Brahmamudi అక్టోబర్ 25 ఎపిసోడ్ 236: నిన్నటి ఎపిసోడ్ లో,రుద్రాణి కావాలనే రాజ్ అపర్ణ లకు మధ్య గొడవ పెడుతుంది. సుభాష్ రుద్రాణి మాటలు వినొద్దని అపర్ణకు చెబుతాడు. కొడుకు మీద రుద్రాణి అనుమాన పడుతుంది తల్లికి క్షమాపణ చెప్తాడు రాజ్. స్వప్న ఇంకా ఎన్నాళ్ళు ఈ నాటకం ఆడాలి అని అనుకుంటుంది. భర్తలో వచ్చిన మార్పు చూసి కావ్య హ్యాపీగా ఫీల్ అవుతుంది.
ఈరోజు 236 వ ఎపిసోడ్ లో రాజ్ రూంలో తన అంతరాత్మతో మాట్లాడుతూ ఉంటాడు. నువ్వు కాఫీని ప్రేమిస్తున్నావు అని అంటే లేదు నేను ప్రేమించట్లేదు అని అంటాడు. అంతరాత్మతో రాజు గొడవ పడుతూ పెద్దగా అరుస్తూ ఉంటాడు. నువ్వు కావిని ప్రేమిస్తున్నావండోనికి నా దగ్గర రుజువుంది అని అంటాడు అంతరాత్మ అయితే ఏంటో చెప్పు అని అంటాడు రాజ్ నువ్వు మీ అమ్మకు తెలియకుండా ఆ పనిమనిషిని ఇంటికి తీసుకొచ్చావు కదా అని అంటాడు అందులో నీకు ప్రేమ కనిపిస్తుందా అని అంటాడు రాజ్. ప్రేమ లేకపోతే ఎందుకు తీసుకొచ్చావు అని అంటే మానవత్వం కోసం అంటాడు రాజ్, మానవత్వం లేదు ఏమీ లేదు ప్రేమని ఒప్పుకొమ్మ అని అంటుంది అంతరాత్మ, రాజ్ నో అని అరుస్తూ ఉంటాడు. అప్పుడే అక్కడికి కావ్య వస్తుంది ఏంటండీ ఎవరితో మాట్లాడుతున్నారు అని అంటుంది ఏం లేదు ఫ్యాన్ తిరగట్లేదు స్విచ్ వేసుకోవడం మర్చిపోయాను అని నాలో నేనే అనుకుంటున్నాను అని కవర్ చేస్తాడు రాజ్.
పరుపు తెచ్చిన కష్టాలు..
ఇక రాజ్ కావ్యతో నాలో నేను ఏదో మాట్లాడుకుంటాను నువ్వు పడుకో అని అంటాడు ఏంటి ఏదో కంగారుగా ఉన్నారు అని అంటుంది కావ్య ఏం లేదు అంటాడు ఇంతలో ఎవరో తలుపు కడతారు కావ్య పరుపు వేసుకుంటూ ఉంటుంది. వెంటనే రాజ్ తలుపు కొట్టిన సౌండ్ విని కంగారు పడతాడు ఎవరో వచ్చినట్టున్నారు తలుపు తీయండి అని అంటుంది కావ్య,ఇంతలో అమ్మమ్మ గారు కావ్య తలుపు తీయమ్మ అని అంటుంది రాజు ఇంకా కంగారు పడతాడు నువ్వు పరుపేసుకోవడం చూస్తే అమ్మమ్మ గారు ఇంకేమైనా ఉందా అని పరుపు తీసి మడత పెట్టి ఇప్పుడే తలుపు తీయకు అని చెప్పి ఆ పరుపుని బాల్కనీలోకి తీసుకువెళ్లి కిందకి విసిరేసి ఏమీ తెలియనట్టు వచ్చి తలుపు వేసేసి ఇప్పుడు తలిపితే అని అంటాడు అప్పుడే కావ్య వెళ్లి తలుపుతీస్తుంది. అమ్మమ్మ గారు పాలు తీసుకోమ్మా అని అంటుంది. మీరు తెచ్చారు ఏంటండీ అని అంటుంది కావ్య పర్వాలేదు అమ్మ మీ తాతయ్య గారు ఆర్డర్ మీ ఇద్దరూ కలిసి తాగాలి అని అంటుంది సరే అమ్మమ్మ గారు అని అంటుంది కావ్య. ఏంటి వాడు టెన్షన్ గా తిరుగుతున్నాడు అని అడుగుతుంది ఇందిరా దేవి తిన్నది అరక్క అని అంటుంది కావ్య అదేంటి తిన్నది అరగలేదా అని అంటుంది అమ్మమ్మ గారు అదేనండి ఇందాక తిన్న అన్నం అరక అటు ఇటు తిరుగుతున్నారు అంటుంది కావ్య. రాజ్ కోపంగా కావ్య వైపు చూస్తాడు. ఇక ఇందిరా దేవి సరే ఈ పాలు తాగు రా వేడిగా తిన్నది ఏదైనా అరిగిపోతుంది అని చెప్పి కావ్యకు పాలు ఇచ్చేసి వెళ్లిపోతుంది. రాజు ఒక గంట నుంచి బయటపడ్డాము అని అనుకుంటాడు
రాజ్ ని ఆటపట్టించిన కావ్య..
