NewsOrbit
Entertainment News Telugu TV Serials

Prema Entha Madhuram January 27 2024 Episode 1163: ఆర్యకి అను భర్త ఫోటో మార్చి పంపించిన మానసి వాళ్ళ మనిషి…

Prema Entha Madhuram Today Episode January 27 2024 Episode 1163 Highlights

Prema Entha Madhuram January 27 2024 Episode 1163: నేను పోలీస్ స్టేషన్ కి వస్తాను సార్ కానీ ఈ ఒక్క రోజు నన్ను వదిలేయండి అని బ్రతిమలాడుతుంది అను. ఆవు పులి కథ చెప్తున్నావా అని అంటాడు ఎస్సై. పంతులు వచ్చి, అమ్మాయి అలాంటిది కాదు సార్ తన కష్టాల నుండి బయట పడడానికి తను దీక్ష చేస్తుంది అని చెప్తాడు. ఏంటి పూజారి ఈ దొంగతనంలో నీకెంత కమిషన్ ఉంది అని అంటాడు ఎస్సై. అను చెప్తున్న వినకుండా వాళ్లు బలవంతంగా లాక్కెళ్తారు అప్పుడు వాళ్ళ దగ్గర నుండి కత్తి కింద పడుతుంది. అది చూసి అను మీరు పోలీసులు కాదు మీరు ఎందుక నా దీక్షను భంగం చేస్తున్నారు మీరు పోలీసులైతే మీ ఐడీలు చూపించండి అని అడుగుతుంది.ఆ రౌడీలు తనని బలవంతంగా లాక్కు వెళ్తారు.అది చూసి అక్కడున్న వాళ్లంతా వాళ్ళని కొడతారు. అను అక్కడి నుంచి వెళ్ళిపోతుంది.

Prema Entha Madhuram Today Episode January 27 2024 Episode 1163 Highlights
Prema Entha Madhuram Today Episode January 27 2024 Episode 1163 Highlights

సాయంత్రం రాధని దివ్యని పెళ్లికూతురు చేయాలి తర్వాత నిన్ను కూడా పెళ్లి కొడుకుని చేయాలి ఇక్కడ ఏర్పాట్లు అన్ని యాదగిరి చూసుకుంటున్నాడు నువ్వు వెళ్లి విడితి ఏర్పాట్లు చూడు అని అంటుంది సుగుణ. నేను వస్తున్నాను అని అంటాడు ఆర్య. ఏ ఇన్ఫర్మేషన్ వచ్చిన నాకు వెంటనే ఫోన్ చేయండి అని నీరజ్ వాళ్లతో అంటాడు ఆర్య. కట్ చేస్తే, సుగుణ రాధ కోసం ఎదురు చూస్తుంది. సుగుణ పెళ్లి కూతుర్ని రెడీ చేయడానికి దంచిన పసుపు ఎక్కడుంది అని ముత్తైదులు అడుగుతారు. అది సుగుణ వినిపించుకోకుండా రాధ కోసం ఎదురుచూస్తుంది. అమ్మ వాళ్ళు పసుపు అడుగుతుంటే పట్టించుకోవేంటి అని అడుగుతుంది జ్యోతి. ఎందుకు పట్టించుకుంటుంది అక్క ఆ రాధ ఇంకా వచ్చిందా రాలేదా అని ఎదురుచూస్తుంది అని అంటుంది దివ్య. ఇక్కడ నన్ను పెళ్లికూతుర్ని చేయాలని ఏర్పాట్లు జరుగుతుంటే నువ్వు ఎందుకు అలా ఎడమొహం పెడమొహంగా ఉన్నావు అని అడుగుతుంది దివ్య.

Prema Entha Madhuram Today Episode January 27 2024 Episode 1163 Highlights
Prema Entha Madhuram Today Episode January 27 2024 Episode 1163 Highlights

దివ్య ఏంటి ఇలా అందరి ముందు అరుస్తున్నావ్ నువ్వు వెళ్లి రెడీ అవ్వు నిన్నే ముందు రెడీ చేస్తాం అని అంటుంది జ్యోతి. రాధ వచ్చాక మొదలు పెడదాం అని అంటుంది సుగుణ. నాకు తెలసు అమ్మ నువ్వు ఈ మాట అంటావని ఏ ముహూర్తాన ఈ పెళ్లికి ఒప్పుకున్నానో కాని ఒకటి కూడా సరిగ్గా టైం కి జరగలేదు, రేపు నా సంసారం కూడా ఇలాగే తగలబడుతుందేమో అని అంటుంది దివ్య.దివ్య ఏంటిది నీకు నువ్వు శాపనార్థాలు పెట్టుకుంటున్నావు అని అంటుంది సుగుణ. నా బతుకు అలా తగలడింది ఏం చేయమంటావు, అక్క నన్ను పెళ్లి కూతుర్ని రెడీ చేయాల్సిన అవసరం లేదు రేపు డైరెక్ట్ గా పెళ్లి పీటల మీద కూర్చుంటాను తాళి మాత్రం కట్టించండి చాలు జరగాల్సిన తంతులన్ని ఆవిడకే చేయండి అని అంటుంది దివ్య. అభి అక్కి వచ్చి ,అమ్మ రాకపోయినా పర్వాలేదు మీరు దివ్య అక్కని పెళ్లి కూతుర్ని చేయండి అని సుగుణకి చెప్తారు.మీరు రికమండేషన్ నాకు అవసరం లేదు అని అంటుంది దివ్య.

