NewsOrbit
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్

తెలంగాణలో ఏపీ ఎమ్మెల్యే కారుకు ప్రమాదం.. కాన్వాయ్ లో కార్లు ఢీ .. ఎమ్మెల్యేకి తప్పిన ప్రమాదం

Advertisements
Share

కృష్ణాజిల్లా గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీకి ప్రమాదం తప్పింది. ఆయన కాన్వాయ్ శనివారం ప్రమాదానికి గురైంది. విజయవాడ – హైదరాబాద్ జాతీయ రహదారిపై సూర్యాపేట జిల్లా చివ్వెంటల మండలం కాశీంపేట వద్ద కాన్వాయ్ కి ప్రమాదం జరిగింది.  అయితే ఈ ప్రమాదం నుండి వంశీ సురక్షితంగానే బయటపడ్డారు. వల్లభనేని వంశీ శనివారం విజయవాడ నుండి హైదరాబాద్ వెళుతుండగా, చివ్వెంల మండలం కాశీంపేట వద్ద కాన్వాయ్ లోని వాహనాలు ఒకదానితో ఒకటి ఢీకొన్నాయి.

Advertisements

ఈ క్రమంలో ఎమ్మెల్యే ప్రయాణిస్తున్నవాహనం సైతం ప్రమాదానికి గురైంది. అయితే ఈ ప్రమాదంలో ఎవరికీ ఎలాంటి గాయాలు కాలేదని తెలుస్తొంది.  రెండు వాహనాలు స్వల్పంగా దెబ్బతిన్నాయి. ఈ ప్రమాదంలో ఎవరికి గాయాలు కాకుండా సురక్షితంగా బయటపడటంతో వంశీ మరో కారులో హైదరాబాద్ వెళ్లిపోయారు. వంశీ కారు ప్రమాదానికి గురైందని ఎలక్ట్రానిక్ మీడియాలో రావడంతో వైసీపీ నేతలు, ఆయన అభిమానులు ఆందోళనకు గురైయ్యారు. పలువురు ఆయన ఫోన్ చేసి వివరాలు అడిగి తెలుసుకున్నారు.

Advertisements

Road Accident: ఏపీలో వివిధ రోడ్డు ప్రమాదాల్లో ఏడుగురు మృతి


Share
Advertisements

Related posts

Nazriya : నజ్రియా ఎంట్రీ ఇచ్చినట్టు సుందరం చెప్పనేలేదు..! 

GRK

Weight Loss: ఇడ్లీ సాంబార్ తింటే బరువు తగ్గుతారా..!! ఎప్పుడు తినాలంటే..!?

bharani jella

Guppedentha Manasu Feb 3 Today Episode: జగతి మేడంను అమ్మా అని రిషి. పిలుస్తాడా..??

Ram