NewsOrbit
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్ రాజ‌కీయాలు

గుంటూరు కోటీశ్వ‌రుల పోరులో విన్న‌ర్ ఎవ‌రు…?

గుంటూరు జిల్లాలో 3 పార్ల‌మెంటు స్థానాలు ఉన్నాయి. గుంటూరు, న‌ర‌స‌రావుపేట‌. ఈ రెండు లోక్‌సభ స్థానాల్లోనూ ఇద్ద‌రు క‌మ్మ నేత‌లు టీడీపీ నుంచి పోటీ చేస్తున్నారు. ఒక బీసీ నేత వైసీపీ నుంచి ఒక కాపు నాయ‌కుడు వైసీపీనుంచి పోటీ చేస్తున్నా రు. వీరి మ‌ధ్య రాజ‌కీయం జోరుగా సాగుతోంది. ఇదే స‌మ‌యంలో ఈ న‌లుగురు అభ్య‌ర్థులు ఆస్తుల్లో కూడా పోటీపడుతున్నారు. గుంటూరు పార్ల‌మెంటు స్థానంలో ఇద్దరు కోటీశ్వరుల మధ్య పోటీ నువ్వానేనా అనేట్లు ఉంది…

వైసీపీ తరఫున గుంటూరు లోక్‌సభకు పోటీచేస్తున్న పొన్నూరు ఎమ్మెల్యే కిలారు రోశయ్యకు రూ. 81 కోట్ల ఆస్తి ఉండగా…15 కోట్ల విలువైన అప్పులు ఉన్నాయి. అలాగే 4 కోట్ల విలువైన వ్యవాయ భూములు ఉండగా…30కోట్ల విలువైన ఇల్ల స్థలాలు ఉన్నాయి. గుంటూరులో ధియేటర్లు, గోదాములు, దుకాణాలు అన్నీ కలిపి కమర్షియల్ బిల్డింగ్‌ల ఆస్తి విలువ మరో 26 కోట్లకు ఉంది. గుంటూరులో ఉన్న ఇళ్ల విలువై మరో 8 కోట్లు ఉంటుంది. మొత్తం స్థిరాస్తుల విలువ 70 కోట్లు ఉంది. అలాగే వివిధ బ్యాంకు ల నుంచి తీసుకున్న అప్పు 15 కోట్లుగా ఉంది. ఆయనపై పోటీ చేస్తున్న టీడీపీ అభ్యర్థి ప్రవాసాంధ్రుడు పెమ్మసాని చంద్రశేఖర్ సైతం కోట్లకు పడగలెత్తినవాడే. దాదాపు ఆయ‌న‌కు 300 కోట్ల రూపాయ‌ల ఆస్తులు ఉన్నాయ‌ని తెలిసింది. అమెరికా స‌భ ప‌లు దేశాల్లోనూ ఆయ‌న‌కు స్థిరాస్తులు ఉన్నాయ‌ని స‌మాచారం.

గుంటూరు జిల్లాలోనే మరో లోక్‌సభ నియోజకవర్గం నరసరావుపేట నుంచి టీడీపీ అభ్యర్థిగా పోటీపడుతున్న సిట్టింగ్ ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయులు.. విజ్ఞాన్ విద్యాసంస్థలు పేరిట తెలుగు రాష్ట్రాల్లో యూనివర్సిటీలు, ఇంజినీరింగ్ కళాశాలలు ఉన్నాయి. ఆయన పేరిట 17 కోట్ల విలువైన ఆస్తులు ఉండగా.. కోటి రూపాయల విలువైన అప్పులు ఉన్నాయి. బ్యాంకులో డిపాజిట్లు, బాండ్లు రూపేణా 3కోట్ల 68 లక్షల విలువైన ఆస్తులు ఉండగా.. కోటి రూపాయల విలువైన వ్యవసాయ భూమి, 10 కోట్లు విలువైన ప్లాట్లు, మరో మూడున్నర కోట్ల విలువైన ఇల్లు ఉన్నాయి. మొత్తం స్థిరాస్తుల విలువ 14 కోట్ల వరకు ఉంది.

ఇక లావు శ్రీకృష్ణదేవరాయులపై పోటీపడుతున్న వైసీపీ ఎమ్మెల్యే అనిల్‌కుమార్‌ యాదవ్‌కు 6 కోట్ల విలువైన ఆస్తులు ఉండగా.. కోటి రూపాయల అప్పు ఉంది. బ్యాంకులో డిపాజిట్లు,పర్సనల్‌ లోన్లు, బంగారం, వాహనాలు అన్నీ కలిపి 2 కోట్ల 80 లక్షల చరాస్తులు ఉండగా.. వ్యవసాయ భూమి, ప్లాట్లు కలిపి మూడు కోట్ల విలువ ఉంటుంది. వివిధ బ్యాంకుల నుంచి తీసుకున్న అప్పు మరో కోటి రూపాయల వరకు ఉంది.