Prema Entha Madhuram Today Episode January 27 2024 Episode 1163 Highlights
Prema Entha Madhuram Today Episode January 27 2024 Episode 1163 Highlights

ఎవరు మాట్లాడకండి జ్యోతి నువ్వు దివ్యని పెళ్లికూతురిని చెయ్యి నేను వెళ్లి రాధని తీసుకొని వస్తాను అని వెళ్తుంది సుగుణ. ఆర్య శాండీ కారులో వస్తూ ఉంటారు. ఏమైంది హరి ఆలోచిస్తున్నావ్ అని అడుగుతాడు శాండీ. నేనెప్పుడూ ఇంత కన్ఫ్యూజ్ కాలేదు శాండీ ఈ విషయంలో మాత్రం ఏదో తెలిసిందే తెలియనట్టు ఉండడం అని అంటాడు ఆర్య. నీరజ్ ఆర్య కి ఫోన్ చేసి కాసేపట్లో ఫోటో వస్తుంది అది మీకు నేను వాట్సాప్ చేస్తాను అని అంటాడు. సరే అని ఫోన్ కట్ చేస్తాడు ఆర్య. కెనడి బయటకి వెళ్ళిపోతాడు. మానసి వాళ్ళ మనిషి వచ్చి మీ ముగ్గురిని కెనడి గారు ఎందుకో అర్జెంటుగా రమ్మంటున్నారు అని వాళ్ళని బయటికి పంపించేస్తాడు. తన దగ్గరున్న ఫోటోని ఆర్యకి పంపిస్తాడు. అది చూసి శాండీ ఇతనే రాధ వాళ్ళ భర్త కావచ్చు అని అంటాడు. ఇది రాధ గారిని అడిగి తెలుసుకోవాలి అని అంటాడు ఆర్య. నేను తనకి ఫోన్ చేసి అడుగుతాను అని అనుకి ఫోన్ చేస్తాడు ఆర్య. తను ఫోన్ ఎత్తడం లేదు తను ఎక్కడుంటుందో నాకు తెలుసు శివాలయం కి వెళ్దాం పద అని అంటాడు ఆర్య.అను చివరి రోజు దీక్ష పూర్తి చేసి దీపం వెలిగిస్తుంది.

Prema Entha Madhuram Today Episode January 27 2024 Episode 1163 Highlights
Prema Entha Madhuram Today Episode January 27 2024 Episode 1163 Highlights

స్వామి దీక్షను పూర్తి చేశాను ఇకనైనా నా కష్టాలను తొలగించి ముఖ్యంగా ఆర్య గారిని కాపాడు అని అంటుంది. ఇంతలో అనుని దీక్ష చేయమని చెప్పిన గురువు గారు అక్కడికి వస్తారు. గురువు గారు మీరు చెప్పినట్టే చేశాను నేను అనుకున్నది జరుగుతుందా అని అడుగుతుంది. నువ్వు చేయాల్సింది చేసావు కొంచెం సహనంతో వేచి ఉండు దాని ప్రతిఫలం వస్తుంది అని చెప్తారు గురువు గారు. నేను కోరుకున్నది జరగబోయే పెళ్లి ఆగాలని అని అంటుంది అను. నువ్వు అనుకున్నది నీకు మంచి జరుగుతుందని నీకు ఎలా తెలుసు అది ఆ భగవంతుడికి తెలుసు నీకు ఏం కావాలో అని అడగకు నీకు ఏది తగినదో అది అడుగు అది నీకు కచ్చితంగా ఆయన ఇస్తాడు అని గురువుగారు చెప్తారు.సుగుణ వచ్చి అనుని ఏమైంది అని అడుగుతుంది.ఆర్య వాళ్లు గుడికి వచ్చి అనుని వెతుకుతారు.నీ దీక్ష పూర్తి అయిపోయినట్టే కదా ఇంటికి వెళ్దాం పద అని అంటుంది.

