న్యూఢిల్లీ : రాజస్థాన్, మధ్యప్రదేశ్, ఛత్తీస్ గఢ్ లలో బీజేపీ విజయం తథ్యం : గడ్కరీ

Share

ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలలో బీజేపీకి తిరుగులేదని కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ అన్నారు. తాను రాజస్థాన్, మధ్య ప్రదేశ్, ఛత్తీస్ గఢ్ లలో పర్యటించానని చెప్పిన ఆయన ఈ మూడు రాష్ట్రాలలోనూ కూడా బీజేపీ మంచి మెజారిటీతో విజయం సాధిస్తుందని చెప్పారు. ఈ మూడు రాష్ట్రాలలోనూ బీజేపీ ఎదురీదుతోందన్న వార్తల నేపథ్యంలో గడ్కరీ ఈ ఉదయం విలేకరుల సమావేశంలో ధీమా వ్యక్తం చేయడం గమనార్హం. బీజేపీ ప్రభుత్వం పథకాలకు ప్రజలు తమ ఓటు ముద్రతో ఆమోదముద్ర వేయనున్నారని గడ్కరి అన్నారు. ఈ మూడు రాష్ట్రాలలో   ప్రజలు బీజేపీకి పట్టం కట్టడానికి కృత నిశ్చయంతో ఉన్నారని ఆయన అన్నారు. దశాబ్దాల పాటు దేశంలో అధికారం చెలాయించిన కాంగ్రెస్ ప్రజలకు కష్టాలూ, కడగండ్లే మిగిల్చిందని గడ్కరీ విమర్శించారు. బీజేపీ ప్రజలకు అవినీతి రహిత పాలన అందించిందని గడ్కరీ చెప్పారు.


Share

Related posts

సీన్ లోకి అమెరికా మాజీ అధ్యక్షుడు బరాక్ ఒబామా..!!

sekhar

“ఆర్ఆర్ఆర్” లో ఎవరూ ఊహించని గెటప్ నీ ఎన్టీఆర్ తో వేయించబోతున్న రాజమౌళి..??

sekhar

మా భర్తకు నాలుగో భార్య కావాలి: ముగ్గురు భార్యలు

Teja

Leave a Comment