మాల్యా చాలా చాలా మంచోడు!

Share

బ్యాంకుల నుంచి తీసుకున్న వేల కోట్ల రూపాయల రుణం ఎగ్గొట్టి లండన్ పారిపోయిన విజయ్ మాల్యాకు కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ నుంచి అనూహ్య మద్దతు లభించింది. విజయ్ మాల్యా చాలా చాలా మంచోడని కితాబిచ్చారు. మాల్యాని డిఫాల్టర్ అనడం సరికాదని పేర్కొన్నారు. నాలుగు దశాబ్దాల పాటు తీసుకున్న రుణాలకు వడ్డీ క్రమం తప్పకుండా కట్టారనీ, అటువంటి వ్యక్తిని డిఫాల్టర్ అని ఎలా అంటారని ప్రశ్నించారు. కింగ్ ఫిషర్ ద్వారా విమానయాన రంగంలోనికి అడుగుపెట్టిన తరువాత మాల్యా నష్టాల పాలయ్యారనీ, వ్యాపారంలో నష్టాలు రావడం సహజమనీ, అంత మాత్రాన డిఫాల్టర్ అనీ, దొంగ అని అనడం సరికాదని గడ్కరీ మాల్యాను వెనకేసుకొచ్చారు. కేంద్ర మంత్రి స్థాయి వ్యక్తి ఆర్థిక నేరాలకు పాల్పడి విదేశాలకు పారిపోయిన వ్యక్తికి మద్దతుగా మాట్లాడటం పట్ల సర్వత్రా నిరసన వ్యక్తమౌతున్నది. కేంద్ర మంత్రి హోదాలో గడ్కరీ చేసిన వ్యాఖ్యలు మాల్యాకు కేసుల నుంచి బయటపడేసేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయా అన్న అనుమానాలను రేకెత్తిస్తున్నాయి. నష్టాల కారణంగానే బ్యాంకు వాయిదాలు కట్టలేకపోయారంటూ గడ్కరీ మాల్యాను వెనకేసుకు రావడంతో..మాల్యా తాను విదేశాలకు వేళ్లే ముందు అన్ని విషయాలూ కేంద్రం పెద్దలకు వివరించానంటూ చేసిన వ్యాఖ్యలు ప్రాధాన్యతను సంతరించుకున్నాయి. బ్యాంకు రుణాలను ఎగ్గొట్టి దేశం విడిచి పారిపోయిన మాల్యాను వెనక్కు రప్పించేందుకు కేంద్ర ప్రభుత్వం, ఈడీ, సీబీఐ ఒక వైపు కృషి చేస్తుంటే…కేంద్ర మంత్రి మల్యాకు వత్తాసుగా మాట్లాడటం కేసులను నిర్వీర్యం చేసే అవకాశం ఉందని ఆందోళన వ్యక్తమౌతుంది. సరిగ్గా మాల్యాను భారత్ కు అప్పగించడానికి బ్రిట్ కోర్టు అంగీకరించిన సమయంలోనే గడ్కరీ ఈ వ్యాఖ్యలు చేయడం ఈ అనుమానాలకూ, ఆందోళనకూ బలం చేకూరుస్తోంది.


Share

Related posts

Ananya pande : అనన్య పాండే రేస్‌లో లేనట్టేనా..?

GRK

బిజెపి లోక్‌సభ, అసెంబ్లీ జాబితా విడుదల

somaraju sharma

Fau g : పబ్‌జీకి ప్రత్యామ్యాయం వచ్చేసిందోచ్..!! దీని ప్రత్యేకతలు ఇవే..!!

bharani jella

Leave a Comment