NewsOrbit
Entertainment News Telugu TV Serials

Nuvvu Nenu Prema January 27 2024 Episode 531: అత్తింట్లో అడుగు పెట్టిన పద్మావతి.. విక్కీ నీ కొట్టిన అరవింద.. కృష్ణ ప్లాన్ సక్సెస్..

Nuvvu Nenu Prema Today Episode January 27 2024 Episode 531 Highlights

Nuvvu Nenu Prema January 27 2024 Episode 531: పద్మావతి చాలాసేపు గుడి దగ్గర కూర్చొని ఇక పంతులుగారు ఎంతసేపని ఇక్కడ కూర్చుంటావమ్మా అని అడగడంతో అక్కడి నుంచి బయలుదేరి పద్మావతి ఒంటరిగా వెళ్తూ చంద్రప్రసాద్ కి కనబడుతుంది చంద్రప్రసాద్ పద్మావతిని ఏమైందని అడగ్గా పద్మావతి ఏదో బాధలో ఉందని అర్థం చేసుకుంటాడు పద్మావతి ఏ విషయం చెప్పకపోవడంతో ముందు మనం ఇంటికి వెళ్లి మాట్లాడుకుందాం అని చంద్రప్రసాద్ తన ఇంటికి తీసుకు వెళ్తాడు. ఇష్టం లేకపోయినా పద్మావతి బలవంతంగా చంద్రప్రసాద్ ఇంటికి వెళ్తుంది.

Nuvvu Nenu Prema Today Episode January 27 2024 Episode 531 Highlights
Nuvvu Nenu Prema Today Episode January 27 2024 Episode 531 Highlights

అను చాలా టైం అయింది ఇంకా పద్మావతి నిద్రలేవలేదని పద్మావతి కోసం గదిలోనికి వెళుతుంది అక్కడ పద్మావతి కనిపించకపోవడంతో చాలా కంగారుపడుతుంది చాలా సేపు పద్మావతి కోసం వెతికి ఎక్కడ పద్మావతి కనిపించలేదని సెక్యూరిటీని అడుగుతుంది. సెక్యూరిటీ రాతిరి నుండి పద్మావతి ఇంటికి రాలేదమ్మా, విక్కీ మాత్రమే ఇంటికి వచ్చాడు రాత్రి పద్మావతిని తీసుకురాలేదు అని సెక్యూరిటీగా చెప్తాడు ఆ మాటలకు అనుషాక్ అవుతుంది. మరి పద్మావతి ఎక్కడికి వెళ్ళింది అని అడిగితే నాకు తెలియదు అమ్మ పొద్దున్నుంచి పద్మావతి నేను చూడలేదు అని చెప్తాడు దాంతో అను కంగారుపడి ఇంట్లోకి వచ్చి వాళ్ళ అమ్మకి ఫోన్ చేస్తుంది పద్మావతి ఎక్కడ ఉంది అని అడుగుతుంది ఇక్కడికి రాలేదా మీ ఆయన ఏమైంది అని అడుగుతుంది పార్వతి పద్మావతి కనిపించట్లేదు అమ్మ అని చెప్తుంది దానికి పార్వతి చాలా కంగారుపడుతుంది.

Nuvvu Nenu Prema Today Episode January 27 2024 Episode 531 Highlights
Nuvvu Nenu Prema Today Episode January 27 2024 Episode 531 Highlights

