NewsOrbit
Horoscope దైవం

Today Horoscope: మే 20 – వైశాఖమాసం – రోజువారీ రాశి ఫలాలు

Today Horoscope: మే 20 – గురువారం – వైశాఖమాసం

మేషం

కుటుంబంలో చికాకులు. అనుకోని ఖర్చులు. బంధువులు, మిత్రుల ఒత్తిళ్లు. ఆకస్మిక ప్రయాణాలు ఉంటాయి. పాత సంఘటనలు గుర్తుకు తెచ్చుకుంటారు. రియల్టర్లు, కాంట్రాక్టర్లకు చిక్కులు పెరుగుతాయి. వ్యాపారాలు సామాన్యంగా ఉంటాయి. ఉద్యోగులకు ఆకస్మిక బదిలీలు, రాజకీయ,కళారంగాల వారికి కొత్త వివాదాలు. ఐటీ నిపుణులు ఒడిదుడుకులు. విద్యార్థులకు కొంత ఉత్సాహం తగ్గుతుంది. మహిళలకు నిరుత్సాహమే. షేర్ల విక్రయాలు మందకొడిగా సాగుతాయి.

అదృష్ట రంగులు….గోధుమ,పసుపు.

రెమిడి .. సుబ్రహ్మణ్యాష్టకం పఠించండి.

Today Horoscope:
Today Horoscope

వృషభం

వ్యవహారాలలో ఆటంకాలు. కొత్త రుణాలు చేస్తారు. దూర ప్రయాణాలు సంభవం. కుటుంబ సభ్యులతో అకారణంగా తగాదాలు. ఆలయాలు సందర్శిస్తారు. ఆరోగ్య భంగం, ఔషధసేవనం. రియల్ ఎస్టేట్ల వారికి చిక్కులు. వ్యాపార లావాదేవీలు నిరుత్సాహపరుస్తాయి. ఉద్యోగవర్గాలకు నిరాశ తప్పదు. పారిశ్రామిక,రాజకీయవేత్తలకు అవకాశాలు చేజారతాయి. ఐటీ నిపుణులకు సామాన్యంగానే ఉంటుంది. విద్యార్థులకు అసంతృప్తి. మహిళలకు కుటుంబ సభ్యులతో వివాదాలు. షేర్ల విక్రయాలు నత్తనడకన సాగుతాయి.

అదృష్ట రంగులు….పసుపు, నేరేడు.

రెమిడి.. దక్షిణామూర్తి స్తోత్రాలు పఠించండి.

మిథునం

వ్యవహారాలలో విజయం. బంధువర్గం నుంచి శుభవార్తలు. ఆకస్మిక ధన లాభం. పలుకుబడి కలిగిన వారితో పరిచయాలు. ప్రత్యర్థులు మిత్రులుగా మారతారు. ఆలోచనలు కార్యరూపం దాలుస్తాయి. పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. రియల్ ఎస్టేట్ల వారికి అనూహ్యమైన అవకాశాలు. వ్యాపారాలు లాభాల దిశగా సాగుతాయి. ఉద్యోగులకు ఉన్నత హోదాలు. పారిశ్రామిక, కళారంగాల వారికి యోగదాయకంగా ఉంటుంది. ఐటీ నిపుణులు అనుకున్న విజయాలు సాధిస్తారు. విద్యార్థులకు ఉన్నత విద్యావకాశాలు. మహిళలకు శుభ వర్తమానాలు. షేర్ల విక్రయాలు లాభిస్తాయి.

అదృష్ట రంగులు…. గోధుమ, నీలం.

రెమిడి… విష్ణుసహహ్రనామ పారాయణ చేయండి.

కర్కాటకం

ఆకస్మిక ప్రయాణాలు. ఇంటాబయటా ఒత్తిడులు. బంధువులు, మిత్రులతో కలహాలు. శారీరక రుగ్మతలు. వివాదాలకు దూరంగా ఉండండి. పుణ్య క్షేత్రాలు సందర్శిస్తారు. ముఖ్య నిర్ణయాలలో తొందరవద్దు. రియల్ ఎస్టేట్ల వారికి సమస్యలు ఎదురవుతాయి. వ్యాపారాలు ముందుకు సాగవు. ఉద్యోగులకు మార్పులు జరిగే వీలుంది. రాజకీయవేత్తలు, కళాకారులకు అంతగా కలసిరాదు. ఐటీ నిపుణులకు కొన్ని ఇబ్బందులు. విద్యార్థులకు కొత్త సమస్యలు. మహిళలకు మానసిక అశాంతి. షేర్ల విక్రయాలలో లాభాలు కనిపించవు.

