NewsOrbit
Entertainment News Telugu TV Serials

Prema Entha Madhuram December 23 2023 Episode 1133: నాన్న కోసం అయ్యప్ప మాల వేసుకున్న పిల్లలు..

Prema Entha Madhuram Today Episode December 23 2023 Episode 1133 Highlights

Prema Entha Madhuram December 23 2023 Episode 1133: పిల్లలు మీరేంటి మా అన్నయ్యని పట్టుకుని నాన్న అంటున్నారు అని ఉష అంటుంది. మమ్మల్ని సొంత మనవడు మనవరాలా చూసుకుంటున్నారు కదా మాకు నాన్న ఉంటే ఇంత ప్రేమగా చూసుకునేవాడేమో అనిపించి నాన్న అని పిలిచాము అని అభయ్ అంటాడు. ఎంత ప్రేమగా చూసుకుంటే మాత్రం పిల్లలు మా అన్నయ్యని నాన్న అని ఎలా పిలుస్తారు అని ఉష అంటుంది. నువ్వు ఊరుకో ఉష పిల్లలు తెలియక అలా పిలిచారులే అని సుగుణ అంటుంది. పిల్లలు మాల వేసు కోవడం అంటే మాటలనుకుంటున్నారా ఎంత పెద్ద తతంగా ఉంటుందో తెలుసా మీరు భరించలేరు అని యాదగిరి అంటాడు. మా నాన్న కోసం ఎంత కష్టమైనా చేస్తామండి మా నాన్న మాకు కావాలి అందుకే మొక్కుకొని ఈ మాల వేసుకున్నాము అని అభాయ్ అక్కి ఏడుస్తారు క్షమించు ఫ్రెండ్ మా నాన్న ఉంటే నీలాగే మమ్మల్ని ప్రేమగా చూసుకునే వాడనిపించి అలా పిలిచాము మా నాన్న లేడు కదా అందుకే నీ పాదాలకు నమస్కారం పెట్టుకుంటే మాకు నాన్న లేడు కదా ఫ్రెండ్ అమ్మానాన్నల పాదాలకి నమస్కారం పెడితే మా కోరిక నెరవేరుతుందని మా గురుస్వామి చెప్పాడు అందుకే మీ పాదాలకు నమస్కారం పెట్టాను ఫ్రెండ్ అని అక్కి అంటుంది.

Prema Entha Madhuram Today Episode December 22 2023 Episode Highlights

Prema Entha Madhuram Today Episode December 23 2023 Episode 1133 Highlights
Prema Entha Madhuram Today Episode December 23 2023 Episode 1133 Highlights

మిమ్మల్ని దూరం చేసుకున్న మీ నాన్న ఎంత దురదృష్టవంతుడు ఇంత ప్రేమని దూరం చేసుకుని అతను మాత్రం ఎన్ని రోజులు దూరంగా ఉంటాడు అని మనసులో అనుకొని ఆర్య బైటికి ఓకే పిల్లలు మీ నాన్నని ఎలాగైనా సరే వెతికి నేను తెచ్చి నీకు అప్పగిస్తాను వెళ్లి మీ అమ్మ ఆశీర్వాదం తీసుకోండి అని ఆర్య అంటాడు. చిన్నపిల్లలైనా ఎంత బాగా అర్థం చేసుకునే మీ నాన్న కోసం ఇంత తపన పడుతున్నారా మీ కోరిక తప్పక నెరవేరుతుంది మీ అమ్మ ఆశీర్వాదం కూడా తీసుకోండి వెళ్ళండి అని సుగుణ అంటుంది. అభాయ్ అక్కి ఆర్య ని వెనుకకు ముందుకు చూస్తూ నడుచుకుంటూ వాళ్ళ అమ్మ దగ్గరికి వెళ్తారు. కట్ చేస్తే, వాళ్ళ అమ్మ దగ్గరికి వెళ్లి ఏడుస్తూ వాళ్ళ అమ్మ పాదాల మీద పడతారు పిల్లలు. వాళ్ల కన్నీళ్లను చూసి కరిగిపోయి అను దగ్గరికి తీసుకొని గుండెలకు హత్తుకుని ఏడుస్తుంది. మమ్మల్ని క్షమించమ్మా నాన్న కోసం మేము మాల వేసుకుంటున్నాము అంటే నువ్వు ఒప్పుకోవని భయపడి నీకు చెప్పలేదు అని అభాయ్ అంటాడు.