ఇక పార్వతీ కంగారుగా ఎక్కడికి వెళ్లింది మీ పద్మావతి అని అడిగితే రాత్రి విక్కీ పద్మావతి ఇద్దరూ రెస్టారెంట్ కి వెళ్లారు. తర్వాత పద్మావతి ఇంటికి రాలేదు విక్కి మాత్రమే వచ్చాడు అని చెప్పడంతో ఏమైందోనని ఇంట్లో వాళ్ళు కంగారు పడతారు ఈ మాటలు, అను పార్వతి తో చెప్పడం అరవింద కూడా వింటుంది అరవింద పద్మావతి ఇంటికి రాలేదని తెలుసుకొని చాలా బాధపడుతుంది ముందు అను నీ విషయం మొత్తం కనుక్కుంటుంది దానికి పద్మావతి ఇంతవరకు నిద్ర లేవలేదని రూంలోకి వెళ్లాను వదిన అక్కడ పద్మావతి లేకపోవడంతో సెక్యూరిటీని అడిగితే రాత్రి పద్మావతి ఇంటికి రాలేదని చెప్పారు అప్పటిదాకా నాకు కూడా తెలియదు అని అంటుంది అను, అంటే వికీ మాత్రమే వచ్చాడా రాత్రి రెస్టారెంట్ నుంచి అని అడుగుతుంది. అరవింద ఏమో వదిన అని అంటుంది అను దాంతో అరవింద చాలా కంగారుపడుతుంది అసలు పద్మావతి రాత్రి నుండి ఇంటికి రాకుండా ఎక్కడికి వెళ్లినట్టు ఏమైనట్టు అసలు పద్మావతికి ఏమన్నా అయిందా అని చాలా బాధపడుతూ ఉంటుంది ఇక ఇంట్లో కుటుంబ సభ్యులందరూ కూడా అరవింద దగ్గరికి వస్తారు.

Nuvvu Nenu Prema Today Episode January 27 2024 Episode 531 Highlights
Nuvvu Nenu Prema Today Episode January 27 2024 Episode 531 Highlights

ఇక మరోవైపు పద్మావతి నీ చంద్రప్రసాద్ తన ఇంటికి తీసుకువెళ్లి మొహమాట పడకమ్మా లోపలికి రా అని అంటాడు. పద్మావతి కుడికాలు పెట్టి లోపలికి వెళుతుంది చంద్రప్రసాద్ చాలా సంతోషిస్తాడు కోడలు మొదటిసారి ఇంటికి వచ్చినందుకు చాలా పొంగిపోతాడు పద్మావతిని లోపలికి తీసుకువెళ్లి జ్యూస్ తీసుకువచ్చి ఇస్తాడు. పద్మావతి తో ఇది నీళ్లు అనుకోమా నువ్వు చాలా ఫ్రీగా ఉండొచ్చు ఇక్కడ నీకు ఏ ఇబ్బంది కలగదు అని చెప్తాడు అప్పుడే అక్కడికి శ్వేత వస్తుంది శ్వేత డాడీ ఎవరిని పడితే వారిని ఇంట్లోకి తీసుకువస్తావా అని అంటుంది మీ ఇద్దరికీ ముందే పరిచయం ఉందా అని అడుగుతాడు ప్రసాద్ దానికి పద్మావతి ఒకసారి గుడిలో కలిశాము అని చెప్తుంది ఆ మాటలకు శ్వేత ఇలాంటి వాళ్ళతో మాట్లాడటం కూడా నాకు నచ్చట్లేదు అని చెప్తుంది. అలా అనకమ్మ పద్మావతి ఎవరో కాదు నీకు వదిన అని అంటాడు. ఆ మాటలకు శ్వేతా పద్మావతి ఇద్దరు షాక్ అవుతారు అప్పటివరకు పద్మావతి కూడా అది వాళ్ళ అత్త ఇల్లు అని చంద్ర ప్రసాదు విక్కీ తండ్రి అని తెలియదు. దాంతో వెంటనే, అదేనమ్మా పద్మావతి నీకు వదిన లాంటిది అని చెప్తున్నాను అంటాడు. దానికి వెంటనే శ్వేత నాకు ఎవ్వరూ లేరు నాకు నువ్వు నీకు నేను తప్ప మనకి ఏ బంధుత్వాలు బంధువులు లేరు అని చెప్పేసి లోపలికి వెళ్ళిపోతుంది. చంద్ర ప్రసాద్ పద్మావతి తో నువ్వు శ్వేత మాటలు ఏం పట్టించుకోకమ్మ తన అలానే మాట్లాడుతుంది తండ్రి పెంపకంలో పెరిగింది కదా ఎవరితో ఎలా మాట్లాడాలో దానికి తెలీదు అని అంటాడు.

