This week OTT Releases: చూస్తూ చూస్తూ ఉండగానే మార్చ్ నెల వెళ్ళిపోయింది. ఏప్రియల్ తొలి వారంలోకి అడుగుపెట్టేసాం. ఎన్ని నెలలు వారాలు మారినప్పటికీ మనం మాత్రం సినిమాలను చూడడం అస్సలు ఆపము. ప్రతివారం ఓటీటీలోకి ఏ విధమైన సినిమాలు వస్తున్నాయో తెలుసుకుంటూ వాటిని చూసేందుకు ఇంట్రెస్ట్ చూపిస్తాము. ఇక ఏప్రిల్ తొలి వారంలోనే ఓటీటీలోకి కొన్ని ఇంట్రెస్టింగ్ సినిమాలు మరియు వెబ్ సిరీస్ లో రాబోతున్నాయి. ఏప్రియల్ ఒకటి నుంచి ఏప్రిల్ 7 మధ్య వివిధ ఓటీటిల్లో రిలీజ్ కానున్న సినిమాలు మరియు సిరీస్ ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.
1. లంబసింగి (హాట్ స్టార్):
గత నెలలో రిలీజ్ అయిన లంబసింగి మూవీ 20 రోజుల్లోనే ఓటీటీలోకి వచ్చేస్తుంది. ఈ మూవీ మంగళవారం అనగా ఏప్రిల్ 2 నుంచి డిజిని ప్లస్ హాట్ స్టార్ లో రిలీజ్ కానుంది. బిగ్బాస్ ఫేమ్ దివి ఈ మూవీలో ముఖ్యపాత్ర పోషించింది.
2. భీమా(హాట్ స్టార్):
గోపీచంద్ హీరోగా నటించిన ఈ మూవీ గత నెల ఎనిమిదవ తారీఖున థియేటర్లోకి వచ్చింది. బాక్స్ ఆఫీస్ వద్ద అంతగా సక్సెస్ కాలేకపోయినా ఈ మూవీ నెలలోపే ఓటీటీలోకి వచ్చేస్తుంది. ఈ శుక్రవారం అనగా ఏప్రిల్ ఐదు నుంచి హాట్స్టార్ లో ఈ మూవీ స్ట్రీమింగ్ కానుంది.
3. హనుమాన్ (హాట్ స్టార్):
హనుమాన్ మూవీ ఇటీవలే రెండు ఓటీటీలో రిలీజ్ అయిన సంగతి తెలిసిందే. తెలుగు మరియు హిందీ వెర్షన్ ను జీ5 , జియో సినిమాలో రిలీజ్ చేయగా మిగిలిన కన్నడ, తమిళ్, మలియాల్ భాషల్లో శుక్రవారం అనగా ఫిబ్రవరి 5 నుంచి హాట్స్టార్లో రిలీజ్ చేయనున్నారు.
4. ఫారి( జీ5):
గత ఏడాది థియేటర్లో రిలీజ్ అయిన మూవీ నే ఫారీ. ప్రస్తుతం ఈ మూవీ జీ5 ఓటిటిలోకి వస్తుంది. ఏప్రిల్ 5వ తేదీ నుంచి ఈ మూవీ స్ట్రీమింగ్ కి రానున్నట్లు తెలుస్తుంది. స్కూల్లో చీటింగ్ రాకెట్ చుట్టూ తిరిగే కథతో ఈ మూవీ రూపొందింది.
5. ఫ్యామిలీ ఆజ్ కల్ (సోనీ లీవ్):
ఫ్యామిలీ ఆజ్ కాల్ వెబ్ సిరీస్ బుధవారం అనగా ఏప్రిల్ 3 నుంచి సోనీ లీవ్ ఓటీడీలో స్ట్రీమింగ్ కానున్నాయి. ఓ టాక్సీ డ్రైవర్ ను ప్రేమించే మధ్యతరగతి యువతి.. ఆమె ఫ్యామిలీ చుట్టూ తిరిగే కాథే ఈ మూవీ.
6. యే మేరే ఫ్యామిలీ 3(మినీ టీవీ):
ఈ సిరీస్ నుంచి వచ్చిన రెండు సీజన్లు ఐఎండీబీ లో అత్యధిక రేటింగ్స్ సొంతం చేసుకున్నాయి. ఇక ఇప్పుడు మూడో సీజన్ రాబోతుంది. ఈ సీజన్ సరికొత్త గా గురువారం అనగా ఏప్రిల్ నాలుగు నుంచి అమెజాన్ మినీ టీవీలో స్ట్రీమింగ్ కానుంది.
ఇలా ఏప్రియల్ మొదటి వారంలో మంచి మంచి కథాంశాలను ప్రేక్షకులకు అందించేందుకు ముందుకు వచ్చాయి పలు ఓటిటి ఫ్లాట్ ఫారంస్. ఇక వీటిలో ప్రతి ఒక్కరి ధ్యాస హనుమాన్ మరియు బీమా పైనే ఉంది. ఈ రెండు సినిమాలు కూడా కొంచెం పేరు ఉన్న సినిమాలు కావడంతో ప్రతి ఒక్కరూ వీటి కోసం ఎదురుచూస్తున్నారు.