Prema Entha Madhuram Today Episode December 23 2023 Episode 1133 Highlights
Prema Entha Madhuram Today Episode December 23 2023 Episode 1133 Highlights

అమ్మ మా ఫ్రెండ్ వాళ్ళ లాగా నే మేము కూడా మా నాన్నతో ఉండాలనిపిస్తుంది మా నాన్నతో ఆడుకోవాలనిపిస్తుంది మన0 నలుగురం కలిసి ఉండాలనిపిస్తుంది ఈ మాల ధారణ అయిపోయే లోపు నాన్న మనకు దొరికితే బాగుంటుందమ్మా ఎంత కష్టమైనా సరే ఈ మాలను విడిచి పెట్టకుండా 40 రోజులు దిగ్విజయంగా పూర్తి చెయ్యాలని మమ్మల్ని ఆశీర్వదించమ్మా అని అక్కి అంటుంది. ఆర్య సారే వాళ్ళ నాన్నని తెలిస్తే పిల్లలు వదిలిపెట్టి రారు ఆయనకి ప్రమాదం వస్తుంది అసలు పిల్లలకు వాళ్ళ నాన్న గురించి తెలియకూడదు అని అను అనుకుంటుంది. ఏంటమ్మా ఏమి మాట్లాడవు కోపం వచ్చిందా అని ఆభాయ్ అంటాడు. లేదు నాన్న రేపటి నుంచి మీకు పూజ కు అన్ని నేనే సిద్ధం చేస్తాను అని వాళ్ళ అమ్మ అంటుంది. కట్ చేస్తే, ఏంటి సార్ ఆలోచిస్తున్నారు అని యాదగిరి అంటాడు. ఆ స్థలం బిల్డర్ కి ఇచ్చి మనం డబ్బులు సంపాదించాలనుకోవట్లేదు యాదగిరి దాని గురించి మాట్లాడడానికి జెండిని రమ్మన్నాను అని ఆర్య అంటాడు.

Prema Entha Madhuram Today Episode December 23 2023 Episode 1133 Highlights
Prema Entha Madhuram Today Episode December 23 2023 Episode 1133 Highlights

ఇంతలో  జెండి అక్కడికి ఇల్లులు కట్టే అతని తీసుకొని వస్తాడు. ఆర్య ఇతని పేరు సుందరం ఇతను మనం ఏది చెప్పినా కాదనకుండా చేస్తాడు అని జెండి అంటాడు. చూడు సుందరం ఆ స్థలంలో నాలుగు ఇల్లులు కట్టాలి అవి వేరువేరుగా ఎవరి పేర్లతో వాళ్లకు రిజిస్ట్రేషన్ అయిపోవాలి నలుగురికి పార్ట్నర్షిప్ గా ఉన్నట్టుగా ఉండాలి నలుగురికి ఉపయోగపడేలా ఉండాలి అని ఆర్య అంటాడు. అలాగే సార్ మీరు చెప్పిన ప్లాన్లతోటే ఇల్లులు ప్లాన్ చేస్తాను అని సుందరం అంటాడు. ఓకే సుందరం నీ వెనక జెండి ఉంటాడు నీకు ఏం కావాలన్నా మా కంపెనీ నుంచి నీకు వస్తాయి ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా పని పూర్తి చేయండి అని ఆర్య అంటాడు. అలాగే సార్ అని సుందరం అంటాడు. యాదగిరి సుందరానికి మన స్థలం గురించి చూపించి ప్లాన్ ఎలా చేస్తాడో వేళ్ళు చూపించు అని ఆర్య అంటాడు. జెండి పని తొందరగా పూర్తి అయిపోవాలి లేదంటే ఆ జలంధర్ ఛాయా ఆ స్థలాన్ని కాజేయడానికి ఎన్నో ప్లాన్లు వేస్తున్నారు అని ఆర్య అంటాడు. అలాగే ఆర్య సుందరం వెనక నేను ఉండి చూసుకుంటాను కానీ ఆర్య దివ్య ఉష జ్యోతి ఓకే కానీ సూర్య పేరు మీద కూడా ఎందుకు అని జెండి అంటాడు. సూర్య పేరు మీద ఉన్నది సుగుణమ్మకి దక్కుతుంది రేపు పొద్దున మనం మోసం చేశామని తెలిసినా వాళ్ళకి సెక్యూరిటీగా తనకు ఉపయోగపడుతుంది అని ఆర్య అంటాడు. సరే ఆర్య నువ్వేం టెన్షన్ పడకు అని జెండి వెళ్ళిపోతాడు. కట్ చేస్తే, సుగుణ అను ని తీసుకునే ఛాయా వాళ్ళ ఇంటికి వస్తుంది.

