Horoscope Today's Horoscope in Telugu- Rasi Phalalu దైవం

ఆగస్టు 11 – శ్రావణమాసం – రోజు వారి రాశి ఫలాలు

Share

ఆగస్టు 11 – శ్రావణమాసం – గురువారం
మేషం
నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి. ఆర్థిక వ్యవహారాలు ఆశాజనకంగా ఉంటాయి. కుటుంబ సభ్యుల ఆదరణ పెరుగుతుంది. వృత్తి వ్యాపారాలలో నూతన లాభాలు అందుకుంటారు. భూ సంభందిత కొనుగోలు ప్రయత్నాలు ఫలిస్తాయి. ముఖ్యమైన పనులు సకాలంలో పూర్తి చేస్తారు. ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు.


వృషభం
ముఖ్యమైన వ్యవహారాలలో అవరోధాలు ఉన్నపటికీ సకాలంలో పూర్తి చేస్తారు. సంతానానికి నూతన ఉద్యోగ అవకాశములు లభిస్తాయి. ఉద్యోగాలలో ఆకస్మికంగా నిర్ణయాలు మార్చుకుంటారు. వృత్తి వ్యాపారాలలో బాధ్యతలు పెరుగుతాయి. వృధా ఖర్చుల విషయంలో మరింత అప్రమత్తంగా వ్యవహరించాలి.
మిధునం
కుటుంబ సభ్యుల నుండి అవసరానికి ధన సహాయం అందక ఇబ్బంది పడతారు. దీర్ఘ కాలిక ఋణ ఒత్తిడి అధికమవుతుంది. ధన వ్యవహారాలలో చిన్న పాటి సమస్యలు కలుగుతాయి. నూతన వ్యాపార విస్తరణ ప్రయత్నాలు ఫలించవు. ఉద్యోగమున ఇతరులతో వాదనకు వెళ్ళకపోవడం మంచిది. దూర ప్రయాణాలు కలసిరావు.
కర్కాటకం
వృత్తి, ఉద్యోగాలలో అధికారుల ఆదరణ పెరుగుతుంది. ఖర్చులకు మించి ఆదాయం ఉంటుంది. గృహమున సంతోషంగా గడుపుతారు. భాగస్వామ్య వ్యాపారమునకు నూతన పెట్టుబడులు అందుతాయి. సంఘంలో ప్రముఖుల నుండి ప్రశంసలు అందుకుంటారు. అనుకున్న సమయానికి పనులు పూర్తిచేస్తారు.
సింహం
స్ధిరాస్తి వివాదాల పరిష్కారానికి చేసే ప్రయత్నాలు కలసివస్తాయి. శత్రువులు కుడా మిత్రులుగా మారి సహాయ సహకారాలు అందిస్తారు. ఉద్యోగస్తులకు నూతన ప్రోత్సాహకాలు అందుతాయి. ఆలోచనలు కార్యరూపం దాలుస్తాయి. నిరుద్యోగ ప్రయత్నాలు వేగవంతం చేస్తారు. బంధు మిత్రుల ఆగమనం ఆనందం కలిగిస్తుంది.
కన్య
నిరుద్యోగులు ఉద్యోగమున అంచనాలు అందుకుంటారు. దీర్ఘ కాలిక రుణాలు కొంత వరకు తీర్చగలుగుతారు. దూరపు బంధువుల నుండి శుభవార్తలు అందుతాయి. కుటుంబ సభ్యులతో దైవ సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు. వృత్తి ఉద్యోగాలలో నూతన ఆలోచనలు ఆచరణలో పెడతారు. వ్యాపారాలలో గందరగోళ పరిస్థితుల నుండి ఉపశమనం పొందుతారు.
తుల
