Prema Entha Madhuram October 16th ఎపిసోడ్ 1074: నైని వచ్చి పిన్ని చపాతీలు నేను చేస్తాను నువ్వు వెళ్ళు అని అంటుంది. కుదరదు నైని చపాతీలు నేనే చేస్తాను అని దురంధర అంటుంది. ఇంతలో తిలోత్తమ వచ్చి నువ్వు వెయ్యి చపాతి పెనం మీద అని అంటుంది. పెనం మీద చపాతి వెయ్యొద్దు పిన్ని నేను చెల్లి చేస్తాము నువ్వు వెళ్ళు అని హాసిని అంటుంది. నువ్వు చెయ్యి దురదర విలు ఎందుకు వద్దంటున్నారో చూద్దాం అని తిలోత్తమ అంటుంది. దురంధర చపాతీ పెనం మీద వేయగానే అది లేచిపోయి పిండిలో పడిపోయిది పెనం లేసి వచ్చి వల్లభా మొహం మీద పడుతుంది. మమ్మీ నా మొహం కాలిపోయింది మమ్మీ అని వల్లభ అంటాడు. నైని పిండి తీసుకొని పక్కకు వెళ్ళిపోతుంది. అందరూ అక్కడికి వచ్చి ఏం జరిగింది అని అంటారు. ఏమీ లేదు విశాల్ పెనం వచ్చి వల్లభ మొహం మీద పడి మొహం కాలింది అని తిలోత్తమ అంటుంది.

పెనం దగ్గరికి నువ్వెందుకు వెళ్లావు అన్నయ్య అని విశాల్ అంటాడు.నేను వెళ్లలేదు రా అదే లేచి వచ్చి నా మొహం మీద పడింది అని వల్లభా అంటాడు. అలా ఎలా పడుతుంది అని విక్రాంత్ అంటాడు. ఏమోరా నేను చూశాను అలాగే లేచి పడింది అని తిలోత్తమ అంటుంది. మమ్మీ మంట మంట అని వల్లభ అంటాడు. మంట అని హాసిని నీళ్లు తెచ్చి మొహం మీద చల్లుతుంది. మొహం కాలితే నీళ్లు చల్లుతావేంటి పిచ్చి మొహం దాన అని తిలోత్తమ అంటుంది. మంగళ సూత్రాలు చల్లగా ఉంటాయని చల్లుతున్నాను అత్తయ్య అని హాసిని అంటుంది. మమ్మీ నన్ను లోపలికి తీసుకెళ్ళు మమ్మీ అని వల్లభ అంటాడు. తిలోత్తమ వల్లభను తీసుకుని రూమ్ లోకి వెళుతుంది. ప్లేట్ లో ఉన్న పిండిని కింద పెట్టగానే పెద్ద బొట్టు అమ్మగా మారిపోతుంది. పెద్దమ్మ ఏంటి నీ మొహం అలా అయ్యింది అని నైని అంటుంది.చపాతీని చేసి దురంధర పెనం మీద వేసింది కదా నైని.

అందుకే న మొహం కాలిపోయింది అని పెద్ద బోట్టమ అంటుంది. అయితే ఉండు పసుపు తీసుకొస్తాను అని నైని అంటుంది. నైని ఆగు పసుపు రాస్తే తగ్గే గాయాలు కావు ఉలవొచ్చిని ఎత్తుకుంటే మాయమైపోతాయి అని పెద్ద బోట్టమ అంటుంది. ఇప్పుడు మళ్లీ ఊలోచిని తీసుకొస్తే చెల్లి చూస్తుంది పెద్ద గొడవ అయిపోతుంది ఎలా అని నైని అంటుంది.అందుకే నైని వద్దంటున్నాను అని పెద్ద బోట్టమ అంటుంది.పాపగా ఉంటే తీసుకురాలేను కానీ పాముగా మారిన తర్వాత తీసుకొస్తాను సాయంత్రం అయ్యే దాకా ఉండు అమ్మవారి చీర కట్టుకొని పాపను ఎత్తుకుందువు అని నైని అంటుంది.కట్ చేస్తే తిలోత్తమ వాళ్ళు అఖండ స్వామి దగ్గరికి వెళ్లి ఇంట్లో జరిగిందంతా చెబుతారు. అయితే నైని వాళ్ళు అలా చేయడానికి ఏదో ఒక కారణం ఉండే ఉంటుంది ఆ పిండిని నాగుల మీద పోస్తే పిండిలా మారిపోతాయి ఆ పిండిని మీరు తీసుకెళ్లి చపాతీని చేద్దామని చూసేసరికి అలా జరిగి ఉంటుంది ముందు నైని అలా ఎందుకు చేసిందో కారణం తెలుసుకోండి అని అఖండస్వామి అంటాడు.

