Prema Entha Madhuram October 25th Episode 1082: జలంధర్ అలా మాట్లాడగానే ఉషాకి కోపం వచ్చి ఏంట్రా ఏం వాగుతున్నావ్ ముందు నువ్వు ఇక్కడి నుంచి బయటికి వెళ్ళు లేదంటే మా అన్నయ్య వస్తే నీ సంగతి చూస్తాడు అని ఉషా అంటుంది. అవునా ఎక్కడమ్మా మీ అన్నయ్య మరి పిలువు అని జలంధర్ అంటాడు. నా కొడుకు ఇప్పుడు ఇంట్లో లేడు రా రేపు ఇదే టైం కి రా నా కొడుకు పొగరుని పరిచయం చేస్తాను అప్పుడు చూద్దువు గాని నా కొడుకు అంటే ఏంటో అని గర్వంతో చెబుతుంది సుగుణ.

సరే అలాగే రేపు ఇదే టైం కి వస్తాను నీ కొడుకు పొగరును చూస్తాను ఏం చేస్తాడో అది కూడా చేస్తాను అని జలంధర్ అక్కడి నుండి వెళ్ళిపోతాడు. కట్ చేస్తే ఆర్య ఇంట్లో మీటింగ్ లో పాల్గొని వాళ్లకు ప్రాజెక్టు గురించి అంత వివరంగా చెప్తూ ఉంటాడు. ఇంతలో సుగుణ ఫోన్ చేసి బాబు అన్నం తిన్నావా ఎక్కడున్నావ్ నాన్న అని అంటుంది. ఇప్పుడే ఆఫీస్ నుంచి బయలుదేరాను అమ్మ ఇంట్లోకి సరుకులు తీసుకొద్దామని బజారుకు వచ్చాను అని ఆర్య అంటాడు. సరే నాన్న రేపు ఇంకొక ఆర్డర్ కూడా వచ్చింది ఆ లిస్ట్ కూడా చెపూతను తీసుకురా సూర్య నువ్వు అన్నం బయట తినకు నాన్న నీకు ఇష్టమని పప్పు టమాట వంకాయ వేపుడు ఆలుగడ్డ ఫ్రై చేశాను ఇంటికి వచ్చాక అందరం కలిసి తిందాము డబ్బులు పోతే పోయాయి గాని నువ్వు ఆటో ఎక్కి రా అని సుగుణ అంటుంది.

అలాగే అమ్మ అని ఆర్య ఫోన్ కట్ చేస్తాడు. చూసావా జెండి ఆ అమ్మ ప్రేమ ఎంత అదృష్టవంతుడో చూడు తన తల్లి ప్రేమను పొందలేకపోయాడు అని ఆర్య అంటాడు. ఎవరి కర్మకు ఎవరు బాధ్యులు ఆర్య అక్కడ మీటింగ్ లో అందరూ వెయిట్ చేస్తున్నారు పదా అని జెండి అంటాడు. ప్రాజెక్టు వర్క్ గురించి ఆఫీస్ వాళ్ళతో మాట్లాడి ఆర్య వెళ్ళిపోతూ ఉండగా ఆకాంక్ష ఫోన్ చేసి ఏంటి ఫ్రెండ్ చాలా బిజీ అయిపోయినట్టున్నావ్ మాతో మాట్లాడలేనంత బిజీ అయిపోయావా అని అంటుంది.అదేమీ లేదమ్మా ఏదో కొత్త వర్క్ వచ్చింది అందుకే కొంచెం బిజీ ఇప్పుడు ఏంటి మిమ్మల్ని కలవాలా సరే వస్తున్నాను ఉండండి అని ఆర్య అంటాడు. అన్నయ్య ఫ్రెండ్ వస్తున్నాడంట ఇప్పుడు అమ్మని ఎలా ఒప్పించడం అని ఆకాంక్ష అంటుంది.

నేను చెప్పినట్టు చెయ్ చెల్లి అమ్మే బయటకు పంపిస్తుంది అని అభయ్ అక్కి ఎంత పని చేసావు హోంవర్క్ చేయకపోతే రేపు మేడం నిన్ను కొడుతుంది కదా ఇప్పుడు ఎలా బుక్కు ఎందుకు మర్చిపోయావు అసలు నీకు భయం ఉందా అని అభయ్ కోప్పడుతూ ఉంటాడు. ఇంతలో వాళ్ళ అమ్మ వచ్చి ఏంటి నాన్న చెల్లిని అంత కోపంగా తిడుతున్నావ్ ఏం చేసింది అని అను అంటుంది. ఏమీ లేదమ్మా చెల్లి తన ఫ్రెండ్ దగ్గర హోంవర్క్ చేసుకునే బుక్కు మర్చిపోయి వచ్చిందట ఇప్పుడు ఎలా హోంవర్క్ చేసుకుంటుంది రేపు మేడం కొట్టదా ఈమధ్య దీనికి భయం లేదమ్మా చెప్పిన మాట వినట్లేదు అని అభయ్ అంటాడు. అమ్మ పొద్దున హడావుడిలో మర్చిపోయానమ్మా దానికే చూడు అన్నయ్య ఎలా తిడుతున్నాడు అని ఆకాంక్ష ఏడుస్తున్నట్టు నటిస్తుంది. దానికి ఎందుకమ్మా ఏడవడం మీ ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి వెళ్లి బుక్కు తెచ్చుకో అని అను అంటుంది. అయితే అన్నయ్యను కూడా తోడుకు తీసుకువెళ్తానమ్మ అని ఆకాంక్ష అంటుంది.