అదృష్ట రంగులు….గోధుమ, నీలం.

రెమిడీ.. శివ స్తోత్రాలు పఠించండి.

సింహం

ఉద్యోగ యత్నాలు అనుకూలిస్తాయి. మిత్రులను కలుసుకుని మంచీచెడ్డా విచారిస్తారు. ఆస్తి వివాదాలు తీరి లబ్ధి పొందుతారు. పుణ్య క్షేత్రాలు సందర్శిస్తారు. ప్రముఖులతో పరిచయాలు సంతోషం కలిగిస్తాయి. బంధువులతో మరింత సఖ్యత. రియల్ ఎస్టేట్ల వారికి నూతనోత్సాహం. వ్యాపారాలలో ముందడుగు వేస్తారు. ఉద్యోగులకువిధుల్లో ప్రశంసలు. రాజకీయ వేత్తలు, కళాకారులకు ఉత్సాహవంతంగా ఉంటుంది. ఐటీ నిపుణులకు మరింత గుర్తింపు. విద్యార్థులు కొత్త విద్యావకాశాలు దక్కుతాయి. మహిళలకు ఆస్తిలాభం. షేర్ల విక్రయాలు లాభిస్తాయి.

అదృష్ట రంగులు….గోధుమ, కాఫీ,

రెమిడి .. విష్ణు ధ్యానం చేయండి.

కన్య

ఆర్థిక పరిస్థితి గందరగోళంగా ఉంటుంది. ప్రయాణాలలో ఆటంకాలు. పనులు మధ్యలోనే నిలిపివేయాల్సివస్తుంది. కష్టానికి తగ్గ ఫలితం కనిపించదు. కోపతాపాలకు దూరంగా ఉండండి. ముఖ్య నిర్ణయాలలో ఆచితూచి వ్యవహరించండి. వ్యాపార లావాదేవీలు అంతగా అనుకూలించవు. ఉద్యోగులకు ఆకస్మిక మార్పులు.ఉంటాయి. రాజకీయ,పారిశ్రామికవేత్తలకు వ్యవహారాలు ముందుకు సాగవు. ఐటీ నిపుణులకు అంతగా అనుకూలం కాదు. విద్యార్థులకు కొంత నిరాశ తప్పదు. మహిళలు ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగాలి. షేర్ల విక్రయాలలో లాభాలు కష్టమే.

అదృష్ట రంగులు….గులాబీ, లేత పసుపు.

రెమిడి .. దుర్గాదేవికి కుంకుమార్చన చేయించుకోండి.

తుల

పరిస్థితులు అనుకూలిస్తాయి. గత సంవత్సర ఘటనలు నెమరు వేసుకుంటారు. బంధువులను కలుసుకుని ఉత్సాహంగా గడుపుతారు. ఆస్తి వివాదాలు నుంచి బయటపడతారు. ఆలయాలు సందర్శిస్తారు. శ్రమకు తగ్గ ఫలితం కనిపిస్తుంది. ఆహ్వానాలు రాగలవు. రియల్ ఎస్టేట్ల వారికి సమస్యల నుంచి ఉపశమనం. వ్యాపారాలలో చిక్కులు అధిగమిస్తారు. లాభాలు తథ్యం. ఉద్యోగులకు అనుకోని హోదాలు, అదనపు బాధ్యతలు. రాజకీయవేత్తలకు కొత్తపదవులు. ఐటీ నిపుణుల ఆశలు ఫలిస్తాయి. విద్యార్థులు కొత్త లక్ష్యాలతో ముందుకు సాగుతారు. మహిళలకు ఆశ్చర్యకరమైన సంఘటనలు ఎదురవుతాయి. షేర్ల విక్రయాలు లాభిస్తాయి.

అదృష్ట రంగులు .. పసుపు,తెలుపు.

రెమిడి .. గణేశాష్టకం పఠించండి.

