“ఎంటర్టైన్మెంట్ లైక్ నెవర్ బిఫోర్” అనే క్యాప్షన్ తో ప్రారంభమైన ఈ సీజన్ బిగ్ బాస్ దానిని ప్రేక్షకులకు అందించాలని ఎంత పరితపిస్తోందో మరోసారి అర్థమైంది. కరోనా కారణంగా కంటెస్టెంట్స్ విషయంలో కొద్దిగా కాంప్రమైజ్ కావాల్సి వచ్చిన నిర్వాహకులపై నెగటివ్ కామెంట్స్ ఎక్కువయ్యాయి. దాంతో ఆదిలోనే 3 వైల్డ్ కార్డ్ ఎంట్రీ లను ఇంటి లోకి తీసుకొని రావలసి వచ్చింది.
ప్రస్తుతం టాలీవుడ్ నెంబర్ వన్ యాంకర్ సుమ కూడా ఇంట్లోకి ఎంట్రీ పోతున్నట్లు నిర్వాహకులు క్లారిటీ ఇచ్చారు. అయితే ఈ విషయాన్ని మాత్రం జీర్ణింఛుకునేందుకు టెలివిజన్ ప్రేక్షకులకు చాలా కష్టంగా ఉంది. యాంకర్ సుమ సాధారణంగా ఇలాంటి ఏ షో లో కనిపించినా….. మహిళలు బాగా అట్రాక్ట్ అవుతారు. పదిహేనేళ్లుగా ఇండస్ట్రీలో టాప్ మోస్ట్ యాంకర్ గా కొనసాగుతున్న సుమ ఒక్కసారిగా సూట్ కేస్ పట్టుకుని స్టేజి పైకి ఎంట్రీ ఇచ్చారు.
గత సీజన్లో ఒక గెస్ట్ గా లోపలికి వచ్చిన సుమ వెంటనే వెళ్లిపోయారు. అయితే ఈ సారి మాత్రం కంటెస్టెంట్ గా హౌస్ మేట్స్ తో పోరాడేందుకు సిద్ధమవుతోందని ప్రోమో ద్వారా ప్రచారం చేస్తున్నారు. ఇక న్యూ ప్రోమో వైరల్ అయిన దెబ్బకు అంచనాల డోస్ పెరిగిపోయింది. అసలు ఇలాంటి సమయంలో సుమ ఎంట్రీ ఉంటుందని ఎవరూ ఊహించరు. ఇక సుమకు కూడా పారితోషికం గట్టిగానే ఇచ్చి ఉంటారని చెప్పవచ్చు. నాగార్జున మరో అయిదు వారాలు అంతకుమించిన ఎంటర్టైన్మెంట్ అంటున్నారు.
చూద్దాం…. చివరికి ఇది డ్రామా గా ముగుస్తుందా లేదా జనాలను సర్ప్రైజ్ చేసే సెన్సేషన్ అవుతుందో….