NewsOrbit
Horoscope

October 31: ఈ రోజు మీ రాశిచక్రం లో ఏముందో? అక్టోబర్ 31 ఆశ్వయుజ మాసం రోజు వారి రాశి ఫలాలు!

daily-horoscope-aug-28th-2023-rasi-phalalu-nija-sravana-masam
Share

October 31: Daily Horoscope in Telugu అక్టోబర్ 31 – ఆశ్వయుజ మాసం – మంగళవారం – రోజు వారి రాశి ఫలాలు

మేషం

చేపట్టిన పనులలో జాప్యం కలుగుతుంది. ఇంటాబయటా సమస్యలు అధికమవుతాయి. ధన సంబంధ విషయాలలో జాగ్రత్తగా వ్యవహరించాలి. ఆరోగ్య సమస్యలు బాధిస్తాయి. వ్యాపారంలో  జీవితభాగస్వామి సలహా తీసుకోవడం మంచిది. నూతన కార్యక్రమాలను ప్రారంభానికి అవరోధాలు కలుగుతాయి.

Daily Horoscope to start your day, August 7 2023 Daily Horoscope, August 7 Rasi Phalalu
Daily Horoscope to start your day October 31st2023 Daily Horoscope October 30th Rasi Phalalu

వృషభం

అన్ని రంగాల వారికీ లాభదాయకంగా ఉంటుంది.  ఆర్థికంగా పురోగతి సాధిస్తారు. దీర్ఘకాలిక రుణాలు తీర్చి ఊరట  చెందుతారు. ప్రయాణాలలో నూతన పరిచయాలు కలుగుతాయి. వాహనం నడిపే విషయాలలో శ్రద్ధ వహించడం మంచిది. విలువైన వస్తు వాహనాలు కొనుగోలు చేస్తారు.

మిధునం

వృత్తి ఉద్యోగాలలో అనుకూల పరిస్థితులు ఉంటాయి. గృహనిర్మాణ ప్రయత్నాలు ఫలిస్తాయి. క్రయ విక్రయాలలో స్వల్ప లాభాలు అందుకుంటారు. కోపాన్ని అదుపులో ఉంచుకోవడం మంచిది. బంధు మిత్రులతో చర్చలు అనుకూల ఫలితాన్ని ఇస్తాయి. సన్నిహితుల ఆహ్వానాలు అందుతాయి.

daily-horoscope-aug-28th-2023-rasi-phalalu-nija-sravana-masam
daily horoscope October 31st 2023 rasi phalalu Ashwayuja masam

కర్కాటకం

సన్నిహితుల నుండి కీలక సమాచారం అందుతుంది. కుటుంబ సభ్యులతో విందు వినోద కార్యక్రమాల్లో ఉత్సాహంగా పాల్గొంటారు. వృత్తి ఉద్యోగాలలో అదనపు పనిభారం ఉన్నప్పటికీ  పూర్తిచేస్తారు. వ్యాపారపరంగా నూతనోత్సాహంతో ముందుకు సాగుతారు. సంతానానికి  నూతన  విద్యా విషయాలపై ఆసక్తి పెరుగుతుంది.

సింహం

నిరుద్యోగులకు అనుకూలత వాతావరణం ఉంటుంది.  స్నేహితుల నుండి శుభాకార్య ఆహ్వానాలు అందుతాయి. ఆర్థిక పరిస్థితి పురోగమిస్తుంది. వృత్తి వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. ఉద్యోగులకు ఉన్నత పదవులు లభిస్తాయి. కుటుంబ సభ్యుల ఆరోగ్య విషయాలలో శుభవార్తలు అందుతాయి.

కన్య

దీర్ఘకాలిక రుణాలు తీర్చి  మానసికంగా ప్రశాంతంగా ఉంటారు. సామాజిక సేవా కార్యక్రమాల్లో విశేషంగా పాల్గొంటారు. నూతన వ్యాపార ప్రారంభానికి శ్రీకారం చుడతారు. ఉద్యోగాలలో స్వల్ప మార్పులు ఉంటాయి. ఆకస్మిక ధనలాభం కలుగుతుంది.  ప్రయాణాలు లాభసాటిగా సాగుతాయి.