గుంటూరు జిల్లాలోని మరో లోక్‌సభ నియోజకవర్గం బాపట్ల నుంచి ఈసారి వైసీపీ తరపున సిట్టింగ్ ఎంపీ నందిగం సురేశ్ పోటీపడుతున్నారు. ఆయన ఆస్తులు కేవలం 41 లక్షలే ఉండగా…అప్పులు రెండున్నర లక్షలు ఉన్నట్లు ఎన్నికల అఫిడవిట్‌లో చూపారు. బ్యాంకులో క్యాష్‌, బాండ్లు, కార్లు, బంగారు ఆభరణాలు అన్నీ కలిపి 28 లక్షలు ఉండగా…ఐదు లక్షల విలువైన వ్యవసాయ భూమి, మరో 8 లక్షల విలువైన ప్లాట్లు ఉన్నాయి.

వీటి మొత్తం విలువ 13 లక్షలు ఉంది. బ్యాంకులో తీసుకున్న గోల్డ్‌ లోను 2లక్షల 69 వేలు మాత్రమే ఉంది. ఈసారి ఈయనపై తెలుగుదేశం మాజీ ఐపీఎస్ అధికారి కృష్ణప్రసాద్ ను నిల‌బెట్టింది. తెలుగు రాష్ట్రాల్లో వివిధ హోదాల్లో పనిచేసిన ఆయన డీజీపీ హోదాలో పదవీవిరమణ చేశారు. ఈయన మాజీ మంత్రి శమంతక మణి అల్లుడు. తొలిసారి ఎన్నికల్లో పోటీపడుతున్నారు. ఈయ‌న ఆస్తిపాస్తులు కూడా 200 కోట్ల వ‌ర‌కు ఉంటుంద‌ని ఒక అంచ‌నా.

Related posts

Pawan Kalyan: వైసీపీకి ప్రతిపక్ష హోదా కూడా దక్కకుండా ఓడించాలి – పవన్

sharma somaraju

గెలిస్తే మళ్లీ మంత్రి ప‌క్కా… ఈ మౌత్ టాకే ‘ విడ‌ద‌ల ర‌జ‌నీ ‘ ని మ‌ళ్లీ గెలిపిస్తోందా ?

KCR: కేసిఆర్ కు ఈసీ బిగ్ షాక్ .. 48 గంటల పాటు ప్రచారంపై నిషేదం

sharma somaraju

YS Sharmila: సీఎం జగన్ కు వైఎస్ షర్మిల ప్రశ్నల వర్షం

sharma somaraju

YS Jagan: ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై క్లారిటీ ఇచ్చిన సీఎం జగన్

sharma somaraju

మైల‌వ‌రంలో ‘ టీడీపీ వ‌సంత ‘ విజ‌యం ఊగిస‌లాడుతోందా ?

మురిపించిన కూట‌మి మేనిఫెస్టో… ఓట్లు రాలుస్తుందా…?

Telangana High Court: దిశా నిందితుల ఎన్‌కౌంటర్ కేసులో పోలీస్ అధికారులకు ఊరట

sharma somaraju

Pawan Kalyan: అమ్మ బాబోయ్‌.. ప‌వ‌న్ క‌ళ్యాణ్‌, ఆయ‌న భార్య అన్నా లెజ్నెవా మ‌ధ్య అంత భారీ ఏజ్ గ్యాప్ ఉందా..?

kavya N

Wearable Ac: రియల్ పాకెట్ ఏసీ ని తీసుకొచ్చిన సోనీ.. వెంట తీసుకెళ్లేందుకు సరైన ఫెసిబిలిటీ..!

Saranya Koduri

Alluri Seetarama Raju: వెండితెర సంచ‌ల‌నం అల్లూరి సీతారామరాజు కి 50 ఏళ్లు.. ఎన్టీఆర్ చేయాల్సిన ఈ సినిమా కృష్ణ చేతికి ఎలా వెళ్లింది?

kavya N

Janasena: సింబల్ వివాదంపై కూటమికి స్వల్ప ఊరట

sharma somaraju

Siddharth Roy: థియేట‌ర్స్ లో విడుద‌లైన 2 నెల‌ల‌కు ఓటీటీలోకి వ‌స్తున్న సిద్ధార్థ్‌ రాయ్‌.. ఈ బోల్డ్ మూవీని ఎక్క‌డ చూడొచ్చంటే?

kavya N

Tollywood Movies: స‌మ్మ‌ర్ లో సంద‌డి చేయ‌డానికి క్యూ కట్టిన చిన్న సినిమాలు.. మే నెల‌లో రిలీజ్ కాబోయే మూవీస్ ఇవే!

kavya N

Shruti Haasan: శృతి హాసన్ బ్రేక‌ప్ స్టోరీ.. ఆ రీజ‌న్ వ‌ల్లే శాంతానుతో విడిపోయిందా..?

kavya N