సాధారణంగా ఎవరైనా సరే కార్లను రోడ్లపై బాగానే డ్రైవ్ చేస్తారు. కానీ పార్కింగ్ విషయానికి వస్తే తడబడుతుంటారు. ఇక పార్కింగ్ స్థలం కొద్దిగా ఉంటే.. కారును ప్యారలల్ గా పార్కింగ్ చేయాల్సి వస్తే.. కొందరు చాలా ఇబ్బంది పడుతుంటారు. కానీ ఆ డ్రైవర్ మాత్రం చాలా చాకచక్యంగా ఆ కారును పార్కింగ్ చేశాడు. ఆ సమయంలో తీసిన ఓ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
కేరళలోని మనంతవాడికి చెందిన పీజే బిజు అనే వ్యక్తి తన స్నేహితుడికి చెందిన తెలుపు రంగు ఇన్నోవా కారును వర్క్‌షాప్ నుంచి తెచ్చాడు. కారుకు పెయింట్ జాబ్ చేయించినందున దాన్ని చాలా జాగ్రత్తగా పార్కింగ్ చేయాల్సి వచ్చింది. అయితే పార్కింగ్‌కు ఉన్న స్థలం కూడా తక్కువే. ఈ క్రమంలోనే బిజు చాలా చాకచక్యంగా ఎంతో నైపుణ్యంతో ఆ కారును నిమిషంలోనే పార్కింగ్ చేశాడు. అదే సమయంలో అతని భార్య ఆ వీడియోను షూట్ చేసి దాన్ని సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. దీంతో ఆ వీడియో వైరల్‌గా మారింది. ఇప్పటికే ఆ వీడియోకు 10 లక్షలకు పైగా వ్యూస్ వచ్చాయి. ఎన్నో వేల మంది కామెంట్లు పెట్టారు. అతని డ్రైవింగ్ స్కిల్‌ను అందరూ మెచ్చుకుంటున్నారు.
That’s Malayalee Driver for you , salute his skill and confidence!
Few saw how he took out the car earlier this has both how he parked and how took it out from parking !
Kudos to the guy ???? pic.twitter.com/JwJrCIjTyn
— Vijay Thottathil (@vijaythottathil) September 7, 2020
కాగా బిజు ఈ విషయమై మీడియాతో మాట్లాడుతూ.. తాను ఎన్నో ఏళ్ల నుంచి ఎర్నాకుళం – కన్నూర్ మధ్య బస్సులు, లారీల వంటి భారీ వాహనాలను నడుపుతున్నానని, అవి సుమారుగా 12 మీటర్ల వరకు పొడవు ఉంటాయని అన్నాడు. అంతటి భారీ వాహనాలనే నడిపే తనకు ఈ కారు పెద్ద సమస్య అనిపించలేదని అన్నాడు. ఏ వాహనానికి అయినా సరే దాని సైజుకు సంబంధించి మెంటల్ పిక్చర్ మైండ్‌లో ఉండాలని, అలాగే కాన్ఫిడెన్స్ కూడా ఉంటే ఇలాగే చాకచక్యంగా వాహనాలను పార్కింగ్ చేయవచ్చని తెలిపాడు.