హైదరాబాద్ : కోదాడలో నేడు ప్రజాకూటమి సభ- హాజరు కానున్న రాహుల్, చంద్రబాబు

82 views

ఎన్నికల ప్రచారానికి చివరి రోజైన నేడు కోదాడలో కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీ కోదాడలో జరిగే ప్రచార సభలో ప్రసంగిస్తారు.  తెలుగుదేశం అధినేత నారా చంద్రబాబునాయుడు, ప్రజాకూటమి నేతలు కోదండరామ్, చాడ వెంకటరెడ్డి, ఎమ్మార్పీఎస్ అధినేత మందకృష్ణమాదిగ, ప్రజాగాయకుడు గద్దర్ కూడా ఈ సభలో ప్రసంగిస్తారు. తెలంగాణ ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకున్న ప్రజా కూటమి నేతలు ఇప్పటికే పలు సభలలో వేదికను పంచుకున్నారు. సభ అనంతరం ప్రజాకూటమి నేతలు హైదరాబాద్ లో ఉమ్మడిగా విలేకరుల సమావేశంలో మాట్లాడతారు. చివరి రోజు కావడంతో ఎక్కడా సమయం వృధా చేయకుండా కూటమి సందేశాన్ని ప్రజలకు మరింత స్పష్టంగా వివరించే ప్రయత్నాలు చేస్తున్నారు. ఇప్పటికే రాహుల్ తెలంగాణలో మూడు విడతలు పర్యటించి ప్రచారం చేశారు. చంద్రబాబు గత ఐదు రోజులుగా హైదరాబాద్ లో విస్తృతంగా తిరుగుతున్నారు.