హైదరాబాద్: సెలవులే సెలవులు..!

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల పుణ్యమా అంటూ రాష్ట్ర వ్యాప్తంగా విద్యాసంస్థలకు సెలవులే సెలవులు. ప్రభుత్వం ఎన్నికల సందర్భంగా నేడు రేపు సెలవులు ప్రకటించింది. తరువాత రెండో శనివారం, ఆ మరుసటి రోజు ఆదివారం సెలవులు రావడంతో విద్యాసంస్థలకు వరుసగా నాలుగు రోజులు సెలవులు వచ్చాయి. ఇక ప్రభుత్వోద్యోగులకు కూడా వరుసగా మూడు రోజులు సెలవులు వచ్చాయి. పోలింగ్ కారణంగా రేపు ప్రభుత్వం సెలవు ప్రకటించగా, ఆ తరువాత వరుసగా రెండు రోజులు రెండో శనివారం, ఆదివారం సెలవులు.