చేపట్టిన పనులు వాయిదా పడతాయి. వృత్తి వ్యాపారాలలో శత్రు సమస్యలు పెరుగుతాయి. కొన్ని వ్యవహారాలలో సన్నిహితులు మీ మాటతో విభేదిస్తారు. ఉద్యోగమున శ్రమాధిక్యత పెరుగుతుంది. పని ఒత్తిడి అధికమై మానసిక ఆందోళనలు పెరుగుతాయి. వాహన ప్రయాణ విషయంలో అప్రమత్తంగా ఉండాలి.
వృశ్చికం
వృథా వ్యాపారాలలో మీ కృషికి తగిన ఫలితం పొందుతారు. ఉద్యోగమున అధికారులతో చర్చలు అనుకూలిస్తాయి. చేపట్టిన పనులలో నిదానంగా సాగుతాయి. నిరుద్యోగులకు నూతన అవకాశాలు లభిస్తాయి. వ్యాపార వ్యవహారాలలో దైర్యంగా ముందుకు సాగుతారు. దూర ప్రయాణాలు లాభసాటిగా సాగుతాయి.
ధనస్సు
ఆర్ధికంగా స్వల్ప నష్టాలు తప్పవు. సంతాన ఆరోగ్య విషయంలో వైద్య సంప్రదింపులు అవసరమవుతాయి. ఇతరులతో కొన్ని విషయాలలో విభేదాలు కలుగుతాయి. నూతన వ్యాపార ప్రయత్నాలు నిదానంగా సాగుతాయి. చేపట్టిన పనులు సకాలంలో పూర్తిచెయ్యక వాయిదా వేస్తారు. వృత్తి ఉద్యోగాలలో సహోద్యోగులతో మాటపట్టింపులుంటాయి.
మకరం
ముఖ్యమైన వ్యవహారములలో అప్రయత్న విజయం సాధిస్తారు. ఉద్యోగమున జీత భత్యాల విషయంలో శుభవార్త అందుకుంటారు. దాయాదులతో భూ సంభందిత వివాదాలు నుండి బయటపడతారు. ఆర్ధిక పురోగతి కలుగుతుంది. బంధు మిత్రుల నుండి శుభకార్య ఆహ్వానాలు అందుతాయి. గృహమున పెద్దల సహాయంతో కొన్ని పనులు పూర్తిచేస్తారు.
కుంభం
ధన పరంగా ఇతరులకు మాట ఇచ్చి ఇబ్బంది పడతారు. వ్యాపారాలు మందకొడిగా సాగుతాయి. ఇంటా బయట ఊహించని ఖర్చులు ఎదురవుతాయి. దూర ప్రయాణాలు వాయిదా వెయ్యడం మంచిది. ఉద్యోగమున కొంత నిరుత్సాహ వాతావరణం ఉంటుంది. ఆదాయం ఆశించినంత లభించదు. దైవ చింతన పెరుగుతుంది.
మీనం
నిరుద్యోగుల ప్రయత్నాలు ఒక కొలిక్కి వస్తాయి. సంతాన విద్యా విషయాలు పట్ల శ్రద్ద వహించాలి. అనారోగ్య సమస్యల నుండి కొంత ఉపశమనం పొందుతారు. ఉద్యోగమున మీ పని తీరుతో అందరిని ఆకట్టుకుంటారు. పాత ఋణాలు తీర్చడానికి నూతన ఋణాలు చేస్తారు. వృత్తి వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి.

 

నిత్ర రాశి ఫలాలు యాప్ సౌజన్యంతో….


Share

Related posts

Growth : మీ వ్యాపార, ఉద్యోగ ఉపాధి రంగాలలో మళ్ళీ   అభివృద్ధి  తగ్గడానికి కారణం ఇదే కావచ్చు…  వెంటనే పరిష్కరించుకోండి!!

siddhu

Today Horoscope: సెప్టెంబర్ 3 – బాద్రపద మాసం – ఈ రాసుల వారికి నేడు పట్టిందల్లా బంగారమే

somaraju sharma

Today Horoscope: జూన్ 15 – జ్యేష్ఠమాసం – రోజు వారి రాశి ఫలాలు

somaraju sharma