NewsOrbit
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్ రాజ‌కీయాలు

CM YS Jagan: విశాఖ నుండి పరిపాలనపై సీఎం జగన్ కీలక ప్రకటన

Share

CM YS Jagan: పరిపాలనా రాజధానిగా పేర్కొంటున్న విశాఖకు మకాం మార్చడంపై సీఎం జగన్ కీలక ప్రకటన చేశారు. రాజధానికి సంబంధించిన కేసు సుప్రీం కోర్టులో విచారణ దశలో ఉన్న సంగతి తెలిసిందే. నవంబర్ నెలలో విచారణకు రానుంది. సుప్రీం కోర్టులో విచారణ జాప్యం జరుగుతున్న కారణంగా ఈ లోపుగా సీఎం జగన్ తన మకాంను విశాఖకు షిఫ్ట్ చేసి అక్కడి నుండి పరిపాలన సాగించాలని భావిస్తున్నారు. ఈ క్రమంలో రుషికొండ పై సీఎం నివాసానికి గానూ భవన నిర్మాణం పూర్తి అయ్యింది. అలానే అధికార యంత్రాంగం ఉండేందుకు అవసరమైన భవనాలు, వసతి ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఈ మేరకు ఇటీవలే ప్రభుత్వం ఉత్తరాంధ్ర ప్రాంత అభివృద్ధి, పర్యటనలకు సంబంధించి రెండు జీవోలు విడుదల చేసింది. ప్రభుత్వం ఓ కమిటీని ఏర్పాటు చేసింది. విజయ దసమి మూహూర్తానికే సీఎం జగన్ విశాఖకు షిప్ట్ అవుతారనీ, అక్కడ నుండి పరిపాలన సాగిస్తారని ప్రచారం జరిగింది.

అయితే ఇవేళ విశాఖ పర్యటన సందర్భంలో తమ మకాం మార్పునకు సంబంధించి కీలక ప్రకటన చేశారు సీఎం జగన్. డిసెంబర్ నాటికి విశాఖకు రాబోతున్నట్లు వెల్లడించారు. పరిపాలనా  విభాగమంతా ఇక్కడికే వస్తుందని, ఇక్కడి నుండే పాలన కొనసాగిస్తానని తెలిపారు. ఐటీ హిల్స్ వద్ద ఇన్ఫోసిస్ కార్యాలయాన్ని సీఎం జగన్ సోమవారం ప్రారంభించారు. అలాగే జీవిఎంసీ బీచ్ క్లీనింగ్ వాహనాలను ప్రారంభించారు. ఈ సందర్భంగా జగన్ మాట్లాడుతూ విశాఖ నగరానికి ఉజ్వల భవిష్యత్తు ఉందన్నారు. హైదరాబాద్, బెంగళూరు మాదిరిగానే వైజాగ్ లో అపారమైన అవకాశాలు ఉన్నాయన్నారు. వైజాగ్ కూడా ఐటీ హబ్ గా మారుతుందన్నారు. ఇప్పటికే విద్యాసంస్థల కేంద్రంగా మారిందనీ, ఏటా 15వేల మంది ఇంజనీర్లు తయారవుతున్నారని చెప్పారు.

రాష్ట్రంలోనే అతి పెద్ద నగరం, అంతర్జాతీయ విమానాశ్రయం, పొడవైన తీర ప్రాంతం విశాఖ సొంతం అని ఇలాంటి సౌకర్యాలు అన్నీ ఉన్నందునే ప్రముఖ సంస్థలు విశాఖలో పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు వస్తున్నాయని జగన్ తెలిపారు. వైజాగ్ కాలల నగరంగా అభివృద్ధి చెందుతుందన్నారు. ఇన్ఫోసిస్ రాకతో విశాఖ మరింత వేగంగా వృద్ధి చెందుతుందని అన్నారు. ఇన్ఫోసిస్ కు అన్ని విధాలుగా సహకరిస్తామని హామీ ఇచ్చారు. త్వరలోనే విశాఖకు షిప్ట్ అవుతున్నానని తెలిపారు. విశాఖ నుండే పాలన కొనసాగిస్తానని చెప్పారు. డిసెంబర్ లోపు విశాఖకు మారతానని సీఎం జగన్ తెలిపారు.

అనంతరం అనకాపల్లి జిల్లా అచ్యుతాపురం సెట్ లో లారెస్ ల్యాబ్ (ఫార్మా కంపెనీ) లో యూనిట్ – 2 ను సీఎం జగన్ ప్రారంభించారు. పరిశ్రమను సందర్శించిన సీఎం జగన్ .. కంపెనీ సీఈఓ, డైరెక్టర్లు, ఉద్యోగులతో ఇంటరాక్ట్ అయ్యారు. రూ.460 కోట్లతో ప్రారంభించిన ఈ యూనిట్ 2 ద్వారా 1200 మందికి ఉద్యోగాలు లభించాయి. లారస్ కు సంబంధించి మరో రెండు కొత్త యూనిట్లకు సీఎం జగన్ శంకుస్థాపన చేశారు. రూ.850 కోట్లతో కొత్తగా నిర్మించే రెండు యూనిట్ల ద్వారా మరో 800 మందికి ఉద్యోగ అవకాశాలు లభించనున్నాయని కంపెనీ ప్రతినిధులు సీఎం జగన్ కు వివరించారు.

Chandrababu Arrest: వదల బొమ్మాళీ .. నిన్నొదల..?


Share

Related posts

రేపటి నుండి విజయమ్మ, షర్మిల ప్రచారం

somaraju sharma

Chandrababu Arrest: హైకోర్టులో చంద్రబాబు లాయర్ల హౌస్ మోషన్ పిటిషన్

somaraju sharma

ప్రారంభమైన ఏపి శాసనసభ శీతాకాల సమావేశాలు

somaraju sharma