NewsOrbit
ట్రెండింగ్ న్యూస్

Corona virus : భారత్ లో కోవిడ్ సెకండ్ వేవ్…? ఒకే హాస్టల్లో 229 మంది కి కరోనా…!

Corona virus :  భారతదేశంలో కరోనా సెకండ్ వేవ్ మొదలైంది అన్న ప్రకంపనలు ఎక్కువైపోయాయి. అందుకు తగ్గట్టే మహానగరాల్లో కరోనా కేసులు విపరీతంగా పెరిగిపోతున్నాయి. ముఖ్యంగా మహారాష్ట్రలో కరోనా మళ్లీ పంజా విసురుతోంది. ఇక గత కొద్ది రోజులుగా అక్కడ కేసులు పెరుగుతుండడంతో నైట్ కర్ఫ్యూ కూడా విధించారు. 

 

Corona virus second wave in India
Corona virus second wave in India

కొన్ని జిల్లాల్లో అయితే ఏకంగా లాక్డౌన్ విధించారు. స్కూళ్ళు, కాలేజీలు, మార్కెట్లను మూసేశారు. ఇక అన్నిటికన్నా విస్తుగొలిపే విషయం ఏమిటంటేతాజాగా వాషిమ్ జిల్లాలోని రిసొడ్ తాలూకా లోని డేగాన్ కు చెందిన ఒక పాఠశాల హాస్టల్ లో 327 మంది విద్యార్థులు ఉంటున్నారు. అయితే వారిలో ఏకంగా 229 మంది కి కోవిడ్ సోకడం గమనార్హం. అలాగే విద్యార్థులతో పాటు ఆ హాస్టల్ లో పనిచేస్తున్న మరో నలుగురు ఉద్యోగులకు కూడా వైరస్ సోకింది. 

ఇక బారినపడిన వారిలో ఎక్కువ మంది 13 నుండి 15 సంవత్సరాల మధ్య వయసుగల కావడం గమనార్హం. ఆ విద్యార్థులకు వేరుగా ఉంచి చికిత్స అందిస్తున్నారు. దీంతో పాఠశాలను కంటైన్మెంట్ జోన్ గా ప్రకటించారు. ముంబై మహానగరంలో కూడా భారీ స్థాయిలో కేసులు నమోదవుతున్నాయి. వాటిలో కొన్ని ఈ మధ్య బయటపడ్డ కొత్తరకం స్ట్రైన్ కి చెందిన కేసులు కావడం గమనార్హం. 

అన్ని ప్రాంతాల్లో గత కొద్ది రోజుల నుండి అధిక సంఖ్యలో కేసులు నమోదు అవుతుంటే సెకండ్ వేవ్ భారతదేశంలో ప్రారంభమైందని అందరూ భయపడుతున్నా.  గడచిన 24 గంటల్లో ఒక మహారాష్ట్రలోని ఎనిమిది వేల కొత్త కేసులు నమోదయ్యాయి. దీంతో రాష్ట్ర ప్రభుత్వం, ముంబై పోలీసులు కోవిడ్ ఆంక్షలు పాటించకపోతే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. 

ఒకవైపు దేశవ్యాప్తంగా స్కూళ్ళన్నీ తెరుచుకున్నాయి. ఇలాంటి సమయంలో ఈ కోవిడ్ మహమ్మారి మళ్ళీ విద్యార్థులకు భయాందోళనకు గురిచేస్తోంది. తల్లిదండ్రులు కూడా విపరీతంగా కంగారుపడుతున్నారు. మహానగరాల్లో పిల్లలను స్కూలుకు పంపించాలంటే వారికి వణుకు వస్తుంది. కరోనా వైరస్ వ్యాప్తిని అరికట్టడమే లక్ష్యంగా కఠినచర్యలను అమలు చేసే విషయంలో ఏమాత్రం అలసత్వం పనికిరాదని రాష్ట్రాలకు కేంద్ర పాలిత ప్రాంతాలకు ప్రభుత్వం తీవ్రమైన హెచ్చరికలు జారీ చేసింది.

Related posts

Varun Tej: పవన్ కు మద్దతుగా రేపు పిఠాపురంలో హీరో వరుణ్ తేజ్ ప్రచారం

sharma somaraju

JD Lakshminarayana: ప్రాణహాని ఉందంటూ మాజీ సీబీఐ జేడీ లక్ష్మీనారాయణ సంచలన ఫిర్యాదు

sharma somaraju

Breaking: ఆల్విన్ ఫార్మా పరిశ్రమలో భారీ అగ్ని ప్రమాదం

sharma somaraju

Phone Tapping Case: ఫోన్ ట్యాపింగ్ కేసులో నిందితులైన మాజీ పోలీస్ అధికారులకు కోర్టులో లభించని ఊరట

sharma somaraju

YSRCP: వైసీపీకి బిగ్ షాక్ .. మరో కీలక నేత రాజీనామా

sharma somaraju

Aa Okkati Adakku: ఆ ఒక్కటి అడక్కు మూవీకి ఫ‌స్ట్ ఛాయిస్ అల్ల‌రి న‌రేష్ క‌దా.. మొద‌ట అనుకున్న‌ది ఎవ‌ర్నో తెలుసా?

kavya N

Supreme Court: సుప్రీం కోర్టులో కేంద్ర ఎన్నికల సంఘానికి భారీ ఊరట ..ఈవీఎం, వీవీప్యాట్ పిటిషన్ల కొట్టివేత

sharma somaraju

Allu Aravind: ల‌గ్జ‌రీ కారు కొన్న అల్లు అర‌వింద్‌.. ఎన్ని కోట్లో తెలిస్తే మ‌తిపోతుంది!!

kavya N

రెండు రౌండ్లు వేసిన జ‌గ‌న్‌… అయోమ‌యంలో కూట‌మి లీడ‌ర్లు…?

ఇండిపెండెంట్ల ఎఫెక్ట్ వైసీపీకా… కూట‌మికా… తేలిపోయిందిగా…?

బ‌క్కెట్ Vs గ్లాస్ Vs పెన్ హోల్డ‌ర్‌.. పిఠాపురంలో ప‌వ‌న్‌కు సెగ‌..!

Megha Akash: త్వ‌ర‌లో మ‌రో టాలీవుడ్ హీరోయిన్ పెళ్లి.. ఫోటోల‌తో హింట్ ఇచ్చేసిన మేఘా ఆకాష్!

kavya N

TDP: టీడీపీకి బిగ్ షాక్ .. మరో కీలక నేత రాజీనామా

sharma somaraju

Jr NTR: ఫ‌స్ట్ టైమ్ ఫోటోగ్రాఫర్లపై అరిచేసిన ఎన్టీఆర్‌.. అంత కోపం ఎందుకు వ‌చ్చిందంటే?

kavya N

Shruti Haasan: మ‌ళ్లీ లవ్ లో ఫెయిలైన శృతి హాసన్.. బాయ్‌ఫ్రెండ్ తో బ్రేక‌ప్ క‌న్ఫార్మ్!

kavya N