ఇక అమ్మమ్మ గారు వెళ్ళిపోయిన తర్వాత కావ్య నా పరుపు ఎక్కడా అని అడుగుతుంది. అవును మర్చిపోయాను నీ పరుపు ఏం చేశాను అని రాజ్ ఆలోచించి నేను ఇప్పుడే తీసుకొస్తాను ఇక్కడే ఉండు అని అంటాడు. మీరు కావాలనే నా పరుపుని తీసేశారు కదా అని అంటుంది కావ్య. అసలు నా పరుపు ఎక్కడా అని అంటే పైనుంచి పడేసాను అని అంటాడు. మనం విడివిడిగా పడుకోవడం మీకు ఇష్టం లేదు కదా అందుకని ఇలా చేశారు అబద్ధం చెప్పకండి అని అంటుంది. మీ గుండె లభకు చెప్పక్కని కొట్టుకుంటుంది కదా అని అంటుంది కావ్య. చి చివరకు నేను ఏదో కంగారులో పడేస్తే నువ్వు ఇలాంటివన్నీ చెప్పకు అంటాడు రాజ్నేనెందుకు కావాలని తీసేస్తాను అని అంటాడు నామీద ఇష్టంతో మీరు అలా చేసి ఉంటారు ఇద్దరం కలిసి ఉండడానికే కదా ఇదంతా చేశారు అని అంటుంది. చి చి అలాంటివేమి మనసులో పెట్టుకోకు అని అంటాడు రాజ్, నాకు తెలిసింది మీరు కావాలనే చేశారు అని అంటుంది మీ పరుపు నీకు తీసుకొచ్చి ఇస్తాను అన్నాను కదా అంటాడు రాజ్, ఎలాగైనా కావేక పరుపు తీసుకొచ్చి ఇవ్వాలని రాజ్ కిందకి వెళ్లి పరుపు తీసుకురావడానికి వెళుతూ ఉండగా ఇంట్లో కుటుంబ సభ్యులందరూ హాల్లో కూర్చుని ఉంటారు.
ప్రకాష్ కోసం ధన్యాలక్ష్మి బాధ..
ఇక ధన్యాలక్ష్మి హాల్లో కూర్చొని ప్రకాష్ కనిపించట్లేదని ఏడుస్తూ ఉంటుంది. అసలే అమాయకుడు వాకింగ్ చేస్తానని వెళ్లి ఇల్లు తప్పిపోయి ఎటో వెళ్లిపోయి ఉంటారు అని ఏడుస్తూ ఉంటుంది. అపర్ణ అలా ఎలా వెళ్తాడు ఇంటికి వస్తాడు కదా రోజు చేసే వాకింగ్ కదా ఎక్కడికి మర్చిపోడు లే అని ధాన్యలక్ష్మి ఓదారుస్తూ ఉంటుంది కానీ ధాన్యలక్ష్మి మాత్రం అతను అమాయకుడు ఎటు వెళ్ళాడో ఏంటో అసలు నోట్లో వేలు పెడితే కొరకలేదు నీ అంత అమాయకుడు నా భర్త నాకు తెలుసు ఈయన వెళ్ళిపోయాడు అని బాధపడుతూ ఉంటుంది. ఇదంతా రాజ్ కిందకి వస్తువు వింటూ ఉంటాడు. వామ్మో నేను పైనుంచి పరుపు కిందకు వేస్తే అది బాబాయ్ మీద పడిందా ఏంటి అని అనుమానం వచ్చి, పైకెళ్ళి చూస్తాడు అప్పుడే అక్కడ ప్రకాష్ కిందపడి ఉండడం గమనిస్తాడు రాజ్, వామ్మో బాబాయ్ అని చెప్పి మళ్ళీ కిందకు వచ్చేటప్పటికి లక్ష్మి ఏడుస్తూ ఉంటుంది.