యాంకర్ రష్మీ పెళ్లి ఫిక్స్.. వరుడి వివరాలు ఇవే.. సుడిగాలి సుధీర్ పరిస్థితి ఏంటి మరి?

ఓమైగాడ్.. యాంకర్ రష్మీ పెళ్లికి సిద్ధమైందట. ఎక్స్ ట్రా జబర్దస్త్ తో అందరినీ అలరించే రష్మీ గౌతమ్ పెళ్లికి రెడీ అయినట్టు ప్రస్తుతం వార్తలు వస్తున్నాయి. ఇప్పటికే చాలా ఆలస్యమైందని.. అందుకే పెళ్లి చేసుకోవాలని ఫిక్స్ అయిందట. అయితే వరుడు మాత్రం సుడిగాలి సుధీర్ కాదండోయ్.. అదే ట్విస్టు ఇక్కడ. సుడిగాలి సుధీర్ కు ఇది మామూలు పంచ్ కాదు.

rashmi gautam marriage fixed with business man
rashmi gautam marriage fixed with business man

రష్మీ, సుడిగాలి సుధీర్ మధ్య ఉన్న సంబంధం గురించి చిన్న పిల్లాడిని అడిగినా చెబుతాడు. ఢీ షోలో కానీ.. జబర్దస్త్ షోలో గానీ వాళ్లు ఇద్దరూ కలిసి చేసే పర్ ఫార్మెన్స్ అదిరిపోతుంది. ఎప్పుడూ రష్మీ వెనుక తిరుగుతూ తనను ప్రపోజ్ చేస్తూ తన మనసులోని మాటను బయటపెడుతుంటాడు సుధీర్. రష్మీకి కూడా సుధీర్ అంటే ఇష్టమే కానీ.. ఎందుకో మరి.. సుధీర్ కాకుండా రష్మీ.. వేరే వ్యక్తిని పెళ్లి చేసుకోబోతోంది.

తనకు కాబోయే భర్తను కూడా తానే సెలెక్ట్ చేసుకున్నదట రష్మీ. ప్రస్తుతం తన వయసు 32 ఏళ్లు. ఇప్పటికే మూడు పదుల వయసు దాటడంతో ఇక పెళ్లి చేసుకోవాలని రష్మీ ఫిక్స్ అయిందట. ఇప్పటికే రష్మీ గురించి సుధీర్ గురించి ఎన్నో గాసిప్స్ షికారు చేస్తున్నాయి. వాటన్నింటికీ ఇక రష్మీ చెక్ పెట్టేసినట్టే.

ఇక.. రష్మీకి కాబోయే వరుడు బిజినెస్ మెన్. అతడితో కొన్ని రోజులు ట్రావెల్ చేసిన తర్వాతనే పెళ్లికి రెడీ అయిందట. రష్మీ అభిప్రాయంతోనే అతడు కూడా ఏకీభవించడంతో రష్మీ పెళ్లి పీటలు ఎక్కబోతోంది. ఇరు కుటుంబాలు కూడా వాళ్ల పెళ్లికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారట. ఇక ముహూర్తాలు పెట్టడమే ఆలస్యం.

అయితే.. రష్మీ పెళ్లి అనగానే మొదట గుర్తొచ్చేది సుడిగాలి సుధీర్. రష్మీ.. పెళ్లి చేసుకొని వెళ్లిపోతే సుడిగాలి సుధీర్ పరిస్థితి ఏంటి? అని నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు. రష్మీ పక్కన సుధీర్ అన్నను కాకుండా మరో వ్యక్తిని ఊహించుకోలేమని సుధీర్ ఫ్యాన్స్ మండిపడుతున్నారు.