సరే ఇద్దరూ వెళ్లి రండి త్వరగా రండి జాగ్రత్తగా రోడ్డు మీద నడవండి అని అను అంటుంది. అన్నయ్య పదరా అమ్మ వెళ్ళమంటుంది అని ఆకాంక్ష వాళ్ళ అన్నయ్యని తీసుకొని వెళ్తుంది. కట్ చేస్తే ఆర్య రోడ్ పక్కన పిల్లల కోసం ఎదురు చూస్తూ ఉంటాడు. ఆర్యనే ఫాలో అవుతున్న మానస కారు లో నుంచి ఆర్య ఏం చేస్తున్నాడు ఎవరి కోసం ఎదురు చూస్తున్నాడు అని చూస్తూ ఉంటుంది. ఇంతలో పిల్లలు వచ్చి హాయ్ ఫ్రెండు అని ఆకాంక్ష అంటుంది. ఎవరితో మాట్లాడుతున్నాడు అని మానస చూసేసరికి పిల్లలు కనిపిస్తారు ఇంకా ఆర్య పిల్లలతో మాట్లాడుతూనే ఉన్నాడా రోజు వీళ్లను కలుస్తూ ఉంటే ఏదో ఒక రోజు వాళ్ళ పిల్లలు అని తెలిసిపోతుంది అప్పుడు అను కూడా ఎక్కడ ఉందో తెలిసిపోతుంది అప్పుడు అందరూ ఒకటైపోతారు అలా జరగనివ్వకూడదు అని మానస అనుకుంటుంది.
ఏంటి పిల్లలు ఎలా ఉన్నారు బాగా చదువుకుంటున్నారా ఎగ్జామ్ లో ఎన్ని మార్కులు వచ్చాయి అని ఆర్య అంటాడు. బాగానే ఉన్నాము ఫ్రెండ్ నాకైతే ఫస్ట్ క్లాస్ వచ్చింది మా చెల్లికి థర్డ్ క్లాసు వచ్చింది అని అంటాడు అభయ్. అవునా కంగ్రాజులేషన్స్ కానీ నన్ను ఎందుకు కలవాలి అనుకున్నారు చెప్పండి మీకేం కావాలి అని ఆర్య అంటాడు. నాకు నాన్న కావాలి ఫ్రెండ్ అని ఆకాంక్ష అంటుంది. అవును ఫ్రెండ్ మాకు మా నాన్న కావాలి మా అమ్మని అడిగితే ఏమీ చెప్పట్లేదు ఆఫీస్ పని మీద వేరే కంట్రీ కి వెళ్ళాడు అని చెప్తుంది ఏమి అడిగినా ఏడుస్తుంది ఫ్రెండ్ చెల్లెమ్మ స్కూల్లో వాళ్ళ ఫ్రెండ్స్ వాళ్ళ నాన్నతో ప్రేమగా ఉండడం చూసి ఏడుస్తూ ఉంటుంది అందుకే నువ్వు మాకు సహాయం చేస్తే మా నాన్నని వెతికి తెచ్చి మా అమ్మని నాన్నని కలుపుతావ అప్పుడు మేము ఒక ఫ్యామిలీ అయిపోయి హ్యాపీగా ఉంటాము అని ఆభయ్ అంటాడు.

అవును ఫ్రెండ్ ఎలాగైనా సరే నువ్వే హెల్ప్ చెయ్యాలి అమ్మని నాన్నని కలపాలి లేదంటే మాకు ఏడుపొస్తుంది ఈ ఒక్క హెల్ప్ చేసి పెడతావా ఫ్రెండ్ అని ఆకాంక్ష అంటుంది. తప్పకుండా చేస్తానమ్మా మీ నాన్న ఏ కంట్రీస్లో పనిచేస్తాడు అడగండి మీ నాన్న పేరు ఏంటో అడగండి అని ఆర్య అంటాడు.మా నాన్న గురించి మాకు ఏమీ తెలియదు ఫ్రెండ్ అమ్మని అడిగితే నాన్న పేరు చెప్పదు కానీ మా అమ్మకి నాన్న అంటే చాలా ఇష్టం నాన్ననే తలుచుకొని ఏడుస్తూ ఉంటుంది కానీ నాన్న మాత్రం చాలా మంచోడు అని అమ్మ ఎప్పుడూ చెబుతూ ఉంటుంది ఎలాగైనా మా డాడీ ని వెతికి పెట్టు ఫ్రెండ్ అని ఆభయ్ అంటాడు. మీ నాన్న ఎక్కడున్నా సరే వెతికి తెచ్చి మిమ్మల్ని డాడీని కలుపుతాను అని ఆర్య అంటాడు. థాంక్యూ ఫ్రెండ్ అని ఆకాంక్ష అంటుంది. అయితే ఇప్పుడు పార్టీ చేసుకోవాల్సిందే ఏం తిందాం అని ఆర్య అంటాడు. పానీ పూరి తిందాం అని పిల్లలు అనగానే ఆర్య పానీ పూరి తెచ్చి పిల్లలకు తినిపించి తను వెళ్ళిపోతాడు.ఛాయా మానసికి ఫోన్ చేసి ఆర్య ఏం చేస్తున్నాడో తెలిసిందా అని అంటుంది. ఇప్పుడే ఒక బస్తీలో కారు ఆపి మళ్ళీ అదే మాసిపోయిన బట్టలు వేసుకొని కూరగాయ సంచి తీసుకొని బస్తీ లోపలికి వెళ్తున్నాడు అని మానస అంటుంది.. దీనితో ఈరోజు ఎపిసోడ్ ముగి