రాజ్ ఏమైంది పిన్ని అని అడుగుతాడు మీ బాబాయ్ కనిపించట్లేదు రా అని అంటుంది రుద్ర అని ఏ అమ్మాయితో వెళ్ళాడు అని అంటుంది, మీ అబ్బాయి లాగా మా ఆయన అలాంటివాడు కాదు అని అంటుంది ధాన్యలక్ష్మి రుద్రా నీతో, అయినా ఎప్పుడూ ఏ టైంలో ఎలా మాట్లాడాలో నీకు తెలియదా అని అంటుంది అపర్ణ రుద్రా నీతో, రాజ్ బాబాయ్ ఎక్కడైనా చూసావా అంటుంది అపర్ణ దేవి చూశాను అని అంటాడు రాజ్.ఎక్కడ చూసావ్ అని అంటారు ఇంట్లో వాళ్ళు ఇందాకే డైనింగ్ టేబుల్ దగ్గర భోజనం చేసేటప్పుడు చూసాను కదా అంటాడు అప్పుడు కాదు ఇప్పుడు చూసావా అని అంటుంది అపర్ణ. నేను తీసుకొస్తాను కదా నువ్వు ఏడ మాకు అని వాళ్ళ పిన్నికి బెదిరించి అక్కడి నుంచి రాజు వెతకడానికి వెళ్తాడు. వీడేంటి ఏదో తేడాగా ఉన్నాడు అని రుద్రాణి అనుమానిస్తుంది రాజ్ ని, ఇక రాజ్ బయటకు వెళ్లి ప్రకాష్ ని చూసి అయ్యో ఈ పరుపు వేసేదానికి నువ్వు ఇక్కడికి ఎలా వచ్చావు బాబాయ్ అయినా ఈ పరుపు వల్ల చాలా ఇబ్బందులు వచ్చేటట్టు ఉన్నాయి ఇప్పుడు ఇంట్లో వాళ్ళు వచ్చి చూస్తే ఎక్కడిది అని అంటే ఏం చెప్తాము అని ఈ పరుపును పూర్తిగా తొలగించుకోవాలి అని దాన్ని తీసి బయట పడేసి వాళ్ళ బాబాయ్ నీ లేపుతూ ఉంటాడు.
స్వర్గంలో ఉన్నాను అన్న ప్రకాష్..
ఇక ఎంతసేపటికి ప్రకాష్ లేవకపోతే పక్కనే ఉన్న నీళ్లను తీసుకొచ్చి ప్రకాష్ మీద పోస్తాడు రాజ్ బాబాయ్ లేస్తాడు. ప్రకాష్ లేచి నేను ఇప్పుడు ఎక్కడ ఉన్నాను అని అంటాడు స్వర్గంలో ఉన్నావ్ అని అంటాడు రాజ్ అవునా స్వర్గంలో ఉన్నానా అయితే మరి రంబ ఎక్కడ అని అంటాడు ఇంట్లో ఏడుస్తుంది అని అంటాడు రాజ్ అయితే ఆధారంగా దగ్గరికి తీసుకెళ్తాను అని రాజ్ ఇంట్లోకి తీసుకొని వెళ్తాడు ప్రకాష్ ని, ప్రకాశం చూసి ఇంట్లో వాళ్లంతా ఎక్కడికి వెళ్లారు అని అడిగితే ప్రకాష్ స్వర్గానికి వెళ్లాను అని చెప్తాడు ప్రకాష్ కి పూర్తిగా స్పృహలోకి రాడు. స్వర్గానికి వెళ్లడం ఏంటి అని అంటుంది అపర్ణాదేవి. అయినా రాజ్ ఎక్కడ దొరికాడు బాబాయ్ అని అంటుంది అపర్ణాదేవి బాల్కనీలో పడుకుని ఉన్నాడమ్మా వాకింగ్ అని చెప్పి నిద్రపోతున్నాడు అని అంటాడు రాజ్,అదేంటి ఇందాకే కదా నేను బాల్కనీలో చూసి వచ్చాను అక్కడ లేడు కదా అంటుంది లక్ష్మి నువ్వు ఒకవైపు చూసావు పిన్ని ఇంకోవైపు ఉన్నాడు బాబాయ్ అని అంటాడు రాజ్, మొత్తానికి ప్రకాష్ దొరికినందుకు ఇంట్లో వాళ్లంతా హ్యాపీగా ఫీల్ అవుతాడు ఇక ఇందిరాదేవి ప్రకాష్ ని లోపలికి తీసుకెళ్ళమని ధన్యలక్ష్మికి చెబుతుంది.
కావ్య తో రాజ్ తిప్పలు..