Prema Entha Madhuram Today Episode December 23 2023 Episode 1133 Highlights
Prema Entha Madhuram Today Episode December 23 2023 Episode 1133 Highlights

ఏంటి ఆంటీ ఏం ఇక్కడికి తీసుకొచ్చావు ఈ ఇల్లు ఎవరిదో తెలుసా అని అను అంటుంది.తెలుసమ్మ అని పేపర్లు తాకట్టు పెట్టిన విషయం అంతా చెప్తుంది సుగుణ. ఎంత పని చేశారంటే ఈ విషయం మీ అబ్బాయికి తెలిస్తే ఎలా అని అను అంటుంది. చెప్పాను కదమ్మా ఆ పరిస్థితులో ఏమీ ఆలోచించుకోలేదు అని సుగుణ అంటుంది. సరే పదండి అని అను ఛాయా వాళ్ళ ఇంట్లోకి వెళ్తారు. ఏంటి సుగుణమ్మ ఒక్కదానివే వస్తావు అనుకుంటే తోడు తెచ్చుకున్నావా అని ఛాయా అంటుంది. ఏంటి సుగుణమ్మ ఇలా వచ్చావ్ నీ కూతురు పెళ్లి కుదిరింది అంట కదా ఇన్విటేషన్ కార్డు ఇవ్వడానికి వచ్చావా అని మానస అంటుంది.

Prema Entha Madhuram Today Episode December 23 2023 Episode 1133 Highlights
Prema Entha Madhuram Today Episode December 23 2023 Episode 1133 Highlights

అదే అయ్యుంటుందిలే మానస కాని వాళ్ళ చేతిలో కార్డులు లేవు ఏ పని మీద వచ్చారు సుగుణమ్మ అని ఛాయా అంటుంది. అదేంటమ్మా నా కూతురు పెళ్లికి డబ్బు సహాయం చేస్తానంటే మీకు ల్యాండ్ పేపర్ ఇచ్చి సంతకం కూడా పెట్టాను ఇప్పుడేంటి ఇలా మాట మారుస్తున్నారు అని సుగుణ కంగారు పడుతూ ఉంటుంది. ఏంటి సుగుణమ్మ మా మీద నేరం నెట్టేస్తున్నావ్ మర్చిపోయావా ఏంటి సరిగ్గా చూసుకున్నావా మాకే ఇచ్చావా అని ఛాయా అంటుంది. చూడండి అమ్మ మీరు ఇలా చేస్తే నా కూతురు పెళ్లి ఆగిపోతుంది మీరు ఆడపిల్లలే కదమ్మా ఇలా మోసం చేయకండి అని సుగుణ ప్రాధేయపడుతుంది. పెద్దదైపోయింది కదా ఛాయా చాదాస్తం ఎక్కువయ్యి ఇలా మాట్లాడుతున్నట్టు ఉంది పెళ్లి కుదిరింది కదా ఏమైనా డబ్బులు అవసరమేమో అప్పు కోసం వచ్చిందేమో అని మానస అంటుంది. అప్పు కోసం రాలేదు వాళ్లకు రావాల్సిన డబ్బు ఇస్తే వెళ్లిపోతాము అని అను అంటుంది. నాన్సెన్స్ మనకు పేపర్ ఇవ్వడం ఏంటి ఛాయా అని మానస అంటుంది. చూడండి మర్యాదగా ఆవిడకు డబ్బులు ఇచ్చేయండి లేదంటే పరిణామం చాలా తీవ్రంగా ఉంటుంది అని అను హెచ్చరిస్తుంది.. దీనితో ఈరోజు ఎపిసోడ్ ముగుస్తుంది

