“బాహుబలి” సినిమాతో ప్రపంచవ్యాప్తంగా తనకంటూ సెపరేట్ మార్కెట్ క్రియేట్ చేసుకుని పాన్ ఇండియా సూపర్ స్టార్ అయిపోయాడు ప్రభాస్. దీంతో బాలీవుడ్ ఇండస్ట్రీ లో చాలామంది ప్రొడ్యూసర్లు ప్రభాస్ తో సినిమా చేయడానికి “క్యూ” కట్టే పరిస్థితి నెలకొంది. ప్రభాస్ కూడా “బాహుబలి” తర్వాత చాలా వరకు అన్ని రకాల ప్రేక్షకులను దృష్టిలో పెట్టుకొని సినిమాలు ఒప్పుకుంటున్నారు.
దీంతో ప్రభాస్ ఫ్యాన్ ఫాలోయింగ్ ఇదివారి కంటే ఇప్పుడు బీభత్సంగా పెరిగిపోయింది. ఇటువంటి తరుణంలో ప్రభాస్ పుట్టిన రోజుకి 50 రోజులు ఉందనగా సోషల్ మీడియాలో హంగామా హంగామా గా ప్రభాస్ ఫ్యాన్స్ ఫుల్ జోష్ లో రచ్చ రచ్చ చేస్తున్నారు. ఇటీవల చాలామంది ప్రముఖ స్టార్ హీరోల పుట్టిన రోజు వేడుకలకు సంబంధించి డిపిలను ముందే రిలీజ్ చేసి నానా హడావిడి చేస్తున్నారు.
ఇదే రీతిలో ఇప్పుడు ప్రభాస్ మొదటి సినిమా “ఈశ్వర్” నుండి తాజాగా ఫస్ట్ లుక్ రిలీజ్ అయిన “రాధేశ్యాం” సినిమా వరకూ ప్రభాస్ కి సంబంధించిన స్మైలీ ఫోటోలను…. సినిమా టైటిల్స్ నీ ఒక డీపిగా క్రియేట్ చేసి సరి కొత్త డిజైన్ క్రియేట్ చేయడం జరిగింది. తాజాగా విడుదలైన ఈ కామన్ డీపీ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. మరోపక్క ప్రభాస్ పుట్టినరోజు నాడు “రాధేశ్యాం” సినిమాకి సంబంధించి టీజర్ విడుదల చేయాలని సినిమా యూనిట్ అనుకుంటున్నట్లు టాక్.
Family Star OTT Response: థియేటర్లలో అట్టర్ ఫ్లాప్.. ఓటీటీలో టాప్ లో ట్రెండింగ్.. థియేటర్లలోనే ఆడాలా ఏంటి? అంటున్న ఫ్యామిలీ స్టార్..!