వృశ్చికం

కొత్త వ్యక్తుల పరిచయం. వివాదాల నుంచి బయటపడతారు. ఆలోచనలు కార్యరూపంలో పెడతారు. బంధువుల నుంచి ఆస్తిలాభాలు. పనులు చకచకా సాగుతాయి. రియల్ ఎస్టేట్ల వారికి నూతనోత్సాహం. వ్యాపారాలు సజావుగా సాగుతాయి. ఉద్యోగులకు ఉన్నత హోదాలు తథ్యం. పారిశ్రామిక, రాజకీయవేత్తలకు శ్రమాధిక్యమైనా ఫలితం ఉంటుంది. ఐటీ నిపుణులుక కొత్త అవకాశాలు లభిస్తాయి. విద్యార్థులు ఊహించని రీతిలో ఫలితాలు పొందుతారు. మహిళలకు భూలాభాలు. షేర్ల విక్రయాలు లాభిస్తాయి.

అదృష్ట రంగులు….గులాబీ, కాఫీ.

రెమిడి.. దక్షిణామూర్తి స్తోత్రాలు పఠించండి.

ధనుస్సు

ఆర్థిక లావాదేవీలలో ఆటుపోట్లు. ప్రయాణాలలో ఆటంకాలు. పనులు నత్తనడకన సాగుతాయి. శారీరక రుగ్మతలు. బంధువర్గంతో అకారణ వైరం. శ్రమ తప్ప ఫలితం కనిపించదు. ఆస్తి వివాదాలు. కాంట్రాక్టర్లకు చిక్కులు. వ్యాపారాలలో ఒడిదుడుకులు. ఉద్యోగులకు పనిభారం పెరుగుతుంది. పారిశ్రామిక వేత్తలు,కళాకారులకు సమస్యలు పెరుగుతాయి. ఐటీ నిపుణులు కొంత నిదానం పాటించాలి. విద్యార్థులు కొంత శ్రమపడాలి. మహిళలకు కుటుంబసభ్యులతో విభేదాలు. షేర్ల విక్రయాలలో లాభాలు కనిపించవు.

అదృష్ట రంగులు….గులాబీ, లేత నీలం.

రెమిడి … ఆదిత్య హృదయం పఠించండి.

మకరం

ఆకస్మిక ప్రయాణాలు ఉంటాయి. సన్నిహితులతో మాటపట్టింపులు. ఆరోగ్యం మందగిస్తుంది. దూరప్రయాణాలు చేస్తారు. బంధువులు, మిత్రుల నుంచి విమర్శలు. నిర్ణయాలలో ఆచితూచి వ్యవహరించండి. రియల్ ఎస్టేట్ల వారికి సమస్యలు చికాకు పరుస్తాయి. వ్యాపార లావాదేవీలు సామాన్యంగా ఉంటాయి. ఉద్యోగవర్గాలకు బదిలీలు ఉండవచ్చు.  పారిశ్రామిక, కళారంగాల వారికి నిరుత్సాహమే. ఐటీ నిపుణులకు పై స్థాయి నుంచి ఒత్తిళ్లు. విద్యార్థులు అసంతప్తి చెందుతారు. మహిళలకు కుటుంబంలో సమస్యలు. షేర్ల విక్రయాలు లాభించవు.

అదృష్ట రంగులు….నలుపు, నీలం.

రెమిడి .. సుబ్రహ్మణ్యాష్టకం పఠించండి.

కుంభం

కొత్త కార్యక్రమాలు ప్రారంభిస్తారు. పరిచయాలు పెరుగుతాయి. పాతబాకీలు వసూలవుతాయి. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. ప్రత్యర్థులు సైతం మిత్రులుగా మారతారు. ఉద్యోగ యత్నాలు అనుకూలిస్తాయి. రియల్ ఎస్టేట్ల వారికి ఊరట లభిస్తుంది. వ్యాపారాలలో అడుగు ముందుకు వేస్తారు. ఉద్యోగులకు ఇంక్రిమెంట్లు రాగలవు. పారిశ్రామికవేత్తలు, కళాకారులకు శ్రమ ఫలిస్తుంది. ఐటీ నిపుణులు నైపుణ్యాన్ని నిరూపించుకుంటారు. విద్యార్థులు కొత్త అవకాశాలు దక్కించుకుంటారు. మహిళలకు కుటుంబంలో చికాకులు తొలగుతాయి. షేర్ల విక్రయాలు లాభిస్తాయి.

అదృష్ట రంగులు….గులాబీ, లేత ఎరుపు.

రెమిడి .. సుబ్రహ్మణ్యేశ్వరునికి అర్చన చేయండి.