అది కాదు స్వామి గాయత్రీ మా అక్క గాయత్రి అన్నారు ఆ పిల్ల కుడిచేయిని తాగితే నాకు ఏమీ కాలేదు మొత్తానికి గాయత్రి పాప వల్ల నాకు ఏ ప్రమాదం లేదని తెలిసింది అనితిలోత్తమ అంటుంది. అది కాదు మమ్మీ ప్రమాదం అయితే జరగలేదు కానీ అసలు మరదలు ఇలా ఎందుకు చేసింది అడుగుదాం పద అని వల్లభ అంటాడు. వాళ్ళిద్దరూ అక్కడ నుంచి బయలుదేరి వస్తారు. కట్ చేస్తే పెద్ద బోట్టమని సాయంత్రం ఇంటికి రమ్మన్నాను అక్క ఉలొచ్చిని ఎలా తీసుకురావడం అని నైని అంటుంది. ఏముందమ్మా సుమన లేని టైంలో ఉలోచికి పాలు పెట్టి ఎర్రటి చీరలో తీసుకురావచ్చు అని డమ్మక్క అంటుంది. అది కాదు చెల్లి పెద్ద బోట్టమ్మ ఇప్పుడు ఇంటికి వస్తే అందరు గుర్తుపడతారు కదా ఎలా అని హాసిని అంటుంది.

అమ్మవారి చీర కట్టుకుంటుంది కాబట్టి తను ఎవరు గుర్తుపట్టలేరు అక్క రూపురేఖలు మారిపోతాయి అని నైని అంటుంది. అయితే డమ్మక్క రా మన ఉలొచికి స్వాగతం పలుకుదాం అని హాసిని అంటుంది. పద అమ్మ ఎవరు రాకముందే తీసుకొద్దాం అని డమఅక్క అంటుంది.సుమన గదిలోకి వెళ్లి ఊలోచి ఎక్కడున్నావురామా పాలు తాగుదువు గాని అని హాసిని అంటుంది. ఉలొచ్చి ఇప్పుడు పాము పిల్లగా మారింది కాబట్టి ఏ తలుపు సందుల్లోనూ మంచం కిందనో దాక్కొని ఉంటుంది పాలు లిటి వ్వు అక్కడ పెట్టి పిలుద్దాము అని డమ్మ అక్క పాలు తీసుకొని అక్కడ పెట్టి ఉలొచ్చి తొందరగా రా మా పాలు తాగుదువు గాని అని అంటుంది. అలా పిలవగానే ఉలోచి వచ్చి పాలు తాగుతుంది. దమ్మక్క ఈ చీర అక్కడ పెట్టు అని హాసిని అంటుంది. రెడ్ కలర్ చీరను సోఫా మీద పెట్టి ఉలొచ్చి ఈ పాలు తాగి ఈ చీరలో దూరిపో మీ అమ్మకు వాయినంగా ఇస్తాము మీ అమ్మకు గాయాలయ్యాయి అని డమ్మకం అంటుంది.

ఉలొచి పాలు తాగి చీరలో వచ్చి పడుకుంటుంది డమ్మక్క వాళ్ళు తీసుకుని వెళ్తారు. కట్ చేస్తే ఇంతలో పెద్ద బోట్టమ్మ అమ్మవారి చీర కట్టుకొని అక్కడికి వస్తుంది. పెద్ద బోట్టమ్మ మా వాళ్ళందరికీ నీ కూతురు శ్రీమంతానికి పిలుస్తున్నానని చెప్పు కొంగు మీద వేసుకో అని నైని అంటుంది. విక్రాంత్ విశాల్ తిలోత్తమ సుమన హాల్లోకి వస్తారు. ఎవరు ఆవిడ అని విశాల్ అంటాడు. తన పేరు నాగలక్ష్మి బాబు గారు తన కూతురు శ్రీమంతం అంట మనల్ని పిలవడానికి వచ్చింది అని నైని అంటుంది. అయితే మొహం మీద ముసుకేంటి అని సుమన అంటుంది. మేము మరాఠీ వాళ్ళ మామ ఇంట్లో నుంచి బయటికి వస్తే మొహం మీద కొంగు కప్పుకుంటాము మా మొహం ఎవరికి చూపించము అని పెద్ద బొటమ్మ అంటుంది.

అది వాళ్ళ ఆచారమేమో నీకేం అడ్డం వస్తుంది అని విక్రాంత్ అంటాడు. ఎవరు ఆవిడ నీకేమైనా తెలుసా నైని అని తిలోత్తమ అంటుంది. ఎవరైతే ఏముందమ్మా వాళ్ల కూతురు సీమంతం అని పిలవడానికి వచ్చింది బొట్టు పెట్టించుకో అని విశాల్ అంటాడు. పెద్ద బొట్టమ్మ అందరికీ బొట్టు పెట్టి రేపు మా కూతురు శ్రీమంతం మీరందరూ రండి అని అంటుంది. ఏంటి బొట్టు మాత్రమే పెట్టి పిలుస్తారా అని సుమన అంటుంది. లేదే బంగారం కూడా ఇస్తారు అని విక్రాంత్ అంటాడు. మేము నాగలక్ష్మి కి చిరవాయంనగా ఇస్తాము అని హాసిని అంటుంది.. దీనితో ఈరోజు ఎపిసోడ్ ముగిస్తుంది