ఇక కావ్య గదికి వస్తాడు రాజ్ కావ్య ఏది అని అంటుంది అదే ఏంటి అని అంటాడు రాజ్. అదే నా పరుపు ఎక్కడా అని అంటుంది చుట్టూ బయట విసీరిసాను ను అని అంటాడు. ఒక్కదాని ఒక్క పరుపుని మీరు అలా చేస్తే ఇప్పుడు నా పరిస్థితి ఏంటి అని అంటుంది మరి ఏం చేయమంటావు అది బాబాయ్ నెత్తిన పడింది ఇంట్లో వాళ్ళు చూస్తారు ఏమో అని కంగారేసి బయటపడేసాను అని అంటాడు. మీ అంతరార్థం మొత్తం నాకు అర్థం అయిపోయింది అని అంటుంది కావ్య అయితే ఏంటో అని అంటాడు రాజ్..మీరు చేసిన చర్య వెనక కచ్చితంగా ఏదో స్వార్థం ఉంది మనిద్దరం కలిసి పడుకోవాలని కదా పరుపు తీసేసావు. దేవుడా మనసే లేని చోట వయసే గుర్తురానిచోట పర్వం పదిలంగా ఉండలేని చోట నిద్దరం కలిసి ఒకే బెడ్ మీద అది ఉత్తరమ్, దక్షిణం పడమర తూర్పు లాగా పడుకోవాలంటే ఎలా భగవంతుడా అని అంటుంటే రాజ్ ఏం మాట్లాడుతున్నావే అని అంటాడు. మా కళ్యాణ్ గాడి దగ్గర కాపీ కొట్టావా ఏంటి అని అంటాడు. మీకు అర్థం కాదు లెండి నా బాధ ఇప్పుడు పరుపు లేకుండా నేను ఎలా పడుకోవాలి అని అంటుంది. మా బాబాయ్ తోనే నా బుర్రంతా తిరిగిపోయింది ఇప్పుడు నీ అర్థం కాని కవితలతో నన్ను అల్లాడించకే తల్లి అని అంటాడు రాజ్. దేవుడు లేని పూజ నీళ్ళు లేని పూజ చక్రపాకం లో లేని మడత కాజా ఇలా ఏవేవో చెప్తూ ఉంటే నువ్వు ఇక నుంచి వెళ్ళిపో అని అంటాడు. కావ్య నిజమే అనుకోను అక్కడి నుంచి వెళుతూ ఉంటుంది ఎక్కడికి వెళ్తున్నావ్ అంటాడు ఇక్కడ పడుకోలేను కదా ఇంకో చోటికి వెళ్లి పడుకుంటాను అని అంటుంది. అయితే నేను తాతయ్య ఇక్కడికి పంపించి నేను వెళ్ళి అమ్మమ్మగారి గదిలో పడుకుంటాను అంటుంది ఒసేయ్ అంత పని చేయకే తల్లి నీకు దండం పెడతాను ఇక్కడే పడుకో అని అంటాడు రాజ్. కావాలనే రాజుని చాలాసేపు ఆట పట్టిస్తుంది కావ్య.వద్దులెండి ఎందుకు అని ఉంటుంది ఏం అవసరం లేదు పడుకో అని కావాలనే కావ్య ని తన దగ్గర పడుకోమని చెప్తాడు ఇద్దరు ఒకే మంచం మీద పడుకుంటారు.
రేపటి ఎపిసోడ్ లో స్వప్న శ్రీమంతానికి పంతులు గారితో ముహూర్తం పెట్టిస్తూ ఉంటారు. పంతులుగారు శుక్రవారం మంచిదని చెప్తాడు శుక్రవారం రోజు స్వప్నకు శ్రీమంతం చేస్తున్నాము అంటుంది ఇందిరా దేవి. అదంతా కావ్య అక్కడే ఉండి చూస్తూ వీళ్ళని నేను కూడా మోసం చేయడం ఎంత వాడికి కరెక్టు వీళ్ళకి నిజం చెప్పేయాలి అని అనుకుంటుంది. ఇక స్వప్నకి కడుపు లేదన్న విషయం ఇంట్లో వాళ్లకు చెప్పడానికి కావ్య సిద్దపడి మీ అందరికీ నేను ఒక విషయం చెప్పాలి అని అంటుంది. స్వప్న ఒక్కసారిగా షాక్ అవుతుంది తల్లో ఇది ఎక్కడ నిజం చెబుతుందో అని, చూడాలి రేపు రేపటి ఎపిసోడ్లో కావ్య నిజం చెప్పిందా ఇంట్లో వాళ్లకి లేదా అని