మీనం

ముఖ్యమైన పనులు సకాలంలో పూర్తి చేస్తారు. చిన్ననాటి మిత్రులు కలుస్తారు. కొన్ని సమస్యలు తీరతాయి. ఆలోచనలు అమలు చేస్తారు. ఆలయాలు సందర్శిస్తారు. రియల్ఎస్టేట్ల వారికి వివాదాల పరిష్కారం. వ్యాపారాలు లాభసాటిగా ఉంటాయి. ఉద్యోగాలలో కొత్త ఆశలు చిగురిస్తాయి. పారిశ్రామికవేత్తలు ఆటుపోట్లు తొలగుతాయి. ఐటీ నిపుణులకు అవకాశాలు పెరుగుతాయి. విద్యార్థులు మంచి ఫలితాలు సాధిస్తారు. మహిళలకు సోదరుల నుంచి లాభాలు. షేర్ల విక్రయాలు లాభిస్తాయి.

అదృష్ట రంగులు….ఎరుపు, గులాబీ.

రెమిడి.. శ్రీ రామరక్షా స్తోత్రాలు పఠించండి.

author avatar
sharma somaraju Content Editor

Related posts

April 26: ఈ రోజు మీ రాశిచక్రం లో ఏముందో? ఏప్రిల్ 26 చైత్ర మాసం – రోజు వారి రాశి ఫలాలు!

sharma somaraju

April 25: ఈ రోజు మీ రాశిచక్రం లో ఏముందో? ఏప్రిల్ 25 చైత్ర మాసం – రోజు వారి రాశి ఫలాలు!

sharma somaraju

April 24: ఈ రోజు మీ రాశిచక్రం లో ఏముందో? ఏప్రిల్ 24 చైత్ర మాసం – రోజు వారి రాశి ఫలాలు!

sharma somaraju

April 23: ఈ రోజు మీ రాశిచక్రం లో ఏముందో? ఏప్రిల్ 23 చైత్ర మాసం – రోజు వారి రాశి ఫలాలు!

sharma somaraju

April 22: ఈ రోజు మీ రాశిచక్రం లో ఏముందో? ఏప్రిల్ 22 చైత్ర మాసం – రోజు వారి రాశి ఫలాలు!

sharma somaraju

April 21: ఈ రోజు మీ రాశిచక్రం లో ఏముందో? ఏప్రిల్ 21 చైత్ర మాసం – రోజు వారి రాశి ఫలాలు!

sharma somaraju

April 20: ఈ రోజు మీ రాశిచక్రం లో ఏముందో? ఏప్రిల్ 20 చైత్ర మాసం – రోజు వారి రాశి ఫలాలు!

sharma somaraju

April 19: ఈ రోజు మీ రాశిచక్రం లో ఏముందో? ఏప్రిల్ 19 చైత్ర మాసం – రోజు వారి రాశి ఫలాలు!

sharma somaraju

April 18: ఈ రోజు మీ రాశిచక్రం లో ఏముందో? ఏప్రిల్ 18 చైత్ర మాసం – రోజు వారి రాశి ఫలాలు!

sharma somaraju

April 17: ఈ రోజు మీ రాశిచక్రం లో ఏముందో? ఏప్రిల్ 17 చైత్ర మాసం – రోజు వారి రాశి ఫలాలు!

sharma somaraju

April 16: ఈ రోజు మీ రాశిచక్రం లో ఏముందో? ఏప్రిల్ 16 చైత్ర మాసం – రోజు వారి రాశి ఫలాలు!

sharma somaraju

April 15: ఈ రోజు మీ రాశిచక్రం లో ఏముందో? ఏప్రిల్ 15 చైత్ర మాసం – రోజు వారి రాశి ఫలాలు!

sharma somaraju

April 14: ఈ రోజు మీ రాశిచక్రం లో ఏముందో? ఏప్రిల్ 14 చైత్ర మాసం – రోజు వారి రాశి ఫలాలు!

sharma somaraju

April 13 : ఈ రోజు మీ రాశిచక్రం లో ఏముందో? ఏప్రిల్ 13 చైత్ర మాసం – రోజు వారి రాశి ఫలాలు!

sharma somaraju

April 12: ఈ రోజు మీ రాశిచక్రం లో ఏముందో? ఏప్రిల్ 12 చైత్ర మాసం – రోజు వారి రాశి ఫలాలు!

sharma somaraju