మన శరీరానికి కొలెస్ట్రాల్ కొంతమేరకు అవసరం.. అదే కొలెస్ట్రాల్ ఎక్కువ అయితే మాత్రం అనారోగ్య సమస్యలు వస్తాయి.. కొలెస్ట్రాల్ రెండు రకాలు.. ఒకటి మంచిది రెండు ఒకటి చెడుది.. మంచి కొలెస్ట్రాల్ మన ఆరోగ్యానికి మేలు చేస్తుంది.. చెడు కొలెస్ట్రాల్ మన అనారోగ్యానికి దారితీస్తుంది.. కొలెస్ట్రాల్ లెవెల్స్ పెరిగితే చర్మంపై ఈ లక్షణాలు కనిపిస్తాయి.. మీకు కూడా ఈ లక్షణాలు కనిపిస్తే విస్మరించవద్దు అంటున్నారు ఆరోగ్య నిపుణులు.. ఆ లక్షణాలు ఏంటంటే..!?
కొలెస్ట్రాల్ పెరగడం వల్ల కళ్ళపై పసుపు రంగు మచ్చలు వస్తాయి.. కళ్ళపై పసుపు రంగు దద్దుర్లు, క్రస్ట్ వస్తాయి.. ఈ లక్షణాన్ని అసలు విస్మరించకూడదు.. శరీరంలో పెరిగిన కొలెస్ట్రాల్ ప్రధాన లక్షణాలలో ఇది ఒకటి.. కళ్ళపై పసుపు రంగు దద్దుర్లు డయాబెటీస్ కూడా సంకేతం.. ఇలాంటప్పుడు కొలెస్ట్రాల్ లెవెల్స్ చెక్ చేసుకోవాలి.. రక్తంలో కొలెస్ట్రాల్ లెవెల్స్ పెరిగినప్పుడు చేతులు, కాళ్ల చర్మంపై జలదరింపు మొదలవుతుంది.. అంతేకాకుండా మీ చేతులు, కాళ్లు చర్మంలో కూడా నొప్పి వస్తుంది.. ఇలా ఉన్నప్పుడు మాత్రం జాగ్రత్త వహించలి.. శరీరంలో చెడు కొలెస్ట్రాల్ పెరిగినప్పుడు చర్మంపై నారింజ, పసుపు రంగులు గుర్తులు కనిపిస్తాయి.. మీరు తప్పనిసరిగా ఇటువంటి కనిపిస్తే అప్పుడు కొలెస్ట్రాల్ స్థాయిలను చెక్ చేసుకోవాలి.. రక్తంలో అధిక కొలెస్ట్రాల్ ఒక ప్రమాద హెచ్చరిక.. ఇది అధిక రక్తపోటు, గుండె పోటు, ట్రిపుల్ నాలాల వ్యాధి వంటి వ్యాధులకు దారి తీస్తుంది..