పూజా పాండే అరెస్టు

అలీగఢ్, పిబ్రవరి6: మహాత్ముడి హత్య మళ్లీ ‘చేసి చూపించిన’ హిందూ మహాసభ జాతీయ కార్యదర్శి పూజా షకున్ పాండేను మంగళవారం అరెస్టు చేశారు. గత నెల 30వ తేదీన మహత్మా గాంధీ వర్ధంతి రోజున పాండే, గాంధీజి దిష్టిబొమ్మను బొమ్మ తుపాకితో కాల్చి తర్వాత గాడ్సే చిత్రానికి పూలమాల వేశారు.

ఈ కేసుకు సంబంధించి పాండేను, ఆమె భర్తను అరెస్టు చేసినట్లు అలీగఢ్ పోలీసులు చెప్పారు. గాంధీ వర్ధంతి రోజున ఆయన హత్యను పండగ చేసుకున్న పూజా పాండే, దసరా రోజున రావణుడి దిష్టిబొమ్మ తగలబెట్టినట్లుగా ఇక ప్రతి సంవత్సరం గాంధీ వర్ధంతి రోజున ఇట్లాగే చేస్తామని చెప్పారు. పూజా పాండే నాయకత్వంలో హిందూ మహాసభ చేసిన పని వీడియో వైరల్ అవ్వడంతో దేశం నివ్వెర పోయింది. ఉత్తరప్రదేశ్ పోలీసులు 12 మందిపై కేసు నమోదు చేశారు.  వీడియోలో కనబడేవారిలో ముగ్గురిని గత వారం అరెస్టు చేశారు. హిందూ మహాసభ గాంధీజీ వర్ధంతిని శౌర్యదివస్‌గా జరుపుతుంది. గాంధీ హంతకుడు నాధూరాం గాడ్సే కూడా హందూ మహాసభ సభ్యుడే.

జనవరి 30నాటి వీడియో కోసం కింద క్లిక్ చేయండి