Paluke Bangaramayena: ప్రస్తుత కాలంలో సీరియల్స్ ప్రేక్షకులను ఎంతగా ప్రభావితం చేస్తున్నాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఒకప్పుడు మహిళలు మాత్రమే సీరియల్ చూడడానికి ఇష్టపడేవారు కానీ ఇప్పుడు పురుషులు కూడా సీరియల్స్ చూస్తూ ఆనందాన్ని పొందుతున్నారు. ముఖ్యంగా చాలా వరకు సీరియల్స్ లో విలన్స్ దే పై చేయి అన్నట్లుగా అనిపిస్తుంది.. కానీ కొన్ని సీరియల్స్ మాత్రం మంచి కంటెంట్ తో వస్తూ ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నాయి. ఈ మధ్యకాలంలో ఎక్కువగా పరువు , చదువు, బాధ్యత అనే కాన్సెప్ట్ తో వస్తూ ప్రేక్షకులలో మంచి ఆసక్తిని సృష్టిస్తున్నాయి. ఈ క్రమంలోనే స్టార్ మా లో సరికొత్త సీరియల్ ప్రేక్షకులను అలరించడానికి సిద్ధం అయ్యింది.

అదే పలుకే బంగారమాయేనా. గత కొద్ది రోజులుగా ఈ సీరియల్ కి సంబంధించిన ప్రోమోలు వస్తూనే ఉన్నాయి. ఇందులో హీరోయిన్ కి నత్తి ఉంటుంది. అయితే ఆ నత్తి పోవడానికి తల్లి సంగీతం క్లాస్ లో చిన్నప్పుడే జాయిన్ చేస్తుంది. కానీ సంగీతం మాస్టర్ మాత్రం తనకు నత్తి పోవడానికి సంగీతం పనికిరాదు అని అంటాడు. ఇక అప్పుడే తన తండ్రి వచ్చి తనకు నత్తి అన్న విషయం అందరికీ తెలియాలా అంటూ అటు కూతురిపై ఇటు భార్యపై కూడా కోప్పడతాడు. ఇక కూతురు పెద్దదైనా కూడా తండ్రి ఏమాత్రం కూడా ఆమె మీద ప్రేమ చూపించడు. పైగా తనకు నత్తి ఉంది కాబట్టి మాట్లాడితేనే చిరాకు పడుతూ ఉంటారు ఆ ఇంట్లో వాళ్ళు.

అయితే హీరో మాత్రం తనను మాట్లాడమని చెబుతాడు.. హీరో ఒక పోలీసు.. హీరో మిస్సింగ్ కేసులను పట్టుకోలేకపోవడంతో.. పై ఆఫీసర్ తనపై అరుస్తూ ఉండగా కనీసం జేబుదొంగనైనా పట్టుకోమని చెబుతాడు.. అలా హీరో దొంగలు పట్టే పనిలో ఉంటే నత్తితో బాధపడే అమ్మాయి లాయర్ అయితే.. ఆ అమ్మాయి కేసులను ఎలా డీల్ చేస్తుంది అన్నది ఇప్పుడు మరింత ఆసక్తిని రేకెత్తిస్తోంది. ఇకపోతే ప్రస్తుతం ఈ సీరియల్ నుంచి మరొక ప్రోమో విడుదల చేయగా ఇందులో బ్రహ్మముడి సీరియల్ హీరో మానస్ నాగులపల్లి (రాజ్).. ఈ సీరియల్ హీరోను పరిచయం చేస్తాడు.

హీరో తన బ్యాగు దొంగతనం చేసిన వాడిని పట్టుకొని బాగా కొడతాడు.. వెంటనే రాజ్ అతడిని చూసి గుర్తుపట్టి.. తన చిన్నప్పటి ఫ్రెండ్ అభి అని.. తన నిజాయితీయే తనకు ప్రాబ్లమ్స్ తెచ్చిపెడుతుందని.. అందుకు మీ బ్లెస్సింగ్ తీసుకోవడం కోసం పలుకే బంగారమాయే సీరియల్ తో ముందుకు వస్తున్నాడు అని సీరియల్ గురించి మానస్ ప్రమోట్ చేయడం జరిగింది. ప్రస్తుతం ఈ ప్రోమో చాలా వైరల్ గా మారింది.