Nuvvu Nenu Prema Today Episode January 27 2024 Episode 531 Highlights
Nuvvu Nenu Prema Today Episode January 27 2024 Episode 531 Highlights

ఇక అరవింద చాలా కంగారు పడుతూ ఉంటే విక్కీ అప్పుడే ఆఫీస్ నుంచి వస్తాడు పద్మావతి ఎక్కడ అని అడుగుతుంది దానికి విక్కీ సమాధానం చెప్పడు నేను నిన్ను నమ్మి ఒక ఆడపిల్ల నీతో పంపించాను తను వెళ్ళనన్నా తను సంతోషంగా ఉంటుందని నీతో పంపిస్తే నువ్వు ఇవాళ అమ్మాయిని రాత్రిపూట ఒంటరిగా వదిలిపెట్టి ఇంటికి వచ్చావా ఇదేనా నేను నీకు నేర్పిన సంస్కారం అయినా ఆ అమ్మాయికి ఏమన్నా జరగరాని జరిగితే ఈ ఇంటిల్లిపాది ఎంత బాధ పడతారు నీకు తెలుసా అయినా న కడుపులో పెరుగుతున్న బిడ్డ గురించైనా ఆలోచించావా? ఆ ఉసురు తనకు కూడా తగులుతుందని నీకేమన్నా అర్థం అయిందా అని అంటూ ఉంటే కృష్ణ అక్కడే ఉండి ఇది కదా నాకు కావాల్సింది ఇప్పుడు నేను వేసిన ప్లాన్ సక్సెస్ఫుల్గా అయింది. అక్క తమ్ముడు ఇద్దరు గొడవ పడుతుంటే ఎంత ఆనందంగా ఉందో అని అనుకుంటూ ఉంటాడు. ఇక పద్మావతి ఎక్కడికి వెళ్లిందో తెలియదు ఇంటికి తీసుకురావాలని కుదరదు ఇక ఇంట్లో ఆ బాధతో పద్మావతి రాలేదని అరవింద చనిపోతుంది దాంతో విక్కీ మనస్థాపానికి గురవుతాడు ఇక నేను అనుకున్నది సక్సెస్ఫుల్గా జరిగి ఈ ఆస్తంతా నా చేతిలోకి రావడమే ఇక మిగిలింది అని ఊహించుకుంటూ ఉంటాడు. పద్మావతి ఎక్కడికి వెళ్ళింది నిన్నే అడుగుతుంది సమాధానం చెప్పు అని అరవింద గట్టిగా అడుగుతుంది ఇంట్లో వాళ్ళందరూ కూడా అడగడంతో నారాయణ కూడా అడగడంతో ఇక విక్కి ఏం చేయాలో తెలియక పద్మావతికి నాకు రాత్రి రెస్టారెంట్లో గొడవ అయింది పద్మావతి ఎక్కడికో వెళ్లిపోయింది అని చెప్తాడు ఆ మాటలు అరవిందకు బాగా కోపం వచ్చి విక్కీని చంప మీద కొడుతుంది దాంతో ఇంట్లో అందరూ కూడా ఆశ్చర్యపోతారు. ఒక ఆడపిల్లని రాత్రిపూట గొడవైందని వదిలిపెట్టేసి వచ్చేస్తావా తను ఎక్కడికి వెళ్లిందో నీకు తెలియదా ఎలా చెప్తున్నా విక్కీ మాటలో అసలు నువ్వు నా తమ్ముడువేనా అని అంటే అక్క అని ఏదో విక్కి చెప్పబోతుంటే అలా పిలవద్దు నువ్వు నల పిలవాలి అంటే ముందు వెళ్లి పద్మావతిని తీసుకురా అని అంటుంది. మా ఇంట్లో వాళ్ళు కూడా పద్మావతి ఎక్కడికి వెళ్ళింది అని టెన్షన్ పడుతున్నారు అండి అని అను చెప్పడంతో చూసావా విన్నావా ఒక ఆడపిల్ల కనిపించకపోతే రెండు కుటుంబాల్లో ఎంత అలజడి సృష్టిస్తున్నావని నీకు అర్థం అవుతుందా ఇదంతా నీవల్లే జరిగింది విక్కీ నిన్ను నమ్మియా పద్మావతిని పంపించాను ఇప్పుడు నువ్వు పద్మావతి తిరిగి ఇంటికి రావాలి అని విక్కిని బయటికి వెళ్ళమని చెప్తుంది. పద్మావతిని తీసుకొని లోపలికి రా లేదంటే రేపు ఉదయం నేను ఇంట్లో నుంచి వెళ్ళిపోతాను అని అరవింద డెడ్ లైన్ పెడుతుంది. చేసేదేం లేక విక్కీ బయటకి వెళ్తాడు.