Prema Entha Madhuram Today Episode January 27 2024 Episode 1163 Highlights
Prema Entha Madhuram Today Episode January 27 2024 Episode 1163 Highlights

రాధ నిన్ను ఒకటి అడుగుతాను చెప్తావా అని అంటుంది సుగుణ. అడగండి ఆంటీ అని అంటుంది అను. ఇంత కఠినమైన దీక్ష ఎందుకు చేసావ్ అమ్మ నువ్వు ఏది చేసిన నీ పిల్లల కోసం చేస్తావని తెలుసు సూర్యతో నీ పెళ్లి కూడా పిల్లల మంచి కోసమే కదా అని అంటుంది సుగుణ. సుగుణకి ఏం సమాధానం చెప్పాలో తెలియక ఆలోచిస్తుంది అను. ఆర్య సుగుణను ఆర్యను చూసి వాళ్ళ దగ్గరికి వెళ్తాడు. ఆర్యని చూసిన సుగుణ సూర్య నువ్వు ఇక్కడ ఏం చేస్తున్నావ్ అని అడుగుతుంది. రాధ గారిని ఒకటి అడగడానికి వచ్చానమ్మ అని అంటాడు ఆర్య. ఆర్య ఆ స్కెచ్ తీసి అనుకి చూపించి ఇతను మీ భర్త అని అడుగుతాడు.

Related posts

Satyadev: పగ కోసం మొక్కను చంపడం.. తమిళ్ హీరోయిన్ పై సత్యదేవ్ ఫైర్..!

Saranya Koduri

Vijay Devarakonda: విజయ్ దేవరకొండ పుట్టినరోజు నాడు ఫాన్స్ కి ఫుల్ మీల్స్.. రాబోయే మూడు సినిమాలు ఇవే..!

Saranya Koduri

Today OTT Releases: నేడు ఒక్కరోజే ఓటీటీలోకి వచ్చిన సూపర్ హిట్ మూవీస్ ఇవే..!

Saranya Koduri

This week OTT Releases: ఈ వారం ఓటీటీలోకి రానున్న 8 సినిమాలు ఇవే.. ప్రతి ఒక్కరి చూపు ఆ సినిమాపైనే..!

Saranya Koduri

Guppedantha Manasu: గుప్పెడంత మనసు సీరియల్ ఫేమ్ జ్యోతి రాయ్ ఆస్తుల విలువ ఎంతో తెలుసా..!

Saranya Koduri

Television Couple: తల్లిదండ్రులు కాబోతున్న మరో సీరియల్ జంట.. పోస్ట్ వైరల్..!

Saranya Koduri

Anchor Shyamala: యాంకర్ శ్యామలని చెప్పుతో కొట్టాలి.. శ్యామల పై నటుడు ఫైర్..!

Saranya Koduri

Dimple Kapadia: 15 ఏళ్లు వయసులోనే పెళ్లి, పిల్లలు.. బెడిసికొట్టిన వివాహం.. హాట్ టాపిక్ గా మారిన స్టార్ హీరోయిన్ లైఫ్ స్టైల్..!

Saranya Koduri

90’s Middle Class Biopic: 90’s మిడిల్ క్లాస్ బయోపిక్ హీరోయిన్ ఎలా మారిపోయిందో చూడండి..!

Saranya Koduri

Neethone Dance: కొట్టుకునేదాకా వెళ్ళిన సదా – అరియానా.. నువ్వెంత అంటూ ఒక్క మాటతో సదా పరువు గంగలో కలిపేసిందిగా..!

Saranya Koduri

Allu Arjun: అంద‌రి ముందు భార్య ప‌రువు తీసేసిన అల్లు అర్జున్‌.. స్నేహ గురించి అంత మాట‌న్నాడేంటి..?

kavya N

Karthika Deepam 2 May 9th 2024 Episode: శౌర్య తెలివితేటలకి.. గంగలో కలిసిపోయిన పారు ప్లాంన్స్.. బంటు ని చితకబాదిన కార్తీక్..!

Saranya Koduri

Prabhas: ప్ర‌భాస్ సినిమాల్లో ఆయ‌న త‌ల్లికి మోస్ట్ ఫేవ‌రెట్ మూవీ ఏదో తెలుసా.. బాహుబ‌లి మాత్రం కాదు!

kavya N

Vijay Deverakonda: విజ‌య్ దేవ‌ర‌కొండ ఫ్రీగా చేసిన సినిమాలేవి.. ఇండ‌స్ట్రీలో అత‌ని ఫ‌స్ట్ రెమ్యున‌రేష‌న్ ఎంత‌?

kavya N