ప్రస్తుతం ఇండస్ట్రీలో అభిమాన హీరోలకు సంబంధించి పుట్టినరోజు వేడుకలకి ఫ్యాన్స్ తమ అభిమాన హీరో పాత సినిమానీ లేటెస్ట్ టెక్నాలజీతో స్పెషల్ షోలు చేసుకుంటున్నారు. ఈ ట్రెండ్ సూపర్ స్టార్ మహేష్ బాబు ఫ్యాన్స్ స్టార్ట్ చేయడం జరిగింది. ఆగస్టు 9వ తారీఖు నాడు మహేష్ పుట్టినరోజు సందర్భంగా.. మహేష్ కెరియర్ లో బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ “పోకిరి” లేటెస్ట్ టెక్నాలజీ ప్రింట్ తో రెండు తెలుగు రాష్ట్రాలలో దాదాపు 300కు పైగా స్పెషల్ షోలు వేసుకుని భారీగా ఎంజాయ్ చేశారు.
ఇదంతా పక్కన పెడితే ఆగస్టు 22వ తారీకు చిరంజీవి పుట్టినరోజు అని అందరికీ తెలుసు. గత రెండు సంవత్సరాలు కరోనా నేపథ్యంలో పెద్దగా వేడుకలు జరపలేదు. అయితే ప్రస్తుతం పరిస్థితులంతా అనుకూలంగా ఉండటంతో బయట కరోనా కేసులు లేకుండా ఉండటంతో మెగా ఫాన్స్ చిరంజీవి పుట్టినరోజు వేడుకలు ఘనంగా చేయాలని రెండు తెలుగు రాష్ట్రాలలో అభిమానులు ఏర్పాట్లు చేసుకుంటున్నారు. ఇదిలా ఉంటే చిరంజీవి పుట్టినరోజు నాడు సూపర్ హిట్ మూవీ “ఘరానా మొగుడు” లేటెస్ట్ టెక్నాలజీతో స్పెషల్ షోలు వేయడానికి ఏర్పాట్లు జరుగుతున్నట్లు సమాచారం.
కే రాఘవేంద్రరావు దర్శకత్వంలో 1992 సంవత్సరంలో విడుదలైన “ఘరానా మొగుడు” ఇండస్ట్రీ హిట్ గా నిలిచింది. చిరంజీవి సరసన నగ్మా హీరోయిన్. ఈ సినిమాలో చిరంజీవి చేసిన ఫైట్స్.. పాటలు మరియు స్టెప్పులు అప్పట్లో ట్రెండ్ సెట్ గా నిలిచాయి. అయితే మళ్లీ 30 సంవత్సరాల తర్వాత చిరంజీవి పుట్టినరోజు సందర్భంగా.. ఆగస్టు 22వ తారీకు “ఘరానా మొగుడు” రెండు తెలుగు రాష్ట్రాలలో స్పెషల్ షోలు వేస్తున్నట్లు సమాచారం.