారా ఏంటి అంటుంది అంత సీన్ లేదు అంటాడు రాజ్. అవును నాకు తెలుసు అని అంటుంది కావ్య. నా నడుము పిడికెడు అయినంత మాత్రం మీరు టచ్ చేయాలని చూస్తే నేను ఎందుకు ఒప్పుకుంటాను అంటుంది. నేను చెప్పేది వినవే అంటాడు. నువ్వు అనుకున్నదే మాట్లాడతావు కానీ నేను చెప్పేది వినవా అని అంటాడు. ఇక నా నడుము గురించి మీరు మాట్లాడదాం అనుకుంటున్నారా అవన్నీ ఏమీ వద్దులేండి అంటుంది ఒసేయ్ ఎంతసేపు నువ్వు చెప్పిందే నా, అసలు నడుమ గోల ఏంటి నాకు తలకాయ నొప్పిగా ఉంటే నేను జండుబాం రాసుకుందాం అనుకున్నాను ఈలోపు నువ్వు వచ్చి నీ స్క్రిప్ట్ నువ్వు రాసేసుకుంటున్నావు అంటాడు రాజ్. అవునా తలకాయ నొప్పిగా ఉందా సరే ఇటు ఇవ్వండి మీ తలకు నేను బాంబ్ రాస్తాను అంటుంది ఏమీ అవసరం లేదు అంటాడు అదేంటి నాన్న నాకు నడుము నొప్పి అయితే మీరుబాంబ్ రాలేదా ఇప్పుడు మీకు తలనొప్పిగా ఉంటే నేను రాయకూడదా అని బలవంతంగా తలకి బాంబు రాస్తుంది కొంచెం రిలాక్స్ అవుతాడు రాజ్. నువ్వు నాకు బాంబ్రాసి నా నోరు మూసేలా చేస్తున్నావు పడుకో ఇంకా అంటాడు. రాజ్ లో మార్పు చూసి కావ్య మనసులో మీరు కొంచెం మారుతున్నారు అని అనుకుంటుంది. తలనొప్పి తగ్గిందా అంటుంది కావ్య తగ్గిందిలే పడుకో అంటాడు రాజ్. ఇక కావ్య కావాలని ఆటపట్టిస్తూ ఉంటుంది.అంతలో రాజా కోప్పడి కావిని పడుకోమంటాడు. కావ్య పడుకుంటుంది. ఇక కరెంటు పోతుంది అంతలో టార్చ్ కోసం వెతుకుతూ సెల్ఫోన్ ఎక్కడ పెట్టానో అని కావ్య నడుం మీద చెయ్యి వేస్తాడు రాజ్. వెంటనే కావ్య ఏమండీ మీరు మళ్ళీ నన్ను అడుగు మీద చెయ్యి వేశారు అంటే మీ మనసులో ఏదో ఉంది మీరు నన్ను భార్యగా ఒప్పుకుంటున్నారు అని ఉంటుంది ఇంతలో కరెంటు వస్తుంది సెల్ఫోన్ కోసం వెతుకుతూనే క్రమంలో నా చెయ్యి నీకు తగిలింది. అంతేకానీ నువ్వు ఊహించుకున్నట్టు ఏమి జరగదు పడుకో అంటాడు.

Krishna Mukunda Murari: కృష్ణే తప్పు చేసిందనీ అనుకుంటున్న భవాని.. మురారి కృష్ణ కి దూరం అవుతాడా.?

ఇక రాహుల్ ఆత్రుతగా ఎదురు చూస్తూ ఉంటాడు ఏంటి ఇంకా స్వప్న, కడుపునొప్పి అని అరవడం లేదు ఏంటి అని స్వప్ననే చూస్తూ ఉంటాడు. వెంటనే స్వప్న కళ్ళు తెరిచి చూసి ఏంటి రాహుల్ అని అంటుంది నువ్వు బానే ఉన్నావా అంటాడు ఏంటి నన్నే గమనిస్తున్నావు అని అడుగుతుంది స్వప్న ఏం లేదు నీకు అంతా బానే ఉందా అంటాడు నువ్వు నా మీద ఇంట్రెస్ట్ చూపించడం ఆపి పడుకో అని ఉంటుంది అయినా నాకేమవుతుంది అని అంటుంది అవును నీకేమీ అవదు నిన్ను నమ్ముకుంటే నీ చుట్టూ ఉన్న వాళ్ళకి ఏదో ఒకటి అవుతుంది మీకు మాత్రమే ఏమీ అవదు అంటాడు రాహుల్ కదా పడుకో అరవకుండా అంటుంది స్వప్న. ఇక రాహుల్ టెన్షన్ గా ఎప్పుడు ఏం జరుగుతుందో ఎప్పుడు స్వప్న కడుపు నొప్పిని అరుస్తుందో అని చూస్తూ ఉంటాడు