Nuvvu Nenu Prema Today Episode January 27 2024 Episode 531 Highlights
Nuvvu Nenu Prema Today Episode January 27 2024 Episode 531 Highlights

ఇక పద్మావతి రెడీ అయ్యి ఇక నేను వెళ్ళిపోతాను పెద్ద సారు అని చంద్రప్రసాద్ తో చెబుతుంది అదేంటమ్మా ఇప్పుడేగా వచ్చావు భోజనం చేసి వెళ్ళు గానివి అని అంటాడు దానికి పద్మావతి లేదు సారు నేను వెళ్ళిపోవాలి అని అంటుంది కుదరదు నువ్వు ముందు అన్నం తిన్న తర్వాతే ఏదైనా మాట్లాడదాం పద అని చంద్రప్రసాద్ బలవంతంగా డైనింగ్ టేబుల్ దగ్గర తీసుకువెళ్లి కూర్చోబెడతాడు. ఇక శ్వేత అప్పుడే అక్కడికి వస్తుంది చంద్రప్రసాద్ తో పద్మావతి మీరు చాలా మంచి మనసు గలవారు అని అంటే నాదేముందమ్మా నువ్వు కూడా చాలా మంచి దానివి అని అంటాడు. అప్పుడే వచ్చిన శ్వేత ఇదంతా విని చాలా కోపంగా ఉంటుంది చంద్రప్రసాద్ రా మనం కూడా కూర్చొని శ్వేతతో అంటాడు అడ్డమైన వాళ్లతో భోజనం చేయడం నాకు ఇష్టం ఉండదు నాన్న అని పనిమనిషిని నా రూమ్ కి భోజనం తీసుకురా అని చెప్పేసి వెళ్ళిపోతుంది చిన్నపిల్లకధమ్మ దాని మాటలు పట్టించుకోవద్దు అని చంద్రప్రసాద్ పద్మావతికి నచ్చచెప్తాడు. నువ్వు అసలే బాధలో ఉన్నావు బాదం చెప్పట్లేదు కనీసం ఆకలిని కూడా దాచాలని చూస్తున్నావా ముందు భోజనం చెయ్యి అని అనడంతో పద్మావతి సరే అంటుంది.

రేపటి ఎపిసోడ్లో విక్కీ పద్మావతి దగ్గరికి వచ్చి ఇంటికి వెళ్దాం పద అని చెయ్యి పట్టుకుంటాడు పద్మావతి చేయి విదిలించుకొని ఏ రోజైతే నా ప్రేమకు మీరు వెలగట్టి చెక్ నాకు ఇచ్చారో ఆ రోజుతోనే ఆ ఇంటికి నాకు సంబంధం తెగిపోయింది ఇకమీదట నేను ఆ ఇంటికి రాను మీకు నాకు సంబంధం లేదు అని చెప్తుంది. విక్కీ అక్కడ్నుంచి వెళ్ళిపోతాడు. పద్మావతి బాధగా కూర్చుని ఏడుస్తూ ఉంటుంది.