Related posts

Manam Movie: రీరిలీజ్‌కు సిద్ధ‌మైన‌ మ‌నం.. ఈ సినిమాలో శ్రియా పాత్ర‌ను మిస్ చేసుకున్న అన్ ల‌క్కీ హీరోయిన్ ఎవ‌రో తెలుసా?

kavya N

SS Rajamouli: మహేష్, రాజమౌళి ప్రాజెక్టుపై వస్తున్న రూమర్స్ కి క్లారిటీ ఇచ్చిన నిర్మాణ సంస్థ..!!

sekhar

Tollywood Actress: ఒక‌ప్పుడు ర‌జ‌నీకాంత్ మూవీలో సైడ్ ఆర్టిస్ట్‌గా న‌టించిన ఈ అమ్మాయి ఇప్పుడు స్టార్ హీరోయిన్‌.. ఎవ‌రో గుర్తుప‌ట్టారా?

kavya N

Eesha Rebba: త్రివిక్ర‌మ్ మాట‌లు న‌మ్మి దారుణంగా మోస‌పోయిన ఈషా రెబ్బ.. వెలుగులోకి వ‌చ్చిన సంచ‌ల‌న నిజాలు!

kavya N

NTR – Prashanth Neel: ఎన్టీఆర్‌, ప్ర‌శాంత్ నీల్ మూవీకి క్రేజీ టైటిల్‌.. అదిరిపోయిందంటున్న ఫ్యాన్స్‌!

kavya N

Prabhas: ఇట్స్ అఫీషియ‌ల్‌.. ఫైన‌ల్ గా జీవితంలోకి ఒక‌రు రాబోతున్నారంటూ ప్ర‌క‌టించిన ప్ర‌భాస్‌!

kavya N

Krishnamma: విడుద‌లైన వారానికే ఓటీటీలో ద‌ర్శ‌న‌మిచ్చిన స‌త్య‌దేవ్ లేటెస్ట్ మూవీ కృష్ణ‌మ్మ.. ఎందులో చూడొచ్చంటే?

kavya N

Krishna Mukunda Murari May 17 2024 Episode 472: ముకుంద ప్రెగ్నెంట్ అన్న భవాని. చెకప్ చేయనున్న కృష్ణ. మురారి కంగారు

siddhu

Nuvvu Nenu Prema May 17 2024 Episode 626: కూతుర్లని పుట్టింటికి తీసుకెళ్లడానికి పార్వతి ప్రయత్నం.. కృష్ణ కి వార్నింగ్ ఇచ్చిన విక్కీ…

bharani jella

Brahmamudi May 17 2024 Episode 412: లేచిపోదామన్న అప్పు.. అనామికకు విడాకులు.. కావ్య అమ్మకానికి బేరం..

bharani jella

Weekend OTT Movies: ఈ వీకెండ్ ఓటీటీలో సందడి చేయనున్న సినిమాలు, వెబ్ సిరీస్ ఇవే..!

Saranya Koduri

OTT: ఒకే రోజు ఓటీటీలో కి వచ్చేసిన.. తమన్నా, విశాల్ మూవీస్.. కానీ చిన్న ట్విస్ట్..!

Saranya Koduri

Scam 2010 Web Series: మరో సిరీస్ అనౌన్స్ చేసిన హన్సల్ మెహతా.. వైరల్ అవుతున్న పోస్టర్..!

Saranya Koduri

Manjummel Boys OTT: ఓటీటీలో దూసుకుపోతున్న మలయాల్ బ్లాక్ బస్టర్ మూవీ..!స‌స‌

Saranya Koduri

Big Boss Siri: సరికొత్త లుక్ లో సిరి హనుమాన్.. ఫొటోస్ వైరల్..!

Saranya Koduri