ఇక రేపటి ఎపిసోడ్లో కావ్య తలస్నానం చేసి తల తుడుచుకుంటూ ఉండగా రాజ్ అప్పుడే నిద్ర లేచి వెనక నుండి కావ్య ను చూసి చాలా బాగుంది అని అనుకుంటాడు. కావేని అలానే చూస్తూ రాజ్ రొమాంటిక్ ఫ్రీగా ఫీల్ అవుతాడు. వెంటనే వెనుక నుంచి కావ్యని వాటేసుకుంటాడు ఆ సీన్ చాలా బాగుంటుంది. ఇక కావ్య షాక్ అవుతుంది.. చూడాలి రేపటి ఎపిసోడ్లో నిజంగానే రాజ్ కావ్యని వాటేసుకున్నాడా లేదంటే కలగన్నదా కళావతి

Related posts

Satyadev: పగ కోసం మొక్కను చంపడం.. తమిళ్ హీరోయిన్ పై సత్యదేవ్ ఫైర్..!

Saranya Koduri

Vijay Devarakonda: విజయ్ దేవరకొండ పుట్టినరోజు నాడు ఫాన్స్ కి ఫుల్ మీల్స్.. రాబోయే మూడు సినిమాలు ఇవే..!

Saranya Koduri

Today OTT Releases: నేడు ఒక్కరోజే ఓటీటీలోకి వచ్చిన సూపర్ హిట్ మూవీస్ ఇవే..!

Saranya Koduri

This week OTT Releases: ఈ వారం ఓటీటీలోకి రానున్న 8 సినిమాలు ఇవే.. ప్రతి ఒక్కరి చూపు ఆ సినిమాపైనే..!

Saranya Koduri

Guppedantha Manasu: గుప్పెడంత మనసు సీరియల్ ఫేమ్ జ్యోతి రాయ్ ఆస్తుల విలువ ఎంతో తెలుసా..!

Saranya Koduri

Television Couple: తల్లిదండ్రులు కాబోతున్న మరో సీరియల్ జంట.. పోస్ట్ వైరల్..!

Saranya Koduri

Anchor Shyamala: యాంకర్ శ్యామలని చెప్పుతో కొట్టాలి.. శ్యామల పై నటుడు ఫైర్..!

Saranya Koduri

Dimple Kapadia: 15 ఏళ్లు వయసులోనే పెళ్లి, పిల్లలు.. బెడిసికొట్టిన వివాహం.. హాట్ టాపిక్ గా మారిన స్టార్ హీరోయిన్ లైఫ్ స్టైల్..!

Saranya Koduri

90’s Middle Class Biopic: 90’s మిడిల్ క్లాస్ బయోపిక్ హీరోయిన్ ఎలా మారిపోయిందో చూడండి..!

Saranya Koduri

Neethone Dance: కొట్టుకునేదాకా వెళ్ళిన సదా – అరియానా.. నువ్వెంత అంటూ ఒక్క మాటతో సదా పరువు గంగలో కలిపేసిందిగా..!

Saranya Koduri

Allu Arjun: అంద‌రి ముందు భార్య ప‌రువు తీసేసిన అల్లు అర్జున్‌.. స్నేహ గురించి అంత మాట‌న్నాడేంటి..?

kavya N

Karthika Deepam 2 May 9th 2024 Episode: శౌర్య తెలివితేటలకి.. గంగలో కలిసిపోయిన పారు ప్లాంన్స్.. బంటు ని చితకబాదిన కార్తీక్..!

Saranya Koduri

Prabhas: ప్ర‌భాస్ సినిమాల్లో ఆయ‌న త‌ల్లికి మోస్ట్ ఫేవ‌రెట్ మూవీ ఏదో తెలుసా.. బాహుబ‌లి మాత్రం కాదు!

kavya N

Vijay Deverakonda: విజ‌య్ దేవ‌ర‌కొండ ఫ్రీగా చేసిన సినిమాలేవి.. ఇండ‌స్ట్రీలో అత‌ని ఫ‌స్ట్ రెమ్యున‌రేష‌న్ ఎంత‌?

kavya N