Related posts

Big flop Movie: బిగ్గెస్ట్ ఫ్లాప్ గా నిలిచిన భారీ బడ్జెట్ మూవీ.. మొత్తం బాలీవుడ్ ని ముంచేసిన మూవీ ఇది..!

Saranya Koduri

Dhe Celebrities Special 2: ఢీ సెలబ్రిటీ స్పెషల్ 2 కి సరికొత్త హోస్ట్.. ఈసారి డబల్ కిక్..!

Saranya Koduri

Swathi Chinukulu: మళ్లీ వస్తున్న ” స్వాతి చినుకులు ” సీరియల్.. ఆనందంలో ఫ్యాన్స్..!

Saranya Koduri

Elections Results 2024: మూవీ థియేటర్స్ లో ఎన్నికల ఫలితాల లైవ్.. ఆ సిటీలో బుకింగ్స్ కూడా స్టార్ట్..!

Saranya Koduri

OTT: థియేటర్ రిలీజ్ కంటే ముందే ఓటీటీలోకి వచ్చేసిన ఆస్కార్ విన్నింగ్ మూవీ.. ఎక్కడ చూడొచ్చంటే..!

Saranya Koduri

Big Boss 8: బిగ్ బాస్ 8 కి కంటెస్టెంట్లు సిద్ధం.. ఈసారి కొత్త రూల్స్ తో మరింత ఎంటర్టైన్మెంట్..!

Saranya Koduri

Kiccha Sudeep: కిచ్చా సుదీప్ కూతురిని ఎప్పుడైనా చూశారా.. అందంలో హీరోయిన్ల‌కే పోటీ ఇస్తుంది..!!

kavya N

Karthika Deepam 2 June 1st 2024 Episode: కాంచనకు నిజం నిర్మోహమాటంగా చెప్పమంటున్న కావేరి.. కార్తీక్ కి దగ్గరయ్యేందుకు జో ప్రయత్నాలు..!

Saranya Koduri

Paruvu Web Series: నివేత తో చిరు కుమార్తె వెబ్ సిరీస్.. స్ట్రీమింగ్ ఎందులో అంటే..!

Saranya Koduri

Shoban Babu: శోభన్ బాబు అసలు హీరో అయ్యే వాడే కాదా?.. మొహమాట పడకుండా జరిగింది చెప్పేసిన సూపర్ స్టార్..!

Saranya Koduri

Bujji And Bhairava OTT: ఓటీటీలో దుమ్ము రేపుతున్న బుజ్జి అండ్ భైరవ.. థియేటర్ రిలీజ్ కంటే ముందే మనోడు డిజిటల్ లో అదరగొడుతున్నాడుగా..!

Saranya Koduri

Amulya Gowda: బాలు తో రొమాన్స్ చేస్తుంటే.. కల్లప్పగించి చూస్తున్నారు.. అమూల్య గౌడ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ ‌..!

Saranya Koduri

Most Expensive TV Show: అత్యధిక బడ్జెట్ కలిగిన టీవీ షో ఇదే.. ఒక్కో ఎపిసోడ్ కి ఏకంగా అన్ని కోట్లు ఖర్చు..!

Saranya Koduri

Keerthy Suresh: కీర్తి సురేష్ చేతిలోకి మ‌రో క్రేజీ ప్రాజెక్ట్‌.. మ‌హాన‌టి అస్స‌లు త‌గ్గ‌ట్లేదుగా..!?

kavya N

Pranitha Subhash: సిగ్గు లేదా అంటూ ప్ర‌ణీతపై మండిప‌డుతున్న నెటిజ‌న్లు.. అంత పెద్ద త‌ప్పు ఏం చేసింది..?

kavya N