ట్రెండింగ్ న్యూస్

Sohel : లైవ్ లో అరియానా, మెహబూబ్ ముందు.. ఓ వ్యక్తితో సోహెల్ గొడవ?

sohel and mehaboob prank on ariyana
Share

Sohel : సోహెల్ గురించి తెలుసు కదా. ఆయనకు కొంచెం ఆవేశం ఎక్కువ కానీ.. మంచి వ్యక్తి. ఎదుటి వాళ్లకు చాలా మర్యాద ఇస్తాడు. చాలా సింపుల్ గా ఉంటాడు. అందరితో కలుపుగోలుగా ఉంటాడు. కానీ.. ఏదైనా తేడా వస్తే మాత్రం అంతే. తాట తీస్తాడు. ఆయన కథే వేరే ఉంటది. అవును.. బిగ్ బాస్ హౌస్ లో కూడా మనం చూశాం. సోహెల్.. గొడవ పెట్టుకుంటే ఎంత సీరియస్ అవుతాడో.. ఎదుటి వాళ్లు ఎంతటి వాళ్లు అయినా సరే.. తాడో పేడో తేల్చేస్తాడు. అది లెక్క మరి.

sohel and mehaboob prank on ariyana
sohel and mehaboob prank on ariyana

అయితే.. తాజాగా సోహెల్, అరియానాతో మెహబూబ్ ఇంటర్వ్యూ చేశాడు. దానికి సంబంధించిన పార్ట్ వన్ ను ముందే రిలీజ్ చేశాడు. కారులో.. సోహెల్, అరియానాతో కలిసి మెహబూబ్ ఇంటర్వ్యూ చేశాడు. ఆ తర్వాత ముగ్గురు కలిసి రెస్టారెంట్ కు వెళ్లి అక్కడ కాసేపు సరదాగా గడిపారు.

Sohel : అరియానాపై సోహెల్ ప్రాంక్

అయితే.. రెస్టారెంట్ లో ఓ వ్యక్తి వచ్చి… వాళ్లను ఫోటోలు తీస్తుంటే సోహెల్ చూసి ఫోటోలు తీయొద్దంటాడు. దీంతో ఆ వ్యక్తి నార్మల్ గా ఫోటోలు తీశా ఏమైంది అనగానే.. సోహెల్ కు కోపం వచ్చి కొట్టబోతాడు. దీంతో అరియానా మధ్యలోకి వెళ్లి వద్దు.. సోహెల్ గొడవ వద్దు అంటూ ఎంత సముదాయించినా సోహెల్ మాత్రం ఊరుకోలేదు. మెహబూబ్ కూడా ఆ వ్యక్తితో గొడవ పెట్టుకొని కొట్టడానికి ప్రయత్నిస్తాడు. పబ్లిక్ లో గొడవ ఎందుకు సోహెల్.. అంటూ అరియానా ఎంత చెప్పినా వాళ్లు వినలేదు. ఇంతలో సోహెల్.. ఓ ప్లేట్ పట్టుకొని వచ్చి అతడిని కొట్టబోతాడు. దీంతో అరియానా.. భయపడిపోయి.. నేను వెళ్లిపోతాను అని అనేసరికి.. వెంటనే మెహబూబ్, సోహెల్ నవ్వేసి.. ఇదంతా ప్రాంక్ అనేసరికి.. అరియానా మాత్రం తెగ సీరియస్ అయిపోయింది. మొత్తానికి అరియానాను సోహెల్, మెహబూబ్ ఇద్దరూ కలిసి ఓ ఆటాడుకున్నారుగా.

దానికి సంబంధించిన వీడియోను మెహబూబ్ తన యూట్యూబ్ చానెల్ లో పోస్ట్ చేశాడు. ఇంకెందుకు ఆలస్యం.. మీరు కూడా ఆ ప్రాంక్ వీడియోను చూసేయండి.


Share

Related posts

Intinti Gruhalakshmi: లాస్య చేసిన పనికి నవ్వు ఆపుకోలేరు..! తులసి పై లాస్య ఫైర్..!

bharani jella

Intermittent Fasting: ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్ వలన కలిగే లాభాలు..!! ఎవరు చేయకూడదంటే..!?  

bharani jella

Covid Hospital: ఏపీ ప్రభుత్వం అద్భుతం..! 15 రోజుల్లోనే కోవిడ్ ఆసుపత్రి నిర్మాణం

Muraliak