దిల్ రాజు.. టాలీవుడ్ లో స్టార్ ప్రొడ్యూసర్ మాత్రమే కాదు దమ్మున్న ప్రొడ్యూసర్ కూడా. దిల్ రాజు ఒక సినిమా నిర్మాణం మొదలు పెట్టాడంటే ఏ విషయంలో కూడా వెనకడుగు వేయడు. దిల్ రాజు కి గత రెండేళ్ళుగా అంత సక్సస్ లు రావడం లేదు. కాని దిల్ రాజు సంస్థ నుంచి మాత్రం సినిమాలు వస్తూనే ఉన్నాయి. ఒకటి కాదు రెండు కాదు ఏకంగా ఐదు సినిమాలు ఒకే రోజు సెట్స్ మీదకి తీసుకు రావడం అంటే మామూలు విషయం కానేకాదు. కానీ టాలీవుడ్ టాప్ నిర్మాత దిల్ రాజు ఆ పని చేసి చూపించాడు. కరోనా లాక్ డౌన్ కారణంగా ఇన్నాళ్లు చిత్రపరిశ్రమ స్తంభించిపోయింది.
షూటింగ్ లు లేక నిర్మాతలు.. దర్శకులు చాలా సమయాన్ని వృధాగా గడిపారు. ఇక అన్ లాక్ ప్రక్రియ ప్రారంభమైనప్పటి నుంచి దిల్ రాజు మంచి దూకుడుగా కనిపిస్తున్నాడు. మిగతా నిర్మాతలు సినిమాలు చేస్తున్నప్పటికీ దిల్ రాజు స్పెషల్ అనే చెప్పాలి. ఎందుకంటే ఓకే ఈ రోజు ఐదు సినిమాలను ఒకే సారి షూటింగ్ ప్రారంభించిన ఘనత దిల్ రాజు కే దక్కుతుంది. ఇది చాలా అరుదుగా జరిగే విషయం అని సినీవర్గాలు అంటున్నాయి. దిల్ రాజు గట్స్ కి ఫిదా అవుతున్నారు. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటిస్తున్న వకీల్ సాబ్ దగ్గర్నుంచి హుషారు సినిమా తో పాపులర్ అయిన దర్శకుడు శ్రీ హర్ష కొనుగంటి తెరకెక్కించే సినిమా వరకు అన్ని ఒకే రోజు సెట్స్ మీదకు వచ్చాయి.
దిల్ రాజు నిర్మాణం లో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటిస్తున్న వకిల్ సాబ్ ఫైనల్ షెడ్యూల్ షూటింగ్ జరుగుతుండగా.. వెంకటేష్ – వరుణ్ తేజ్ ల ఎఫ్ 3, అక్కినేని నాగ చైతన్య నటిస్తున్న థాంక్యూ, ఫాగల్, శ్రీ హర్ష దర్శకత్వంలో రూపొందుతున్న సినిమా.. ఇలా ఈ ఐదు సినిమాలన్నీ కూడా 23 న షూటింగ్ మొదలయ్యాయి. అందుకే దిల్ రాజు ని స్టార్ ప్రొడ్యూసర్ అని అంటుంన్నారు. ఆయన దమ్ము.. ధైర్యం వేరబ్బా అని పొగిడేస్తున్నారు. ఇక ఈ సినిమాల తో పాటు దిల్ రాజు మరికొన్ని సినిమాలని 2021 లో మొదలు పెట్టబోతున్నాడు.
Family Star OTT Response: థియేటర్లలో అట్టర్ ఫ్లాప్.. ఓటీటీలో టాప్ లో ట్రెండింగ్.. థియేటర్లలోనే ఆడాలా ఏంటి? అంటున్న ఫ్యామిలీ స్టార్..!