The Railway Men Review: “ది రైల్వే మెన్” వెబ్ సిరీస్ నెట్ ఫ్లిక్స్ ఓటిటిలో విడుదల కావడం జరిగింది. సుమారు 36 సంవత్సరాల క్రిందట మధ్యప్రదేశ్ లోని భోపాల్ లో గ్యాస్ లీకేజ్ ఘటనలో పదివేల మంది మరణించడం జరిగింది. డిసెంబర్ రెండవ తారీకు అర్ధరాత్రి భోపాల్ లో యూనియన్ కార్బైడ్ పరిశ్రమ నుంచి విషవాయువులు వెలువడ్డాయి. ఈ ప్రమాదం అప్పట్లో వేలాదిమందిని పొట్టన పెట్టుకుంది. ప్రపంచవ్యాప్తంగా సంభవించిన పారిశ్రామిక ప్రమాదాలలో భోపాల్ గ్యాస్ లీకేజ్ ఘటన అత్యంత ప్రమాదకరమైనది. ఈ ప్రమాదంలో వెలువడిన 40 టన్నుల విషవాయువుల తీవ్రత మూడు రోజులపాటు కొనసాగటంతో భారీ ఎత్తున ప్రాణ నష్టం జరిగింది. ఈ ఘటన కారణంగా ఆ విషవాయువు పిల్చినా సమయంలో పదివేల మంది మరణించారు. ఆ తర్వాత క్రమేపి 25వేల మందికి పైగా మృత్యువాత పడ్డారు. ప్రత్యక్షంగా లేదా పరోక్షంగా సుమారు 2 లక్షల మంది జీవనంపై ప్రమాదం పెను ప్రభావం చూపించింది. అటువంటి ఈ దుర్ఘటన ఆధారం చేసుకుని యశ్ రాజ్ ఫిలింస్ “ది రైల్వే మెన్” అనే వెబ్ సిరీస్ తెరకెక్కించారు. నవంబర్ 18వ తారీకు నెట్ ఫ్లిక్స్ లో విడుదల చేశారు. మొత్తం నాలుగు ఎపిసోడ్ లతో విడుదల చేయగా తెలుగు డబ్ వర్షాన్ కూడా అందుబాటులో ఉంది.

స్టోరీ:
1984లో దేశాన్ని కూదిపేసిన భోపాల్ లీక్ గ్యాస్ ఘటన ఆధారం చేసుకుని తీసిన ఈ వెబ్ సిరీస్ లో.. ప్రమాదానికి ముందు గ్యాస్ లీక్ పరిశ్రమ నుండి ఎలా లీక్ అయ్యింది..? ఆ సమయంలో నలుగురు రైల్వే ఉద్యోగులు ఎలా కాపాడారు.. అనేది చాలా ఉత్కంఠ భరితంగా చూపించారు. వాస్తవికత ఆధారంగా ఆ సమయంలో ప్రమాదం జరిగిన ప్రదేశంలో రైల్వే ఉద్యోగులు పలువురిని కాపాడిన లైన్ ని తీసుకున్న డైరెక్టర్ శివ్ రవాలీ ప్రజల ప్రాణాలను కాపాడే తీరును అద్భుతంగా చూపించారు. ఇందులో మాధవన్.. కీలక పాత్ర పోషించడం జరిగింది. ఇక ఇదే సమయంలో మాధవన్ తో పాటు కేకే మీనన్, దివ్యేందు శర్మ, ఇర్ఫాన్ ఖాన్ కుమారుడు బాబిల్ ఖాన్ ముఖ్యపాత్రలో నటించారు. సెంట్రల్ రైల్వే జనరల్ మేనేజర్ రతీ పాండే(మాధవన్), స్టేషన్ మాస్టర్ గా(కేకే మీనన్), కానిస్టేబుల్ గా(దివ్యేందు), లోకో పైలట్ (బాబిల్ ఖాన్).. భోపాల్ విషవాయువుల గ్యాస్ లీకేజ్ ఘటన జరిగిన రోజు రాత్రి.. ధైర్యంగా.. ఈ నలుగురు ప్రజలను కాపాడటానికి చేసిన సాహసోపేతమైన పోరాటం “ది రైల్వే మెన్” కథ.
విశ్లేషణ:
పరిశ్రమలో జరిగిన ప్రమాదాన్ని కళ్ళకి కట్టినట్లు అద్భుతంగా చూపించారు. అంతేకాదు ఆ పరిశ్రమలో పనిచేసే కార్మికుల జీవన శైలిని కూడా వాస్తవికతను గుర్తు చేసేలా సన్నివేశాలు బాగా ఆకట్టుకుంటాయి. ప్రమాదానికి 12 గంటల ముందు పరిశ్రమ చుట్టుపక్కల వాతావరణం ఇంకా.. మూడు గంటల ముందు వాతావరణం తర్వాత.. ప్రమాదం సంభవించాక ఫ్యాక్టరీలో చోటు చేసుకున్న వాతావరణన్ని దర్శకుడు శివ్ రవాలీ అద్భుతమైన టేకింగ్ తో కథను బాగా నడిపించారు. ప్రేక్షకుడిని కథకు కనెక్ట్ చేసేలా డైరెక్టర్ పనితనం నెక్స్ట్ లెవెల్ అని చెప్పవచ్చు. జనాలు ఎలా ఎఫెక్ట్ అయ్యారు..? ఎలా చనిపోయారు..? వంటి సన్నివేశాలు రియలేస్టేక్ గా ఉంటాయి. మొత్తం నాలుగు ఎపిసోడ్లు అయినా గాని ప్రతి ఎపిసోడ్ కేవలం 40 నుంచి 50 నిమిషాలు ఉండటంతో మీడియం సైజు వెబ్ సిరీస్ అని చెప్పవచ్చు. పాత్రల విషయానికొస్తే.. ఎవరికివారు తమ పాత్రకి న్యాయం చేశారు. 1984 సమయంలో ఫ్యాక్టరీ మరియు ప్రజల జీవన విధానం అదేవిధంగా రైల్వే సెట్ బాగా ఆకట్టుకోవడం జరిగింది. ముఖ్యంగా బ్యాక్ గ్రౌండ్ స్కోర్ మ్యూజిక్ తో పాటు సినిమాటోగ్రఫీ సినిమాకి బాగా ప్లస్ అయింది. స్టార్టింగ్ మూడు ఎపిసోడ్ లలో కొన్ని అనవసరమైన సన్నివేశాలు పెట్టి.. కాస్త పొడిగించే ప్రయత్నం చేసినట్లు అనిపించింది. గ్యాస్ లీకేజ్, ఈ నలుగురు రైల్వే ఉద్యోగులు కాపాడే ప్రయత్నం కాకుండా కొన్ని అనవసరమైన విషయాలపై దర్శకుడు ఫోకస్ పెట్టినట్లు మొదటి మూడు ఎపిసోడ్లలో ప్రేక్షకులకు ఫీల్ కలుగుద్ది. అంతవరకు మినహా వెబ్ సిరిస్ మొత్తం ఫీల్ గుడ్ తరహాలో మానవీయ కోణంలో చూపించారు.