తుల

సన్నిహితులతో చాలా కాలంగా  ఉన్న  వివాదాలను పరిష్కారమౌతాయి. నిరుద్యోగులకు నూతన ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి. వృత్తి వ్యాపార వ్యవహారాలలో ఆకస్మిక నిర్ణయాలు తీసుకుంటారు. దూర   ప్రయాణాలు వాయిదా పడుతాయి. ఆరోగ్య విషయాలలో చిన్నపాటి  ఇబ్బందులు కలుగుతాయి.

వృశ్చికం

ధన సంబంధ వ్యవహారాలలో అనుకూలత కలుగుతుంది. సమాజంలో ప్రముఖుల నుండి ఊహించని ఆహ్వానాలు అందుతాయి. ప్రయాణాలలో వాహనాలు నడిపి విషయంలో జాగ్రత్తగా ఉండాలి. వృత్తి ఉద్యోగాలలో  అధికారులు అనుగ్రహం వలన ఉన్నత పదవులు లభిస్తాయి.

ధనస్సు

దూరప్రాంత బంధుమిత్రుల   ఆగమనం ఆనందం కలిగిస్తుంది. గృహమున వినోదాది కార్యక్రమాలు నిర్వహిస్తారు. వృత్తివ్యాపారాలు మరింత ఉత్సాహంగా సాగుతాయి. సంతానం విద్యా విషయాలు సంతృప్తినిస్తాయి. ఉద్యోగాలలో జీత భత్యాల విషయంలో శుభవార్తలు అందుతాయి.

మకరం

ధన పరంగా ఇబ్బందులు ఎదురైనా అధిగమిస్తారు. దీర్ఘకాలిక రుణాలను కొంతవరకు తీర్చి ఊరట చెందుతారు. దూరప్రాంత బంధు మిత్రుల నుండి అరుదైన ఆహ్వానాలు అందుతాయి. వృత్తి వ్యాపారాలలో నూతన పెట్టుబడులు  లభిస్తాయి. సంతాన విద్యా ఉద్యోగ విషయంలో శుభవార్తలు అందుకుంటారు.

కుంభం

చేపట్టిన పనులు జాప్యం జరిగినా సకాలంలో పూర్తి చేస్తారు.  మిత్రులతో కొన్ని విషయాలలో విభేదాలుంటాయి.  ఆరోగ్య విషయాలలో  అప్రమత్తంగా వ్యవహారించాలి.  గృహమున వివాహాది శుభకార్య ప్రస్తావన వస్తుంది. విలువైన వస్తు వాహనాలు కొనుగోలు చేస్తారు. దైవ చింతన పెరుగుతుంది.

మీనం

వృత్తి ఉద్యోగాలలో అనుకూలత పెరుగుతుంది. పాత  మిత్రులతో విందు వినోద కార్యక్రమాలలో పాల్గొంటారు. బయట కొన్ని సంఘటనలు ఆశ్చర్యం కలిగిస్తాయి. శుభకార్యాలకు ధనవ్యయం   చేస్తారు. ఆర్థిక పరిస్థితి లాభసాటిగా ఉంటుంది. చిన్న తరహా పరిశ్రమలకు నూతన అవకాశములు లభిస్తాయి.

 

నిత్ర రాశి ఫలాలు యాప్ సౌజన్యంతో ….


Share

Related posts

Daily Horoscope: ఆగస్టు 1 – ఆధిక శ్రావణమాసం – రోజు వారి రాశి ఫలాలు

somaraju sharma

ఆగస్టు 2 – శ్రావణమాసం – రోజు వారి రాశి ఫలాలు

somaraju sharma

November 29: ఈ రోజు మీ రాశిచక్రం లో ఏముందో? నవంబర్ 29 కార్తీక మాసం – రోజు వారి రాశి ఫలాలు!

somaraju sharma